"మా డిపార్టుమెంట్ కూడా ప్రస్తుతం... ఆ పనిలోనే ఉంది మేడమ్...ఈవెనింగ్ కల్లా...ఉయ్... విల్ గేట్...టోటల్ ఇన్ ఫర్ మేషన్ మేడమ్..."
ఆ మాటల్ని విన్పించుకోలేదు త్రిభువనేశ్వరీదేవి...
"హనిపోయినది శ్రీకర్ అయితే...అతనెలా చనిపోయాడో....ఎవరు చంపారో... నా కర్జంటుగా ఇన్ ఫర్ మేషన్ కావాలి....ఇన్ ఫర్ మేషన్ కాదు....జిల్లా పోలీసుల్ని ఎలర్టు చెయ్యండి....ఇమ్మీడియట్ గా హంతకుల్ని అరెస్ట్ చెయ్యండి...." కోపంగా అంది త్రిభువనేశ్వరీదేవి.
అదే సమయంలో, లోనికొచ్చాడు పి.ఎస్. హేమాద్రి...దూరంగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.
లేచి నిలబడ్డాడు ఐ.జి. ఇంటెలిజెన్స్ శ్రీధర్.
"ఎక్కడా....ఏమాత్రం ఆలస్యం జరగకూడదు....యూ కెన్ గో నౌ..."
ఐ.జి. వెంటనే బయటకు వచ్చేసాడు.
అదే సమయంలో తలుపు తెరచుకుని, లోనికి అడుగుపెట్టాడు ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్య.
"నమస్కారం మేడమ్..." తలెత్తి, సూటిగా చోసాయింది....ఎక్సయిజ్ మినిస్టర్ వేపు సి.ఎం. ఆమె ముఖ్మలో కన్పించిన కోపాన్ని సులభంగానే అర్ధం చేసుకున్నాడు మినిస్టర్ రాజ్య.
"మీ డిపార్టుమెంటుకు చెందిన ఒక సూపరింటెండెంట్ ను... నెల్లూరులో ఎవరో కాల్చి చంపేసార్ట... తెలుసా...."
"తెల్సింది మేడమ్... అదే నాకర్ధం కావడం లేదు.... ఆ విషయమే మీతో మాట్లాడదామని, పరుగు పరుగున వస్తున్నాను."
ఆయాసంతో రొప్పుతూ కూర్చున్నాడు మినిస్టర్ రాజ్య.
అతని ఖాదీ చొక్కామీద పడిన గులాబీపూల రెక్కలు....వంటి నుంచి వస్తున్న అత్తరు వాసన ఏసీ గదిలో ఒక్కసారి పరిమళాన్ని పెంచింది.
"మీకు సన్మానాలు....సభలమీద వున్న శ్రద్ద- ప్రజలు ప్రజా సమస్యల మీద లేదు....ఎక్కడేం జరిగినా మీకనవసరం కదూ" ఏదో ఫైలుని తిరగేస్తూ అంది త్రిభువనేశ్వరీదేవి.
ఆ మాటకు రాజ్య ఉలిక్కిపడ్డాడు....ఇబ్బందిగా మొహం పెట్టి అటూ యిటూ చూసాడు.
ఎవరూ అతనివేపు చూడడంలేదు....అందరూ సీరియస్ గా ఉన్నారు...
తలుపు తెరచుకొని లోనికొచ్చిన పి.ఎ. అరవింద్ వేపు చూసి-
"నేను మళ్ళీ పిలిచేవరకూ.... లోనికెవరూ రావద్దు... ఎవర్నీ పంపించొద్దు..."
"ఎస్ మేడమ్..." వెంటనే డోర్ దగ్గరకువేసి, బయటికెళ్ళిపోయాడు అరవింద్.
