Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 8

        "తప్పదు దోస్త్. మిమ్మల్ని ఎవరైనా బెదిరించి, ఇక్కడికి తీసుకురా వచ్చు.మీతోపాటు మీకు తెలియకుండా మీ కారు దీక్కిలో మరెవరైనా రావచ్చు. తెలివైనా సోల్జర్ ఎప్పుడూ తన నీడను తాను కూడా నమ్మకూడదు. ముఖ్యంగా యుద్దంలో..." అన్నాడు ఖాన్.
    "ఠీక్ హై ఖాన్ సాబ్... అయినా మన పరిచయం అయి పాతికేళ్ళు అయినా మీరింకా నాకిప్పటికీ అర్ధంకాదు. అయినా మీరు సామాన్యులు కారు. పాతికేళ్ళ క్రితం ఇండియా వచ్చి, ఈ పాతికేళ్ళుగా త్రావాల్ బిజినెస్ పేరుతో ఇక్కడే వుంది ఇంత పెద్ద సేక్యూరీటి తో, దర్జాగా వున్నారంటే మీది మాస్టర్ మైండ్" మెచ్చుకోలుగా అన్నాడు కరంజయా.
    "దోస్త్... నేను చేపట్టిన వృత్తే అలాంటిది. అమెరికాకు చెందిన ఓ గూడచారి నలబైయ్యేళ్ళు మరో దేశంలో వున్నాడు. మా పాకిస్తాన్ ఏజెంట్ ముపైయ్యేళ్ళుఅమెరికా గూఢ చర్యం చేశారు...'
    ఖాన్ వంక చూస్తుండిపోయారు కరంజయా.
    పాతికెళ్ళా క్రితం భరద్వాజని బెదిరించి, తమవైపు తిప్పుకునే కాంట్రాక్ట్ లో భాగంగా, ఖాన్ తనని కలవడం, తను భరద్వాజ కొడుకును తీసుకు రావడంతో ప్రారంభమైంది.
    ఇది జరిగి పాతికేళ్ళయింది. ఈ పాతికేళ్ళు ఖాన్ ఇక్కడే వున్నాడు. త్రావాల్ బిజినెస్ రం చేస్తూ, అప్పుడప్పుడు పాకిస్తాన్ వెళ్ళొస్తూ.
    తనేం చేసేది ఖాన్ చెప్పాడు. అవసరమైతే కరంజయాని పిలిపించి పని అప్పగించి, అందుకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు.
                                                                       ***
    "ఖాన్ సాబ్ మన భస్మ ఎలా ఉన్నాడు... అతడ్ని చూడక చాలా కాలమైంది" అన్నాడు కరంజయా.
    "భస్మ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి వుందా? ఇన్నాల్లో అతని ఉనికిని ఎందుకు గోప్యంగా వుమ్చానో తెలుసా... సైంసిస్ట్ అగర్వాల్ అతడ్ని అబ్జర్వ్ వేషన్లో పెట్టాడు. నౌ హీ ఈజ్ అల్ రైట్... భస్మ మన ప్రయోగానికి సిద్దంగా వున్నాడు. చూద్దాం పదండి..." అంటూ ఓ హాలులోకి దారితీశాడు ఖాన్.
    అతడ్ని అనుసరించారు కరంజయా, లల్లూరామ్. విఇశాలమైన ఆ హాలులో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ స్విచ్ లు వున్నాయి. కుడివైపు పెద్ద బోర్డ్, దాని మీద రకరకాల మాటలు... రంగు రంగుల్లో...
    ఓ చెయిర్ కూచొని మైక్రో ఫోన్ చెవులకు తగిలించుకుని... ఎదురుగా వున్న కంప్యూటర్ మీద ఏర్పడే గీతాలను పరీశీలిస్తూ వున్నాడు సైంసిస్ట్ అగర్వాల్.
                                                                            ***
    "మీరలా కూచోండి..." ఖాన్ అ హాలులోకి వచ్చి విషయం చెప్పాక, అన్నాడు కుర్చీలు చూపిస్తూ సైంసిస్ట్ అగర్వాల్ ఎర్రగా, డబ్బాపండులా వుంటాడు.
    బట్టతలా...కళ్ళజోడు.... అతని చూపులు గమ్మత్తుగా వుంటాయి.
    ఖాన్, కరంజయా, లల్లూరామ్ కుర్చీలో కూచున్నారు.
    తనూ వచ్చి వాళ్ళా ప్రక్కనే కూర్చున్నాడు అగర్వాల్.
    వాళ్ళా ఎదురుగా పెద్దా స్క్రీన్ ఉంది.
    అగర్వాల్ చేతిలో రిమోట్ వుంది.
    "ఇప్పుడు మనం భస్మ వున్నా అపార్ట్ మెంట్ చూస్తున్నాం..." చెప్పాడు అగర్వాల్.
