ప్రతీ విషయానికి టెన్స్ ఫీలవ్వడం పరమహంసకు అలవాటే... కర్టెన్ పక్కకు జరిపి, రోడ్డువైపే చూడసాగాడు. రోడ్డు మీద వచ్చి పోయే వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎదురుగా కాకా హొటల్. అతని దృష్టి కాకా హొటల్ మీద పడింది.
కాకా హొటల్ లో కూచొని ఛాయ్ తాగుతున్న యువకుల మీద పడింది. తాని దృష్టి, వాళ్ళు అచ్చు అంకిత్, రాహుల్, చేతన్లలా కనిపించారు. వెంటనే కాళ్ళ జోడు పెట్టుకుని, కళ్ళు చిట్లించి మరీ చూసేడు. నో డౌట్ వాళ్ళే.
అయినా, ఎందుకైనా మంచిదని మరోసారి కఫర్మేషన్ కోసం, టేబుల్ మెడ వున్న బైనక్యూలర్ కోసం, అరగంట వెతికి, అది తన మెదలోనే వుందన్న విషయం ఆలస్యంగా గుర్తఒచీ, బైనాక్యూలర్స్ తో చూశాడు.
అంకిత్ కులాసాగా కూచొని మోఎట్ ఆర్గాన్ వాయిస్తూ వుంటే, చేతన, తాహుల్ లి సమోసాలు తింటున్నారు. పరమహంస కోసం 'హైపిచ్' లోకి వెళ్ళింది. వెంటనే బోయ్ ని గట్టిగా బెల్ నొక్కి పిలిచాడు.
బోయ్ వెంటనే బి.పి మాత్రలు తీస్కోని వచ్చాడు. అప్పుడు రేయిజైంది బి.పి అయినా కంట్రోల్ చేసుకుంటూ, బోయ్ ని వెళ్ళిపొమ్మన్నాడు. తర్వాత క్యాబిన్ లో నుంచి బయటకు వచాడు. బోయ్ చైర్మెన్ వంక చూస్తుండిపోయాడు.
***
"బాసూ... నువ్విలా తాపీగా మౌత్ ఆర్గాన్ వాయిస్తూ కూచుంటే, చైర్మెన్ వచ్చాడా... మనల్ని వాయిస్తాడు... ఏం చేద్దాం చెప్పు గురూ..." రాహుల్ అంకిత్ కాళ్ళ దగ్గర పెటిలై అడిగాడు.
"ముందు సెల్ అన్ చెయ్..." అంటూ తన జేబులోని సెల్ న్ చేసి మ్కిట్ కు ఇచ్చాడు.
మరి ఇంత బద్ధకం పనికిరాదు బానూ..." అంటూ సెల్ అప్ చేసి అంకిత్ కు ఇచ్చాడు.
సెల్ అన్ చేసిన మరుక్షణమే, పెద్ద సోదిస్తూ రింగయింది. డ్స్ ప్లే మీద నెంబర్ చూశాడు. అది చైర్మెన్ సెల్ నెంబర్.
అంకిత్ సెల్ ని చెవి దగ్గర పెట్టుకుని...
"యస్సార్... చేప్పండిసార్..." అన్నడున్ తాపీగా ఓ కాలును టేబుల్ మీద పెట్టి వెనక్కి ఒరిగి రిలాక్స్ వుతూ.
"ఇప్పుడేక్కడున్నావు అంకిత్... నీ గురించి ఉదయం నుంచి తెగ టెన్షన్ పది పోతున్నాను..."
అటు వైపు నుంచి చైర్మెన్ పరమహంస గొంతు.
"హు.. మీరు ఎ.సి. చాబార్ లో కూచొని టెన్స్ ఫీలవుతున్నారు... కానీ నేను.. ఇక్కడ పది రోడ్డు మీద నిలబడి, మీ కోసం మన నీటిని ఛానల్ కోసం ఎంత కష్టపడుతున్నానో అర్ధం కాదు సార్... అర్ధం కాదు..."
"అర్ధం కాదని రెండు సార్లు రిపీట్ చేయడం ఎందుగ్గానీ, ఇప్పుడెక్కడున్నా వెంటి?"
"ఎక్కడుంటే ఏమని చెప్పను సార్... వూరికి చివర పాతిక్కిలోమీటర్లు దూరంలో వున్నారు. ఇక్కడో పాడుపడిన స్మాశానానికి ఘాట్ చేస్తున్నాను. 'స్మశానం వైరాగ్యం' కాప్షన్ తో మనం టెలికాస్ట్ చేసి, స్పెషల్ స్టోరీ తయారు శేస్తే బావుంటుంది సార్... ఉదయం నుంచి నేచురాల్టీ కోసం ఏదైనా శవం వస్తుందేమోనని చూస్తుంన్నాం..."
