7
నావాంఛలే వాస్తవికత అంటాను -
ఎంచేతంటేనా వాంఛల వాస్తవికతను నమ్ముతున్నాను.
(సోర్బాన, ప్రదర్శనశాల, ఇతరత్రా)
క్రియ=ప్రతి క్రియకాదు- కాని సృష్టి
(సెన్సియర్)
యువకమిలిటెంట్లూ, వాళ్ళ మిత్రులూ ప్రదర్శిస్తున్న అవ్యాహతసంఘటనలతో రేలూపగళ్ళూ గడిచిపోతున్నాయి. ఆ ఉరుముల ప్రతిధ్వనులుతతిమ్మా అన్ని చప్పుళ్ళనూముంచేస్తున్నాయి. చిన్న బతుకుల, చిన్న భయాలచిన్న చిన్నచప్పుళ్ళు, నిశ్శబ్దాలచప్పుళ్ళు; దైనందినతాపత్రయాల చప్పుళ్ళు;ఎందరో వింటున్నారు. కొందరుకలవరపడుతున్నారు.
సూచనలు కనబడుతున్నాయికాబట్టి. "వినిమయ వస్తువులే ప్రజలనల్లమందు." అని నేషనల్ పాప్యులర్ బ్యాంక్ గోడమీద రాసి ఉంటే అక్కడ పనివాళ్ళు చెరిపేశారు.
"వాళ్ళు మీ సౌఖ్యాన్ని డబ్బిచ్చికొంటున్నారు. వీల్లేదు. దొంగిలించండి" అని ఇంకా చెరిగిపోకుండా ఒక గోడమీద ఉంది.
బస్సులపై ప్రశాంతిలో, భూగర్భప్రయాణాలు సద్దులేని ఎడార్లలో, యుద్దవార్తలను ప్రకటించే ప్రచారసాధనాల భవనాలలో సందేహ సర్పాలుతల చూపుతున్నాయి. కార్మికవర్గాల అసంఖ్యాకజనానీకంలో, ధనవంతులకొడుకులు తండ్రులమీద చేసిన తిరుగుబాటులోని ద్వేషం ప్రతిఫలిస్తోంది. అందరి కన్న చిన్నపిల్లలు, ఇన్నాళ్ళుగా బూర్జువా కుటుంబపు చేదు, తీపి పెత్తనాలక్రింద నలిగిపోయినవాళ్ళు, కాన్వెంటు స్కూళ్ళవిశాలమైన నీడపట్టులు వదిలిపెట్టి వీధుల్లోకొచ్చి విజ్రుంభిస్తున్నారు. సంఘ వ్యవస్థను వెక్కిరించడంలో మొదటివాళ్ళు వెనుకంజ వెయ్యడంలో ఆఖరివాళ్ళు.
సమాజం ఇలాగ అకస్మాత్తుగా బద్దలవడంతో, పూటబత్తెం పుల్లవెలుగులాదమ్మిడీలు పొదుపుచేసుకునే పేదవర్గాలలో ప్రతీకారపు రుచి తగిలింది. తమ తండ్రులిదివరకు జరిపిన పోరాటాల్లో చిరిగిపోయిన జెండాలనుపోగుచేసుకొని, కామ్రేడ్ అనే మాటకు అర్ధం ఆర్జించుకున్న ఈ అడవి పువులు బాష్పవాయుసముద్రాల మధ్యభయంకర వ్యాఘ్రాలలాగ, ఆ మనస్సుల మాననీయతకోసం, తమ తమ సప్నాల సాహసంకోసం ముగ్గులోకి దిగాయి. గత చరిత్రలో దాగిన, తాము చదవలేని పుస్తకాలలో, బూజుపట్టిపోయిన పాతకాలపు యుద్దాలలోకూడా, పేదవాళ్ళ సరసన ఎందరెందరో గొప్పింటివాళ్ళలోని అత్యుత్తములు నిలబడ్డారు.
