Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 12

   

    సీత ఆలోచించటం మానేసింది. ఇల్లు సర్దేసి ముఖం కడుక్కొచ్చి చీర జాకెట్టు మర్చి వాకిలి తలుపుకి తాళమేసి బైలుదేరింది.

 

    మద్యాహ్నం పూట యింట్లో ఎవరూ వుండరు. రాజు, జయ స్కూలు కెళ తారు. రూప కాలేజికెళుతుంది. రామచంద్రం ఆఫీసు కెళతాడు. పి.యు.సి. తో చడువాపిన సీత మాత్రం మద్యాహ్నం పూట కుట్టు సెంటర్ కెళ్ళి మిషను మీద బట్టలు కుట్టడమేగాక ఎంబ్రాయిడ్ చేయటం కూడా నేర్చుకుంటున్నది.

 

    టైము కన్నా ముందే బైలుదేరటం వల్ల సీత నెమ్మదిగా నడుస్తున్నది.

 

    సీత వెనుకనే బయలుదేరిన ప్రకాష్ వీధి మలుపు దాటిందాక ఆగి సీతని కలుసుకున్నాడు "సీతా" అని పిలిచాడు.

 

    సీత గిర్రున వెనుతిరిగి చూసి ప్రకాష్ ని చూస్తూనే ముఖం చిట్లించింది. మాట్లాడకుండా ముందుకు సాగింది.

 

    "సీతా! ప్లీజ్ నాతో మాట్లాడవా? నేనేం పాపం చేశాను" అన్నాడు ప్రకాష్.

 

    "ఏం మాట్లాడాలి?అంది సీత.

 

    "ఏదో ఒకటి"

 

    "ఎందుకు?"

 

    "ఎందుకేమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి."

 

    "నన్నడిగి ప్రేమిస్తున్నావా? అయినా నాకి ప్రేమలు దోమలు నచ్చవు."

 

    "అలా అనకు సీతా! అసలు నన్నడిగితే ప్రేమించడానికి ఎవరిని అడగక్కరలేదు. అందాన్ని ఆరాదించే హృదయం , చూడటానికి కళ్ళు వుంటే చాలు. పూలని ప్రేమిస్తాం, పకృతిని ప్రేమిస్తాం కంటికింపుగా హృదయాలకి ఆహ్లాదకరంగా కానవచ్చే ప్రతిది ప్రేమించవచ్చు. అలాగే నీ రూపం నాకు నచ్చింది ప్రేమించాను." కవిత్వం చదివినట్లే అన్నాడు ప్రకాష్.

 

    తామిద్దరూ ప్రక్కప్రక్కనే మాట్లాడుకుంటూ నడుస్తుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండదని భయపడుతూ వుంది సీత. ఎలా వదిలించుకోవాలి ఈ ప్రకాష్ ని అనుకుంది.

 

    "మాట్లాడవేం సీతా?" అన్నాడు ప్రకాష్.


    
    "కంటికి బాగున్నా వన్ని ప్రేమించవచ్చని చెప్పారుగా, ప్రేమిస్తుపోతే సరీ."

 

    "వాన్ వే ట్రాఫిక్ నాకు నచ్చదు సీతా"

 

    "దానికి నేనేం చేయను?"

 

    "ఏం చేయాలి నన్ను ప్రేమించి ప్రేమించానని చెపితే సరి. బట్ మన మార్గంలో ఏ అవరోధము లేనట్లే."

 

    "ప్రేమతో ప్రాధేయ పడుతున్నాను సీతా! రెండుసార్లు లెటర్స్ నా ముఖానే చించావు. నే అందముగా లేనా? నాకు డబ్బు లేదా? నాలో ఏం లోపం కనపడింది?"

 

    సీత మాట్లాడలేదు. వేగంగా నడవటం మొదలుపెట్టింది.

 

    "నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సీతా! ఇంటెడు చాకిరీ చేస్తున్నావు, ఖరీదైన బట్టలు లేవు. నగలు లేవు."

 

    "నాకేం కోరికలు లేవు."


    
    "చెపితే నమ్మాలా! ఈ వయసులో కోరికలు లేకుండా ఎవరు వుండరు. పుష్టిగా ఆరోగ్యంగా వున్న నీ శరీరం కోరికలతో కాలిపోవటం లెదూ?"

 

    "మీరిలా వెంటపడి వేధిస్తే నాన్నతో చెప్పాల్సి వుంటుంది."

 

    "చెప్పు ఆయనెంతో సంతోషిస్తాడు."

 

    "అహో," అయితే ఓ పని చేయండి. నన్ను ప్రేమిస్తున్నానని నా వెనుకబడి గోల చేయక మా నాన్నతో వచ్చి చెప్పండి. నాన్న యిష్టపడితే పెళ్ళి చేసుకోవచ్చు."

 

    "నా కభ్యంతరం లేదు. కాని కొన్నాళ్ళు ప్రేమించుకుని హాయిగా తిరిగితే ఆ త్రిల్ వేరుగా వుంటుంది."

 

    "మికుంటుంది. ఎవరైనా మీతో అలా తిరిగే వాళ్ళుంటే వాళ్ళ వెంటపడండి. అంత ప్రేమే వుంటే ఈ లేఖలు చాటుమాటు పలకరింపులు మానేసి నాన్నతోను, మీ పెద్దవాళ్ళతోను చెప్పి వాళ్ళ ఆమోదం పొంది పెళ్ళి చేసుకోండి. నా కభ్యంతరం లేదు."

 

    ప్రకాష్ ముఖం వెలిగిపోయింది సంతోషం పట్టలేక.

 

    "సీతా! నేనంటే యిస్తాపడుతూనేనా ఈ పైపై కోపం నీ కభ్యంతరం లేదంటున్నావు. అమ్మయ్య నన్ను ప్రేమించేనన్న మాట ఈ నాటకం. అవును ప్రేమిస్తావు నాకెప్పుడో తెలుసు, అందమైన వాడిని డబ్బుంది. నీకేలోపం చేయను కదా"

 

    సీత ముఖం చిట్లించింది.

 

    "నేచేప్పేది వినండి. ఇహపై నాకు చాటుగా ప్రేమలేఖలు అందించవద్దు. నన్ను కలుసుకో ప్రయత్నించవద్దు. పెద్దవాళ్ళ ఆమోదం తర్వాతే ఏదయినా, అన్నట్లు మిలా పెళ్ళికి ముందే ప్రేమించటం నాకు చాతకాదు. పెళ్ళయింతర్వాతే ప్రేమ. ఇంకా నా వెనుకనే రాకండి." గట్టిగా చెప్పేసి సీత చకచక ముందుకి నడిచింది.

 

    "పెళ్ళికాకముందు ప్రేమిస్తే కొంపేం మునుగుతుందో" ఆలోచిస్తూ వెను తిరిగాడు ప్రకాష్.   

 Previous Page Next Page