Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 9

   

   మెడల దాకా జుట్టు పెంచటం సైడ్ లక్స్ అంటూ చెంపలు ముసినంతా తేలిక కాదురా ఉద్యోగం రావటం అంటే. అదృష్టవశాత్తు రావచ్చంటూ ఆశ పెట్టుకుంటే మిగిలేది నిరాశే. అదృష్టాన్ని నమ్ముకోక ప్రయత్నం చేసేవారికి పడుతుంది అదృష్టం. అదయినా కొందరికే కృషితో నాస్తి దుర్బిక్షం అన్నారు పెద్దలు."

 

    "కృషి చేస్తూనే వున్నాను. అంటే అన్ని ఉద్యోగాలకి అప్లికేషన్లు పడేస్తున్నా. మంచి ఉద్యోగమే వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు. అంతే కాని పచారి షాపులో పద్దులు రాసి ఆఫ్ ట్రాల్  వందరూపాయలు సంపాదించటం ఎంత షెమ్. పద్దులు రాసే ఉద్యోగం కోసం అయితే బి.ఎ. దాకా చదవటం దేనికి?" అయిదో తరగతి చాలు."

 

    విసిగిపోయాడు రామచంద్రం అయితే నా మాట వినవన్న మాట అన్నాడు.

 

    "మీమాట విననని అనలేదు. ఇలాంటి అడ్డమైన పనులకి నన్ను పంపకండి. ముష్టి వంద కోసం ముష్టి ఎత్తుకోవటం అంటూ బాబా బైటికి నడిచాడు.

 

    రామచంద్రంకి బాగా కోపం వచ్చింది. "బాబా" అంటూ పిలువబోయాడు. అంతవరకు వూరుకున్న సీత నాన్నా!" అని పిలవటంతో ఆగిపోయాడు.

 

    "ఏమ్మా!"

 

    "ఏం లేదు నన్నా! బాబాని వెళ్ళనివ్వండి."

 

    "వెళ్ళనివ్వక పట్టుకున్ననా తల్లి! పట్టుకుంటే మటుకు ఆగుతాడా బి.ఎ. పాసయి ఏడాది దాటింది. ఊరకే తిరుగుతున్నాడు కదా వేన్నిళ్ళకు చన్నీళ్ళు తోడుగా వుంటాడని ఆ చలమయ్యా ను అడిగాను అతను వప్పుకున్నాడు. నూటపాతిక చేదా అమ్మా? అరబస్తా బియ్యం వచ్చెను, ఒక నెల పాలకి వచ్చెను. లెక్కలు రాయటంలో తప్పేమిటో నాకర్ధం కాలేదు. ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తే అప్పుడే వెళ్ళొచ్చు కదా!" అన్నాడు రామచంద్రం.

 

    బాబా గురించి రామచంద్రం అలా అనుకోవడంలో స్వర్ధమేమిలేదు. తిని తిరుగుతున్నాడు ఊరికే ఎందుకుండి పోవాలి అనే దుగ్ధ కాదు. పెద్దవాళ్ళు అయిదుగురు కడుపునిండా రెండుపూటలా తినాలంటే ఒకరి రెక్కల కష్టం ఈ కలికాలంలో, ఈ ఆకలి కాలంలో ఏం చాలుతుంది? రామచంద్రం చేసేది కలక్టరుద్యోగము కాదు ఆఖరికి బీటు కానిస్టేబులుద్యోగమైనా కాదు గుమస్తా. మంచి వయసులో అడదిక్కుకి దూరమయి అయిదుగురు పిల్లలని ఉన్నంతలో బాగానే పెంచి నడి వయసులోనే జవసత్యాలుడిగి తల ముగ్గు బుట్టాయి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం ఎలా, అనే దిగులుతో కుమిలి పోతుంటే నూటపాతిక రూపాయల ఉద్యోగం బంగారం లాంటి దనుకోవటంలో రామచంద్రం తప్పేమీ కాదు.

