Previous Page Next Page 
సక్స్ స్ పేజి 10


    హరికృష్ణమనాయుడు కల్లా దగ్గర ఎ.కే 47  ని పడేసి, ఆ వ్యక్తి మరుక్షణంలో  అక్కడ నుంచి మాయమై పోయాడు.

    అంతా క్షణాల్లో జరిగి పోయింది.

    క్రమ శిక్షణ, పట్టుదల , అపారమ్తెన మేధస్సు ....స్వయంకృషితో పైకోచ్చి, అంచెలంచేలుగా ఎదిగిన కింగ్ మేకర్ నెత్తుటి మడుగులో రెండు నిమిషాలు గింజుకుని___

    కోన ప్రాణాలు వదిలాడు.

    భారతదేశపు పారిశ్రామిక ఆశాజ్యోతి, కరకు శత్రువుల తుఫాకి కోరలకు బల్తేపోయింది.

    ఎంతోమంది యువకులకు, ఇన్ స్పిరేషన్ గా నిలిచినా వ్యక్తి, ఓకే  ఒక అజాగ్రత్త వాళ్ళ నిండు  జీవితాన్ని బలిపెట్టుకున్నాడు.

    రాజకీయమా! నీకు జోహారు.....

    హిమాలయాల మీంచి, మురుగు కాల్వల్లోకి ఒక్కసారిగా దిగి పోయిన విలువల్ని, ఉన్నతంగా, మురికి బట్టలో మూటగట్టి కాపాడుతున్న రాజకీయమా!

    జోహార్!

    హరికృష్ణమనాయుడి కోన ఊపిరి నినదించిన విషాద నినాదంఅది.....

    భళ్ళున రక్తం కక్కుకున్న ప్రతిభ, ఉరి తీయబడ్డప్పుడు....

    ఆఖరి సారిగా ఆలపించిన రక్తాశ్రు గితమది.

    __ప్యాలస్ ఆం విల్స్ పరిగెడుతూనే ఉంది.....

     తెల్లవారుజాము మూడు గంటల్తెంది.

    రెండో కంపార్ట్ మెంట్లో .....నిద్రపోతున్న లాయర్ సూర్య సాగర్  ఆకస్మాత్తుగా మెలుకు వొచ్చింది.

    నెమ్మదిగా లేచి____

    రెండు కంపార్ట్ మెంట్లకు మధ్యనున్న మొదటి కంపార్ట్ మెంట్లోకి వచ్చాడు....

    దగ్గరగా వేసి ఉన్న__

    హరికృష్ణమనాయుడు పర్సనల్ రూమ్ డోర్ ని నెమ్మదిగా ముందుకు తోసాడు.

    అక్కడ....!!!

  
                    *              *            *

    అనిమిష మతారంగా నవ్వింది.

    ఆమె నవ్వినప్పుడు యౌవనం  పొంగినట్టుగా ఉంటుంది. పాతికేళ్ళ అనిమిష అరబ్బీ జాతి గుర్రానికి, అందమ్తెన ప్యారిస్  చీర తొడిగినట్టుగా ఉంటుంది.

    చామనచాయ శరీరం___ఆల్చిప్పల్లాంటికళ్ళు__పొడవాటి ముక్కు__విదేశీ ఎరుపుతో పెంచిన వింత  గులాబిల్లా మెరిసే బుగ్గలు___నును ప్తెన భుజాలు___

    మగాణ్ని  కామాదాహంతో, పాదాక్రాంతం చేసుకునే యోవ్వనాల గుర్తులు. తెల్లటి ట్రాన్స్ పరెంట్ చీరలో, నల్లటి రేబకా సుందరికా ఉంది అనిమిష.

    అనిమిష మత్తుగా నవ్వింది. చేతిలోంచి బాటిల్ ని వంచి, డ్రింక్ ను  గ్లాస్ లో పోసి___

    మరింత మత్తుగా నవ్వుతూ ఎదురుగ సోఫాలో  కూర్చున్న వ్యక్తికి అందించింది.

