డిలా ఎస్ప్రపాద్ వీధిలోపోరాటం సాగుతోంది. సెయింట్ మైఖేల్ కాగడా లాగమండుతోంది. కమ్యూన్ ఒక్కొక్క గజమే వదులుకుంటోంది. అంగుళం, అంగుళం చొప్పున ఇళ్ళనూ, బారికేడ్లనూవదులుకుంటోంది. బీభత్సకాండ ప్రారంభం కాబోతుంది.
మోనోప్రజలకు ప్రశాంతంగా విజ్ఞప్తి చేస్తున్నాడు. తన గొంతుకనుసిచాఫ్ చేసేలోపుగానే ఇళ్ళలోని వారంతాబైటికి వచ్చి ఊచకోతను నిలుపుదల చెయ్యవలసిందని. చిన్న వీధుల్లో పోలీసు దాడుల ఉధృతం తగ్గించడానికి Yఆకారంలో రెండు కార్లు నిలబెట్టండి. టైముంటే ఇంకోకారుతో Y ఆకారంచెయ్యండి. కార్లన్నింటినీతగలబెట్టండి.
ఆఖరిబారికేడ్లను నిలబెట్టడంముఖ్యం. కమాండోలుజట్లు జట్లుగాపోరాటం సాగిస్తున్నారు. ఉక్కిరిబిక్కిరి అయిపోయే దాకా నిలబడుతున్నారు. తర్వాత ఇతరులువచ్చి వాళ్ళస్థలం తీసుకుంటున్నారు జ్ఞప్తి ఉంచుకో పోలీసులుదుష్టులే కాని పోరాడగలిగిన వాళ్ళు కారు. కారణం, వలలు కూలి పుచ్చుకుని పోరాడేవాళ్ళు అంబులెన్స్ లు దారి చేసుకుని వెళ్ళకుండా ఉన్నాయి. తెల్లకోట్లుధరించిన డాక్టర్లనీ, నర్సులనీ బాదుతున్నారు. కమ్యూన్ల ఆసుపత్రులకీ, ప్రథమ చికిత్సాదళాలకీ పెన్సిలిన్, స్కాల్పెల్స్, ఆక్సిజన్, దూది, డాక్టర్లుకావాలి.
కమ్యూన్ రక్తం కక్కుకుంటోంది.
దృష్టి పోగొట్టుకున్న ఒక అమ్మాయితోబాటు ఒక డాక్టరును పోలీసులు అటకాయించారు. తనకు దారి ఇవవలసిందని పోలీసులకు చెప్పడానికి రేడియోను ఉపయోగించి పోలీసు ప్రధానాధికారికి తెలియజెయ్యండని అతడు ఒక రిపోర్టును అడుగుతాడు.
ఉపకారపరులు ముక్కచెక్క లేరుకోడానికి వస్తారు. టాక్సీవాళ్ళుపోలీసుల నుండి క్షతగాత్రులనులాక్కొనిపోతారు. పోలీసులు మందులు తీసుకువెళుతున్నవాళ్ళని కొట్టడం, మందుకుప్పెలను పిప్పిగా చితకగొట్టడంచూసిన వాళ్ళున్నారు.
కమ్యూన్ ఆఖరి వీధుల్లో పోరాటం భీషణంగా సాగుతోంది. పొగ నీలిరంగు. ద్రావకంపసుపు పచ్చరంగు. బారికేడ్లుమంటలతో పేలుతున్నాయి.
పిల్లలువాటిని వదలిపెట్టడంలేదు. మంటలలో, నెత్తురులో, బురదలో పోరాడుతూనే ఉన్నారు. నోట పలుకరాని దారుణాలు సాగిస్తున్న పోలీసులతోపోరాడుతూనే ఉన్నారు.
మేకమ్యూన్ పూర్తిగా స్థావరాలనుకోల్పోయింది కాని గెలుస్తూనేఉందని అందరికీస్పష్టమవుతోంది.
ఆఖరిబారికేడ్లను కూడా వదలిపెట్టవలసినప్పుడు, చక్రబంధాన్ని బిగిస్తూ సైరెన్లు విజయంప్రకటిస్తున్నప్పుడు, లొంగిపోవడం తప్పనిసరి అయినప్పుడు ఉదయంసమీపించింది.
భయం ఒక మాట కాదు. పరుగెత్తుతున్న వాళ్ళని పెరళ్ళలోకి వెంటాడుతున్న శత్రువు భయం. అపరిచితమైన మెట్లెక్కితెరచుకోని తలుపులనుబాదడం భయం. ఇరుకుల్లో దాగి సైరెన్లుసమీపించడాన్ని వినడంభయం.
చలిగా ఉంది. ఉదయకాలపుచలి. వీధి ప్రతిధ్వనిస్తోంది. చలి కొరుక్కుతింటోంది. కమ్యూన్ ఖూనీ అయింది.
