Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 10

    "ఆ! లేదంటే...?" కోపంగా అడిగాడు చైర్మెన్ పరమహంస.

    "తుమ్మ జిగురు పనేమిటి? పోస్టర్లు అతికేస్తావా?"

    "కాదు... డైలీ సీరియల్స్ కు మాటలు రాస్తా... బా... గా.. శా... గ... దీసి..." కసిగా చెప్పాడు అంకిత్.
          
                                                          ***

    అంత కోపంలోనూ నవ్వొచ్చింది పరమహంసకు. తన నవ్వును దాచుకోవడం, ఆపుకోవడం అయన వల్ల కాలేదు. వెంటనే ఫక్కున నవ్వేసి...

    "అమ్డుకేనోయ్ నువ్వంటే నా కిష్టం, సీరియస్ లో కామిడీ మిక్స్ చేసి, కోపాన్ని క్షణాల్లో పోగొట్టేస్తావ్.." రిలాక్స్ వుతూ అన్నాడు పరమహంస.

    చైర్మెన్ కూల్ అయ్యాడన్న వుశయం కం ఫ్రం చేస్కొని చేతన, రాహుల్ జారుకున్నారు. అంకిత్ కూడా జారుకునే ప్రయత్నం చేయబోయాడు.

    "అంకిత్ నువ్వాగు.. నీతో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయాలి..." అన్నాడు పరమహంస.

    "అంటే.. నేనిప్పుడు సేరియాస్ గా వున్న ఎక్స్ ప్రెషన్ పెట్టాలా సర్?" అంకిత్ అడిగాడు.

    "కామీడీలోద్దు... బీ సిరీయాస్" అంటూ తన చెయిర్ లో రిలాక్సయ్యాడు. అతనికి ఎదురుగా వున్న సీట్లో కూచున్నాడు అంకిత్.

    "మన చానలుకు వ్యూయర్ షిన్ పది పోతుంది" గంబీరంగా చెప్పాడు పరమహంస.

    "మన పోగ్రామ్స్ కాన్సెప్ట్ ని టోటల్ గా మార్చాలి సార్."

    "మిగతా ఛానల్ ప్రోగ్రామ్స్ కు, మన ప్రోగ్రామ్స్ కు తేడా ఏముంది?"

    "లేకపోవచ్చు... కానీ, వాళ్ల ప్రోగ్రామ్స్ కన్నా, మన ప్రోగ్రామ్స్ తీసిపోవని సంతోష పడతామంటారా? మనం ప్యాటర్ లో వెళ్తున్నాం."

    "మన సీరియల్స్ మద్యహ్నం నుంచీ ప్రారంభమవుతున్నాయి. సినిమా మినహాయిస్తే రాత్రి పదకొండు వరకూ సీరియల్స్ అన్నింటికి కదా వస్తువు ఒఅక్కటే. అన్ని సీరియల్సు ఏడుపు ప్రధానమే..."

    "ఇప్పటి టీ,వి ట్రెండ్ అదేగా?"

    "ఆ ట్రెండ్ ఎవరు క్రియేట్ చేశారు? ట్రెండ్ ఎప్పుడూ ఫాలోయర్ ప్లేస్ లో వుండకూడదు. క్రియేట్ ప్లేస్ లో ఉండాలి... ఒక చానల్ లో ఏడుపు సీరియల్స్ హిట్టయితే, మనం అన్నీ అలాంటి సీరియల్స్ ఫాలో అవుతున్నాం.

    ఒక్కసారి మన ఛానల్ పెట్టి చూడండి... మన ఛానల్ కాదు, దాదాపు మిగతా అన్ని టి.వి ఛానల్స్ పరిస్థితీ అలానే ఉంది. కధ వుండదు, కధనం సాగదీసి మనం ఎపిస్లోడుగా తీయడం...

    ఒక పాత్ర మరో పాత్రతో నాలుగు మాటలు మాట్లాడాటానికి ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటుంది... మీరు ఫేలవ్వనని అంటే, మన ఛానల్ లో  వస్తోన్న ఓ ఎపిసోడ్ డైలాగులు చెబుతాను. ఒక పాత్ర మరో పాత్రతో మాట్లాడే విధానం ఎలా వుమ్తుమ్దావు తెలుసా సార్..."

