Next Page 
పంచభూతాలు పేజి 1

                                 

           
                                      పంచభూతాలు

                                                                             ----రంవీద్రనాధ్ ఠాగూర్

                      

                                  

 

   పాఠకులకు ఇట్టి రచన సులభంగా అర్దమయేందుకు ఈ పుస్తకంలోని పాత్రలకు నామకరణం చేయడం అత్యంతావశ్యకం. అందుకని నేను ఇందులోని పాత్రలకు శ్రీ పృధ్వీరాజ్ ,శ్రీ పవన్ దేవ్, శ్రీ గగన్ జీ. శ్రీమతి నిర్ఘరిణీదేవి, శ్రీమతి ప్రకాశవతీదేవి అనే పేర్లతో సంబోధిస్తాను.
    నామకరణం తరువాత వ్యక్తి మారిపోతాడు. కత్తికి అనుగుణమయిన వర ఆవశ్యకమయిన విధంగానే వ్యక్తి విశేష గుణగణాలకు అనుగుణమయిన పేరు పెట్టాలి. కాని అలా పేరు పెట్టడం కష్టం. ముఖ్యంగా పూర్వోక్తపాత్రలకు నామకరణం చేయడం మరీ కష్టం.  పైగా ఈ చిక్కుల్లో చిక్కుకోవడం నా అభిమతం కాదు. నేను న్యాయస్థానంలో కూర్చోలేదు. నేను పాఠకులకు విశ్వాసం కలిగించదలచాను.  నేను ఏమి మాట్లాడినా సత్యమే మాట్లాడతాను. ఆ సత్యాన్ని కూడా నిజానికి  సుందరమయిన భాషలో వ్యక్తీకరిస్తాను.
    ఇక పాత్రల పరిచయం ఈ దిగువ యిస్తున్నాను - శ్రీ పృద్వీరాజ్ - ఇతని ఆకారం మా అందరివంటి భారీ అయింది. భావాలు కూడా సుస్థిరమయినవే.  ఆ కృషి ప్రత్యక్షంగా స్పష్టంగా గోచరించే వస్తువును పనిచేసే కాలాన్ని ఇతను సత్యమయినవిగా అంగీకరించడు. వాటిలో ఏ విధమయిన సంపర్కం పెట్టుకోవడానికి ఇచ్చగించడు. అవసరమయినంత జ్ఞానభావం మోయడం కష్టం కావడమే దీనికి కారణం. అంతేగాక జ్ఞానభావం ప్రతిదినం బరువెక్కుతుంటుంది. దీనితోపాటు విద్య నేర్వడం కూడా కఠిన మవుతూంటుంది.
     విజ్ఞానం వున్నత స్థాయిలో లేని పూర్వకాలంలో అటువంటి విషయాలను నేర్చుకోవలసిన అవసరం తక్కువగా వున్న పూర్వకాలంలో  విలాసయుక్త విద్యా శిక్షణకు తగినంత  వ్యవధి  వుండేది. కాని నేను  జ్ఞాన విజ్ఞానవ్యాప్తికి వ్యవధి చిక్కడం లేదు. చిన్న చిన్న పిల్లలకు రకరకాల దుస్తులు  ఆభరణాలు అలంకరించంవల్ల హాని ఏమీ లేదు. వారికి అన్న పానాదులు తప్ప వేరే పని లేదు. కాని వయసు వచ్చిన వారికి కాళ్లకు చెప్పులు, చేతికి కంకణాలు, తలమీద నెమలిపాన్ ధరించడం మానివేస్తే అతని పని ఎలా సాగుతుంది?వారు పని  చేయాలిగదా! నడుం బిగించి పని చేయడానికి సదా సంసిద్దం కావాలి. కాబట్టి నేను సభ్యత సమక్షంలో అలంకారం వెలవెలబోతోంది. ఆవశ్యకమయిన వస్తువులను సేకరించడం, అనావశ్యకమయిన వస్తువులను పరిత్యజించడం ఉన్నతికి అర్దం.
