Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 11

 

    ఈ  నెల పరిశోధన మాసపత్రికలో మిరే డిటెక్టివ్ అయితే! స్టొరీ పజిల్ లో మహానంద ఒక్కతే గెలుపొందింది. నూట పదహార్లు బహుమతి కొట్టేసింది. ఆ సందర్భంలో మాసపత్రిక మార్కెట్ లోకి రాకముందే పోస్టులో ముందుగా మహానందికి పంపించాడు ఎడిటరు. జరిగింది అది.

 

    ముగ్గురు స్నేహితురాళ్ళలో మహానంద తండ్రి బాగా ధనవంతుడు. శ్రీవిద్య దైర్య, వాళ్ళ తండ్రులకి ఎంతో కొంత డబ్బుంది. కానీ రిచ్ మటుకు కాదు. మహానందికి నూట పదహారు రూపాయలు ఓ లెక్క కాదు. పజిల్ ల్లో  గెలుపొందింది కాబట్టి ఆ సంతోషం.

 

    ముగ్గురు కలసి అక్కడే కుర్చుని పరిశోధన మాసపత్రిక మొత్తం తిరగేశారు. పత్రిక చూడబోతే ఒక్కటి చదవాల్సింది ముగ్గురు ఎలా? అందుకని స్టోరీస్ ని వదిలేసి పజిల్స్ లాంటివి అక్కడే కుర్చుని చదివి చర్చ్చించుకున్నారు.

 

    అపరాధ పరిశోధన అన్నా పజిల్స్ అన్నా వాళ్ళ ముగ్గురికి ఒకే రకమైన యిష్టం. ప్రతినెల పోటిల్లో పాల్గొంటుంటారు. గెలుపొందింది మాత్రం యిప్పుడే.

 

    సూపర్ పాస్టు సస్పెన్స్ క్రేం రచనా పితామహ "భయంకరమూర్తి" తన స్టోరీస్ లోనే తమాషా పజిల్స్ లాంటివి కలిసి రచనలు చేస్తుంటాడు ఈ నెల పరిశోధన మాసపత్రికలో "ఆ చీకటి రాత్రి" అనే చిన్న పజిల్ స్టొరీ అతనిది ప్రచురణ అయింది. రైటర్ భయంకరముర్తి రచన మొదట్లో పాఠకులకి కొన్ని సూచనలు యిచ్చాడు. హెచ్చరిక చేశాడు.

 

    మీకు బి.సి. గుండెదడ నరాల విక్ నస్, భయంకరమైన కలలు రావటం హార్ట్ కి సంబంధించిన దిసేజ్ లేమైనా వున్నాయా! వుంటే ఎ కధ చదవ వద్దు.

 

    ఎంత భయంకరమైన స్టోరీనైన చదవగలంగాని సంఘటని చూడలేము అంటారా! అయితే ఈ నెల నేను మీకు అందిస్తున్న "ఆ చీకటి రాత్రి" ని చదివి వదిలేయండి. అంతేగాని పరిసోధనలోకి దిగొద్దు. ఆ తర్వాత మీరు చింతించి ప్రయోజనం లేదు నన్ను దూషించి లాభం లేదు.

 

    మీకు గుండె ధైర్యం దండిగా వుండి పరిశోధన చేయాలన్న కుతూహలం వుంటే ప్రాక్టికల్ గా చేసి చూడండి. మీరు ఎంత ధైర్యవంతులైనా మొండి చెయ్యి రంగ ప్రవేశం చేసేసరికి మీకు బి.పి. రైజ్ అయి, నాలుక పిడచకట్టుకుపోయి, గుండె దడ దడ లాడటం ఖాయం. మీరు వెర్రికేక వేయడం కూడా ఖాయం.

 

    "ఆ చీకటి రాత్రి" గురించి భయంకర మూర్తి ముందే పాఠకులకి చిన్న హెచ్చరిక లాంటిది చేశాడు (రాశాడు)

 

    భయంకర మూర్తి రచనలు అంటే ముగ్గురికి చాలా యిష్టం. ఆ చీకటి రాత్రి గురించి ముగ్గురు పదే పదే చదివారు.

 

     స్టొరీ విషయం అల వుంచితే దానిలో ఒక సీను  భయంకరంగా అద్భుతంగా వుంది.

 

    అది చాలా పెద్ద ఇల్లు. ఆ రాజు రాత్రి ఇంటిలో యవన్ మంది పార్టీ కి వేళతారు. అభయ అనే పదహారేళ్ళ అమ్మాయి మాత్రం వంట్లో బాగుండక ఇంటిలోనే వుంటుంది. సమయం రాత్రి పన్నెండు పది. కరెంటు పోతుంది. అభయ కొవ్వొత్తి వెలిగించి టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చుని చదువుకుంటుంది.

 

    ఎటు చూసినా గాడాంధకారం. గాలి కూడా స్తంభించింది. ఇంటి మొత్తంమీద అభయ ఒక్కతే వుంది. ఇంటి తలుపులు మొత్తం మూసేసి వున్నాయి. తల పూర్తిగా పుస్తకంలో దూర్చి కధలో లీనమయిన అభయ వెనుక పక్క కిటికీ వుంది.ఆ కిటికిలోంచి ఓ మొండిచెయ్యి నెమ్మదిగా అభయ మెడవరకు వచ్చి ఆగింది.

 

    ఉత్త మొండిచెయ్యి తప్ప ఆ చెయ్యి తాలూకా మనిషి లేడు.మొండిచెయ్యి చీము నెత్తురు ఓడుతూ ఉంది. చేతికి పురుగులు పట్టాయి. చెయ్యి కుల్లిపోయివుంది.ఏ అధారమూ లెకుండా గాలిలో తేలుతూ వచ్చింది. అభయ మెదవరకూ వచ్చి ఆగింది.

 

    టప్!

 

    నెత్తురు చీము కలిసిన ఓ చుక్క మొండిచెయ్యినుంచి జారి అభయ మెడమీద టప్ మని పడింది.

 

    5)   

 Previous Page Next Page