Previous Page Next Page 
సక్స్ స్ పేజి 7


    అతనలా  నవ్వడం నచ్చలేదు ముక్తానందకు.

    "ఇంకా ఒన్ మినిట్ మాత్రమే టైముంది. చెప్పకోండి లేదా ఇంకో టెన్ మినిట్స్  టైమిస్తాను. అప్పడ్తేనా చెప్పకోండి. ఈ లోపల  మనం  చక్కగా  కాఫి తాగుతే, బావుంటుదని ప్రపోజల్" ఆమె చెప్పే జవాబును  ఆశించకుండానే, అతను, తన జీపును ఓ హొటల్లో కి పోనిచ్చాడు.

    ఇంజన్ ఆఫ్ చేసి , దిగుతూ_

    "DONT BELIEVE STRANGERS అన్న విషయాన్నీ ఆలోచిస్తున్నట్టున్నారు ఫరవాలేదు, దిగండి మిమ్మల్ని నా నుంచి, మీ శత్రువుల నుంచి రక్షించే పూచినాది." అదేనవ్వు.....

    "నా శత్రువుల నుంచా" ఆశ్చర్యపోతూ అడిగింది.

    "ఇప్పుడు కాదులెండి. ప్యూచర్ లో నాక్కొంచెం ప్యూచర్ జ్ఞానం  ఎక్కువ. కాలజ్ఞానంలాగా" జీపు దిగమన్నట్టుగా చేతిని  ముందుకు చూపెడుతూ అన్నాడు.

    "నో ధాంక్స్ ...." అంటూ గబుక్కున జిపుదిగి, అతని వెనకే రెస్టారెంట్ లోకి  అడుగు పెట్టింది ముక్తానంద.

    ఎ.సి. రెస్టారెంట్ లో , పామిలి రూమ్ లో  కూర్చున్నరిద్దరూ.

    వచ్చిన బేరర్ టూ కాఫి  ఆర్డర్  తీసుకొని వెళ్ళిపోయాడు....

    అతని మాటలు, హవాబావాలు, చేదిగిపోనీ నవ్వు, ఏదో ఏదో లీలగా కొన్ని సంఘటనల్ని  గుర్తుకు తెస్తున్నాయి. కానీ స్పష్టంగా ఒక ఆకృతి ఏర్పడడంలేదు.

    "ఇతను తనకు బాగా కావలసినవాడు." అన్నా భావం మాత్రం ఆమెలో ఏర్పడింది.

    "మరో క్లూ ఇమ్మంటారా?" అతని మాటకు అప్రయత్నంగా తలూపింది  ముక్తానంద.

    "సముద్రంలోని నీళ్ళు, దూరంగా నుంచి చూస్తే నీలంగా  ఉంటాయి...కానీ దోసిట్లోకి తీసుకుంటే తెల్లగా కనిపిస్తాయి. ఇంతకి.... సముద్రం నీళ్ళు నీలంగా ఎందుకు కనిపిస్తాయి.....?"

    ఆలోచనలో పడింది ముక్తానంద!

    బేరర్ తెచ్చిన కాఫి....వేడిగా పొగలు, కక్కుతోంది.

    "కాఫి తాగి చూడండి. మొత్తం మిస్టరీ అంతా....విడిపోక పోతే...చూడండి...." తన కప్పను చేతుల్లోకి తీసుకొంటు అన్నాడతను. అతని  ముఖం వేపే చూస్తూ__

    కాఫి తాగుతున్న ముక్తానంద  మోములో సడన్ గా వెలుగు....ఒక సంతోషవు అల డికోన్నట్లుగా ఆమె మోములో ఆనందోద్వేగం....ఎ.సి. రెస్టారెంట్ లో  ఆకస్మాత్తుగా ప్రత్యక్షమ్తెన చంద్రబింబంలా అయిపోయింది. ఆ ముఖం.

    జ్ఞాపకాల పొరల్లోపల....ఏదో మెరుపు....కుదుపు....

    కెవ్వున కేకవేస్తున్నట్లుగా___తట్టుకోలేని ఎక్త్సేట్  మెంట్ కి  గురవుతూ___

    "నువ్వు....నువ్వు....యాడర్టి డాగ్ ....నువ్వు...తేజ...వికదూ...సూర్య తేజ....యమ్తే కరెక్ట్?"

