Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 10

   

    "ఉహు , తిరిగే కాలు తిట్టేనోరు అని దానికి ఇంట్లో క్షణం తోచదు." అంది సీత.

 

    "ఏం మనకి తోచటంలా?"

 

    "అందరూ వకెలా వుండరుగా. రూపలా నీవుండగాలవా! నీలా రూప వుండగాలదా?"

 

    "ఎందుకని?"

 

    "ఆలోచించు"

 

    "సరేలే ఎంతాలోచించినా ఈ పాడు చిన్న లెక్కకి అన్సర్ రాలేదు. ఇంక దీని కొస్తుందేమిటి? నేనేం ఆలోచించను."

 

    జయని చూస్తుంటే సీతకి నవ్వొచ్చింది. "సరేలే కాసేపు ఆ లెక్కతో కుస్తీ పట్టు వస్తుంది ..." అంది.

 

    బుంగమూతి అలాగే పెట్టుకుని లెక్కల పుస్తకం తెరిచింది జయ.

 

    సీత కడుతున్న మాల పూర్తి కావస్తున్నది. సన్నగా ఈల వినపడటంతో అదయినా ఎవరో దగరనుంచి కావాలని వేసినట్లు వినిపిస్తుంటే ఉలిక్కిపడి తలఎత్తి చూసింది.

 

    నాలుగున్నర అడుగుల పక్కింటి పిట్టగోడ మించి తొంగి చూస్తూ ప్రకాష్ కొంటెగా నవ్వుతున్నాడు. సీత తలఎత్తి తనని చూడటంతో మరోసారి ఈల వేశాడు.

 

    ప్రకాష్ పక్కింటి గోవర్ధనమ్మగారి అబ్బాయి. ప్రకాష్ కి చదువుకోవటం కన్నా పై సరదా లేక్కువ. రూపం కూడా చక్కగా వుంటుంది. సిరికి లోటు లేదు. ఇద్దరాడపిల్లల తర్వాత పుట్టిన ఒకే మగపిల్లవాడు. ఈ మధ్య తరచు సీతని చూసినప్పుడు ఈల వేయటం చేస్తున్నాడు. ఇవాళ  వాళ్ళింట్లో వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళినట్లున్నారు. వాళ్ళకి వీళ్ళకి సరిహద్దు గోడ దగ్గరకి సరాసరి వచ్చేశాడు.

 

    సీత కోపంగా చూసి తల వంచేసుకుంది. మళ్ళి మాల కట్టడంలో వుండిపోయింది.

 

    ప్రకాష్ మరో రెండు సార్లు ఈల వేశాడు. సీత నుంచి ఎటువంటి రెస్ పాన్స్ రాకపోవటంతో అటూ ఇటూ చూసి గబుక్కున ఓ కాగితం వుండ సీత మీద పడేలా విసిరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

 

    సీత కంగారు పడటం తలఎత్తి గోడవేపు చూడటం, కాగితం ఉండని కాలికింద దాయటం క్షణంలో జరిగిపోయింది.

 

    "భలే భలే " అంది జయ సంతోషం పట్టలేక.

 

    సీత బిత్తరపోయి జయ కేసి చూసింది.

 

    "వచ్చేసిందక్కా లెక్క వచ్చేసింది. భలే తేలిక ముందు తెలియలేదు. మరో విధంగా చేస్తే తేలిగ్గా వచ్చేసింది."

 

    సీత గుండె దడ కాస్త తగ్గింది. "అమ్మయ్య" అనుకుంది. ప్రకాష్ కాగితం వుండ వెయ్యటం చూసి జయ "భలే భలే," అందేమోనని కంగారు పడింది.

 

    "అన్సర్ తెలిస్తే అంత గట్టిగా అరవాలా మిగతా లెక్కలు కూడా చేసెయ్యి." అని పులుంచిన పళ్ళెం ప్రకాష్ విసిరినా కాగితం తీసుకుని యింట్లోకి నడిచింది సీత.

 

    "నేనేం ఆనందే అక్కయ్య ఎందుకలా విసుక్కుంది? ఏమో ఎందుకో" అనుకుని మళ్ళి లెక్కలు చేయటంలో పడింది జయ.

 

    సీత గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరికి వేసి ఉండలా చుట్టిన కాగితం మడత విప్పింది.

 

    ఎవరూ చెప్పకపోయినా తెలుస్తూనే వుంది. అది ప్రేమలేఖ అని.

 

    సీత నెమ్మదిగా చదవటం మొదలు పెట్టింది.

 

    ప్రియాతి ప్రియమైన సీతకి,

 

    సూర్యుడు ప్రకాశిస్తూనే వుంటాడు.

 

    భూదేవంటే ప్రేమ చేత

 

    తన కాంతి కిరణాలు ప్రసరిస్తాడు ఆమె పైన.

 

    మిన్నకుండలేక.

 

    నా కళ్ళు ప్రకాశిస్తాయి నీ రూపం చూస్తుంటే.

 

    పుత్తడి బుమ్మంటే ప్రేమచేత

 

    నా వెలుగు రేఖలు ప్రసరించనా నీ పైన ఊరాకుండ లేక,

 

    నా భాధ అర్ధం చేసుకో సీతా! నన్ను ప్రేమించు నాకు పిడికెడు బిచ్చం ప్రాసాధించు. నువు చమనచాయిగా వుంటేనేం సీత ఎత్తుకి తగిన లావుతో చక్కని అవయవ సౌష్టవంతో ముద్దుగా ముచ్చటగా ఎంత బాగుంటావో తెలుసా! అద్దాన్ని ఓసారి అడుగు నా మాట అబద్దం అంటుందేమో? ఈ సువిశాల ప్రపంచంలో ప్రేమించటం తప్పుకాదు. ప్రేమించబడటం నేరమూ కాదు. ఈ ప్రేమ పూజారి గోల కాస్త పట్టించుకో. ఈ దినుడి ఆవేదన కాస్త అర్ధం చేసుకో. నీ చెంగున వీడిని ముదేసుకో. దోసిటబట్టి నీ ముందు నిలిచాను. ఏం చేస్తాడో ఏమి నిర్ణయం తీసుకుంటావో నీ యిష్టం.

 

                                                                                                               నీవాడు,

                                                                                                               నీదాసుడు,

    ప్రకాష్ రాసింది చదవగానే సీతకి నవ్వాలో ఏడ్వాలో అర్ధంకాలేదు. సగం కవిత్వం, సగం పైత్యం, సగం కధలు కాకరకాయలు, అది ప్రేమలేఖలా లేదు, అలా అని ఉత్త లేఖ లానూ లేదు పిచ్చివాడి ప్రేలాపనలా వుంది.

 

    "పేరు రాసే ధైర్యం లేదు, ప్రేమలేఖ మాత్రం రాశాడు. ఈ మధ్య ప్రకాష్ తీరు ఏం బాగుండలా ఈల వెయ్యను, కనబడితే చాలు ఇకలింతలు సకిలింతలు. బాబాకి స్నేహితుడు కాబట్టి సహిస్తున్నది. లేఖలు రాసి మీద కిసిరెంతవరకు వచ్చాడు. గోవర్ధనమ్మ గారో పరమ గయ్యాళి. కొడుకు సంగతి ఆవిడకు తెలిసినా నేరం ఇతర్లదే అనే రకం ఏవిధంగా ప్రకాష్ ని...."   

 Previous Page Next Page