కాని ఇప్పుడీ పసిపాపలు, భావితరాల అగ్రగాములు, తమకలల కొక ఆకారాన్ని కల్పించుకుంటూ, "ధనవంతులతోసహా తాము నిలబెట్టగోరుతున్న అన్యాయానికి బానిసలే" అని ఆకాశంలోకి అరుస్తూ చాటుతున్నారు. తమ తండ్రులభవనాలూ, వాటిచుట్టూతోటలూ, ఆ వైభవం, అ ఆదర్పం అన్నీ ఉత్తఅజ్ఞానంతోనూ, దైనందినకర్మకాండతోనూ నిండినశూన్యానికి అంధకారానికి తోడుగుతున్నముసుగులు మాత్రమే అని చాటుతున్నారు. దూరంనుంచి వినబడుతున్న ఈ నాటకరంగ యుద్దాలకోలాహలం ఆ సందర్భపు మురికిపేటల్లోకుళ్ళుతున్న కుర్రాళ్ళకీ, కుర్ర కార్మికులకీ హుషారుచ్చింది.
మరికొందరుతమతో ఒక శూన్యవాదాన్ని తెచ్చి ఈ సన్నాలయుద్ధంతో కలిపారు.
పార్టీదేవదూతలుగొంతు చించుకొని అరుస్తారు. కార్మికులు పోరాటంలో చేరాలనీ, అప్పుడుఓటరు అనేదే ఉండదనీ ఇంతలో శుక్రవారం వస్తుంది. మళ్ళీ అందరూ పోగవుతారు. వేలాది జనం. అందరికన్నా చిన్నవాళ్ళు అందరికన్నా జాజల్యమానంగా ఉంటారు. అందరికీ ఎన్నోపగళ్ళు తిళ్ళూలేవు, రాత్రిళ్ళు నిద్రా లేదు.
తెల్లకోట్లుదాల్చిన మెడికల్ స్టూడెంట్లు సైతంవచ్చేశారు. ఎప్పుడూ రాజకీయాలంటేదూరంగా ఉండేవాళ్ళు. శరీర సౌఖ్యాలు తప్ప మరేమీ అక్కరలేనివాళ్ళు. పగిలిపోయిన తలకాయలు చూశాక వచ్చారా? తమచేతుల్తో కట్టుకట్టినతలలు, సున్నితమైనరంపాలతో కోసిన కోతలు. (నా కళ్ళతో నేనుచూశాను. పోరాటం మద్యని, చికిత్స చేస్తున్న తెల్లకోటు విద్యార్ధియెదుట క్యూలోనిలుచున్న కుర్రాళ్ళని, సడి చెయ్యకుండాకట్లు కట్టించుకుని మళ్ళా.
తమయుద్ద శ్రేణికిమరలి పోతూండడం.)
మంత్రనగరంవైపు మళ్ళీ అందరూ కదుల్తున్నారు - సోర్భాన్ వైపు, ఈగల్లా ముసిరిన పోలీసులవైపు, సోర్భాన్ గోడల వెనుక, బూజు వెనక డీన్ రోష్ ఎలకగారి అధికారానికి అడ్డులేదు. నల్లదడులను దాటిఆనందం ప్రవహిస్తోంది. లాటిన్ కార్టర్ దిక్కుగా చలనంలేని భయానకశిలావిగ్రహాలు. కాని అగ్రదళం సెయింట్ మైఖేల్ చేరినప్పుడు పోలీసులు అటకాయించలేదు. ఎంత ఆనందం! అందరూ ఇక్కడకు సురక్షితంగా రావడం ఒక నిశ్చయాన్ని సృష్టించింది.
హాల్ట్! (ఆగండి) కామ్రేడ్స్! 30 వేలమంది తీసుకునే నిర్ణయం.
పోలీసులురాతి బండలు కనిపెడుతూ, వేచి చూస్తున్నారు.
