మనోహర్ చూస్తూనే ఆమె ముఖం ఆనందంతో విప్పారింది.
ఆమె మనోహర్ తల్లి__ పావని, ఆమెకు ఎదురుగా నున్న వ్యక్తీ __ మనోహర్ తండ్రి _ మాదాల వెంకట్రామయ్య అనబడు అయ్య.
* * * *
అతడంత టెన్షన్ ఎన్నడూ అనుభవించలేదు.
జీవితంలో అత్యంత ప్రమాదకరమైనా పరిస్థితుల్ని ఎన్నింటినో ఎదుర్కొన్నాడు. చట్టావిరుద్డమైన పనులు లెక్కకుమించి చేశాడు. కాని ఎదురుగానున్నా ఆమెవైపుచేష్టలుడిగి చూస్తుండిపోయాడు. ఆమె కళ్ళు మంచులో తడిసిన మల్లె మొగ్గలా ఎంత స్వచ్చంగా వున్నాయో, ఆమె ప్రతీ అనువులోనూ అంతటి అమాయకత్వం తోనికిసాలడుతోంది.
ఆమె___ కావ్య.
అతడు__ తంబి.
ఆ అమ్మాయి జీన్ ప్యాంటు వేసుకుంది. పైన వేసుకున్నా బనియనువంటికి అతుక్కుపోయినట్టు వుంది.
అతడి ముఖం కందగడ్డలా కర్కశంగా వుంది.
అతడు కిరాయి గూండా_
ఆమె అతడి సమయాన్ని కోరి వచ్చింది.
అతడు కిరాయి గూండా_
ఆమె అతడి సహాయాన్ని కోరి వచ్చింది?
ఒక రోజున బంగారు పళ్ళెంలో గుజ్జునగూళ్ళు సేవించిన అతడు బేచ్ లో జారిపడిన పాఫ్ కార్న్, వేరుశనగపప్పు ఏరుకుని తినే దుస్థితికి తీసుకొచ్చినవారు ఎక్కాడు న్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. తెలిస్తే... అయినా ఆ విషయాలేవీ తెలియని కవ్యద్వారా తానూ వారని ఎదుర్కొనాబోతున్నానని ఆ క్షణంవరకు అతడికీ తెలియదు. తన తల్లినుంచి అతడేలా విడిపోయాడంటే ఇరవై ఎనిమిదేళ్ళు వెనకకు తిమ్గి చూడవలసివుంటుంది. అదెలా జరిగిందంటే కాంట్రాక్ట్ వరకు పూర్తయిన తర్వాత మాదాల వెంకట్రామయ్యని డిన్నర్ కి పిలిచింది పావని.
కంపెని ఆర్దిక పరిస్థితిని వివరించి, ఆ పసివాడిపిల్ల ఆమె భవిషత్తు ఏమ్తగాభాగ్నమతిమ్డీ వివరించాడు. త్దానితావు బెధపడిన ఆమెతో " అయామ్ సారీ... మిమ్మల్ని బాధపెట్టినట్ట్లున్నాను" అంటూ క్షమాపణలు చెప్పుకుని, భోజనం కూడా చేయకుండా వడివడిగా అడిగిలేసుకుంటూ వెళ్ళిపోయాడు.
అదే అతడు చేసిన తెలివిగలపని_
ఆనకట్టా కడితే ప్రశాంతమైన తటాకంలా వుంటుంది.
గండిపడితే ఎంతటి అరచాకాన్ని సృష్టిస్తుందో.
అందునా సెక్స్ పరమైన కోరికలు జ్వలిస్తే ఆ మనసుని అదుపులో పెట్టడం కష్టం. ఇప్పుడు పావని వుశాయంలో జరిగిందదే. మాదాల వెంకట్రామయ్య ఆలోచన బీజాలు నాటివెళ్ళాడు. ఆమె తన వైవాహిక జీవితస్మ్రుతిల్ని నెమరువేసుకుంటోంది. పెళ్ళయిన ఏడాది కాలం జీవితం సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత కాంట్రాక్ట్ లు ముమ్మరమయ్యాయి. భార్యను ఇంటిదగ్గరే విడిచిపెట్టి వేళ్ళేవాడు.వర్క్స్ స్పాట్ ద్దగ్గర, బిల్స్ పాస్ చేయించు కోడానికి ఆపైన అడపా దడపా ఇంటికొచ్చినా ప్రెండ్స్ తో పార్టీలు, అప్పుల వాళ్ళతో మీటింగులు అంటూ కాలం గడిపేవాడు. ఏ అర్ధరాత్రో అపరాత్రో పక్కలోకి చేరేవాడు ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే పిల్లవాడు పుట్టడం జరిగింది. భర్త జల్సాపురుషుడు. ఎక్కడవుంటే అక్కడ తన అవసరాలు సేకరించాలన్న ఆలోచన తనకురాలేదు. ఇప్పుడాయన గతించారు రేపటి మాటేమిటి?
