Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 8

 

    టైం చూసుకుంది. మరో పావుగంటలో మృదువని తనకు ఫోన్ చేస్తుంది. ఆటోని పిలిచి ఆడ్రస్ చెప్పింది. పది నిమిషాల్లో ఆటో ఓ టెలీఫోన్ బూత్ ముందాగింది.

    ఆ టెలిఫోన్  బూత్ అతను ఆంధ్రాకు చెందిన వ్యక్తి, శరణ్య కు ఫోన్ ఫేసి లిటీ లేనప్పుడు అక్కడుంచే జేమ్స్ కు ఫోన్ చేసేది.ఇన్ కమింగ్ కాల్ కు రెండ్రూపాయలు చొప్పున వసూలు చేస్తాడు.

    "ఏంటి మేడమ్... చాలా రోజుల తర్వాత వచ్చారు. అంతా కులాసాయేనా?" అడిగాడా టెలీఫోన్ బూత్ వ్యక్తి.

    "ఆ... బాగానే వున్నాను. ఓ ప్రెండు కు ఈ నెంబర్ ఇచ్చాను...." అంటూ కేబిన్ లోకి వెళ్ళింది. సరిగ్గా రెండు నిమిషాల తర్వాత ఫోన్ మోగింది.

    "హలో మృదువనీ... ఏమైందసలు?" మృదువని చెప్పడం మొదలెట్టింది...

    ఒక్కటి...
   
    రెండు...

    మూడు...

    పదిహేను నిమిషాలు గడిచాయి

    "ఇది... ఇతమ్త నిజమా..."

    "అవును... నాకిప్పుడు వేరే ఛాన్స్ లేదు... ఏం చేయాలో తోచటంలేదు."

    "మృదువనీ! కంగారు పడకు... ప్రస్తుతం అక్కడే వుండు. న ప్రెండు ఆడ్రస్ ఇస్తాను. వెళ్ళి కలు వాళ్ళకో మాట్లాడి ఆరెంజ్ చేస్తాను. ఈ లోగా నేను హర్షవర్దనరావుగారితో మాట్లాడానా?"

    "హర్షవర్దన్ రావా? ఎవరతను? ఓహే...! అమెరికాలో వున్న భారత రాయబారి కదూ..."

    "యస్... అతనితో నాకు చిన్న పరిచయం వుందిలే."

    "వద్దు... ప్రస్తుతం నేను ఎవర్నీ నమ్మే పరిష్టితిలో లేను.ముందుగా కొద్దిగా నేను తెరుకోవాలి... సారీ శరణ్యా! నీకు ట్రబులిస్తున్నాను."

    "డోంట్ వర్రీ... ఆ విషయం మరిచిపో... నువ్వు నేనిచ్చిన ఆడ్రస్ కు వెళ్ళు... నేనే అ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తాను వుంటాను" శరణ్య ఫోన్ పెట్టేసింది.
            
                                                                                               ***

    సికిందరాబాద్.

    మృదువని ఆటోలో వెళ్టోంది. ఆమె చేతిలో శరణ్య ఇచ్చిన ఆడ్రస్ ఉంది. ఆమె మొహంలో ఎ భావమూ లేదు... మైండ్ బ్లాంక్ గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, తనిలాంటి చిక్కుల్లో పడాల్సి వస్తుందని ఎ మాత్రం అనికోలేదు.
 
    తను తెలిసీ తప్పు చేసిందా?

    తను చేసిన సాహాసం పర్య వసానం ఎలా ఉంటుంది?

    ఆమె ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి. ఆటో పెండర్ గాస్ట్ స్టీట్ తో ఆగింది.మీటరు చూసి డబ్బులిచ్చి ఆటో దిగింది.మృదువని.
              
                                                                             ***

    నీరజ ట్.వి ఛానల్స్ ఎదురుగా వున్న కాకా హొటల్ లో కూచొని వేడి వెఇ ఛాయ్ తాగుతున్నారు ముగ్గురూ.

    "సార్... మనం వెంటనే వెళ్దాం... లేక పోతే మనం ఉదయం నుంచీ కనిపించలేదని చైర్మెన్ గారు తిట్టినతిట్టు తిట్టకుండా తిడతారేమో..."

