Previous Page Next Page 
కాలనాగు పేజి 11

                                                                                  9
   
    ఆ రోజు సాయంకాలం...

    అయిదు గంటల సమయం, ధర్మరాజు యీజీచేయిర్ లో పడుకున్నారు విశ్రాంతిగా. కిటికీ గుండా చల్లగాలి మెలిమెల్లిగా లోపలికివస్తూ అత్మీయుడిలా పలుకరిస్తోంది.

    ఆదిత్య లైబ్రరీకి వెళ్ళాడు, అతనికి మనస్సంతా చికాగ్గా వుంది. తండ్రిచెప్పిన విషయం అతని మనస్సుని తొలుస్తోంది. అందుకే లైబ్రరీకి వెళ్ళాడు.

    అరుంధతి యింటి తలుపులన్నీ వేసి, జాగ్రత్తగా తాళాలు వేసి కిటికీ వద్దకి వచ్చి భర్తకి తాళాలు అందించింది. 'అబ్బాయివస్తే తాళాలు యివ్వండి! లేదా నేను త్వరలో వచ్చేస్తాను అంది.

    'అక్కడికేనా?' అడిగారాయన.

    'అవును. లక్ష్మి చాలా నమ్మకంగా చెబుతోంది. ఆయనకి చాలా మహిమలున్నాయట గోప్పదైవభక్తి వుండట. ఎందరికో ఎన్నోజబ్బులు నయం చేశారట_

    నిటుర్చారాయన. ఆయనకి "శక్తుల"పై నమ్మకం లేదు.జపతపాలేమి? శక్తేమిటి? మంత్రమేమిటి? మహిమేమిటి? అని వాదించే మేటి రియలిస్ట్ ఆయన.

    కానీ అయన భార్యని వారించలేదు.

    కారణం_అది తన జబ్బుకి సంబంధించిన విషయం.

    "వెళ్ళిరా!" కీస్ అందుకుంటూ అన్నారు.

    లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయింది ఆమె.

    ఏకాంతంగా అంత యింట్లో ఆయనోక్కడిని వదిలేసి వెళ్ళటంలో చాలా తప్పు చేసింది అరుంధతి. అయితే అప్పుడామెకి ఆ విషయం తెలియదు. తర్వాత ఆ తప్పుకి ఎంతో పెనల్టీ చెల్లించాల్సి వచ్చింది. అలా జరుగుతుందని ఎ మాత్రం తెలిసినా ఆమె భర్తని విడిచి వెళ్ళేదికాదు ప్చ్!ఏం లాభం... కాలం మన చేతిలో లేదు.

   
                                          *            *             *

    లైబ్రరీలో ఓ వారగా ఓ టేబుల్ ముందు కూర్చిని దీక్షగా చదువుతున్నాడు ఆదిత్య. అది స్నేకియోగ్రఫీ ఆ ప్రక్కనే మరో పుస్తకం వుంది. అది స్కార్పియోగ్రఫీ. దాని ప్రక్కనే మరో పుస్తకం వుంది అది సర్పెంట్స్ ఆర్ డివైన్...

    ఆ మూడు పుస్తకాలు కొత్తగా వచ్చాయి ఒకటి. మొదటిది అమెరికాలో అచ్చయింది. రెండవ పుస్తకం ఆఫ్రికా ఎడిషన్. మూడవది ఇండియన్ ఎడిషన్. అదీ దక్షిణ భారతదేశంలో తమిళనాడులో అచ్చయింది అ రచయిత మధుర నివాసి. వదహాళ సాంప్రదాయానికి చెందిన శ్రీ వైష్ణవాచార్యుడు.

    ముందుఅ పుస్తకమే చదివాడు ఆదిత్య. అది చదువుతూ వుంటే అతనికి మతి పోతున్నట్టుగా వుంది.

    ఆయన పాముల్ని దేవతలుగా నిరూపించాడు. దివ్య సార్పలున్నాయన్నాడు సర్పకృతి నుంచి ఆ నాగదేవతలు మానవాకృతిని కూడా పోందగలరన్నాడు ఎక్కడెక్కడ ఆ దివ్య దేవతసర్పాలు ఎన్నెన్ని మహిమలు చూపాయో ఉదాహరణగా యిచ్చాడు.

