Previous Page Next Page 
యమదూత పేజి 12


    
    దానిమీద దంతంతో చేసిన ముచ్చటైన పావులు వున్నాయి. ఆట సగంలో ఆపేసినట్లు అక్కడక్కడా వున్నాయి పావులు.
    
    "ఈ చదరంగం ఒక తీరని దాహం!" అని నవ్వాడు మెకానిక్. "అమెరికాలో వున్న ఒక ఫ్రండ్ తో ఆడుతున్నాను ఆట, పోస్ట్ ద్వారా! వేసిన ఎత్తులు మర్చిపోకుండా ఈ బోర్డుమీద పావులు అలాగే వుంచుతాను. డిస్టర్బ్ చెయ్యను. కానీ ఇవ్వాళ చేయక తప్పదు."
    
    "ఎందుకు?" అంది ఆ అమ్మాయి విస్మయంగా.
    
    "ఎందుకంటే మనిద్దరం ఇప్పుడొక ఆట ఆడబోతున్నాం గనక!" అంటూ పావులు కలిపేశాడు మెకానిక్.
    
    "ఇప్పుడా! పొద్దుపోయింది! టైం లేదు! నిజంగానే!" అంది ఆ అమ్మాయి వాచ్ చూసుకుంటూ.
    
    "ఒక్క ఆటే!" అంటూ పావులు పేర్చసాగాడు మెకానిక్.
    
    ప్రతిఘటించే శక్తి లేనట్టు చూస్తూ వుండిపోయింది ఆ అమ్మాయి.
    
    సోఫాలో కూర్చుంటూ అన్నాడు మెకానిక్.
    
    "గేమ్ ని ఇంకా ఇంటరెస్టింగ్ చెయ్యాలంటే పందెం ఏదన్నా పెట్టాలి అవునా?"    
    
    మౌనంగా వుండిపోయింది తను.
    
    "టక్! నువ్వు గనక ఈ ఆట గెలిస్తే నేను నీకు ఐదువేలు ఇస్తాను."
    
    "నేను అంత డబ్బు తీసుకురాలేదు" అంది ఆ అమ్మాయి మెల్లిగా.
    
    నవ్వాడు మెకానిక్. "నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు"
    
    "మరి?"
    
    "సింపుల్! ఓడితే నువ్వు నీ శాండిల్స్ వదిలెయ్యాలి అంతే!"    

    "ఎందుకు?"
    
    "ఎందుకంటే గులాబీ మొగ్గల్లాంటి నీ పాదాలని నేను చూడగల అదృష్టం కోసం!"
    
    నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది ఆ అమ్మాయి.
    
    అతని కళ్ళలో అదే కవ్వింపు.
    
    దీర్ఘంగా శ్వాస తీసుకుని మొదటి ఎత్తు వేసింది ఆ అమ్మాయి.
    
    తర్వాత అతను.
    
    తర్వాత ఆమె.
    
    "షో!" అన్నాడతను నవ్వుతూ.
    
    ఆమె ఆట కట్టయిపోయింది.
    
    "శాండిల్స్ విప్పెయ్!" అన్నాడు.
    
    లేచి నిలబడి, ఒక పాదంతో రెండో కాలికి వున్న శాండిల్ ని తొలగించింది. రెండో కాలితో మొదటి పాదానికి వున్న శాండిల్ ని తొలగించింది.
    
    అదేదో అద్భుతమయిన శృంగార విన్యాసమన్నట్లు తన్మయంగా చూశాడు మెకానిక్.
    
    ఆమె కుడి పాదంమీద అర్ధరూపాయి కాసంత పుట్టుమచ్చ వుంది.
    
    అర నిమిషంసేపు అలా అతన్ని చూడనిచ్చి తర్వాత వచ్చి అతని కెదురుగా కూర్చుంది ఆ అమ్మాయి.
    
    "ఇంక వెళతాను" అంది అస్పష్టంగా.
    
    "ఇంకొక్క ఆట"
    
    "వద్దు!"
    
    "ఈసారి నువ్వు గెలిస్తే పదివేలు ఇస్తాను. ఓడిపోతే నీ భుజంమీద ఉన్న ఆ షాల్ తీసేస్తే చాలు!"
    
    పై పెదిమ కింది పంటితో కొరుక్కుంటూ ఆలోచనలో పడింది ఆ అమ్మాయి.
    
    మళ్ళీ పావులు పేర్చాడు మెకానిక్.
    
    ఎత్తు.
    
    పై ఎత్తు.
    
    మళ్ళీ ఓడిపోయింది ఆ అమ్మాయి.
    
    "షాల్!" అన్నాడు మెకానిక్.
    
    అతన్ని టీజ్ చేస్తున్నట్లు ఊరిస్తూ నెమ్మదిగా షాల్ ని తీసేసింది ఆ అమ్మాయి.
    