    "అనూ....నువ్వు నవ్వకు....నువ్వు నవ్వితే....నా గుండెల్లో  గంధకం మండిపోయినట్లుగా  ఉంటుంది. ప్లీజ్ .....డోంట్  లాఫ్...."నాలుగో పెగ్గులోకి వెళ్ళబోతున్న ఆ వ్యక్తి ,కసిగా అనేసి, గ్లాసులోని  డింకును ఒక్కగుక్కలో తాగేసాడు.

    "నా నవ్వు అంత మత్తుగా ఉంటుందా....." వగాలకు వయసొచ్చిన ట్టుగా  వళ్ళు విరుచుకుంటూ మరింతగా నవ్వింది అనిమిష. 

    రాత్రి పదకొండు గంటల వేళ_____

    ఆ నవ్వు పాము బుసలా వికృతంగా ఉంది.

    "ఐల్తేక్  యువర్ స్త్మేల్....ఐల్తేక్ యువర్ ఫిగర్....ఐల్తేక్  యూ...." మత్తుగా అనేసి, ఖాళి గ్లాసుని ఆమెకు అందించాడా వ్యక్తి.

    మళ్ళి గ్లాసు డ్రింక్  తో నిండి పోయింది.

    "ఇష్టం....ఇష్టం....అని చెప్పడమే కానీ....నా ఇష్టం  ఎప్పడన్నా  అడిగావా డియర్...."

    పక్కన  కూచుని, గోముగా అతని వంటికి, తన భుజాల్ని  రాపాడిస్తూ అంది అనిమిష.

    "ని ఇష్టమా....బుల్ షిట్ ....నీకేం కావాలన్నా ఇచ్చాను. ఇవ్వలేదా  చెప్పు.... నా పర్సనల్  గెస్ట్ హౌస్ ....నికుజ్ రాసిచ్చాను....ఇవ్వలేదా....నీ పేరున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, నువ్వేయ్యమన్నంత ఎమౌంట్  అందులో వేసాను....వెయ్యలేదా...చెప్పు...సింగపూర్ చూస్తావన్నావ్.... చూపించానా లేదా...."

    అతని నోటి నుంచి మాటలు ముద్దగా వస్తున్నాయి.

    "రేపు నా బర్త్ డే...." వేళ్ళతో అతని మీసాల మీద  రాస్తూ అంది.

    "అయితే...ఏం  కావాలో చెప్పు....నువ్వేం కావాలన్నా  ఇవ్వడానికి  నేను రెడి....."ముందుకు వంగి, ఆమె ముక్కుమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.

    అప్పటికే రెడిగా ఉంచుకున్నజ్యుయలరీ అల్భమ్ నీ అతనిముందుచి, కొన్ని పేజీలు  తిప్పి, ఒక  పేజీలోని ఫోటోనీ చూబెడుతూ___

    "ఈ సక్లేస్ కావాలి....ఐల్తేక్  దిస్....బావుంది కాదూ...." కోర్కెగా తన గుండెల  మీద అతని చేతుల్ని ఉంచుకుంటూ అంది.

    ఆ ఫోటో  వేపు కళ్ళు  చిట్లించుకుని  చూశాడతను.

    "ఇది లేటెస్ట మోడల్ ....ఒన్లి ఫిప్టి లాక్స్..." మరింతగా  అతన్ని  అదుముకుంటూ అంది అనిమిష.

    "ఫిఫ్టిలాక్స్ ...." ఆశ్చర్యంగా కళ్ళు  పెద్దవి చేసుకున్నాడతను.

    "ఒన్లి ఫిప్టి లాక్సే కదా....ఏదో  కోటి  రూపాయల్లా బెదిరిపోతావెం.... మీ డాడి.... మినిస్టర్తెన సందర్భంగా నాకో మంచి గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చెయ్యలేదా...ఆయన మామూలు మినిస్టర్ కాకుండా...హొం మినిస్టరుయ్యారు".    

 Previous Page Next Page