Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 12


    కధ చదువుతూ దానిలో లినమయిన అభయ అది గుర్తించలేదు.

 

    టప్...టప్...టప్...!

 

    ఈ తఫా మూడుచుక్కలు పడ్డాయి. అభయ మెడ మీద పురుగేదో వాలింది అనుకుంటూ అభయ తుడుచుకుంది.చేతికి జిగురుగ తగలటంతో అదేమిటో అని చూసింది. చీము నెత్తురు తన మేడమీద ఇవెక్కడనుంచి పడ్డాయి అనుకుంటూ వెనుతిరిగి చూసిన అభయ భయంతో గుండెలు అవిసేలా గావుకేక వేసి స్పృహ తప్పి పడిపోయింది.

 

    తను వచ్చిన పని పూర్తి అయింది అన్నట్లు మొండి చెయ్యి గాలిలో తేలుతూ ఎటో వెళ్ళిపోయింది.

 

    ఆ చీకటి రాత్రి కధలో ఇలా వర్ణిస్తూ ఓ భయంకరమయిన సీనుని ప్రవేశపెట్టాడు రచయిత భయంకరముర్తి అంతటితో ఆగక పాఠకుల్లో ఎవరయినా సరే సాహసము, ధైర్యము మెండుగా దండిగా వున్నవారు ఓ చీకటి రాత్రి ఇంటిలో మీరొక్కరే వున్నపుడు ఇలా చేయగలరా? అని సవాల్ లాంటిది కూడా చేశాడు. చేయవలసిన విధం రాశాడు. అల చేస్తే మీ గుండె దడదడ లడటమేగాక భయపడతారు ఆపై ముర్చపోతారు అంటూ హెచ్చరిక చేశాడు.

 

    అ చీకటి రాత్రి చదివి

 

    "చాలా గొప్పగా రాశాడుకదు!" అంది శ్రీవిద్య.

 

    "పాఠకులని భయపెట్టడంలో కొత్తరకం ప్రయోగాలు చేస్తాడు భయంకరముర్తి. మొండిచెయ్యి ఏమిటి? గాలిలో తెలిరావడం ఏమిటి? కధకు కాళ్ళు ముంతకు చేవులులాగా" ఆంది మహానంద.

 

    "మొండిచెయ్యి గాలిలో తెలిరావటం అన్నది కల్పన అనుకో! కాని అలా ఒంటరిగా పెద్ద ఇంటిలో కరెంటు పోయినప్పుడు వుండటం అంటే గుండె పింజాంపింజాం అనటం ఖాయం" అంది శ్రీవిద్య.

 

    ధైర్యం అధైర్యం గురించి మొండిచెయ్యి కధను గురించి మహానంద శ్రీవిద్య కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ధైర్య వాళ్ళ మాటల్లో కలవలేదు.ఆలోచిస్తూ వుండి పోయింది.

 

    ఆమె చెప్పింది విని శ్రీవిద్య ఉలిక్కిపడింది.

 

    "నీ ప్రయోగం అఘోరించా, నీ ధైర్యం దొంగలు తొలా,మొండిచేయ్యిని చూద్దామనే?" ఆశ్చర్యంగా అడిగింది మహానంద.

 

    "కాదు, నా ధైర్యం ఎంతటితో పరిక్షించుకుందామని" ఆమె తల ఎగరేసి మరి చెప్పింది.

 

    "బాగుంది.సమయానికి కరెంటుపోయి చావాలికదా" శ్రీవిద్య అంది.


    "అది కధ కాబట్టి కరెంటు పోయింది. ఇది వాస్తవ జీవితం కాబట్టి సమయానికి కరెంటు పోకపోవచ్చు . మన చేతుల్లో పని అన్ని గదుల్లో లైటు అరిపేస్తే సరి" అంది ధైర్య.

 

    "తిని కూర్చోక చదివి వూరుకోక ఎందుకొచ్చిన గోల చెప్పు. వేదవ ప్రయోగం నేను చేయను బాబూ" అంది శ్రీవిద్య.

 

    "అలా చెప్పకపోతే ధైర్యం లేదని చెపితే ఒక్క మాటతో సరిపోతుంది కదా?"

 

    "దైర్యం లేక కాదు బద్ధకం" అంది ధైర్య.

 

    "మనకెప్పుడు విషమ పరిస్టితులు తారసపడలేదు.అందువల్ల ధైర్య సాహసాలు ప్రదర్శించే పనిలేదు. మనం అద్వ్తితియ అసమాన సహసవంతులం అవునో కాదో గాని పిరికి పందలం మటుకు కాదు.కనుక ఇలాంటి ప్రయోగాలు అనవసరం. నేను చదివి వదిలేయటం తప్ప చేయను. శ్రీవిద్య చేయనని చెప్పేసింది. నీవు నీ మాటని ఉపసంహరించుకో" కొద్దిసేపు వాదన తర్వాత ఫైనల్ దేషిషన్ తీసుకుని తీర్పు ఇచ్చేసింది మహానంద.

 

    "ఊహు, నేను పరిశోధన చేసి తీరుతాను" మొండిగా చెప్పింది ధైర్య.

 

    "చెయ్యి. మొండిచెయ్యి కనపడుతుంది" శ్రీవిద్య అంది భయపెడుతూ.

 Previous Page Next Page