Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 10

    కారణం___ ఆ పిల్లావాడంటే మాదాల వెంకట్రామయ్యకి___

    అయిష్టం.

     తన బిడ్డని యిష్టపడని వ్యక్తిని ఆమె అయిష్టపడలేదు అతడ్ని చూడాలని బయల్దేరింది.

    ఆమె అక్కడకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను కలచివేసింది. అతడి గదిలో ఆమె ఫోటో.

    కళ్ళనీళ్ళమధ్య వేరునంత సంతోషం... విషాదం మధ్య రవ్వంత చిరునవ్వు ఆమె మొహంలో కదలాడింది.

    ఫోటోలో__ కొనదేలిన ముక్కు ఎంతో అందంగా సిల్ షాట్ లో లాగా కనబడుతోంది.

    అతడి తాలూకు ఏదో ఆకర్షణ ఆమెను   పరిమళంగా చుట్టుముడుతోంది. ఆ సమయాన అతడు అక్కడలేడు. స్నానం చేస్తున్నాట్లు ఆ గదికి అంటి పెట్టుకొని  వున్నా బాత్రూం నుంచి శబ్దం వినవస్తోంది. మౌనంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది. మనసులోని భావాల్ల్ని అదిమి పట్టుకుంటూ కనురెప్పలు మూసుకుంది.

    ఆమె అక్కడ వుందని తెలియని వెంకట్రామయ్య తన సహజ ధోరణీలో లుంగీలు చుట్టుకుని బాత్ రూమ్ నుంచి  బయటపడ్డాడు.

    సజీవశిల్పంలా కుర్చీలో జారగిలబడికూర్చునున్న ఆమెవైపు అప్రతిభడయి చూశాడు! అదీ త్రుటికాలంపాటే! అయినా ఆమె కనురెప్పలు విడిపోలేదు. అంతలో ఒక మెరుపు మెరిసింది_ అతడి మస్తిష్కంలో! ఇహా ఆలస్యం చేయదలేదతడు. వెంటనే లోటాతో నీళ్ళు తెసుకోచ్చాడు. ఆ నీళ్ళలో అత్తరు కలిపాడు. ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. చేతనావస్థలోనున్న ఆమె అప్పటికీ కళ్ళు విప్పలేదు. కుర్చీలో జారగలబడి కూర్చోవడంతో కాళ్ళపైనున్న చీర పైకి జరిగింది. ఆ అత్తరు నీటిని ఆమె కాళ్ళపై పోసి కుడిచేత్తో  కడగసాగాడు. జాగృదావస్థలోకొచ్చిన ఆమె "ఏయ్..." అంటూ కాళ్ళు వెనక్కీ లాక్కోబోయిందిగాని, హాఠాత్తుగా రెండు చేతుల్తోనూ ఆమె రెండుకాళ్ళూ పట్టుకుని నిరోధించాడు.

    "ఏయ్... ఏమిటిది చూపులతోనే ప్రశ్నించింది.

    "దేవతని భక్తుడు అభిషేకించడం శాస్ర సమ్మతం...."

    "నీ గది గుడికాదుగా"

    "కాని నా గుండె ఓ గుడి"

    "కావచ్చు కాని నేను ప్రాణంలేని బొమ్మనుకాదు."

    "అదే నా బాధ__ కంటికి ఇంపైన చీరను కట్టుకోవచ్చు. కాని మనిషికి కావలసినవి ఇవేనా? ఇంతకు మించి ఏమీ అక్కర్లేదా...?"

    "అదేమో నాకు తెలియదు. కాని నిన్ననీవలా అర్ధరహితంగా రావచ్చా?"

    "యుక్తా యుక్తాలు విచారించే సత్తువ నాకా క్షణానలేదు. నా మాటలకు మీరు బాధపడినట్టున్నారు. మీరు భాధపడటం నేను చూడలేను."

    "అలా అనుకున్నావాడివి ఇలా నా ఫోటో నీ గదిలో పెట్టుకున్నావు. చూసినవారు ఏమనుకుంటున్నారన్నది నాకు ముఖ్యం."

    అతడి మాటలకు ఏమని సమాధానమివ్వాలో ఆమెకు భోపదడలేదు. భుజంపై నున్న తువ్వాలు తీసి ఆమె కాళ్ళ తడి అద్దాడు.

    "నేను మీ కాళ్ళతడి తుడవగలను గాని, కనుకొలకులలోని ఆకన్నీటినితుడవలేను గదా...!" స్వగతంగా అనుకుంటూన్నట్టే పైకి అన్నాడు.

    వెంకట్రామయ్య గారూ!

    తల చెడిన నేను అందునా ఓ బిడ్డకు తల్లి అయిన నేను తిరిగి పెళ్ళి చేసుకోగలనని ఎలా అనుకున్నారు?"

