Previous Page Next Page 
సక్స్ స్ పేజి 8

 

    "నువ్వు ఏమైనా అనుకోగూడదు మరి...."

    "ఏవనుకొంటాను.... చెప్పు..."ముద్దుగా అంది ముక్తానంద.

    "నువ్వు అందంగా ఉంటావు కాబట్టి...."

    నెమ్మదిగా  అన్నాడు తేజ.

    ఆ మాటకు ఆమె కళ్ళు సిగ్గును పులుముకున్నాయి.

    రెండు నిమిషాలసేపు, ఇద్దరిమధ్య మాటలు కరువయ్యాయి. ఒకరి  వేపు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు.

    "నువ్వు సడన్ గా  ఇంట్లోంచిపారిపోయావుగదూ....తర్వాత పొలిసు ఉద్యోగంలో చేరావు.... ఎందుకలా సారిపోయావు?"

    "ఏమో.... నాకేం తెల్సు....ఇంట్లోంచి పారిపోవాలనిపించింది పారి పోయాను. నాకు చిన్నప్పట్నించి.....పోలిసంటే ఇష్టం....నేను  పోలిసాఫిసర్ని కావాలనుకుంటే..... మా నాన్న నన్ను తనలాగే లాయర్ని చేస్తాననే  వాడు.... నన్నేప్పటిక్తేనా, లాయర్ని చేస్తాడేమోనని భయపడి, ఇంట్లోంచి పారిపోయాను. ఆ పొలిసు  ఉద్యోగంలో చేరిన  అయిదేళ్ళ  తర్వాత  మా  నాన్న నన్ను పట్టుకున్నాడు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ..... ఎన్నిసార్లనుకున్నానో తెలుసా....ఆ  మధ్య ....ఏదో  మాటల ప్రసక్తిలో మా నాన్నే చెప్పారు. అహమ్మదాబాద్ వచ్చి....నిన్ను చూడాలనిపించింది....."

    చెప్పడం ఆపాడు తేజ.

    "రావాల్సింది.....గమ్మత్తుగా  ఉండేది కదా...."

    "అదే సమయంలో నన్ను పంజాబ్ పంపించారు. ఆరేళ్ళయింది.... ఇక్కడకు ప్రమోషన్ మిదోచ్చాను....."

    "మనం ఇలా కలుసుకోవడం ద్రిల్లింగ్ గా వుంది కదూ....అలా  కలుసుకుంటామని నేనేప్పడూ  అనుకోలేదు....." అన్నాది  ముక్తానంద

    "నువ్విప్పడేక్కడుంటున్నావ్....." అడుగుతూ జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసిచ్చాడు సూర్యతేజ.

    "మీ డాడితో పాటు మా డాడి ప్రమాణ స్వికారానికి వచ్చారని  తెల్సి, ఇద్దర్ని కల్సి....వాళ్ళని ప్యాలెస్  ఆం విల్స్  ఎక్కించి వస్తున్నాను.

    అప్పుడు నాకు తెల్సింది ....నువ్వు అహమ్మదాబాద్ నుంచి వస్తున్నావని..... నిన్ను కలవడానికి  అశోకాకి బయల్దేరాను. దారిలోనే.... ముక్తానందదేవిగారు దర్శనమిచ్చారు." బిల్లు చెల్లించి, బయటికొస్తూ అన్నాడు తేజ.

    "అంతమందిలో నన్ను  నేనే అవి ఎలా పోల్చుకున్నావ్?" జిపుకి  చేరబడి, చేతులు కట్టుకుని  అడిగింది ముక్త.

    "స్నేహాన్ని మరచిపోలేన్నప్పాడు- స్నేహితుల్ని మర్చిపోలేం కదా....సారి....

    స్నేహితురాళ్ళను-ఎగ్తేన్ సారి....స్నేహితురాలిని...." ఓరగా చూస్తూ అన్నాడు సూర్యతేజ.

    "ఉలిక్కి  పడ్డవంటే చాలామందే స్నేహితురాళ్ళుండి ఉంటారు. అవునా....?!  నవ్వును పెదాల మాటున దాచుకుంటూ అంది ముక్తానంద.

    నిండుగా నవ్వి ఊరుకున్నాడు ఒకింతసేపు తేజ.

    "నిన్నేక్కడ డ్రాఫ్ చెయ్యాలి." డ్తెవింగ్ సీట్లో కూర్చుంటూ అడిగాడు తేజ.

