శ్రీమద్భగవద్గీత
---దాశరథి రంగాచార్య
మూకం కరోతి వాచాలం
పంగుం లంఘయతే గిరిం
యత్కృపా తమహం వందే
పరమానంద మాధవం
మాధవస్వామి పరమానందమూర్తి ఆ భగవానుని కృప మూగను మాటకారిని చేయును. కుంటిని కొండలు దాటించును.
అట్టి దొరకు నమస్కరించుచున్నాను.
ఇది ప్రార్ధన కాదు. స్తుతి అగును.
ప్రార్ధన కోరిక, ఆశ, ఆశయం తీర్చమని వేడుకొనుట. అర్ధించుట -యాచించుట.
ప్రార్దన సకామం కోరికల పుట్ట.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోప శాంతయే.
విష్ణుమూర్తి తెల్లనగు వస్త్రము ధరించిన తెల్లనివాడు. నాలుగు చేతులవాడు.
చిరునవ్వు చిందించు వదనపువాడు. అట్టి సామిని సమస్త ఆటంకముల తొలగించమని ధ్యానిస్తున్నాను.
సమస్త విఘ్నాలు తొలగించుట అనునది కోరిక! కోరికలు తీరుస్తేనే దేవుడు!
"మొక్కిన వరమీయని వేల్పు గ్రక్కున విడువంగ వయలు గదరాసుమతీ"
భద్రాచల రామదాసు తన సొమ్ము పెట్టి ఆలయం నిర్మించలేదు. దానం సర్కారుది. అయినా రామచంద్రస్వామిని బహు విధాలనిందించినాడు. అజ్ఞాని అందుకే శ్రీరాముడు తానీషాకు దర్శనం ఇచ్చాడు.
మా పూర్వులది భద్రాచలం. శ్రీమద్రామానుజయతి విశిష్టాద్వైత సిద్దాంత ప్రవక్త. హరి మేనల్లుడు, ప్రథమ శిష్యులు దాశరథి.
మాది ఆ దాశరథి వంశం. నేను శ్రీరామానుజ చరితామృతం రచించాను. దానిని దాశరథి అంకితం సమర్పించాను.
19వ శతాబ్దంలో మా పితామహి - నాయనమ్మకు సంతానం పుట్టడం, గిట్టడం జరిగింది.
మా నాయన ఏడవవాడు. ఇదంతా రాముడు చేయిస్తున్నాడని వారి మూర్ఖత్వం రామాలయం మీద మన్ను పోశారు. భద్రాచలం వదిలారు.
జీవిత పర్యంతం భద్రాద్రి ముఖం చూడలేదు.
ఇది వారి అజ్ఞాన అంధకారానికి పరాకాష్ట!
మన కోరికలన్నీ తీర్చటమేనా స్వామి కార్యం?
విజ్ఞులు చోదకులే భగవానుని నిందించటం బుద్ధిమంతుల లక్షణం కాదు.
మా పితామహులు భద్రాద్రి దర్శనం లేకుండానే గతించారు.
మా నయనకు భయం. మా అమ్మకు భయంలేదు. మేము తేనియని వారం.
ప్రాప్తాన్ని అధిగమించటం అసాధ్యం!
మా మధ్య చెల్లెలు రమాదేవికి భద్రాచలం సంబంధం అనివార్యమైంది. వివాహం జరిగింది. రాకపోకలు సాగుతున్నాయి.
రమాదేవి కొడుకు - పదహారేళ్ళవాడు బావిలో పడ్డాడు. చనిపోయాడు. కార్యక్రమాలు జరిపించారు.
కాలానికి మాన్పే శక్తివుంది! పరిస్థితులు సామాన్యం అయినాయి.
నాకు భద్రాది ఆలయంలో సత్కారం చెల్లెలు ఇంట్లోనే విడిశాం. రమాదేవిని ఆలయానికి రమ్మంటే 'నా కొడుకును మింగిన వాని గుడికి నేను రాను' అన్నది.
"అమ్మా! రామచంద్రమూర్తి నీకు సేవకుడా? నీవు అనుకున్న వాటిని కలిగించాలా? నీ ఇల్లూ, వాకిలి, సంపద, పిల్లలు ఆ స్వామి అనుగ్రహించినవి కావా?