    "ఏ ఆడపిల్లా యుక్తావయసు వచ్చిన తరువాత పెళ్ళిచేయమని అడగదు. అలాగే అవసరం గుర్తించి కావలసినవి సమకూర్చడం నాకర్తవ్యమనుకున్నాను."

    "కావచ్చు. నేనంటే మీకు అభిమానం... ఆరాధన, నా కల్లోముల్లు గుచ్చుకుంటే మీ గుండెల్లో గుచ్చుకున్నట్టు విలవిలలాడి పోతున్నారు. అలాంటి మీరే నన్ను పెళ్ళి చేసుకోవాలని ఎందుకు ఆలోచించలేదు? ఒక వైపు గుడి గదిలో నా రూపం నింపుకున్నారు. మరోవైపు సుగంధ పానీయంతో నా కాళ్ళు కడిగి తుడిచావు. ఏ అడదయినా ఇంత కన్నా ఎక్కువేం కోరుకుంటుంది?" ఆలస్యంగానయినా అడగవలసిన ప్రశ్న అడిగింది.

    ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వెంకట్రామయ్య  త్రోటుపాటు పడలేదు. తడుముకోనూ లేదు.

    "పావనిగారూ!

    నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ని. జాతి పునర్మిర్మాణం కన్నతల్లి పాలల్లోను, ఇంజనీర్ల చేతుల్లోనే వుందని నమ్మినవాడ్ని. ఉద్యోగం చేస్తూ వారానికి ఆరురోజులపని, నెలాఖరుకి జీతం, సంవత్సరాంతానికి ఇంక్రిమెంటు లెక్క వేసుకునే మధ్య తరగతి మనస్తత్వం కాదు. ఎదుగుదలకు అవకాశం వున్నా వ్యాపకం_పట్టా కూటికి పరిమతిమయిందయినా  సరే స్వంతంత్రంగా చేయాలన్నది నా తపన. అందులో భాగంగానే కాంట్రాక్టులో చిన్న ఉద్యోగిగా చేరాను. పని నేర్చుకోవాలన్న తపన మినహా, నా పని పూర్తవగా టెండరు పంపించడం_ అందరికన్నా మిన్నగా పని పూర్తీ చేయడం నా బ్రెయిన్ వరకు ఫలితంగా అల్పకాలంలో అనల్పంగా మన సంస్థ పెరిగింది.సంస్థతోపాటు మనిషిగా ఎదగావలసిన రాఘవయ్యగారి వ్యసనాలు అప్పగించేవారు. ఒంటరి ప్రయాణం_ ఎక్కడ ఇబ్బంది పడ్తారోనని మంచి నీళ్ళా బాటిల్ దగ్గర్నుంచి వేడివేడి టీ ప్లాస్కు వరకు అన్నీ సర్ది పెట్టేవాడ్ని. ఆ రోజుల్లో మీరు నా యజమానురాలు! అంతే!! ఆ విధంగా వ్యక్తిగతంగా మీతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఏర్పడింది.ఆ తర్వాత రాఘవయ్య గారి రాబడి  పెరగడంతో ఉప్పుడు గత్తెల స్థాయి వ్యసనాలకు లోనయ్యారు. తాగి మోలపై నూలుపోగుకూడా లేకుండా సాని కొంపల్లో పడివున్న ఆయనను నేనే తీసుకోచ్చేవాడ్ని. ఆ క్షణాన ఆయనను అసహ్యించుకునేవాడ్నికాదు_ మిమ్మల్ని తలుచుకుని జాలిపడేవాడ్ని. ఆ విధంగా నేను మీకు చాలా దగ్గరయ్యాను. ఆ దశలో రాఘవయ్యగారు ప్రమాదంలో పోయారు. బ్రిడ్జి నిర్మాణంలో వుంది. నిర్మాణానికి చాల అప్పులు చేశాం మన పెట్టుబడి రాళ్ళలో రప్పల్లో విరజిమ్మబడి వుంది. హఠాత్తుగా కాంట్రాక్టు లు మానేస్తే మనకు అప్పులు మిగుల్తాయి. నాకు ఇతర కంట్రాక్టర్లనుంచి అఫర్లోచ్చాయి. కాని మానసికంగా మీతో ఏర్పడిన అనుభంధమో__మీ పట్ల నాకున్న జాలో నన్ను కట్టిపడేసింది! ఈ కాంట్రాక్టు పూర్తవుతున్నకొద్దీ మీరు నా యజమానురాలన్న భావం నాలో సమసిపోయింది. మీ పట్ల నాకున్న అభిమానం ఆరాధనగా మారింది. మిమ్మల్ని తప్ప మరొక వ్యక్తిని పెళ్ళిచేసుకోలేను అన్నంతగా మీ వ్యామోహాహంలో చిక్కుకున్నాను... అయితే ఇవేమీ మీకు తెలియదు_ తెలిసే అవకాశంలేదు.

 Previous Page Next Page