Previous Page Next Page 
కాలనాగు పేజి 12

    అన్నిటికి మించి అడుగున్నర ఎత్తులో వెండినాగ ప్రతిమ వుంది అడుగు వెడల్పున దాని పడగకి అయిదు తలలున్నాయి ఒక్కో తల మీద మరకతం, వజ్రం, గోమేధికం, మాణిక్యం, పగడం తాపబదివున్నాయి అన్నీ జాతికి చెందినవే.

    దాన్ని శ్రీధరశాస్త్రికి ఓ భక్తుడు సమర్పించుకున్నాడు. అతడి పేరు బాల ఈశ్వరరెడ్డి అతనిదో వింతకథ అతనా వూరి సర్పంచ్ తల్లి తండ్రి లేరు ఒక్కడే సంతానం బోల్డెంత ఆస్తి లంకంత ఇల్లు కొత్తగా పెళ్లయిన రోజులు   

    ఇంటినిండా నౌకర్లు చాకర్లు, జీతగాళ్ళు కోరీలు వాళ్లని మించిన బంధుజనం.

    పెళ్ళయి ఆరునెల్లు భార్యతో స్వర్గ సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాతే మొదలైంది అతనికి కష్టపరంపర కళ్ళు తెరిచినా మూసినా సర్పాలు కనిపించేవి. ఆ యవ్వన దశలో అంతా భార్యామయం అనిపించవలసిన ఆవయసులో అతనికి అంతా సర్పమయం అయింది.

    కాలుతీసికాలు పెట్టటానికి భయం. అక్కడో పాము కనిపించేది మంచంపై పడుకుందామని వెళితే పక్కలో నిలువునా ఆమె నానుకుని ఓ పెద్ద పాము పడుకుని వుండేది మంచం దిగి కాలు నేలమోపా లంటే పడగెత్తిన పాము కనిపించేది.పొలానికి వెళితే దారిలో అడుగడుగునా ఓ పాము జీపు ఎక్కబోతే సీట్లో డ్రైవరు ప్రక్కన చుట్టుచుట్టుకుని ఓ పాము పడుకుని వుండేది.

    మంచినీళ్ళు తాగాలని గ్లాసు తీసుకుంటే అందులో ఈత కొడుతూ జర్రిపిల్ల కనిపించేది. పళ్ళెంముందు కూచుని అన్నం కలుపుకోబోతే అందులో పాము పిల్లలు కదలాడేవి.

    ఈ ప్రత్యక్ష నరకాన్ని భరించలేకపోయాడు అయన.

    అప్పటి అతని స్థితి ఎవరికీ చెప్పుకునేది కాదు. ఎవరికీ కనిపించవు ఎవరినీ బాధంచావు. కానీ అతనికి 'ప్రత్యక్ష' మౌతాయి గుండె జల్లుమతుమ్ది. గుభీలు మంటుంది నరనరాలు ఎక్కడక్కడ బిగుసుకుపోతాయి. ఎహారీరం నిశ్చైతన్యమై మనస్సు జడపై పోతుంది.

    ఆఖరికి తన ఆవేదన భార్య క్కూడా చెప్పలేకపోయాడు.
 
    రోజురోజుకి మానసిక రాగిల కృశించిపోతున్న అతన్ని చూసి రోజు బాలమ్మ అడిగింది. అతన్ని ఆమె పురిటికందు దశనుంచి పెంచింది పిల్లలులేని ఆమెకి బాలయీశ్వరరెడ్డి కొడుకయ్యాడు.
 
    'ఏంటి బాబూ అలా వున్నవ్ ?'

    అతనికా క్షణంలో ఆమెలో తన తల్లి కనిపించింది. అయిదేళ్ళ వయసులోనే తనని ఒంటరి చేసి జగన్మాతలో లీనమై పోయిన కన్నతల్లి కన్పించింది.

    తన బాధ చెప్పుకున్నాడు.

    ఆమె నవ్వింది.

    శాస్రీగారింటికి తీసికెళ్ళింది.

    అయన అంత విన్నారు. 'ఇది సర్ప గ్రహా దోషం' అన్నడుసర్ప శాంతి చేసి, సర్ప పూజ చేస్తే తగ్గిపోతుందన్నారు.

    సర్ప విగ్రహం చేయించమన్నారు అయన.