పరుగెత్తేకాళ్ళు, త్వరగా తెరుచుకుంటున్న తలుపులూ, గుసగుసలూ! పెరళ్ళలో అంతులేనిఅరుపులు, భయపడినపిల్లలు-ఏడుస్తూ అరుస్తూ!
మూలల్లో, ఇరుకుల్లో, చీకట్లలో దాగిన నీడలు.
కాన్ బాందీ రేడియో కావాలంటున్నాడు- ఇంకా ఆహుతి అయిపోతున్నవాళ్ళనివద్దని చెప్పడానికి. మరీ చిన్న గుంపులింకాతారాడుతున్నాయి. ఇప్పుడు పోలీసుల లాఠీ దెబ్బలు, దెబ్బలు, దెబ్బలు! తప్పుకోండి. పారిపోండి. మీరు మాకు కావాలి. దొరికిపోకండి. కొన్ని తలుపులు ఓరగా తెరచుకున్నాయి. మరికొన్నింతిని ప్రస్తుతం పై చేయిగా ఉన్న శత్రువు బలవంతంగా తెరుస్తాడు. డిగోల్ మేలుకుంటున్నాడు కమ్యూన్ మరణించింది.
తుదిస్థానం ప్లేస్ డీలా కాంట్రస్కార్క్ వద్ద, మంటల్లో వెలుగుతున్న పెద్ద అక్షరాలలో ఇలారాసి ఉంది:
"సమాజమొక మాంసాహారం తినేనవు."
"అనిశీథ సౌందర్యంలో, తెలివితక్కువతనంలో ఇంకో చెయ్యిఇలా రాసింది.
"రాళ్ళవానలో నేను బతికేఉన్నాను!"
కాని రేయి తర్వాత పగలు వస్తుంది. కాన్ బాందీ తిరుగుబాటుకు పిలుపిచ్చాడు గద్గదసరంతో: అన్ని వామపక్ష శక్తులకీ, కార్మిక సంఘాలకీ, అన్ని రాజకీయపక్షాలకీ, అందరు ప్రజలకీ, చప్పుళ్ళతో నిండి ఒక చిన్న పెట్టెలో ఒక రాత్రి అంతా చిక్కుకున్న అంతరాత్మగల అశేషజనానీకానికీ!
కమ్యూన్ ఒక పువు. నలిగిపోయేపువు. నశరమైనపువు. స్థావరాలనుకోల్పోయింది,
భవిష్యత్తును గెలుచుకుంది.
బలసంపన్నులయిన ప్రజా నాయకులు, చల్లారిపోయిన విప్లవాల బూడిదనుధరించిన వారు,
తెల్లారుతుండగా మేలుకుంటున్నారు.
ఉదయం ఏడు గంట లయేసరికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ వాల్డెక్ రోషి రాత్రి సంఘటనలను ఖండించి, పార్టీ తోడ్పాటును ప్రకటించడానికి సిద్దమవుతాడు.
పార్టీలూ, సంఘాలూ ఒడంబడికలు చేసుకుంటున్నాయి.
పాతఆశయాలకన్నా ముందుకిపడుచు నెత్తురుప్రవహిస్తోంది.
సోమవారంనాడు; దేశమంతటా సార్వత్రిక సమ్మె పారిస్ లో బ్రహ్మాండమైన ప్రజా ప్రదర్శనం. అన్ని వామపక్షాలూ అక్కడుంటాయి. అంతటా ఆనందోత్సాహాలు! ఎగిరే ఎర్రజెండాలు.
9
శాసనసభబూర్జువా నాటకశాల అయినప్పుడు,
బూర్జువా నాటకశాలలే
శాసనసభలు కావాలి.
(ఫ్రీ ఓడియాన్ థియేటర్)
ప్రధానమంత్రి పాంపిడో ఒకప్పుడు మార్సెయిల్స్ లో లాటిన్ గ్రీకుభాషాధ్యాపకుడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరలి వచ్చిమరోపద్దతి అవలంబిస్తాడు. సోర్భాన్ ను యథాప్రకారం విద్యార్దుల వశం చెయ్యడం.
కాని, తరుణం బాగా మించిపోయింది.
చదరంగం ఆట ప్రారంభమయింది.
వామపక్షపుపార్టీలూ, కార్మిక సంఘాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. పారిస్ నగర వీధుల్లో ప్రదర్శనం సాగిస్తాయి - ప్రశాంతంగా, క్రమబద్దంగామే ఒకటో తేదీలాగే కాని ఈ సారి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి ఈ ప్రదర్శనం "పోలీసు దమనకాండ"కు వ్యతిరేకంగా జరుగుతుంది.
పోలీసుల కాన్సెన్ ట్రేషన్ క్యాంప్ బోజాన్ వద్ద నెత్తురోడుతున్న విద్యార్ధులు.
మామూలు ప్రపంచంలోనికి ఒక్కొక్కరేవిడుదలయి వస్తున్నారు.
యూనియన్లూ, పార్టీలూ లాటిన్ కార్టర్ గుండా ఊరేగింపు తీసుకువెళ్ళడానికి అంగీకరించాయి.