Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 13

 

3.    అగ్నీ! నీవు అరాయ నాశకుడవు. నాకు అరాయ సంహారకత్వము ప్రసాదించుము. స్వాహా.
   
    (అరాయాః అదాయినః దానోలక్షిత నిఖిల శ్రేయో విఘ్నకారిణః అని సాయణ వ్యాఖ్య. అరాయలు దానము చేయని వారు. దానము మున్నగు మంగళకార్యములకు విఘ్నము కలిగించువారు.)
   
4.    పిశాచ క్షయణమసి పిశాచ చాతనం మేదాః - స్వాహా.
   
5.    సదాన్వాక్షయణమసి సదాన్వాచాతనం మేదాః - స్వాహా ||

   
    (ఆశ్రోశకారిణ్యః పిశాచాః అని సాయణుడు.)
   
                                            రెండవ సూక్తము - 19
   
వినియోగము :- ఇది మొదలు 5 సూక్తములచే అభిచార కర్మమున తొలి హోమము చేయవలెను.
   
1.    అగ్నీ! నీకు దహించు శక్తి ఉన్నది. దానితో కాల్చుము - "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః" - మమ్ము ద్వేషించు వారిని, మేము ద్వేషించువారిని.
   
2.    అగ్నీ! నీకు సంహరించు శక్తి ఉన్నది. దానితో సంహరించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
3.    అగ్నీ! నీవు దీప్తివంతుడవు. దానితో సంహరించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
4.    అగ్నీ! నీవు ఏడిపించగలవాడవు. ఏడిపించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
5.    అగ్నీ! నీవు తేజస్సు గల వాడవు. నిస్తేజులను చేయుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
                                            మూడవ సూక్తము - 20
   
1.    వాయువా! నీకు దహించు శక్తి ఉన్నది. దానితో దహించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
2.    వాయువా! నీకు సంహరించుశక్తి ఉన్నది. దానితో సంహరించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
3.    వాయువా! నీవు దీప్తిమంతుడవు. దానితో సంహరించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
4.    అగ్నీ! నీవు ఏడిపించగలవాడవు. ఏడిపించుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
5.    అగ్నీ! నీవు తేజస్సు గల వాడవు. నిస్తేజులను చేయుము -
    "యో 2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః"
   
                                         నాలుగవ సూక్తము - 21
   
    (పై సూక్తము వలెనే సూర్యునకు అన్వయించునది.)
   
1.    సూర్య యత్ తే తపస్తేన తం ప్రతి తప. యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
2.    సూర్య యత్ తే హరస్తేన తం ప్రతిహర యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

3.    సూర్య యత్ తే తేర్చిస్తేన తం ప్రత్యర్చ యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

4.    సూర్య యత్ తే శోచిస్తేన తం ప్రతిశోచ యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
5.    సూర్య యత్ తే తేజస్తేన తమ తేజసంకృణు యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
                                        ఐదవ సూక్తము - 22
   
1.    చన్ద్ర యత్ తే తపస్తేన తం ప్రతితప యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
2.    చన్ద్ర  యత్ తే హరస్తేన తం ప్రతిహర యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

3.    చన్ద్ర  యత్ తే తేర్చిస్తేన తం ప్రత్యర్చ యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

4.    చన్ద్ర  యత్ తే శోచిస్తేన తం ప్రతిశోచ యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
5.    చన్ద్ర  యత్ తే తేజస్తేన తమతేజ సంకృణు యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
                                           ఆరవ సూక్తము - 23
   
    (ఆపః అనగా జలము. ఇది జలములది.)
   
1.    ఆపో యద్ వస్తపస్తేన తం ప్రతి తపత యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
2.    ఆపో యద్ వో హరస్తేన తం ప్రతి హరత యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

3.    ఆపో యద్ వోర్చిస్తేన తం ప్రత్యర్చ యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః

4.    ఆపో యద్ వః శోచిస్తేన తం ప్రతిశోచత యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
5.    ఆపో యద్ వస్తేజస్తేన తమ తేజసం కృణుత యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః
   
                                              ఏడవ సూక్తము - 24
   
వినియోగము :-

   
      1) అలక్ష్మీ నాశక కర్మమున సముద్ర మధ్యమున 'శాపేటస్థ' అగ్ని యందు హోమము చేసి చరు సంపాతన     అభిమంత్రణ చేసి భుజించవలెను.
   