    "ఎయిర్ పోర్ట్ లో.... నిజంగానా చాలామందే! అది చాలా తప్పు సుమా" కావాలనే  తమాషాకంది ముక్తానంద.

    తిరిగి మౌనంగా  నవ్వాడు సూర్యతేజ.

    "అవునూ....ఎయిర్ పోర్ట్  కన్నావ్ ....ఎక్కడికెళ్ళాలి?"

    "అర్జంటుగా అహమ్మదాబాద్ వెళ్ళాలి....." అంది  ముక్తానంద జిఫ్ ఎక్కుతూ.

    జీపు స్టార్టు చేసాడు సూర్యతేజ.

    సాయంత్రం....రాత్రిగా మారుతున్న వేళ....వెలుగును కప్పకుంటున్న రోడ్లుమీద బొమ్మల్లా మనుషులు....వాహనాలు.

     ఎయిర్ పోర్టి చేరేవరకూ ఏం మాట్లాడలేదు ముక్తానంద.

    "మళ్ళేప్పుడు...." జీపు దిగి నించున్న ఆమె వేపు చూస్తూఅన్నాడు సూర్యతేజ.

     "ఇంకేప్పడ్తెనా...." యాడ్ ఫిల్ములో అమ్మాయిలా అనేసి, లోని కెళ్ళాబోతూ ఒక క్షణం ఆగి, జిఫ్ దగ్గర చార్మినార్ మోడల్ లా, నుంచున్న తేజ కేసి సూటిగా చూసింది ఆమె కెందుకో వెంటనే వెళ్ళాలని లేదు .

    అతని పరిస్ధితి అలాగే ఉంది.

    అలా ఎంతసేపు ఉన్నారో__ వాళ్ళకే తెలిదు.

    అంతలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ లోంచి ప్లేయిట్ డిపార్చర్ గురించి ఎనౌన్స్ మెంట్  వచ్చింది దానితో ఉలిక్కిపడి తేరుకున్నారిద్దరూ


                             *                       *                        *

    డిసేర్ట్ క్విన్.....రాజభోగాల రైలు....ప్యాలెస్  ఆం విల్స్ ఆగ్రా మీదుగా పరుగులు తీస్తోంది.

    మయసభ భవనంలో, అందమైన, విలువైన భాగాన్ని తెచ్చి అమర్చినట్టుగా ఉన్న  విశాలమైన కంపార్టుమెంట్లో, రాజస్ధాని సంప్రదా  యంతో తాయారు చేసి విశాలమైన సోఫా మీద హుందాగా కూర్చున్నారు హొం మత్రి  హరికృష్ణమనాయుడు.

    ఒక ఇండస్టియలిస్ట్ గా  ,ఒక బిజినెస్ మాన్ గా కాలంతో  పరుగులు పెట్టె వ్యక్తిత్వం ఆయనది.

    హొంమంత్రి కాగానే,  లభించిన లీజర్ ఆశ్చర్యంగా  ఉందయనకు ఆయన కెదురుగా పార్టిలో ప్రముఖుడైన జ్తేపూర్ ఏం.పి. కూచున్నారు. ఆ పక్కన  బి బి .సి, ఇండియన్ రిపోర్టర్  కూర్చున్నారు. పక్కన కొంత  మంది ఇండస్టియలిస్ట్ లు. కొంచెం దూరంలో  కొంతమంది మిత్రులు  పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది యంగ్ పార్లమెంటే రియన్లు లైబ్రరి కమ్ బార్ లో  కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు.

    హరికృష్ణమనాయుడు, ఒక పక్క బి బి .సి రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇస్తూనే మరొక పక్క మిత్రులతో ఛలోక్తులు విసురుతున్నారు. ఇంద్ర దానస్సులాంటి "ప్యాలెస్ ఆం విల్స్ " పట్టాలమీద  పరుగులు తీస్తోంది.

    బి బి .సి రిపోర్టిర్ ఇంటర్వ్యూ అయిపోయాక పిచ్చా పాటిలో పడ్డారు.

    "నాయుడుగారూ.....ప్రస్తుతం దేశంలో మూడు కీలకమైనసమస్యలు  హొంమంత్రిగా మిమ్మల్ని సవాల్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నాయి. ఒకటి పంజాబ్....రెండు....కాశ్మీర్....మూడు....తమిళనాడులో ఎల్.టి.టి.ఇ.....విటినేలా సాల్వ్ చేస్తారు." ఫస్టు టైమ్ గెలిచినా, ఒక యువ ఏం.పి అడిగాడు.   

 Previous Page Next Page