 

    తండ్రి స్థితి ఇంటి పరిస్థితి సీతకి తెలిసినంత బాగా ఆ యింట్లో మిగతా పిల్లలకి తెలీదు. తండ్రి దిగులు పడకుండా వుండటానికి "బాబాకి పెద్ద ఉద్యోగం చేసి మీకు సాయపడాలని వుంది నాన్నా!" అంది సీత.

 

    రామచంద్రం పేలవంగా నవ్వి, "సాయం మన యింటి పరిస్థితులకి నూట పాతిక రావటం తక్కువేమీ కాదు. దీనికి గతిలేదు. వందలు వేలు తెచ్చి అందలం ఎక్కిస్తాడు వాడి తీరు చూస్తుంటే కారులో తిరుగుతూ కాలు మీద కాలేసుకునే గొంతెమ్మ కోర్కెలా వుంది" అన్నాడు.

 

    :ఏదో తెలీసి తెలీని కోర్కె. బాబాతోనే చెబుతాలే నాన్నా!" బాబా ఈ విషయంలో తనమాట వింటడనే ధైర్యం లేకపోయినా అన్నది సీత.

 

    "బాబా నీ కన్నా పెద్దవాడు. నీ లాగా కష్టం సుఖం తెలుసా? తన సుఖం తాను చూసుకోవటం తప్ప ఏనాడయినా ఏదయినా పట్టించుకున్నడా? వాడు యిప్పుడే యిలా వున్నాడు నాలుగు రాళ్ళు స్వయంగా సంపాదించగల స్తోమతు వస్తే...."

 

    "మీరు అనవసరంగా భయపడుతున్నారు నాన్నా"

 

    "హ్హు భయం ఆ మాటేప్పుడో మర్చిపోయానమ్మా! పిరికివాడి నయితే ఎప్పుడో చచ్చిపోయేవాడిని మీ అమ్మ పోతూ పోతూ నాకు ప్రసాదించింది ధైర్యం. మొండిగా బ్రతకటానికి శక్తి సరీ సరే ఇదెప్పుడు ఉన్నదే నీ వెళ్ళి పని చూసుకో, అని రామచంద్ర్తం గొడుగు పుచ్చుకుని వీధిలోకి బైలుదేరాడు.

 

    బాబా విషయంలో నాన్న చాలా దిగులుపడుతున్నారు నిజమే బాబా కష్టం ఆలోచించటం లేదు. పెద్ద ఉద్యోగం రావాలి అని చేతులు ముడుచుకుని కళ్ళప్పగించి చూస్తుంటే కాలం ముందుకు పరిగెడుతుంది గాని ప్రయోజనం మేముంది? వాడి ఆశ చెడ్డది కాకపోవచ్చు కాని..... కాని..... నాన్నకి చేదోడుగా నేనుందమనుకుంటే చదివిన పి.యు.సి. కి ఎవరు ఉద్యోగం యిస్తారు"

 

    "ఎంటక్కా ఆలోచిస్తున్నావు "భుజం పట్టి కుదుపుతు జయ అడిగింది. "అబ్బే ఊరికే కుచున్ననంతే" అంటూ లేచింది సీత.

    
                                                                    7

 

    పెరట్లో జాజి పందిరికి పూచిన పూలన్నీ కోయటం వాటిని మాల కట్టి అందరికి సమానంగా పంచటం రొజూ సీత పని. అరగంట శ్రమ పది పూలన్నీ కోసి మాల కడుతూ కూచుంది సీత.

 

    సీతకి కొంత దూరంలో కూచుని లెక్కలతో కుస్తీ పడుతున్న జయ ఓ లెక్కకి అన్సర్ రాక కాసేపు పుస్తకం మూసేసింది. "రుపక్క ఇంకా యింటికి రాలేదా అక్కా!" అంది.   

 Previous Page Next Page