    "ఏవండీ... మంచి నీళ్ళు తాగండి."

    "వద్దు.."

    "అదేమిటండీ... అలసిపోయి..."

    "వద్దని చెప్పనా?"

    "మీకు జలుబు చేస్తుందని కాచి, వడబోసిన నుంచి నీల్లండీ..."

    "వద్దని చెప్పవా..."

    "అది కాదండీ.."

    "విసుగించోద్దని చెప్పవా?"
  
    "ఏవండీ"

    ఒక్కసారి చెబితే అర్ధం కాదా..."

    "అది కాదండీ..."

    "ఏది కాదు... నాకు మంచినీళ్ళు వద్దు. పాడూ వద్దూ..."
 
    "ఏవండీ.."

    "వద్దని చెబితే అర్ధం చేసుకోవా?"

    "ప్లీజ్ ఈ మాత్ర వేస్కోని మంచినీళ్ళు తాగండీ..."

    "ఏంటీ.."

    "మం...చి..."

    "మం..చి..."

    "మం..చి..నీ..."

    "అలా నీళ్ళు నములుతావేంటి?"

    "మంచినీళ్ళు తాగండి."

    ఇదీ సార్ వరస... ఏదైనా విషయం చెప్పాలంటే, ఇలా ఫెవికాల్ ని ఉదిగించినట్టు ఉదిగించాలా... చెప్పిన మాటనే చెప్పి చెప్పి, తిరగేసి చేబుతాడు. ఎత్రకూ రీజనింగ్ ఉండదు. రీజనింగ్ ఇవ్వాలని కాదు, కనీసం, ఒఅ ప్త్రాకు తన స్వభావం ఏమిటో తెలియాలి.

    మన ఛానల్ వచ్చే అన్ని సీరియల్స్ వరస ఇదే. ఓ సీరియల్ లో అక్క చేల్లిల్ని ఏడిపిస్తే మరో సీరియల్ లో తల్లిని కొడుకు ఏడిపిస్తాడు. ఎవరు ఎవర్నీ ఎందుకు ఏడిపిస్తున్నారో తెలియక ప్రేక్షుకలు ఏడ్చే పరిస్థితి ఏర్పడింది.ప్రేక్షకుల కన్నిల్లె హిట్ ఫార్ములాగా మారిపోయింది. బయట పడదాం సార్.."

    పరమ హంసా అంకిత్ వైపు అలానే చూస్తొండి పోయేడు. అంకిత్ పట్ల పరమహంసకు ప్రత్యేకమైన అభిమానం కలగాదానికి కారణం ఇదే. ఎంత అల్లరిగా, సరదాగా వుంటాడో, వృత్తిపట్ల అంత సిన్సియర్ గా, సీరియస్ గా దేదికేట్ అయి వుంటాడు.

    "అతితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

    "నవరసాల్లో శోక రసమే మన ఛానల్ బలం...అనే ఫీలింగ్స్ లో నుండి బయట పడదాం... కామెడీ, క్రైమ్, హారార్ ఇలా విభిన్న రసాలలో సీరియల్స్ రూపొందిద్దాం.

    మద్యహ్నం మన ఛానల్ చూసేది గృహిణిలు. వాళ్లకు కుటుంబ కదా సీరియల కావాలి... అనే వేద్దాం. తప్పు లేదు. సాయత్రం ఓ అరగంటో, గంటో పిల్లలు కూడా రిలాక్స్ అవుతారు. ఆ టైంలో పిల్లలకు సంబంధించిన సీరియల్స్ కామెడి సీరియల వేద్దామం.... పిల్లలు, మహిళలు ఎంజాయ్ చేస్తారు. ముక్యంగా ఉదయం నుంచి అలసి పోయి వచ్చిన పిల్లలకు ఈ కామెడీ సీరియల మంచి ఎంటర్ టైన్ మెంట్.
 

 Previous Page Next Page