    కరంజయా కు టెన్షన్ గా వుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆ బాబును చూశాడు తను. ఆ తర్వాత అప్పుడప్పుడు, అడపా దడపా వచ్చినా, ఆ బాబును చూడనివ్వలేదు ఖాన్. కేవలం అగర్వాల్ కనిపెట్టుకు వుండటమే తన డ్యూటీ అయింది. ఇప్పుడు పాతిక సంవత్సరాలుతరవాత...అ బాబును ఓ యువకుడిగా చూడబోతున్నాడు తను....
    అగర్వాల్ చెవులకు మైక్రోఫోన్స్ లాంటివి తగిలించుకున్నాడు. అతని చేతి వెళ్ళు రిమోట్ మీద వున్నా బటన్లను ప్రెస్ చేస్తున్నాయి.
    క్రీన్ మీద ముందుగా అడ్డంగా గీతాలు, ఆ తరవాత నిలువు గీతలు... చుక్కలు... స్క్రీన్ బ్రిట గా మారింది.
    ఓ పెద్దా అపార్ట్ మెంట్
    "ఇది ఎయిర్ పోర్ట్ ఎదురుగా వున్నా అపార్ట్ మెంట్. ఇక్కడ్నుంచి చూస్తే ఎయిర్ ఫోర్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో థర్డ్ ప్లోర్ లో నెంబర్ థర్టీన్ రూమ్ లో భస్మ వుంటున్నాడు" స్క్రీన్ మీద కనిపిస్తోన్న అ అపార్ట్మెంట్ ను చూపిస్తూ అగర్వాల్.
    స్క్రీన్ మీద సీన్ మారుతోంది. కెమెరా ముందుకు కదులుతున్నట్టు.... దృశ్యం థర్డ ప్లోర్ కు మారింది. రూమ్ నెంబర్ థర్టీ న్... గది తలుపు మీద పదమూడు అన్నా సంఖ్య కనిపిస్తోంది.
    "నెంబర్ థర్టీ న్..." నవ్వి అన్నాడు కరంజయా.
    "మాములుగా దెయ్యాలు, వాంపయిర్స్ నెంబర్స్ థర్టీ న్ లో నివాసముంటాయంటారు. హొట ల్స్ లో తర్తే న్ నెంబర్ రూమ్ వుండదు. ఒక వేళ వున్నా ఎవరూ ప్రిపేర్ చేయరు. విదేశాలల్లో తర్తే న్  ప్లోర్ కు లిప్ట్ 'బ్రేక్ ఫెసిలిటీ కూడా వుండదు..."
    "తెలుసు... అందుకే భస్మ  అందులో వుంచాను. రక్తం తాగే వాంపయీర్ కు, మన భస్మ కు పెద్దా  తేడా లేదు. అతడ్ని అలా తయారు చేయలనే నా ఉద్దేశ్యం... ముందు చూడండి." అన్నాడు.
    అగర్వాల్ వాళ్ళా ముగ్గురీ మరో గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కాడ హొమ్  వీడియో సైజులో టీవీ వుంది. కరంజయా కు ఎప్పుడెప్పుడు భస్మ  చూద్దామా అని వుంది.
    "భస్మ గదిలో అత్యాధునికమైన వీడియో వుంది. అక్కడ జరిగే ప్రతీ సంఘటన డైరెక్టర్ గా రికార్డ్ యి యిక్కడ టీవీలో మనకు కనిపిస్తుంది. భస్మ ఎక్కడున్నా, అతని మెదడులో మనం అమర్చిన చిప్స్ ద్వారా అతన్ని మనమే కమాండ్ చేయగలం నా వాయిస్ అతను టూన్ కాక తప్పదు" అంటూ ఆ టీవీ ముందు నిలబడి ఓ మీట నొక్కాడు అగర్వాల్.
    నెంబర్ థర్టీ న్ రూమ్ లో ఓ డబుల్ కాట్...
    నిండా ముసుగు కప్పుకుని పడుకున్నా భస్మ ముసుగు తీశాడు కాళ్ళ రెండు పెద్దవి చేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు కరంజియా...
    దుప్పటిని మూలకు గిరాటేసాడు భస్మ... ఆరడుగుల పొడవు, ఎత్తుకు తగ్గా లావు... గంబీరమైన మొహం... చూడగానే వాళ్ళు జలదరించింది.
    "భస్మ... ఓపెన్ డ రైట్ విండో..." చెప్పాడు అగర్వాల్.
    భస్మ చూపులు కుడిచేతివైపు తిరిగాయి.
    అటువైపు వెళ్ళి రైట్ సైడ్ విండో ఇపెన్ చేశాడు.
    ఓ రోబోలా వున్నాడు. చూపుల్లో రియాక్షన్ లేదు. తర్వాత బాత్రూమ్  లోకి వెళ్ళాడు.

 Previous Page Next Page