Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 9


    ఎలకకీచుమంది. "ఇప్పటికీ మించిపోలేదు. విద్యార్ధులుతాము సాగిస్తున్న వికృతయుద్దాన్ని విరమించవలసిందిగా పారిస్ డీన్, అతని సహచరులూ అర్ధిస్తున్నారు." ఖంగునమ్రోగే కంఠధని అసహ్యాన్నీ, ఉపేక్షనీ పురిగొల్పింది.
    కమ్యూన్ జరోగ్రంగా ఉంది. ఇళ్ళలో అందరూ ఊపిరి బిగబట్టేరు.
    బరువుగా, నిశ్శబ్దంగా కాలం ఆగింది. రాయబారాలు ముగిశాయి.
    ఖడ్గధారిగ్రిమో ఆఫీసులో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. మంత్రులు కీలుబొమ్మలు కాని విప్లవం  విస్తరిల్లబోతోందనిగ్రిమో కనిపెట్టేడు. ప్రజల సానుభూతికూడా అటే ఉంది.
    బుద్దిలేని ఈ రేడియోలు ప్రజలఅంతఃకరణలు ప్రతిబింబించే అద్దాలను సప్లయి చేస్తున్నాయి. పారిస్ కీ, రాష్ట్రానికీ, గ్రామాలకీ! రంగస్థలం మీదకి నటీనటులు దిగుతున్నారు. గొర్రెలమందల్లాంటిప్రేక్షకులను కూడా తమతోకలవమని ఆహ్వానిస్తున్నారు. మంట అంటుకుంటోంది కార్మికులు కూడా కలుస్తున్నారు.
    తెల్లారేదాకాబారికేడ్లను ఉండనిస్తే పరిస్థితి చెయ్యి జారిపోతుంది. మంత్రులు వణికిపోతున్నారు. డిగోల్ నిద్రపోతున్నాడు. (నిద్రపొమ్మని టెలిఫోన్ కబురు వెళ్ళిందేమో?)
    గ్రిమోమాట నెగ్గింది. నిర్దాక్షిణ్యంగా విప్లవాన్ని అణిచెయ్యడానికి అనుమతి సంపాదించాడు. కాబట్టి మరోమారుఊచకోత.
    ఉదయం2:16 వరకు కమ్యూన్ సద్దణగిఉంది. తదనంతరం:నరకం.
    