    తర్వాత అతను తేళ్ళల్లో వున్న రకాలు "చూసి" ఆశ్చర్యపోయాడు ఫోటో తో సహ వున్న ఆ పుస్తకం చదివాక అతనికి ఆఫ్రికాలో వుండేది మనుషులా? తేళ్ళా? అనే అనుమానం వచ్చింది

    ఇప్పుడతను పాములా చరిత్ర చదువుతున్నాడు

    చదువుతూ వుంటే అతనికి క్రమంగా తలకి విషం ఎక్కుతున్నట్టుగా అనిపించసాగింది. విషపూరితమై శరీరమంతా క్రమక్రమంగా మొద్దుబారుతున్నట్టుగా అనిపించసాగింది

    కళ్ళు మసకలు కమ్మి అక్షరాలు కనిపించకుండా, అక్షరాల స్థానంలో పాములు వెలుస్తూ అవి భయకరంగా సర్పనృత్యం చేస్తున్నట్టుగా కన్పించసాగింది

    అతని భుజంపై ఎవరిదో చేయిపడింది

    ఆ చేయి పాము పడగలాగా అనిపించి చప్పున ముఖం అటు తిప్పాడు. మసకలు కమ్మిన అతని కళ్ళకి ఆ క్షణంలోనే చూపు తిరిగొచ్చినట్లయింది

    అతనాశ్చర్యపోయాడు

    అతని భుజంపై చేయివేసింది ఎవరో స్త్రీ !యువతి!అపరిచిత వ్యక్తి

    చిరునవ్వు నవ్వుతోంది ఆమె. ఆమె పెదాలిపై వెలిగే చిరునవ్వు పడగపై మణి కాంతులు చిమ్ముతున్నట్టుగా వుంది.

    అతను అప్ర్తతిభుడై పోయాడు

    "నా వెంట రండి!"

    కదిలిన ఆమె పెదవులు ఆహ్వానించినట్లయింది

    చప్పున లేచి నుంచున్నాడతాను

    ముందు ఆమె   

    వెనుక అతను లైబ్రరీ దాటి, మెట్లుదిగి, ఆ బిల్డింగ్ వెనుకకు దారి తీసింది ఆమె, అనుసరిస్తున్నాడు ఆదిత్య.

    అతన్ని చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు.

    ఎవరో లాక్కెళుతున్నట్టుగా. మంత్రించి తీసుకుపోతున్నట్లుగా వెళుతున్నాడు ఆదిత్య.

    అతనికి తన ముందు నడుస్తున్న ఆ యువతి తప్ప మరెవ్వరిపైన దృష్టిలేదు.

    ఆ యువతి వెళ్లివెళ్లి ఓ చెట్టు క్రింద ఆగింది.

    ఆదిత్యకూడా ఆగిపోయాడు.

    ఆమె నడక ఆపి యిటు తిరిగి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు విద్యుత్ ప్రవాహంలాగా అతన్ని సోకి విద్యుత్ ఘాతం తగిలినట్లుగ అనిపించింది.

    అతడప్రతిభుడయ్యాడు. అదే అతని జీవితాన్ని మార్చింది.

   
                                                                              10


    అరుంధతి వాళ్ల పనిమనిషి లక్ష్మి వెళ్లేసరికి శ్రీథరశాస్త్రి సామాహ్నపూజ ముగించుకుని దేవతార్చన కుపక్రమించ బోతున్నాడు.

    ఆయన ఎదురుగా దేవుడి మందసం వుంది. అమందసాన్నిరం రంగుల విద్యుద్దీపాలు కాంతిమంతం చేస్తున్నాయి. మందసంలో వున్న దీపం వెదజల్లే కాంతి విద్యుద్దీపకాంతుల కంటే మిన్నగా వుంది అది నేతి దీపం  ప్రత్యేకంగా తెప్పించుకునే స్వచ్చమైన ఆవు నేతితో వెలిగిచిన దీపం అది.

    మందసంలో రకరకాల విగ్రహాలున్నాయి పార్వతి 'సర్వసతి' శ్రీదేవి, మూర్తులతో పాటు వినాయకుడు, వేంకటేశ్వరుడు కూడా విగ్రహరూపంలో వేలిశారక్కడ! ఇవి కాక శివ పంచాయతనం వుంది.    

 Previous Page Next Page