    లోపల వుంది చమ్కీతో మిలమిల మెరిసిపోతున్న ముదురు నీలం వెల్వెట్ జాకెట్ సైజు కోట్.
    
    "ఈసారి పందెం పాతికవేలు. లేకపోతే నీ కోట్!" అన్నాడు మెకానిక్.
    
    "నన్నింక పోనివ్వరా?" అంది ప్రార్ధిస్తున్నట్లు.
    
    నవ్వుతూ, తల అడ్డంగా వూపాడు మెకానిక్.
    
    మళ్ళీ ఆట.
    
    మళ్ళీ ఓడిపోయింది ఆ అమ్మాయి.
    
    "కోట్!" అన్నాడతను కమాండ్ చేస్తున్నట్లు.
    
    కూర్చునే రెండు చేతులతో కోట్ అంచులు పట్టుకుని, అంగుళం అంగుళం చొప్పున తొలగించింది ఆ అమ్మాయి.
    
    కళ్ళార్పకుండా చూస్తున్నాడు మెకానిక్. ఆమె వక్షం సమున్నతంగా వుంది. సిల్కు కుర్తాలోనుంచి ఆమె బ్రా స్ట్రాప్స్  ఇన్వయిటింగ్ గా కనబడుతున్నాయి.
    
    సంకోచం లేకుండా అతను తనవైపు అలా చూస్తూ వుంటే అప్రయత్నంగా కాస్త పక్కకి తిరిగి కూర్చుంది ఆ అమ్మాయి.
    
    అతని గొంతు కూడా మారింది. "ఈసారి పందెం లక్షరూపాయలు! నేను ఓడితే లక్షరూపాయలు ఇస్తాను. నువ్వు ఓడిపోతే నీ కుర్తా విప్పెయ్! చాలు" అన్నాడు బొంగురుగా.
    
    "వద్దు! వద్దు!" అంది ఆ అమ్మాయి భయంగా.
    
    అతను కోటు జేబులోనుంచి వాలెట్ తీశాడు. దనైలోంచి చెక్ బుక్ తీసి "లక్షరూపాయలు" అని రాశాడు. ఒక చెక్ లీఫ్ మీద. దాన్ని ఆమె కళ్ళముందు రెండుసార్లు ఆడించి, సెంటర్ పీస్ మీద పెట్టి అర్ధవంతంగా అన్నాడు.
    
    "గెలిచినా సుఖమే! ఓడినా సుఖమే! కాదనకు. మొదటి ఎత్తు నీదే! గాంబిట్! కమ్!"
    
    నిస్సహాయంగా అతనివైపు చూసి, తల అవ్న్చుకుని నెమ్మదిగా మొదటి ఎత్తు తనే వేసింది ఆ అమ్మాయి.
    
    రెండో ఎత్తు మెకానిక్ వేశాడు. అప్పుడు ఊహాతీతంగా-
    
    అతనికి కళ్ళు బైర్లు కమ్మేటట్లు -
    
    మూర్చ వచ్చేటట్టు -
    
    ఒక ఎత్తు వేసింది ఆ అమ్మాయి!
    
    అది అతను అంతకు ముందు ఎప్పుడూ కనీవినీ ఎరుగనటువంటి ఎత్తు!
    
    వేసి,
    
    "చెక్" అంది చాలా స్పష్టంగా, చాలా ఆత్మవిశ్వాసంతో.
    
    ఇప్పుడామె శతకోటి సంశయాలతో సతమతమైపోతూ ఉన్న దానిలా కనపడటంలేదు. గుర్తుపట్టలేనట్లుగా మారిపోయాయి ఆమె మొహంలోని భావాలు!
    
    స్టన్ అయిపోయాడు మెకానిక్. అతనికి దిగ్భ్రమ కలిగినట్టయింది. తన కళ్ళమీద తనకే నమ్మకం పోయినట్లు అయింది తెరిచిన నోరు తెరిచినట్లే వుండిపోయింది.
    
    ఆ అమ్మాయి వేసిన ఎత్తు అలాంటి ఇలాంటి ఎత్తుకాదు.
    
    గ్రాండ్ మాస్టర్స్ అయిన ఏ కాస్పరోవో, ఏ బాబీఫిషరీ ప్రపంచ స్థాయి పోటీలలో వెయ్యవలసిన ఎత్తు అది!
    
    అష్టదిగ్భంధం లాంటిది!
    
    ఈ అమ్మాయి -
    
    తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఆ బిజినెస్ మాగ్నెట్ చేతిలో శృంగభంగం కలిగేలా ఓడిపోయిన ఈ పిల్ల...
    
    తనని మట్టి కరిపించటమా? ఎలా సంభవం?
    
    అసలు ఎవరీ అమ్మాయి?

 Previous Page Next Page