                               8
    
    మేకమ్యూన్
    (కమ్యూన్ గోడమీద ఎర్రపెయింట్ తో)
    సమాజమొకమాంసాహారం తినేపువు
    (కమ్యూన్ గోడమీద)
    వాళ్ళ మూర్ఖతలో కూడా ఏదోతర్కం ఉంది.
    "షేక్స్పియర్ అనుసరణః నాన్ టెర్, మూడో అంతస్తుమెట్లు)
    కమ్యూన్ నిశీధాన్ని పాడేదెవరు?
    గేలూజాక్ వీధిలో నల్లసముద్రం దాడి చేసింది. ఫిరంగులు గుళ్ళ వర్షంకురిపిస్తున్నాయి. మొదటి బారికేడ్ మంటలలో భగ్గున మండింది. నల్ల కెరటాలునీలి వాయువులని కక్కుతున్నాయి. ఉక్కిరి బిక్కిరి చేసే ఈ వాయువులు చిన్న ఎత్తున వ్యాపించాయి. గాలినిండా దట్టపునీలిపొర.
    ద్రావకంపసుపు పచ్చనిది.
    మంటలు ఎర్రనివి. పెళపెళలాడేమంటలు. చెవులుచిల్లులెత్తించేకాల్పులు - తుపాకి కాల్పులు-మహాప్రళయం.
    పారిస్ నగరమా! విను నీ చిందులుతొక్కే సేనల కోలాహలాన్నివిను! పొగలోంచి పరుగెత్తుతున్న నీ ముసుగు మనుష్యుల అరుపుల్ని, వాళ్ళుకాల్పులు సాగిస్తున్నారు. నీ బిడ్డల మీదా, నీ ఆశల మీదా, నీ మృదుత్వం మీదా, నీ సమంజసతం మీదా.
    అగ్నిపరివేషంతో నల్లరంగుపురోగమిస్తుంది.
    గాలినీలిగా ఉంది. దళసరిగా.
    ద్రావకం పసుపురంగు మంటలుబద్దలై అడ్డొచ్చినవాటన్నింతిని మింగేస్తున్నాయి. మొదటి శ్రేణిఇక ఎంతోసేపు నిలవలేదు.
    "భీతావహంవద్దు కామ్రేడ్స్-వాళ్ళు మన ప్రాణాలనిమాత్రమే. తీసుకోగలరు- మూర్చపోయేలోపుగా తప్పించుకోండి. రాళ్ళువిసురుతున్నవాళ్ళధారి కడ్డురాకండి"
    .......
    ఒకబారికేడ్ దాని వెనుకఇంకోటి రెండింటిమధ్యాశవాలు.
    "మీస్నేహితుల్ని దిగవదలకండి, కామ్రేడ్స్."
    తర్వాత బారికేడ్.
    తడిఆరిపోయిన ఊపిరితిత్తులు, కన్నీళ్లు, నెత్తురు.
    తలుపులు బడాయించుకుని పారిస్ ఎదురు చూస్తోంది. హత్యాకాండ ముగిసిపోయి, తన కార్లు యధాప్రకారం సాగిపోవడం కోసం.
    సెయింట్ మైఖేల్ లో మొదటి బారికేడ్ మండుతోంది. ఒక ఎర్రని జెండా కాలుతోంది. గేబా జాక్ లో నరకంనిమ్మళంగా పురోగమిస్తోంది.
    జనంకిటికీలోంచి నీళ్ళుపోస్తున్నారు. విరిగిపోయిననీళ్ళ పైపులతో వీధులు నిండిపోతున్నాయి. జనం కిటికీలలోంచి అరుస్తున్నారు. పోలీసుల మీదశాపనార్ధాలు కురిపిస్తున్నారు పోలీసులు. కిటికీల్లోకి గ్రెనేడ్లు విసురుతున్నారు.
    వెనకఉండిపోకండి. బారికేడ్ ను వదలి పెట్టవలసివస్తే ఎవరూ వెనక ఆగిపోరు.
    గుళ్ళప్రేలుడు మధ్య ఏడుపులు.
    పదకొండుగంటలతర్వాత బైటికివెళ్ళకూడని పడుచుప్రాయువుపిల్ల ఇప్పుడు రక్తంతోనిండిన ఊలుచొక్కామండిపోతున్నబారికేడ్ల వెలుగులోకనిపించింది.
    లాసెపేడ్ వీధిలో ఒక గోడమీదతెల్లని పెయింట్ తో "వీధులు రక్తం కక్కుతున్నాయి"అని వ్రాసి ఉంది. రక్తం కక్కుతూంటే పోలీసుల్ని పిలవండి కూలి డబ్బులుపుచ్చుకొని ద్వేషించడంనేర్చుకున్నారు. పారిస్ లోని మర్యాదస్తుల ఇండ్లుమూసికొని ఉంటే "మీరు శవాలు. మీరు బతికి ఉండలేరు" అని అరవగలిగినవారు.
    బాష్పవాయువు ఏడుపు తెప్పిస్తుంది. ఊపిరితిత్తుల్ని కాల్చేస్తుంది. కడుపులో తిప్పేస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
    సకాలంలో వీపు వంచు. అవసరమైతే పరుగెత్తు.
    గేలూసాక్ లోని బారికేడ్లను వీలయినంత దీర్ఘకాలంనిలబెట్టాలి. రణరంగాన్ని కాపాడాలి. చక్రబంధంజరగకుండా చూడాలి. ప్లేస్ డిలా కాంట్రెస్కార్స్ మీదుగా ఏక్షణమైనా తప్పించుకోవడానికివీలుంది.
    రూడిఆల్మ్ ఇప్పుడు పోరాడుతోంది. గే లూసాక్ లొంగిపోలేదు. మేరీ క్యూరీ ఒక ఆసుపత్రి. పోలీసులు విరుచుకుపడతారు. అరిచే గుంపులు. గాయపడినవారిని బాదుతారు. స్ట్రెచర్ ల నుండి కిందకి లాగిమరీ బాదుతారు.
    విద్యార్ధులతో కలిసి ఇంకా నేర్చుకుంటూనే ఉన్న నోబుల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మోనో అక్కడే ఉన్నాడు. రిపోర్టర్లు దారుణకాండనుట్రాన్సిస్టర్లలోకి అరచి గీ పెడుతున్నారు.
    అరవకుండా ప్రశాంతంగా మాట్లాడుతారాలేక సిచాఫ్ చెయ్యమన్నారా అంటారు. కంట్రోల్ రూముల్లోనివాళ్ళు అడ్డుగా సంగీతాన్ని ప్రవేశపెడతారు.

 Previous Page Next Page