Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 10

    "ఏయ్ భామిని... నిన్న ఏం జరిగిందో తెలిసా?" ఉత్సాహంగా అంది మౌనాంజలి.
    ఏం జరిగిందేమిటి? కొంపదీసి ఈ మౌనాంజలిని మణిరత్నం చూసి, మరో 'గీతాంజలి' లాంటి సినిమా 'మౌనాంజలి' పేరుతో తీస్తానన్నాడా?" అంది శర్మిష్ట.
    "ఊహూ కాదూ కానీ... గమ్మత్తయిన విషయం... తలచుకుంటే ఇప్పటకీ నవ్వోస్తుంది..."
    "ఏంటే...?" భామిని అడిగింది.
    "హైదారాబాదు లో ఓ శాల్తీ ప్లయిట్ ఎక్కాడు. ఢిల్లీలో దిగాలి... ప్లయిట్ టేకప్ తీసుకున్నప్పటినుండి అనీజీగా వున్నాడు. మధ్య మధ్య 'ఎనీప్రాబ్లం' అని అడిగినా, ఏమి చెప్పలేదు. ఇంకాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతమనగానే పాపం ఆ జీవుడు ఇక బాధ భరించలేక... తన ప్రాబ్లెం ఏమిఇతావు చెప్పుశాడు..."
    "ఏంటే అది?" అందరూ ఆసక్తిగా అడిగారు.
    "ఎక్స్ క్యూజ్ మీ మేడమ్... నేను అర్జంట్ గా పాస్ కు వెళ్ళాలి..." అని. తే లేట్ చూపించి, వెళ్ళొచ్చాక అడిగా...
    "ఈ విషయం ముందే అడగోచ్చుగా సర్... అని.
    దానికతను సిగ్గుపడుతూ... బస్సులో వెళ్తుంటే ఉమ్మేస్తే పక్కన వున్న వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఆకాశంలో వెళ్తూ 'పాస్' కు వెళ్తే భూ మీదవున్నా వాళ్ళమీద..." అని ఆపాడు మొహమాటపడుతూ... చెప్పి నవ్వసాగింది  మౌనాంజలి.
    అందరూ ఆ నవ్వుతో శృతికలిపారు.
    రాయ్... ఒబరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్ ది. భస్మ వుండే కాస్మాపోలిటన్ అపార్ట్ మెంట్స్ ఎదురుగా వుంది. కరెక్ట్ గా హొటల్ ఒబరాయ్ లో థర్డ్ ప్లోర్ లోనే వీళ్ళకు రూమ్స్ అలాట్ చేయబడ్డాయి.
                                              ***
    "ఏయ్ మౌనా... నీకేం ద్రోహం చేశానని మాకీ శిక్ష విధించావు?" నలుగురూ  మౌనాంజలి మీద యుద్దానికి దిగారు.
    మౌనాంజలి తెలుగు సినిమా చూద్దామంది. సిటీకి దూరంగా వున్నా దియేటర్ లో తెలుగు సినిమాలు ఆడతాయి. తీరా అక్కడకి వెళ్లేసరికి పాత తెలుగు సినిమా ఆడుతుందని తెలిసింది. అప్పటకే టైం అయిపోవడంతో చచ్చినట్టు ఆ సినిమాకే వెళ్ళారు.
    కడవల కొద్దీ కన్నీళ్ళు కార్పిమ్చే పురాతన సినిమా అది. అన్ని అవలక్షణాల తో రెండున్నర గంటల  సేపు నాన్ స్టాప్ గా చిత్రహింసలు పెట్టిందా సినిమా.
     మౌనాంజలికి లోపల భయంగానే వుంది. తను ధియేటర్ బయటకు రాగానే నలుగురూ తనని మర్డర్ చేసిపారేమోనన్న అనుమానం కూడా వచ్చింది.
    "సారీ ప్రెండ్స్... ఎ రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాకో అనికున్నాను. అందుకు పనిష్మెంటు గా ఓ రోజంతా డిడి వన్ లో పందుల పెంపకం, హరికధలు లాంటి ప్రోగ్రామ్స్ చూస్తానే..." అంది.
    "అంత పెద్ద శిక్ష వద్దులేకానీ... మా అందరి డిన్నర్ ఖర్చులు నీవే భరించు" అంది భూమిని.