సి.ఎమ్.త్రిభువనేశ్వరీదేవి అక్కడ తనెదురుగా కూర్చున్న వ్యక్తులవేపొక సారి తీక్షణంగా చూసి-
చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ వేపు, పి.ఎస్. హేమాద్రిశర్మవేపు పరీక్షగా చూసి చెప్పడం ప్రారంభించింది.
"లిక్కర్ ప్రొహిబిషన్ మీద గత వారం రోజులుగా, జరిగిన సమావేశాల్లో...మంత్రివర్గం సబ్ కమిటీగాని, అఫీషియల్స్ గానీ, ఆఖరికి మంత్రిగారు కానీ, లిక్కర్ ప్రొహిబిషన్ ని ఎవరూ వ్యతిరేకించడం లేదు కానీ....ఇంతవరకూ మద్యం ద్వారా వస్తున్న ఆదాయం తగ్గిపోతే ఎలా అని మాత్రమే ఆలోచిస్తున్నారు...అవునా" సూటిగా అందరివేపూ చూసింది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ గొంతు సవరించుకున్నాడు.
"డియర్ ఆఫీసర్స్.... లిక్కర్ ప్రొహిబిషన్ కు సంబంధించి ఇదే ఫైనల్ మీటింగ్....నన్ను డైరెక్ట్ చెయ్యాల్సిన సీనియర్ ఆఫీసర్స్ మీరు... డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు డెసిషన్ పర్ ఫెక్టుగా వస్తుందన్న నమ్మకంగల వ్యక్తిని నేను..."
వరదరాజన్ పెదవి విప్పాడు.
ప్రొహిబిషన్ విధించేముందు, మనం ఆలోచించాల్సింది....ఫెయిల్యూర్స్....ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్ గురించి..."
"ఎక్కడ ఫెయిలౌతామో చెప్పండి...." సీరియస్ గా అంది త్రిభువనేశ్వరీ దేవి.
"మేడమ్....ప్రస్తుతం లిక్కర్ తదితర మత్తుపదార్ధాల అమ్మకాల ద్వారా గవర్నమెంట్ కొస్తున్న రెవెన్యూకు, అదే స్థాయిలో సబ్ స్ట్యూట్ రెవెన్యూ సక్రమంగా రావాలి. ఇది ప్రధానమైన అంశం....రెండోది ....ప్రొహిబిషన్ ను పూర్తిగా, నూటికి నూరుపాళ్ళలా అమలుచెయ్యడానికి, కంట్రాక్టర్ల నుంచి, బడా పారిశ్రామికవేత్తల దగ్గర్నించి ఎదురయ్యే వత్తిడులను బలంగా ఎదుర్కోడానికి, నిజాయితీగల ప్రభుత్వ యంత్రాంగం కావాలి. మూడు.... లిక్కర్ కంట్రాక్టర్ల సిండికేట్స్....ప్రభుత్వాల్నీ, ప్రభుత్వ యంత్రాంగాల్నీ శాసిస్తున్న బలమైన యంత్రాంగం. సిండికేట్స్ పేరుతో దశాబ్దాల తరబడి బలంగా వ్యాపించిన దాని వేళ్ళు, ఊడలు మనకు ముఖ్యం....రావణాసురుడి తలకాయల్లాంటి చిత్రమైన వ్యవస్థ అది తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా...ఏ రాష్ట్రాన్నయినా తీసుకోండి....ఆయా రాష్ట్రాల్లోని సిండికేట్ల మధ్య బలమైన అవగాహన ఉంది.... సారాని నిషేధించినా, కల్తీసారా అక్రమంగా ప్రవహించాడానికి ఆయా రాష్ట్రాలలోని సిండికేట్లే ప్రధాన కారణం.
ఆ సిండికేట్ల కుంభస్థలాన్ని బద్దలు కొట్టగలిగిన నాడు మాత్రమే సారా నిషేధం....విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది...."
ఇంగ్లీషులో చెప్పాడు వరదరాజన్.
చర్చంతా ఇంగ్లీషులోనే జరుగుతోంది.
