Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 9

    బాత్రూం డోర్ క్లోజయింది.
    టీవీ స్క్రీన్ మీద గది మొత్తం కనిపిస్తుంది. రిమోట్ తో ఆ గదిలోని వీడియోని ఆపరేట్ చేస్తున్నాడు సైంసిస్ట్ అగర్వాల్.
    ఐదునిముషాల అనంతరం రిమోట్ ఆఫ్ చేశాడు.
    "ఎలా ఉన్నాడు మన భస్మ" అడిగాడు ఖాన్  కరంజయాని.
    "సినిమా హీరోలా ఉన్నాడు" చెప్పాడు కరంజయా.
    "మనక్కావాల్సింది విలన్..." నవ్వి అన్నాడు ఖాన్.
    "ఇప్పుడు అతను మనం చెప్పినట్టు చేస్తాడా?" లల్లూరామ్ సందేహంగా అడిగాడు.
    "నో డౌట్... మనకెలా చెబితే అలా చేస్తాడు..."
    "అంటే అతనికి స్వంత ఆలోచన లేదా? వుండదా?" కరంజయా లో అనుమానం.
    "ఆలోచించే శక్తి, స్పందించే గుణం భస్మ కు వుండవు. అతన్ని పూర్తిగా మనకు అనుకూలంగా ట్యూన్ చేసుకున్నాం. సెంటి మెంట్స్, ఫీలింగ్స్ ఏమీ వుండవు. రొటిన్ గా తన పనులు తను చేసుకుంటాడు. మనం ఏం చెబితే అది చేయడమే అతని డ్యూటీ... దాదాపు అతని బాడీ అంతా విషపూరితమే. అతన్ని పాము కాటు కూడా ఏమీ చేయలేదు. వెయ్యి వోల్టుల విద్యుత్ ను తాకినా అతనికి ఏమీ కాదు. అతని బాడీ యించు మించు బిల్లేట్ ప్రూపే... బుల్లెట్ తగిలినా అతని బాడీ చెక్కు చెదరదు."
    "మైగాడ్..." అన్నాడు కరంజయా సైంసిస్ట్ అగర్వాల్ చెప్పిన మాటలు విని.
    "ఇవి చాలా చిన్న విషయాలు... సాంకేతిక పరిజ్ఞానం సాధించిన విజయాలు...' గర్వంగా నవ్వుఉతూ అన్నాడు.
    సైన్స్ ను విశ్వ శ్రేయస్సు కు కాకుండా, విశ్వనాశనానకి ఉపయోగించే అగర్వాల్ పెదవుల మీద విషపూరితమైన చిర్నవ్వు.
    "భస్మ ను ఈ రోజే రంగంలో కి దింపుతున్నాం... కిన్నెరా బ్యాంకును ఈ రోజు దావుపీది చేయిస్తున్నాం... జస్ట్ ట్రయల్ గా..." అన్నాడు ఖాన్.
                                                                         ***
    ఎయిర్ ఫోర్ట్ లాంజ్ లో వున్న కాఫీ షాప్ లో ఓ టేబుల్ ను ఆక్రమించుకున్నారు. నలుగురు ఎయిర్ హోస్ట్ స్ లు. యూనిఫామ్స్ లో షో రూమ్ లో డిస్ ప్లే చేసిన బొమ్మలా వున్నారు.
    అప్పుడే ద్తూటీ అయిపోయింది. రిలాక్స్ వుతున్నారు. వాళ్ళు.
    "ఏయ్... సవితా... ఏంటి విశేషాలు..." సుచిత్రాశర్మ అడిగింది సవితను. తమిళనాడు కు చెందిన సవిత, ముంబాయ్ కు చెందిన సుచిత్రా శర్మ, కేరళ నుండి వచ్చిన బామిని, దీల్లికి చెందిన శారిష్ట అందరూ మంచి ప్రెండ్స్.
    ఏ రాష్టం అయినా, ఏ బాష అయినా అందరూ కలసి వుండాలనే అందమైన కామన్ పాయింట్ వాల్లాది. భేషజాలు, యిగోలు వాళ్ళమధ్య లేవు. డ్యూటీ అయిపోగానే ఎక్కడో ఓ చోట వాళ్ళు కలుసుకుంటారు.
    కేవలం ఎయిర్ హావుస్తాస్ అనగానే అందంగా వుంటే సరిపోతుందనుకుంటారు అందరూ.