    "అవును బాసూ... మనం వెళ్ళిపోదాం... లేక పోతే మనం కనిపించటంలేదని, కెమెరా దొబ్బకుపోయారని పోలీసు కంప్లెంట్ ఇచ్చినా ఇస్తాడు..." రాహుల్ అన్నాడు.

    అంకిత్ తాపీగా వాళ్ళిద్దరువైపూ చూశాడు. "అయ్యిందా... ఈ బుద్ధి ఉదయం ఉండాలి. అసలు మీ ఇద్దరి పేర్లు రాహువు-కేతువు" కెమెరామెన్ వంక చూస్తూ కోపంగా అన్నాడు.

    "అదేంటి సార్... అంత మాటనేసారు... అయినా తప్పంతా ఈ రాహుల్ దే.... గుడ్డెద్దు చేలో పడ్డట్టు 'వేల్ డన్ బాసూ... పరుగెత్తు... ఇంకా పరుగెత్తు...' అంటూ మీకన్నా స్పీడులో, మీ వెనుకే పరుగెత్తుకొచ్చాడు. నా గురించి ఆలోచించలేదు కూడా!" సిన్సియర్ గా చెప్పాడు కెమెరామెన్ చేతన్.

    "మీరిద్దరూ కలిసి నన్ను ముంచారు... అసలే నేనేదో సర్ ప్రయిజ్  చేద్దామని ఉదయమే  మిమ్మల్ని తీసుకెళ్ళాను. మీ తెలివితక్కువ తనం వల్ల నేను ఇరుక్కుపోయాను..."
 
    "మరిప్పుడెం చేద్దాం బాసూ..."

    "ఒకే ఒక మార్గం... వావున్లీవన్ వే..." తాపీగా అంకిత్.

    "ఏంటది బాసూ... ముగ్గురం వెళ్ళి చైర్మెన్ గారి కాళ్ళ మీద పడిపోదామా?"

    "ఉహూ.."

    "మరి... అసలు విషయం చెప్పి బావురుమందామా?"

    "అదే ఊహూ..."

    "మీరేంటి హూ.." నెత్తీనోరూ కొట్టుకుని, అడిగాడు రాహుల్.

    ఈ కెమెరాని దిస్కోంట్ కు అమ్మేసి ముగ్గురం కలసి ముంబై పారిపోయి, అక్కడో ఫోటో స్టూడియో పెట్టుకుని బ్రతుకుదాం."

    "గు..రూ.." గట్టిగా అరిచాడు రాహుల్. ఆ అరుపునకు... ఆ అరుపునకు కాకా హొటల్ లో వున్న కస్తామర్లమ్తా బెదిరిపోయాడు. చేతన్ ఆ కేక తో వేడివేడి టీ గొంతులోకి ఒంపెస్కుని కెవ్వున అరిచాడు. అంకిత్ మాత్రం తాపీగా జేబులో వున్న మౌత్ ఆర్గాన్ బయటకు తీసి వాయించుకోసాగాడు.

    "ఒరే రాహుల్ ముండావాడా... అంత గట్టిగా అరిచావేమిట్రా ... హడలి చచ్చి, ఛాయ్ గటుక్కున మింగి చచ్చ్హా..." చేతన్ అరిచాడు.

    ఛాయ్ తాగుతోన్న జనం కోపంగా రాహుల్ వంక చూశారు. అంకిత్ ఇదంతా తనకేమీ పట్టనట్టు మోఎట్ ఆర్గాన్ వాయించుకుంటూనే ఉన్నాడు.
 
    సరిగ్గా అప్పుడు...
   
                                                                                                 ***

    చైర్మెన్ పరమహంస తన ఛాంబర్ లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.అప్పుడప్పుడు బెల్ కొట్టి బోయ్ ని పిలిచి "అంకిత్ వచ్చాడా? రాహుల్ వచ్చాడా?" అని అడుగుతున్నాడు. మద్యహ్నం నుంచీ అంకిత్ సెల్ ఆఫ్ లో ఉంది. కెమెరా యూనిట్ ఏమైందో అర్ధం కావడంలేదు.

 Previous Page Next Page