    "ఓ.కే... ష్యూర్..." అంది  మౌనాంజలి. అటుగా వేలొన్నా టాక్సీని పిలిచారు. 'ఎయిర్ పోర్ట్' చెప్పి కూచున్నారు. టాక్సీ ముందుకు కదిలింది.
    "రెస్టారెంట్ కట్టీస్తారేమో..." కంగారు పెట్టింది సవిత. టాక్సీ ఫేర్ చెల్లించి, హాదవిడిగా రెస్టారెంట్ కు బయల్దేరారు.
                                                                      ***
    "భస్మా... కామన్ గెటప్ మై బోయ్... తెక్దిన్నార్..." అగర్వాల్ డిన్నర్ టైం గుర్తుచేశాడు. అతని చెవులకు ఇయర్ ఫోన్స్ లాంటివి వున్నాయి.
    భస్మ లేచాడు. అద్దంలో తన మొహం చూసుకున్నాడు.
    బీరువాలో నుంచి ఫార్స్ తీసి బ్యాక్పీకేట్ లో పెట్టుకొన్నాడు.
    ఎదురుగా వున్నా రెస్టారెంట్ కు బయల్దేరాడు.
    అతని చూపులు చూట్టూ వున్నా పరిసరాలు గమనించడంలేదు. ఓ రోబోలా నడుస్తున్నాడు.
    సరిగ్గా అప్పుడే మౌనాంజలి తన ప్రెండ్స్ తో కలసి వస్తోంది. రెస్టారెంట్ మూసేస్తారన్న గంగారులో ఎదురుగా వస్తోన్న భస్మ ను గమనించకుండా ఢీకొట్టింది.
    ఆమె గుండెలు అతని ఛాతికి తగిలాయి.
    వెంటనే తేరుకుంది మౌనాంజలి.
    అతన్ని ఢీకొట్టినప్పుడు నేలమీదకి జారిపడ్డా హ్యాండ్ బ్యాగ్ ను తీసుకోవడానికి కిందకి వంగి, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని, అతని వైపు చూసి ' సారీ' అంది అపాలజికల్ గా.
    భస్మ అదేం పట్టించుకోనట్టు ముందుకు కదిలాడు.
    "ఏయ్ మౌనా... యూ ఆర్ లక్కీ... హేండ్ సమ్ ని గుద్దేసావే... ఏయ్ ఇదంతా ప్రీ ప్లాన్ డా?" అడిగింది. కన్నిగీటి సుచిత్రా శర్మ.
    "ఆ జీవుడెంటీ... ఎ ఎక్స్ ప్రెషన్స్ లేకుండా అలా వెళ్ళిపోయాడు?" శర్మిష్ఠ అంది.
    "పాపం... మన మౌన బ్యూటీ చూసి షాక్ తగిలి మొహం ఎర్రబడింది.
    "కనీసం మేనర్స్ కూడా లేదు. తను సారీ చెప్పిందిగా 'దట్సాల్ రైట్ అని అంటే ఆ జీవిడి  సొమ్మెం పోయింది" అనుకుంది మౌన.
    భస్మ మాత్రం వీటికి అతీతంగా ఓ కార్నర్ టేబుల్ దగ్గరకి వెళ్ళి కూచున్నాడు.
    వెయిటర్ భస్మ దగ్గరకి వచ్చాడు.
    తనక్కావలసిన ఐటమ్ ఆర్డర్ చేశాడు.
                                          ***
    "ఏయ్... మౌనా... అటుచూడు... ఇందాక నువ్వు ఢీకొట్టినా చలించమని జెంటిల్మేన్ స్తాత్యూలా కూచొని వున్నాడు. అదేంటి... ఎ ఎక్స్ ప్రేషనూ లేకుండా అలా వున్నాడు..." శర్మిష్ట అంది.
    "పోనీలేవే.... మనకెందుకు?" మౌనాంజలి అలా అన్నదే కానీ, ఆమె మనసులో అతనిమీద ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది.
    అది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదా? అన్నది కూడా ఆమెకు అర్ధం కావడం లేదు.
    భస్మ పోర్క్, స్పూన తో నూడ్ల్స్ తిమ్తునాడు. అతడ్నే చూస్తూ వుండిపోయింది మౌన.

 Previous Page Next Page