"లేదండి"
"మరి క్లబ్బులో చేరకుండా డబ్బులెలా వస్తాయోయ్? మా క్లబ్బులో చేరు. నీ పేరు నేను స్పాన్సర్ చేస్తాను. అడ్మిషన్ ఫీజు నాలుగువేలో ఎంతో అనుకుంటాను ఇప్పుడు. ఫర్వాలేదు నేను కట్టేస్తాను. నువ్వు తర్వాత తిర్చేద్దువుగాని. ఐ విష్ యూ లక్!" అన్నారాయన.
"సరిగ్గా ఇలాంటి సహాయమే నాక్కావాలి. థాంక్యూ సర్! నేను కాస్త తెరుకోగానే మీ అప్పు తిర్చేస్తాను" అన్నాడు శ్రీహర్ష, సంతోషాన్ని మోహంలో కనబరుస్తూ.
"నమస్తే! కనబడుతూ ఉంటారుగా! నేనూ ఆ క్లబ్బులో మెంబర్నే!" అంది లావణ్య చిలిపిగా.
"నమస్తే! కనబడుతూనే ఉంటాను" అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ.
టాక్సీ కదిలింది.
* * *
"దీర్ఘాలోచనలో పడిపోయావ్" అన్నాడు శ్రీహర్ష. ఆలోచనలోంచి తేరుకుంది లావణ్య.
"ఏం లేదు. అడవులూ, డాక్ బంగాళా గుర్తొస్తున్నాయి" అంది.
"మళ్ళీ వెళదాం సరదాగా, దానిదేముంది నా జీపుందిగా" అన్నాడు శ్రీహర్ష.
"మీ జీపు సరేలెండి. అసలయినా నా పరిచయం కలగడానికి కారణం జీపే అన్నారు. ఇంకెంత మంది అమ్మాయిల పరిచయం చేస్తుందో అది. జీపుకి అలా చెయ్యడం సరదాలా ఉంది. అందుకనే అమ్మేయ్యమంటున్నాను."
"అమ్మేయ్యడమే! ఆ జీపునే! లావణ్యా! నేను నిన్ను మరిచిపోయిన రోజున జీప్ ని అమ్మేస్తాను."
లావణ్య నవింది సగర్వంగా.
"థాంక్స్ ! అయినా మళ్ళీ మనం అడవికి ఎప్పుడేళతామో తెలుసా? హనీమూన్ కి. అబ్బ! వద్దులెండి. హనీమూన్ కూడా అడవిలో ఎందుకు? హాయిగా స్విట్జర్లాండ్ వెళదాం."
"స్విట్జర్లాండు దాకా ఎందుకు? కాశ్మిరేం తిసిపోయిందా?"
"ప్రతివాళ్ళు కాశ్మిరెళుతున్నారి రోజుల్లో. లీవ్ ట్రావెల్స్ కన్సెషన్ పెట్టిన తరవాత గవర్నమెంటు ఉద్యోగస్తుల్లో గుమ్మస్తాల దగ్గర్నుంచి అందరూ వెళుతున్నారు. మనమూ అక్కడికే వెళితే మన గొప్పేమిటి?"
"గొప్ప కోసమా? మనసుకి సంతోషం కోసమా మనం వెళ్ళేది?"
"రెండింటి కోసమును! స్విట్జర్లాండ్ వెళ్ళామంటే గొప్ప. "అబ్బ! వాళ్ళెంత గొప్పవాళ్ళో" అని అందరూ అనుకుంటే మనసుకి సంతోషం. అదే ఎకనామిక్స్. ఎవరి దగ్గరా లేని వస్తువు నీ దగ్గర ఉంటే తృప్తి. ఎవరికి కలగని అనుభవం నీకు కలిగితే తృప్తి. ఆ వస్తువు అందరి దగ్గరా ఉన్నా, ఆ అనుభవం అందరికి కలిగినా నీ తృప్తి చాలా శాతం తగ్గిపోతుంది" అంది లావణ్య.
మిలినియర్ కుటుంబరావుగారి కూతురు హనీమూన్ స్విస్ ఆల్ఫ్స్ వెళ్ళగలదేమో గానీ, సాదా మనిషి శ్రీహర్ష వెళ్ళలేడు."
"లావన్యే తన భర్తని హనీమూన్ కి తిసుకేళుతుంది- స్విట్జర్లాండ్ కాదు. చంద్రుడి మీదకు రెగ్యులర్ సర్విస్ వేస్తె అక్కడికయినా సరే" అంది లావణ్య కాస్త గర్వంగా.
"చలో దిల్ దార్ చలో- చంద్ కీ పార్ చలో- హమ్ హై తయ్యార్ చలో" అని హిందీ పాటని హమ్ చేశాడు శ్రీహర్ష. "అయితే అలాంటి భర్త కావాలి నీకు. నుంచో మంటే నుంచోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. నువు బాల్ విసిరి "జూజూ" అంటే కుక్కపిల్లలాగా పరుగెత్తి బాల్ నీ కందించాలి. అవునా?"
"అవును"
"నేను అలాంటి వాడిలాగా కనబడుతున్నానా?"
"మీలో కాస్త పట్టుదల ఉంది. కాస్త మొండితనం ఉంది. అది పోగొట్టెస్తాను నేను."
"ఎలా? చురుగ్గా దెబ్బ తగిలే కొరడా కొంటావా?"
"అంతటి చురుకు నా మాటకుందంటారు గిట్టని వాళ్ళు" అంది గారాలు పోతూ లావణ్య.
"నిజంగా అంత కర్కోటకురాలినా చెప్పండి"
"చీ! చీ! ఎవరంత మాట అన్నది?"
"చాలా మంది. హెల్! ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ బ్లడి బాస్టర్స్!" అంది లావణ్య కోపంగా.
"అందమైన అమ్మాయిలు దురుసుగా మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది."
"అదిగో! మీరూ అలాగే! నేను దురుసుగా మాట్లాడానా ఇప్పుడు?"
"తప్పు! తప్పు! అలా అన్లేదు నేను."
"సో! మనం కాంటినెంట్ కి వెళుతున్నాం!"
"పెళ్ళయిన తర్వాత" అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ.
పెళ్ళి!
"మళ్ళీ లావణ్య ఆలోచనల్లోకి జారిపోయింది.
* * *
ఫారెస్టు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పదిహేను రోజులకి కుటుంబరావుగారింటికి వెళ్ళాడు శ్రీహర్ష.
సాయంత్రం నాలుగవుతోంది.