ఆఫీసుగదుల్లో మూసుకుపోయినమంత్రులు తమఅశక్తతని గుర్తించారు.
కామ్రేడ్స్! నిలదొక్కుకొని ఇక్కడేఉందాం. త్వరలోనే తెల్లారిపోతుంది.
పోలీసులు టెలిఫోను వార్తకోసం ఎదురుచూస్తున్నారు. అల్లాడి పోతున్నారు. మనం నిలదొక్కుకొని ఇక్కడే ఉంటాం. విసిగిపోయి పోలీసులు వెళ్ళిపోయేదాకా! ఎంత సులువైన పని! చిమ్మ చీకటి గేలూజాక్ వీధిలో బారికేడ్లు లేచిపోతున్నాయి. గాడాంధకారం. సెయింట్ జాక్ వీధిలో అప్పుడే ఎరుపూ, నలుపూ పతాకాన్ని ప్రతిష్టించారు. ఆ కారు చీకటిలో మే మాసపు కమ్యూన్ జన్మించింది.
లేతచేతులు గొలుసులుగాకట్టుకుని రాళ్ళుసరఫరా చేస్తున్నాయి. ఒకరాయి ఇంకో రాతితో కలిస్తేఎదిరింపు. మరో రాయి చేరితేవిప్లవం. మరోటిచేరితే కమ్యూన్.
గానం వీధినుంచి వీధికిపాటల ప్రతిధనులు. నీళ్ళలాగ చేత్తోముట్టుకోదగ్గ భావోన్మాదం.
ట్రాన్సిస్టర్లలోపది గంటలయింది.
మూషికంరోష్ ఏకాంతపు గోడలవెనుక కిచకిచలాడుతున్నారు. రాయబారాలుసాగించమని అతని యజమానులు ఆజ్ఞాపించారు. రేడియోలుయధాశక్తిగా సాయపడుతామంటున్నాయి. ముసిలవలు కిటికీల్లోంచికుర్రాళ్ళకోసం చాకలెట్లు విసురుతున్నారు. కమ్యూన్ కి ఆకలి. సామూహికసప్నం సఫలీకృతం కావడానికి ఉత్పత్తి చివరనిపిసరూ, పిప్పీ, బారికేడ్లు నిర్మాణానికికార్లు పనికొస్తాయి, పబ్లిక్చసౌఖ్యం నిర్మించడానికి ప్రైవేట్ కార్లు. ఒక మనిషిస్వయంగా తన మేడమీంచిదిగి బారికేడ్ వైపుతన కారుని తోస్తాడు. కమ్యూన్ బలిష్టమవుతోంది. ఒక ఆఫీసులో మంత్రులుసమావేశమయారు.
కిటికీచప్టాల మీద ట్రాన్సిస్టర్లు, విప్లవకారులు హడావుడిగా ఉన్నారు. ఇళ్ళలో నుంచి బైటికి వచ్చిపౌరులు వాళ్ళకి సహాయపడుతున్నారు. విద్యార్ధులు షరతులు. పోలీసులు పోవాలి. సోర్భాన్ కీ, నిర్భంధంలో ఉన్న తమ సహచరులకీ స్వేచ్చ కావాలి.
హోంమంత్రి వర్గ కార్యాలయంలో తాత్కాలిక ప్రధాని జోసీ, పోలీసు ఉన్నతాధికారిపూషే. డిగోలో ఎడమచెయ్యిట్రిక్, పోలీసుశాకాధికారిగ్రిమో తెల్లారేసరికిపారిస్ నగరమంతా.
బారికేడ్ల మయమవుతుందేమో అని వీళ్ళ భయం.
బారికేడ్లు పెరుగుతున్నాయి. ఎలకతోమాట్లాడడానికి కాన్ బాందీ వెళ్ళేడు. కాని అతన్నివెనక వదలిఇప్పటికే ప్రవాహంచాలా ముందుకి పోయింది. కమ్యూన్ విస్తరిల్లుతోంది.