     పృద్వీరాజ్ యొక్క ఆ అఖండిత వాదనకు శ్రీమతి నిర్ఘరిణీదేవి జవాబు ఇవ్వలేకపోయింది. మధుర కలకలనాదంలా నిపుణ నర్తకి లాగా, అంగూక లతలాగ ముందు వెనకలకు ఊగుతూ, "ఉహూ- కాదు. ఈ మాటలలో ఏమాత్రం నిజం లేదు. నా మనసుకు నచ్చలేదు. ఇందులో విశ్వాసం కుదరడం లేదు" అన్నది. ఆమె నోటినుంచి మాటి మాటికి 'లేదు లేదు' అనే మాటలు వెలువడుతుంటాయి. ఇంతకంటె వేరే యుక్తి తర్కం లేదు. కేవలం ఒకే ఒక సంగీత ధ్వని, ఒకే ఒక వినీత పూర్ణ స్వరం వినిపిస్తూంది. అంటే" అనావశ్యకమయిన వాటిని కూడా పసందు చేస్తాను. అనావశ్యం కూడా ఆవశ్యకమే  అనావశ్యక మయినవి నాకేమీ వుపకారం చెయ్యవు. కాన అపుడపుడు నా అనురాగానికి, నా దయకు ఆత్మపరిత్యాగానికి వుత్తేజం కలిగిస్తాయి. "ఈ ప్రపంచంలో ఈ అనురాగ ఆవశ్యకం కాదా?" శ్రీమతి నిర్ఘరిణీదేవి యొక్క ఈ అనునయధారలో  శ్రీ పృద్వీరాజ్ ఒక్కసారిగా అదృశ్యమయి పోయినాడు.
     శ్రీమతి ప్రకాశవతి కత్తి అంచులాగా మెరిసిపోతూ తీవ్రస్వరంతో 'వహ్వా! యెందుకింత మిడిసిపాటు!యీ ప్రపంచంలోని సకలం మీ కృపవల్లనే ఈనుతున్నాయా? మీరు వేటిని నిరర్దకమని భావించి వేరుచేయాలని మరచారో అవి కూడా నాకు పనికివస్తాయి. మీరు మీ విశ్వాసాలను, శిక్షణకూ ఆచార వ్యవహారాలను సంభాషణకు, శరీరాలంకారాలను వేరుచేయాలని వాంఛిస్తారు. సభ్యతతో పెనుగులాట కారణంగా స్థానకాలాల ప్రభావం యినుమడించింది .కాని అలంకారాలు విసర్జించిన మీదట మా పురాతన  కార్యకలాపాలు ఏదో విధంగా నిలిచి పోయాయి.  మేము యింపయిన కథానికలను, మధుర భాషణలను, రసభరిత ఆచరణను మొదలయిన వాటిని ఆధారం చేసుకుని గృహస్థధర్మం  నిర్వర్తిస్తుంటాం. మృదువుగా మాట్లాడతాం. మధురంగా నవ్వుతాం. శ్రమించి పనిచేస్తాం. సుందరమయిన దుస్తులు ధరిస్తాము. సౌందర్యాన్ని దీపింపజేసే పనులు చేస్తాం. యీ మా పనులవల్ల స్త్రీ ధర్మాన్ని మాతృ కర్తవ్యాన్ని ప్రపూర్ణం చేయగలుగుతాం. అయినా నిజానికి  సబ్యతా ఘాతానికి భయపడి జ్ఞాన విజ్ఞానాలను పరిత్యజించివేసితే అనాధ బాల బాలికల పురుషుల గతి ఏమవుతుందో చూడాలిని వుంది' అన్నది.
     ఈ మాటలకు శ్రీ పవన్ దేవ్ పక్కున నవ్వి ఆజ్ఞాపన లాగా, "పృద్వీరాజ్ మాటను అలా వుంచండి, నిస్సహాయుడు, అధిక ప్రయాసతో నిర్మించిన భవనం హఠాత్తుగా కూలిపోయినట్టు అటూ ఇటూ ఒరగడం,  వెనకకు తగ్గడం చలనం మూలంగా అతని మానసిక రాజ్యంలో అటువంటి భూకంపం పుట్టింది. అందుకే ఇలా మాట్లాడుతూంటాడు. దేవతలనుంచి పురుగుల వరకు అన్నీ మట్టిలోనుంచి పుట్టినవే. అయినా మట్టికి భిన్నమయిన ఇతర వస్తువులను అస్తిత్వాన్ని అంగీకరిస్తే మట్టి నుంచి కూడా మన భావాలు దూరానికి పరుగిడుతాయి.  