    దానితోపాటు మంచి భాషా పరిజ్ఞానం, ఇతర భాషల్లోనూ ప్రవేశం, జనరల్ నాలెడ్జి ఇవన్నీ వుండాలి. వీటికి తోడు చక్కని మేనర్స్ తప్పనసరి. అంతేకాదు పెదవులపై చెరగని చిరునవ్వు వుండాలి. గాలిని చీల్చుకుంటూ విమానం వెళ్తున్నప్పుడు అనుకోని అవాంతరమొస్తే, వుమానం కాలిపోయే పరిస్థితి ఉత్పన్నమయితే... తను నిబ్బరంగా వుండడమే కాదు ప్రయాణికులకు ధైర్యం చెప్పాలి. కొంతమంది ప్రయాణికులు ఓవర్ బిఇహేవ్ చేసినా చిరునవ్వుతో భరించాలి. ఇవన్నీ భరించే ఎయిర్ హోస్ట్ స్ కేవలం అందాల బొమ్మా మాత్రమె అనుకుంటే పొరపాటే.
                                            ***
    "సవితా... మనం వేరువేరు రాష్ట్రాల నుండి వచ్చినా, ఇలా కలిసుకున్నప్పుడు ఓకే కుతుబంలో నుంచి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మనలో ఒక్కరు మిస్సయ్యారు. గమనించారా?" అంది శార్మిష్టా.
    "యస్సేస్... మౌన.. డి గ్రేట్ మౌనంజలి..." అంది.
    "తనక్కూడా  డ్యూటీ అవర్స్ అయిపోవాలె?" అంది సుచిత్రాశర్మ.
    "ఏయ్... అదిగో మౌన... ఆలిండియా స్టార్ శ్రీదేవిలా వస్తోంది. ఓ యాంగిల్ లో మాధురీదీక్షిత్. మరో యాంగిల్ లో కాజోల్, ఇంకో యాంగిల్ లో..." యింకా ఏదోఅనబోతుండగా మౌనాంజలి అక్కడికి వచ్చేసింది.
    స్మాల్ ప్రింట్స్ వున్న కలర్ శారీ, చిన్నా ముడితో హెయిర్ స్టయిల్... చేతికి గోల్డ్ ప్రేం వాచీ... చాలా సింపుల్ గా వున్నా అద్బుతమైనసౌందర్యాన్ని ఒంటినిండా పులుముకుని వస్తున్నట్టు వుంది.
    "హాయ్ ఎవ్రిబడీ..." వస్తూనే అందర్నీ విష్ చేసింది. పెదవుల మీద చ్ర్నవ్వు చెదరకపోవడం, ఎప్పుడూ ఆమెనే అంటి పెట్టుకుని వుండటం ఆమె ప్రత్యేకత.
    "వావ్... ఏంతందంగా వున్నవే మౌనా? ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినట్టు లేవు... హాయిగా ప్లయిట్ లో జలకాలాడి, నీట్ గా డ్రెస్స్ స్ అయి, ఫైనల్ టచప్ తో కెమెరా ముందుకు గ్రీన్ రూమ్ నుంచి సరాసరి వచ్చిన ఏంజిల్ లా వున్నావు" అంది సొట్టలు పడ్డా మౌనాం జలి బుగ్గలమీద ముద్దు పెట్టుకుంటూ సుచిత్రాశర్మ.
    వాళ్ళా కాంప్లిమెంట్స్ స్వీకరిస్తూ... "అద్సరే టీజ్ చేస్తూ.
    "మాటాలేదు...మంతిలేదు....హాయిగా ఫస్ట్ షోకిచేక్కేదాం... ఆ తర్వాత హాయిగా ఇంటర్నేషల్ కాంటినెంటల్లో దిన్నార్ తీసుకుందాం... రేపెలాగూ 'ఆపే' కదా!" అంది భామిని.
    "డాన్..." అంది మౌనాంజాలి.
    "మౌనంజాలి మౌనం వీడి, 'డాన్' అంది యాహూ... అని అరుద్దాం..." అంది అల్లరిగా శర్మిష్ట.
    ఆ అయిదుగురూ సంవత్సరకాలంగా మంచి ప్రెండ్స్. అందరూ స్వచ్చా మైన తెలుగులో నే మాట్లాడతారు. మౌనాంజాలి వాళ్ళకి తెలుగును నేర్పించింది
    సాధారణంగా అందరు కలుసుకునే అవకాశం దొరకదు... చాలా అరుదుగా వచ్చీ అవకాశం అది.
    అందరూ కలసినప్పుడు ప్లయిట్ లో జరిగే సరదా సంఘటనలు చెప్పుకుంటారు.
    ఆ ర్రాజులు వరసగా డ్యూటీ చేస్తే ఏడవ రోజు కంపల్సరీ గా 'పః' వుంటుంది.
    అనుకోకుండా అలా అందరకీ ఓ రోజు 'ఆఫ్' కలిసొచ్చింది.

 Previous Page Next Page