తన ముందున్న ఓ ఫైల్ ని అందుకుంది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
ఆ ఫైలుని తిరగేస్తూ...
"ఏ గవర్నమెంటయినా, ఆచరణలో ఎందుకు విఫలం అవుతోందో నాకిప్పుడు అర్ధమవుతోంది.... పొలిటికల్ ....ఇన్ స్టెబిలిటీ....నిన్నగాక మొన్న ఒరిస్సా సి.ఎం. జిబూ పట్నాయక్ మీద....ప్రభుత్వోద్యోగులే దాడి చెయ్యడానికి కారణం ఏమిటి? పదహారేళ్ళపాటు వెస్ట్ బెంగాల్ సిఎం జ్యోతిబసు...పదవిలో ఉండడానికి కారణం ఏమిటి? ఈ రెండు గవర్నమెంట్లనూ, ఉదాహరణలుగా తీసుకోండి....జ్యోతిబసు అన్నేళ్ళు పదవిలో ఉండడానికి, ప్రజల మనిషిగా ఉండడానికి కారణం ఏమిటి? నేననుకునేది సిన్సియార్టీ చేపట్టిన పధకాలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సక్సస్ చెయ్యగలగాలి.... ఏ బలహీన వర్గాల క్షేమం కోసం, మనం పధకాల్ని ప్రవేశపెడుతున్నామో....ఆ పధకాల ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందేలా చూడగలగాలి...గత సి.ఎమ్. హయాంలో చిత్తూరు జిల్లాలో బలహీన వర్గాల కోసం కట్టిన ఇళ్ళన్నీ, ఇనాగరేషన్ కాకుండానే కుప్పకూలిపోవడానికి కారణం ఏమిటి? అధికారుల అవినీతి- కంట్రాక్టర్ల అవినీతి...
అంటే.... ఒక రకంగా చెప్పాలంటే....ప్రభుత్వ నిస్సహాయస్థితి ఆ స్థితిని ఎదిరించగలిగిన నాడు.... ఎంతో కొంత అభివృద్దిని మనం సాధించగలం..."
"అది మనం అనుకున్నంత సులభం కాదు మేడమ్....ఇందిరాగాంధీ లాంటి గొప్ప లీడర్ అవినీతి ప్రపంచమంతా ఉందని.... స్టేట్ మెంటు ఇచ్చారు..." రాజయ్య ధీమాగా చెప్పాడు.
ఆ మాటకు త్రిభువనేశ్వరీదేవికి కోపం వచ్చింది. కానీ అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుందావిడ.
"ఒ.కే మిస్టర్ రాజ్యా....అవినీతి ప్రపంచమంతటా ఉందని ఆవిడ చెప్పారు కానీ...దాన్ని కంట్రోల్ చెయ్యలేం... అని చెప్పలేదు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీకా విషయం తెలిసీ ఉండాలి..." నవ్వింది సి. ఎమ్. ఆ నవ్వులోని వెక్కిరింతకు ఇబ్బందిగా చూసాడు రాజయ్య.
"మద్యనిషేధం అనగానే మనకు తమిళనాడు చటుక్కున గుర్తుకొస్తుంది. దివంగత ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్యదైవం....ఎంజి రామచంద్రన్....పొలిటికల్ స్ట్రేటజీలో అదొక భాగం మాత్రమేనని ఎంతమందికి తెలుసు గవర్నమెంట్ జీవోల్లో మద్యాన్ని నిషేధించారు. కానీ మద్యపానాన్ని కాదు....ఆ విషయం తమిళనాడులోని ప్రతి పౌరుడికీ తెలుసు. మన ఆంధ్రాకు చెందిన సారా కాంట్రాక్టర్లు మొదట తమిళనాడు కేంద్రంగానే తమ సారా వ్యాపారాన్ని ప్రారంభించి విస్తరింప చేశారు.