Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 8

    "అవును, ఈ ఇంటికి నేను పరాయివాణ్ణి కాదు. రాఘవయ్యగారు ఏ నమ్మకంతో నాకు తమవద్ద ఉద్యోగం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టు కోవలసిన బాధ్యత నా కుంది. అయన పోయేరోజుకి సంస్థ పీకల వరకు అప్పుల్లో వుందన్న విషయం బ్రతుకున్న నాకు తెలుసు; పోయిన అయనకిఉ మాత్రమె తెలుసు, ఆ రోజున వ్యాపారం మానేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టవలసి వచ్చేది! ఆ క్షణనా అప్పులున్నాయన్న సంగతి తెలిస్తే మీరు బెంబేలుపడే అవకాశం వుంది. అందుకే ఆ విషయము చెప్పకుండా మీతో వ్యాపారం కొనసాగించాను. ఆర్దికంగా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చాను. కాని వ్యక్తిగతంగా మీకు చాలా అన్యాయం జరిగింది. పెళ్ళయిన అయిదేల్లా కే అయన పోయారు. మెదట ఏడాది మీరు ఏం సుఖపడ్డరో నాకు తెలియదు. తర్వాత ఆయనను అంటి పెట్టుకుని మీకన్నా ఎక్కువుగా వున్నది. నేనే. పోయినవారి గిరించి చెడు మాట్లాడాలన్నది___ ప్రత్యేకించి రాఘవయ్యగారి గురించి__ నా ధ్యేయంకాదు. కాని ఆయనతో కాపురం చేశారన్నది లోకానికి తెలియక పోయినా నాకు తెలుసు, శరీరానికి తిండేకాదు, మనసుకీ ఆహ్లాదం కావాలి. స్రీ_ పురుష సంభందం ప్రకృతి సహజం. ఆర్దికంగా మిమ్మల్ని ఓ ఒడ్డుకు చేర్చానుగాని, జీవితంలో తిరిగి మిమ్మల్ని ఓ ఇంటిదాన్ని చేయాలంటే ఆ పిల్లవాడు పెద్ద ప్రతిబంధకమయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే రాఘవయ్యగారు బతుకుండి భర్తగా మీకు చేసిన అన్యాయం నాకు తెలుసు . మీ పట్లవున్న సానుభూతి అనండి అభిమానం అనండి మరోటి అనండి అ పిల్లవాడిపట్ల అక్కసుగా మార్చాయి. ఆ పిల్లవాడే లేకుంటే ఈ దేవతని పూలరధంతో కొత్త పెల్లికూతుర్లా అయినింటికి పంపించేవాణ్ణి...." అంటూ తన ధోరణిలో తానూచెప్పుకుపోతున్న వెంకట్రామయ్యని విభ్రంతిగా చూస్తుండి పోయింది పావని.

    ఆమెకు తెలియని కొత్త విషయాలు__ కొత్త ప్రపంచం! తానూ ఇప్పటివరకు ఆలోచించని కొత్త అంశం ప్రస్తావనకొచ్చింది.

    "అయాంసారీ.... మిమ్మల్ని బాధపెట్టినట్ట్లున్నాను" చెవివద్ద గుసగుస లాడి నట్లుంటే తలెత్తి చూసింది.
   
                                                           *    *    *    *

    కారు కీచుమంటూ శబ్దం చేసుకుంటూవచ్చి ఇంటి పోర్టికోముందు ఆగింది. కారుదిగి వడివడిగా అడుగులేసుకుంటూ హాలులోకి ప్రవేశించాదు. అప్పుడే ఉదయిస్తున్నా సూర్యిడిలా అందంగా, పొడుగ్గా ఆకర్షణీయంగా నున్న అతడి రాకతో ఆ ఇంట్లోచైతన్య పుంజుకుంది. ఆ కాతికిరణం_ మనోహర్.

    "డాడీ వున్నారా..." సర్వెంట్ ని అడిగాడు మనోహర్.

    "ఆఫీస్ గదిలో వున్నారు...."

    ఆ ప్రయత్నంగా చేతివాచీవైపు చూసుకున్నాడు.

    ఆ సమయంలో తండ్రీ టీ తాగుతూ టి .వి లో వార్తలు వింటూ వుంటారు. దినచర్య మారిందంటే తండ్రి ఏదో ఒక ముఖ్యమయినపనిలో నుమగ్నమయి వున్నాట్టు లెక్క!

    చేతిలో ఫిల్ తో అనాలోచితంగా తండ్రి అఫేస్ గదివైపు అడుగులేశాడు. ఆ గది బయట ఒక వైపున క్రీమ్  సన్  ఫ్ కలర్ తివాచీ మీద దంతముతోచేసిన విగ్రహం ఒకటుంది. దానికున్న బంగారుతాపడం కం సీల్డ్ లైటింగ్ లో మూసివున్న ఆ గది తలుపునే చూస్తున్నాడు అది తండ్రి ఆఫీస్ గది అయినా పద్ధతుల్ని అధిగమిస్తే సహించదు. అందుకే డోర్ లాక్ చేశారు.

    "కమిన్..." అన్న పిలుపు విని తలుపు తోసుకుని లోపలకి అడుగు పెట్టాడు. తండ్రి ఎదుట చాకాగోనుంచి తెప్పించిన ఫైబర్ గ్లాస్ టేబుల్ వుంది. ఆ బల్లమీద ఒక ప్రక్క కార్డ్ లేస్ తేలిఫోన్ వుంది. మరొక ప్రక్క బంగారపు సిగరెట లైటర్ వుంది. దాని ప్రక్కనే బంగారపు టిన్ వుంది. కాని మనోహర్ వాటిని గమనించండంలేదు. ఆ బాలలకు ఒక ప్రక్కా, తండ్రికి ఎదురుగా కూర్చునున్న స్రీ మూర్తిని చూస్తున్నాడు.
 

 Previous Page Next Page