    ఆపుకోలేని ఉద్రేకం అది....ఆపుకోలేని ఉల్లాసం అది....నరాలు  తెగి ప్రవహించిన జ్ఞాపకాల  పరంపర అది....

    "హమ్మ....ఇంత  బాధపడితే....అమ్మగారికి....నేను  గుర్తోచ్చానన్నమాట....తను కూడా, మనసారా  నవ్వుతూ అన్నాడు సూర్యతేజ

    కాఫి తాగడం మరిచిపోయి  తదేకంగా  అతని ముఖంవేపే చూస్తోంది ముక్తానంద.

    బాల్యంలోని  స్నేహం, బతుకును పండించే బాంధవ్యం...ఎగురుతున్న సీతాకోక చిలుకల్ని పట్టుకోడానికి పరుగెత్తే ఉరుకు, పరుగులకాలబాల్యం....

    ఆరు  రుతువుల అందమైన కలయికలా మెరిసే వింత ప్రకృతి  బాల్యం...మొజాయాక్ ప్లోరింగ్ మీద, చప్పుడు చెయ్యకుండా పరుగెత్తే వేలాది గోలిల్లా....

    రంగు,రంగు స్వప్నాల అంచుల్ని పట్టుకొని,అస్పష్టపు ఊహల ఆకాశంలో ఎగిరే-

    బంగారు గాలిపటం....బాల్యం ....

    చిత్రమ్తెన ప్రేమకు పునాది బాల్యం  జీవితానికి జీవాన్నిచ్చే జీవగడ్డ బాల్యం ....దుఃఖ     భాజకమ్తెన, సమస్యలమయమ్తెన వర్తమానంలోని సాంద్రతని తేలికపర్చేది బాల్యం....నెమరువేసుకుంటుంటే నెత్తుటి చారికల వర్తమానాన్ని సయితం నేతిలో ముంచేది బాల్యం....కాలపు గుప్పిటలోంచి ఇసుకలా జారిపోయిన బాల్యం .....కళ్ళేదుట నిలిచిన అదృష్ట క్షణాలవీ....

    "భలే గుర్తు పట్టేసారే.....ఎలా గుర్తు పట్టరండి బాబూ...." నవ్వుతూ అడిగి, తన కుడిచేతి మీదున్న  ఆమె కుడిచేతివేపు చూసాడు సూర్యతేజ అంతకుముందే ఆసంకల్పితంగానే అతని చేతిమీద  తన చేతిని  వేసింది  ముక్తానంద. కొన్ని  ఏళ్ళ తర్వాత కలిసిన బాల్యం అది___ అందుకే ఆ "ఎక్సయిట్  మెంట్ " ని  ఎలా దాచుకోవాలో  అర్ధం కావడం  లేదామెకు, చేతిని  వెనక్కి తీసుకుంది సిగ్గుతో.

    "మనం  కల్సుకుని ఎన్నాళ్ళయిందో తెలుసా? పదిహేనేళ్ళయింది.... అందుకే  గుర్తుపట్టలేక పోయాను...అప్పుడు నువ్వు సన్నగా, పిలగా ఉండే వాడివి..... ఇప్పుడెలా  ఉన్నావో తెలుసా....?"

    "ఎలా  ఉన్నాను...?"

    "పోలిసంటే  పోలీసులా ఉన్నావు"

    "అంటే ని ఉద్దేశ్యం....రాతిమనిషిననా...." చిరుకోపాన్ని నటిస్తూ అన్నాడు.

    "నేనలా అన్నానా....అప్పుడు అస్సలు మిసాల్లేవు....ఆడపిల్లలా  ఉండేవాడివి....ఇప్పుడు మిసాలోచ్చేసాయిగా...." తనూ నవ్వుతూ అంది  ముక్తానంద.

    "మగవాడికి మీసం....అందం....మరి ఆడపిల్లకు....?"  ఆర్దోక్తిగా ఆగి, సూటిగా ఆమెవేపు  చూసాడు.

    "రోషం....అందం..." తను పూరించింది ముక్తానంద.

    "అందరికి కాదు___నీకు మాత్రమే, రోషం...అందం...ఎందుకో చెప్పుకో...."

    "నువ్వే చెప్పుబాబూ." 

 Previous Page Next Page