      2) యవల సత్తును ఎర్రమేక పాలలో వేసి ఘ్రుతాహుతులు ఇచ్చి సంపాతన, అభిమంత్రణము చేసి     భుజించవలెను.
   
      3) ఆ కర్మయందే తృణ గ్రంథులను చేసి నీరు నిండిన పాత్రలో మంత్రించి వేసి ఆ నీటితో ముఖము కడుగుట,     స్నానము చేయవలెను.
   
1.    శేరభక, శేరభా! మా మీదకు తోలిన యాతనలను త్రిప్పి పంపండి. మాకు నష్టము కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వారిని త్రిప్పిపంపండి.
   
    "యస్య స్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త" మీరు ఎవరి వద్ద ఉన్నారో వానిని భక్షించండి. ఎవడు మిమ్ము ప్రయోగించినాడో వానిని తినండి. మా శత్రువుల మాంసములను తినండి.
   
    (ఆశ్రయించిన వారికి సుఖములు కలిగించువాడు శేరభకుడు. యాతనలు కలిగించు వారాలకు అధిపతి శేరభుడు.)
   
2.    శేవృధక, శేవృధా! మా మీదకు పంపిన యాతనలను త్రిప్పిపంపండి. మాకు నష్టము కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వారిని త్రిప్పిపంపండి.
   
   
    "యస్య స్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త"
   
    (శేవృధిక -అ ఆశ్రయించిన వారి సుఖములను పెంచువాడు. శేవృధ అలక్ష్మీకరులకు అధిపతి.)
   
3.    మ్రోక, మ్రోకాను మ్రోకులారా! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, చోరులు మున్నగు వారిని త్రిప్పిపంపండి.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త"
   
    (దొంగిలించి చాటుగా పారిపోవు వాడు మ్రాకు వానిని అనుసరించువాడు అను మ్రోక.)
   
4.    సర్పాను సర్పలారా! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, చోరులు మున్నగు వారిని త్రిప్పి పంపండి.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త"
   
5.    జీర్ణా! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వారిని త్రిప్పిపంపండి.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త ||"
   
    "దేహమును జీర్ణింప చేయినది జీర్ణ"
   
6.    క్రూర శబ్ద కారిణీ! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వారిని త్రిప్పి పంపండి.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త ||"
   
7.    అర్జునీ! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వానిని త్రిప్పి పంపుము.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త ||"
   
    (అర్జుని మద్ది చెట్టు వంటిది - మద్ది చెట్టు రంగు గలది. ఆ పేరు గల రాక్షసి.)
   
8.    భరూజీ! మా మీదకు పంపిన యాతనలను, మాకు హాని కలిగించు ఆయుధములను, దొంగలు మున్నగు వారిని త్రిప్పి పంపుము.
   
    "యస్యస్థతమత్త యోవః ప్రాహైత్ తమత్త స్వామాంసాన్యత్త ||"    
   
    (శరీరమునకు హాని కలిగించునది భరూజి.)
   
                                            ఎనిమిదవ సూక్తము - 25
   
వినియోగము :-

   
      1) చాతన గణమున పఠించదగినది. శాంత్యుదకాదులందు కూడ వినియోగము.
   
      2) కుష్ఠు మున్నగు వ్యాదులందు "పృశ్ని పర్ణి" ని నూరి పూత పూయవలెను.
   
1.    దేవీ పృశ్నిపర్ణీ! మాకు సుఖములు కలిగించుము. రోగములు కలిగించు నిర్రుతికి దుఃఖములు కలిగించుము. నీవు ఉగ్రరూపవు. పాపనాశినివి. రోగములను మాన్పుదానవు. నేను నిన్ను తినుచున్నాను.
   
2.    పృశ్నిపర్ణీ! నీవు వ్యాధి నివారకమవు. ఓషధులన్నింటి కన్న ముందు పుట్టినదానవు. పక్షితల నరికిన రీతి నేను నీ బలమున రోగముల తలలు నరుకుచున్నాను.
   
3.    పృశ్నిపర్ణీ! రక్తము త్రాగు రోగములను నాశనము చేయుము. వృద్ధిని నిరోధించు రోగములను నాశనము చేయుము. కడుపును తిను రోగములను, కడుపుకు హాని కలిగించు వానిని నాశము చేయుము.

 Previous Page Next Page