    అదే వూళ్ళో నండూరి సోమయాజులు అనే శ్రోత్రీయుడైన విశ్వ బ్రాహ్మణుడున్నాడు.ఆయనతో తయారుచేయించారు యీవిగ్రాహాన్ని.ఒక శిల్పాచర్యుడిగాదాన్ని ఎనభయ్ రైజులు శ్రమించి తయారుచేశాడు అయన.

    వెయ్యిన్నూట పదహార్లు కట్టడి. రెండు నూటపదహార్ల దక్షణ,పంచలచావు,స్వర్ణాంగుళీయకం యిచ్చి తెచ్చుకున్నారు విగ్రాహాన్ని.

    నలభయ్ ఒక్కరోజు మండల దీక్షతో పూజ చేశారు శాస్రీగారు

    బాల ఈశ్వరరేడ్డికి స్నేక్ ఫోబితూ పోయింది.

    అతనికి చేజారిన స్వర్గం_ పారడైజ్ లాస్ట్_ తిరిగి దొరికినట్టుయింది. శాస్రీగారిని భూ, గో, సువర్ణ,రజతదానాలతో సత్కరించాదు.

    అదిగో అదీ ఆ విగ్రహం.

    నాగ అష్టోత్తర శతితో పూజ చేస్తున్నారు శాశ్రీగారు

    అప్పుడు వెళ్లరు అరుంధతి- లక్ష్మి....

    పూజా మందిరంలోకే వెళ్ళారిద్దరూ ఆమె ధర్మరాజు గారి భార్య కావడంలో ప్రత్యెక దర్శనం లభించింది.

    పూజ ముగిసింది.

    శ్రీధరశాస్రీగారు అర్ద నిమీలితనేత్రులై కూర్చూన్నారు.

    'అరుంధతీ?"

    అయన ఎవరయినా! అలాగే పేరుతో పీలుస్తారు ఏ వ్యక్తీ వచ్చి అక్కడ కూర్చున్నా క్షణంలోగా ఆయనకి ఆ వ్యక్తి పేరు, వూరు, విషయం చప్పున స్పుర్తిస్తాయి. ఆ మహిమప్రభావం వల్ల వచ్చిన వక్తులు పేరుతో పిలిచినా గౌరవించి నట్టే భావిస్తారు.

    "మీ వారికి చూపు మందగించింది."

    అది సర్ప దోషం

    మీ యింట్లో పడగ్గదిలో మంచం క్రింద సరిగ్గా మనిషి లోతులో నరసాస్తికలున్నాయి.

    మీ యింటిస్థలంలో యిల్లు కట్టక పూర్వం ఓ పెద్ద పుట్ట వుండేది ఆ పుట్టలో ఓ మహాసర్పం వుండేది ఆ వాల్మీకాన్ని ఆ నగారాజుని యిల్లుకట్టే కూలీలు నాశనం చేశారు. పాముని చంపినా పాపంపోయేటట్టుగా వాళ్ళు పాము నాలికపై రాగి కాని వుంచి దాహానం చేయలేదు పొలాల్లో విసిరివేశారు. ఆ బలవంతమైన సర్పం పీపీలికల పాలైంది. అది చీమలు తిని పురుగులు కొరికి గాలికి,ఎండకు ఎండి, నీటికి తడిచి చర్మం చివికి నానా భ్రష్టం చెందింది. ఆ నాగారాజు ఆత్మ ఎంతో ఘోషించింది.

    అడివుడు మిమ్మల్ని బాధిస్తోంది.

    సరిగ్గా యీ క్షణంలో నీ కుమారుడు ఓ నాగకన్య చేతిలో వున్న అరసృతిలో వున్నాడు.

    ఆ మాటలు విన్న అరుంధతి స్థాణువైంది
   
   
                                                                               11


    మెల్లిగా మృదువుగా నవ్వింది ఆ యువతి

    అమ్మోహనాస్రం ప్రయోగించి నట్టయిందతనికి

    'ఎంత అందంగా వున్నవ్? కిన్నెరమీటి, దానిపై వలపు రాగంలో ప్రేమ మార్చాన పలికించి నట్లుగా వుంది ఆ పలకరింపు

    "నువ్వెవరు?" అడిగేడు ఆదిత్య

    మళ్ళీ నవ్వింది

    "నిన్నెప్పుడూ చూల్లేదు ఎక్కడ వుంటుంన్నావ్?"

    నేను నిన్ను చూస్తూనే వున్నాను నువ్వు చూడలేదేమో! నేను యిక్కడున్నాను అక్కడున్నాను ఎక్కడైనా వుంటాను!

 Previous Page Next Page