నిజమే_ క్కంటికి నిద్ర, పోట్టకు భోజనం, శరీరానికి దుస్తులే తప్ప మనసుకి ఓ అనుబూతి అవసరం లేదా? వెంకట్రామయ్య చెప్పీ వరకు తనకా విషయం స్ఫురించలేదేమిటి? అంతకుమించి తనవారెవరూ ఆ విషయం పట్టించికోలేదేమిటి? అంతకుమించి తనవారెవరూ ఆ విషయం పట్టించుకోలేదేమిటి? అయినా తన వారంటూ ఎవరున్నారు_ వున్నా డబ్బు అవసరం వచ్చినపుడు కనిపిస్తారు. వెంకట్రామయ్య లేకుంటే తన పరిష్టితి తన కుటుంభస్థితి ఏమయ్యేది? పరి పరి విధాల సాగుతున్నాయి ఆమె ఆలోచనలు.
బ్రతికుండగాకూడా తనగురించి పట్టించుకోని_ తనను సుఖపెట్టమని భర్తమీద తొలిసారిగా ఆమెకు కోపం వచ్చింది ఆ కోపం వెంకట్రామయ్య పట్ల మరింత అభిమానాన్ని పెంచింది_ దగ్గరివాణ్ణి చేసింది. ఇప్పుడామె రాఘవయ్యని, వెంకట్రామయ్యని పోల్చి చూస్తోంది.
రాఘవయ్య:_ తాగుబోతు, వ్యభిచారి,జూదరి పైపిచ్చు ఎన్నడు తనను దృష్టిలో పట్టుకుని తనకోసం ఏమీ తెచ్చేవాడు కాదు. డబ్బిచ్చేవాడు_ కావలసినవి కొనుక్కోమనేవాడు. డబ్బు విలువేకాదు మనిషి విలువకూడా తెలియనివాడు.
వెంకట్రామయ్య:_ కారులోకూడా పరాయి స్రీ ప్రక్కన కూర్చోడానికి సిద్దపడడు. తానూ తాగాడు, జూడమాడడు. వ్యాపారంకోసం తాగిస్తాడు, జుదరులతో పరిచయాలు పెంచుకునేవాడు. అంతకుమించి తనకు ఏ రంగు చీర బాగుంటుందో, ఏరకమైన చెప్పులు వాడుతుందో బాగా గుర్తుపెట్టుకునేవాడు. పరాయి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విధిగా ఆమె కోసం షాపింగ్ చేసేవాడు.
రాఘవయ్య కన్నా వెంకట్రామయ్య ఎంతో ఉన్నతుడిగా,తన శ్రేయేభిలాషిగా కనిపించాడు. అప్పటివరకు వెంకట్రామయ్య పట్ల ఆమెకు గౌరవం, అభిమానం మాత్రమె వుండేది. ఆ ఇప్పుడు ఆ రెంటువీ మించిన భావమేదో ఆమెలో చోటు చేసుకుంది. ఆ రాత్రి ఆమెకు నిద్రరావడానికి ఆమె చాలా కష్టపడింది.
మరునాటి ఉదయమే ముస్తాబయి అతడు వ్స్తేదే మోనని ఎదురు చూస్తూ కూర్చుంది. కాని రాకపోవడంతో ఆమె అతడ్ని చూడాలన్న కోర్కెను చంపుకోలేకపోయింది. ఆ రోజు సాయత్రం అతడ్ని వెదుక్కుంటూ బయల్దేరింది. సాధారణంగా ఊళ్ళో ఎక్కడికైనా వెళ్ళేప్పుడు పిల్లవాణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళడం ఆమెకు అలవాటు. కానీ ఈ పర్యాయం పిల్లవాడ్ని వెంటబెట్టుకుని వెళ్ళలేదు.