Previous Page Next Page 
సక్స్ స్ పేజి 9



    "ఆ బి.బి.సి....రిపోర్టర్.....ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావా...." నవ్వూతూ అడిగారు హరికృష్ణమనాయుడు.

    ఆ మాటకు అక్కడ నవ్వులు విరిసాయి.

    "లెటర్ హావ్ సమ్ ఫన్" అంటూ మాట్లాంఛి ఆంద్రప్రదేశ్ కు చెందిన ఒక పారిశ్రామిక  వేత్త చేతిలో షాంపైన్ బాటిల్తో వచ్చాడు. ఆ వెనక ఇంకొక వ్యక్తి  వెండి గ్లాసుల్ని తెచ్చి అందరి ముందుంచాడు. షాం ప్తెన్  బాటిల్లోని డ్రింక్ గ్లాసుల్లోకి సర్వ్  చేసారు.

    గోల్డెన్ ప్లేట్స్ లో మంచింగ్ ఏర్పాట్లు జరిగాయి.

    "హరికృష్ణమనాయుడుగారిని హొం మినిస్టి వరించిన సందర్భంగా త్రి చీర్స్..."

    "నాయుడుగారూ జిందాబాద్...."

    "పాలిటిక్స్ లో  కూడా నాయుడుగారు సూపర్ సక్రాస్ కావాలి."

    గ్లాసుల్ని తీసుకుంటూ చేసిన స్లోగన్లు, ఆ సెలూన్ లో ప్రతిధ్వనించాయి. కబుర్లు  ,జోకులు ప్రతి పక్షాల విసుర్లు.

    కంపెని  సేక్ గా నాయుడుగారు ఎత్తుకున్న గ్లాసులోని డ్రింక్ ని  మెల్లగా సిఫ్ చేసి పక్క న పెట్టారు.

    ప్రపంచ రాజకీయాలు మొత్తం అక్కడ మందు మాటల్లో తొంగిచూస్తున్నాయి.

    పోవు గంట.....

    అరగంట......

    గంట గడిచింది....

    ఎ.సి గాలి మత్తుగా ప్రవహిస్తోంది.

    హొం మంత్రి  హరికృష్ణమనాయుడుగారి కోసం , బుక్ చేసిన రెండు సేలూన్లలో ఒక సెలూన్ లో మంత్రిగారు, మంత్రిగారి  అంతరంగిక మిత్రులు ఉండగా  రెండో సెలూన్ లో హరికృష్ణమనాయుడు, లాయన్  సూర్యసాగర్ పర్సనల్ అసిస్టెంట్లు,సెక్యూరిటి సిబ్బంది ఉన్నారు.

    రెండు గంటలు గడిచాయి....

    రాత్రి సరిగ్గా 10.45 నిమిషాలు.

    మిత్రులందరూ నిద్రలో జోగుతున్నారు....ఊగుతున్నారు...యువ రాజకీయ నాయకులు....అమ్మాయిల మీద జోకులేసుకుంటున్న దశలో ______

    హరికృష్ణమనాయుడు మెల్లగా లేచి, తన పర్సనల్ కాబిన్ లోకి  వెళ్ళిపోయారు.

    చుట్టూ  అతి  ఖరిద్తెన సిల్కు కర్టెన్లు ఒక పక్క అందంగా  అమర్చిన  రాజస్ధాని  పెయింటింగ్.

    విశాలమ్తెన డాబుల్ కాట్ బెడ్.
   
    బెడ్ పక్కనున్న బుక్  షెల్ప్ లోంచి చేతికందిన ఓ బుక్  తీసారు.

    'POLITICS TODAY-TOMORRW'

    ఓ అమెరికన్ రచయిత, ఇండియన్ పాలిటిక్స్ ని విశ్లేషిస్తూ రాసిన బుక్ అది.

    నెమ్మదిగా చదవడం ప్రారంభించాడాయన.

    అప్పుడు రాత్రి__

    సరిగ్గా 10.55 నిమిషాల్తెంది.

    చీకట్లో  పరుగెడుతున్న ప్యాలెస్ ఆం విల్స్  సముద్రం మ్మిద తేలియాడుతున్న ఓడలా ఉంది.

    కనురెప్పలు  మూతలు పడుతున్నాయి.

    రోజంతా ఆలిసి పోవడం వల్ల, శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది సాధారణంగా ప్రతిరోజూ రాత్రి పన్నెండు గంటల వరకూ బుక్ రీడింగ్ ఆయన అలవాటు.

    షాం ప్తెన్ , ఆయన నరాలలోకి మెత్తని హాయిని  తీసుకొస్తున్న దశలో__

    వెలుగుల్ని విరజిమ్ముతున్న ల్తెటుని ఆర్పడానికి___

    హొం మినిష్టర్ హరికృష్ణమనాయుడు లేచి నిలబడ్డారు.

    రెండడుగులు ముందుకేశారు.....

    టక్....టక్ ....గ్లాస్ టీపాయ్ మీద, వెండి గడియారం చేసే శబ్దం చిత్రంగా విన్పిస్తోంది.

    ల్తెట్ స్విచ్ ఆఫ్ చెయ్యబోయి ....చటుక్కున ఏదో చప్పడైతే పర్సనల్ రూమ్  డోర్ వేపు చూసారు హరికృష్ణమనాయుడు.

    ఎదురుగా.....

    చేతిలో స్తేలేన్సర్ అమర్చిన ఎ.కే. 47 గన్ తో నుంచున్న వ్యక్తిని ఆశ్చర్యపోయిచూసి___ప్రమాదాన్ని శంకించి అరవబోయారు....

    కానీ అప్పటికే ఎ.కె.47 నిప్పులు  కురవడం ప్రారంభించింది.

    వంద మ్తెళ్ళా వేగంతో  వెళ్తున్న ర్తెల్లో....తాగుడు మత్తులో గాడ నిద్రతో ఉన్న జనానికి ఎ సి  రూమ్ లోంచి మెల్లగా  విన్పించిన ఆ చప్పడికి మెలుకువ రాలేదు.

    "YOU BASTARD"

    భయంగా, విహ్వలంగా హరికృష్ణమనాయుడు గొంతులోంచి వచ్చిన అరువు....ఎ సి  గాల్లో కలిసి పోయింది.

    "ప్రమాణ స్వీకారానికి  నువ్వు  వెళ్ళడానికి వీల్లేదు. గుర్తుంచుకో.... దీనికి భిన్నంగా ఏం జరిగినా , పైనల్ రిజల్ట్ నీకు కొన్ని గంటల్లో  తెలుస్తుంది."

    "POWERFUL ENEMY....FINAL RESULT.....FINAL RESULT....."

    సడన్ గా.....గుర్తుకొచ్చింది....ఆఖరి క్షణాల్లో గుర్తుకొచ్చింది....

    గుండెలోంచి, భుజమ్మించి, కంఠమ్మించి  జలపాతంలా కారుతున్న రక్తపు ధరలు వంటి నిండా నిండిపోయి.....

    ఆ దృడకాయుడు , హరికృష్ణమనాయుడు రక్తపు ముదలాంటి తన శరీరాన్ని చివరి సారిగా చూసుకుని___

    భయ విహ్వలంగా కేక వేసి, కుప్పకూలిపోయాడు.    
   

 Previous Page Next Page