"అంటే ఇప్పుడు స్మశానం దగ్గర్నుంచీ, అదీ సిటీకి పాతిక కిలోమీట్లర్లుదూరం నుంచి మాట్లాడుతున్నావన్నమాట..."
"అవున్నార్... అవును.. నన్ను నమ్మండి సార్... నమ్మండి."
"నేన్నీ కంటికి ఎలా కనిపిస్తున్ననయ్యా..."
"అదేంటి సర్... సెల్ కట్ అయింది.అయినా మీ వాయిస్ వినిపిస్తుంది..." దిస్ కనెక్ట్ అయిన కాల్ ని చూసి అడిగాడు అంకిత్.
"ఓ సారి రైట్ కు టర్నింగిచ్చుకుంటే నీకే కనిపిస్తుంది సేవంటీ యం యం లో..."
"అదే సార్... నా పక్కనే వుంది మాట్లాడుతున్నట్టుంది. స్మాశానంలో ప్రేతాత్మల పని కాదు కదా.." అంటూ తల వెనక్కి తిప్పాడు. తన వెనకే వున్న చైర్మెన్ పరమహంస ను చూసేడు.
"సార్... మీరా..." గట్టిగా అరిచాడు. పరమహంస వీపు చరుచుకుంటూ... "హాడ్లీ చచ్చాను కదా... నీ అరుపుకు" అన్నాడు.
"సార్... మీరు... ఇక్కడ... ఛ... ఛ... కాకా కాదు సార్... వెళ్ళండి సార్... వెళ్ళండి..." రెండు కళ్ళూ మూసుకుని చేతులు బయటకు చూపెడుతూ అన్నాడు అంకిత్.
ఓవర్ యక్షన్ వద్దూ... పద నా ఛాంబర్ కు" అన్నాడు కోపంతో ముక్కు పుటాలేగారేస్తూ.
అప్పటికే రాహుల్, చేతన అక్కనుంఛీ తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారు.
"హలో... మీరెక్కడికి సార్ జారుకుంటున్నారు.... మీకు డిజిటల్ డబ్బింగ్ ఉంది..." అంటూ గంభీరంగా ఫెస్ట్ పెట్టి...
"పది నిమిషాల్లో మీరంతా నా ఛాంబర్ లో వుండాలి" అంటూ ఆర్డర్ పాస్ చేసి గబగబ బయటకు నడిచాడు.
"అయిపోయామ్రోయ్..." ముగ్గురూ అనుకున్నారు.
***
చైర్మెన్ చాంబర్.
అంకిత్, రాహుల్, చేతన ముగ్గురూ బుద్దిగా చైర్మెన్ ఎదురుగా యల్లు వంచుకొని నిలబడ్డారు. పరమహంస గట్టిగా బెల్ నొక్కాడు. బోయ్ బి.పి. మాత్రలు లోపలకి వచ్చాడు.
"ఇదిగోండి సార్ బి.పి మాత్రలు..." అంటూ ఇచ్చాడు బోయ్.
"చంపుతా... ఇంకోసారి నేను బెల్ నోక్కాగానే బి.పి మాత్రలు తీసుకువస్తే నిన్ను డిస్మిస్ చేసి, మర్డర్ కేసులో ఇరికించి, మీ ఆవిడకు నీ పోస్టు ఇస్తాను" గట్టిగా వార్నింగిచ్చి...
"అరగంట వరకూ ఎవర్నీ లోపలకి పంపించకు" అన్నాడు.
బోయ్ ఓ సారి ఆ ముగ్గురి వంకా ఫేస్ అదోలా పెట్టి చూసి "అలాగే సార్" అంటూ బయటకు నడిచాడు.
***
చేతులు అటు ఇటూ వూపుతూ పచార్లు చేస్తున్నాడు చైర్మెన్ పరమహంస.
"సార్... అటు ఇటూ పచార్లు చేస్తే కాళ్ళు పీకుతున్నాయి. కూచొంది..." మెల్లిగా అన్నాడు అంకిత్.
కోపంగా అంకిత్ ఏమిటి? నేను చెవిలో పువ్వు పెట్టుకున్న శాల్తీలా కనిపించానా?" కపోంగా అడిగాడు.
"నేనెలా అన్నానా సార్... అయినా మీరిలా అంటే నేను రేపట్నుంచి ఎక్కడికి వేల్లనంతే... బుద్దిగా ఎ ఫిలం బెస్ట్ ప్రోగ్రామ్స్ కో యాంకరింగ్ చేస్తాను. లేదంటే..."