కొలపాశం స్వామి సృష్టియే! కాని దాని ధర్మంలో స్వామి కల్పించుకొనరు.
మానవజాతికి ఈ విషయం తెలియచేయదలచారు. స్వామి స్వయంగా అడవులకు వెళ్ళారు. రాముడు దేవుడు కదా! మంథర, కైక మనసులు మార్చలేకపోయాడా? పట్టం కట్టుకోలేకపోయాడా?
శక్తి లేక కాదు కావలసిన దానికి ఎంతటి స్తుతి, నిష్కామము - కోరిక లేనిది. ప్రార్ధన - కోరిక తీర్చమని అర్ధించుట!
కోరికతో కూడిన ప్రార్ధన కన్న కోరికలేని స్తుతి శ్రేష్ఠము భగవానునకు ప్రియము. "స్తుతి స్తోత్రారణప్రియః".
రామచంద్రమూర్తి అవతారం ఆచరణాత్మక ఉపదేశం - చేసి చూపినది. బంగారు జింక ఉండదని భగవానునికి తెలియదా?
దురాశ ఎంతటి దుఃఖ కారణమో చేసి చూపినాడు.
మానవ జీవితానికి ఆశ అవసరం ఆశతోనే లోకం బతుకుతున్నది.
అందునది కోరటం ఆశ.
అందనిది కోరటం దురాశ
దురాశ దుఃఖం చేటు, సామెత,
వంశవృక్షం-
అది ద్వాపరయుగం.
ద్వాపరం 8,64,000 సంవత్సరాలు.
కృతయుగం : 17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగం: 12,96,000 సంవత్సరాలు.
కలియుగం వర్తమానం : 4,32,000 సంవత్సరాలు.
ద్వాపరంలో కృష్ణుని బాలక్రీడలు - శ్రీ కృష్ణుని పాండవపక్షం - కురుక్షేత్ర సంగ్రామం - చాలించిన కృష్ణావతారం ముఖ్యములు.
కురుక్షేత్ర యుద్ద ప్రారంభంలోనే భగవానుడు నరునకు ఉపదేశించినదే భగవద్గీత.
భగవద్గీత నరుని అంతరంగాన్ని శోధించి, బోధించిన మహోత్తమ గ్రంథం.
ద్వాపరంలోనే వేదాలను సంహితీకరించడం జరిగింది.
ద్వాపరంలోనే పంచమ వేదమగు మహాభారతం ప్రథమ పురాణం భాగవత రచన జరిగింది.
ఇంతటి అక్షరసంపదను సృజించినవాడు ఒకే ఒక్కడు. అతడే వ్యాస భగవానుడు.
ఆ భగవానునికి నమస్కరిస్తున్నాం.
వ్యాసం వశిష్ఠ సప్తారం శక్తే పుత్ర మ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం
వశిష్టుని మునిమనమడు -శక్తి మనుమడి నిష్కల్మష పరాశరుని పుత్రుడు శ్రీ శుకునికి తండ్రియగు వ్యాసునకు నమస్కరిస్తున్నాడు.
సాధారణంగా కుటుంబంలో పై మ ఊడు తరాలే గుర్తుంటాయి. అసాధారణం చెప్పలేం.
శుభాశుభ కార్యాల్లో మూడు తరాలను చెప్పుకుంటారు.
పెళ్ళిళ్ళలో ఫలానా వారి మనమరాలు, మనుమడు, తండ్రిని, కూతురును మళ్ళీ ఇదే క్రమంలో కుమారునికి ఇచ్చి అదే మంత్రం చదువుతారు.
శ్రాద్ధ కర్మల్లో కర్త పై మూడు తరాలను గుర్తుచేస్తారు. ఇందు విషయంలో పై తరాల వారిని పితరులు అంటారు.
ఇందువలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
పితృరుణం, రుషిరుణం తీర్చలేనిది అని శాస్త్రం వారివల్లనే మనకు స్వయానా ఆస్తులు, అంతస్తులు లభిస్తున్నాయి. అందువల్ల వారికి కనీసం కృతజ్ఞత తెల్పటం మన కనీస ధర్మం అగుచున్నది.