చైతన్య సంబంధమే ప్రపంచంలో అసలు సంబంధమనే విషయం అతను గ్రహించడం అవసరము కాబట్టి ప్రస్తుత విజ్ఞానం తెలుసుకోదలచినవారు ఎందుకు తెలుసుకోరు! వారు లోక వ్యవహార శిక్షణలో కొంచమయినా సహాయపడలేరు.  కాని జీవన శిరోభూషణం నుంచి సౌందర్యం, కావ్యం, మాధుర్యం వుత్పన్న మవుతాయి.  అవి అసలు మానవుల మధ్య సరయిన సంబంధాలను నెలకొలుపుతాయి. ఒకనొకటి దారిలోని కంటకాలను దూరం చేసి స్పర్దలను సమాప్తం చేసి జ్ఞానచక్షువును తెరుస్తాయి. జీవనమును మర్త్యలోకం నుంచి స్వర్గలోకం వరకు ప్రసరింప జేస్తాయి.
     శ్రీ గగన్ కొంతసేపు కళ్లుమూసుకొని, "దేనిని నిజానికి అనావశ్యకమని  అంటున్నామో అది అన్నింటికంటే అత్యావశ్యకమయింది. దేనిపట్ల కడుపు నిండుతుందో, స్వార్దం సిద్దిస్తుందో, పని కలుగుతుందో, దానిని మనుష్యులు యెల్లప్పుడు చిన్నచూపు చూస్తారు. అందుచేతనే ఋషులు, మునులు ఆకలి దప్పులను శీతోష్ణాలను మరచి స్వాతంత్ర్యమును ప్రచారం చేస్తున్నారు. బాహ్య వస్తువుల  నుంచి మాత్రమే ప్రయోజనం పొంద దలచడం జీవికి ఆత్మకు అవమాన జనకం. అయినా ఈ  ఆవశ్యకత కూడా మానవ సభ్యతా సింహాసనం అధిష్టించడం ఉచితం. ఈ సభ్యతను అన్నింటికంటే శ్రేష్టమయిన సభ్యత అని అనలేము" అన్నాడు.
     గగన్ జీ మాటలను యెవరూ పట్టించుకోలేదు. ఆ మాటలు ఎవరి హృదయానికి గాయం కలిగించలేదు. భయంతో నిర్ఘరిణికూడా మనసును లగ్నం చేసి విన్నది. కాని లోలోపల ఆమె కూడా ఒంటరిని పిచ్చి దానినిగా భావించి జాలిపడింది. కాని శ్రీమతి ప్రకాశవతి సహించలేక పోయింది. వారు వ్యాకులపడి మధ్యలోనే సంభాషణా దోరణి మార్చి వేయ దలచారు. అతని భాషణ సరిగా అర్దం కాలేదు. అందుకని అతని మీద ప్రకాశవతికి విశేషంగా కోపం వచ్చింది.
     కాని శ్రీగగన్ జీ మాటలలో  జీవం లేదు... "స్వార్ద సాధనకోసం ఘోర తపస్సు చేసిన ఋషులు విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు మేలు చేయడానికి వుపయోగించదలచారు. విజ్ఞానం మానవునికి విరుద్దంగా అత్యాచారానికి  పూనుకుంటే వానికి దూరంగా వుండాలి. కాబట్టి యెల్లప్పుడు మూర్ఖతను బంధించి రక్షణ పొంది ఆధ్యాత్మిక సంపదను స్వాధీనము చేసుకోవడానికి ఒక విజ్ఞాన సాధన అత్యాంతావశ్యకం" అన్నాను.
     పృద్వీరాజ్ తన ప్రతిపక్షం వారి వాదనను దేనినీ ఖండిచడం నిరర్దకమని గ్రహించాడు. గగన్ కూడా ఆ ప్రకారమే  ఒకమాట మాట్లాడి మౌనం వహించాడు. ఎవరు ఇష్టం వచ్చినట్లు ఎంత మాట్లాడినా అతని మౌనం భంగం కాలేదు. నా మాటలు కూడా అతని చెవులను చేరుకోలేదు. పృద్వీరాజ్ కూర్చున్న చోటనే కదలకుండా మెదలకుండా కూర్చునే వున్నాడు. గగన్ కూడా గంభీరంగా కూర్చుని అంగీకారం సూచించాడు.

Next Page