Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 7

    "కొన్ని లక్షల రూపాయల వేదజిల్లా... ఒక అయిదారు నెలల్లో ఆఖరి పైసాతోసాహ చేతికి రాబోతుంది. ఈ కాంట్రాక్ట్స్ లో దాదాపుగా యిరవై లక్షలు లాభిస్తుంది. తర్వాత కాంట్రాక్టులకి శాశ్వతంగా స్వస్తి పలికి మీకు నచ్చనిపని చేస్తే బాగుంటుంది. అప్పటి వరకు ఏ విధమైన తొందర నిర్ణయాలు తీసుకోండి..." అంటూ తన అభిపప్రాయాలు చెప్పాడు వెంకట్రామయ్య.

    ఆలోచనలో పడింది పావని.

    అంతకన్నా వేరే మార్గంకూడా కనిపించలేదు.

    భర్త చేస్తున్నా కాంట్రాక్టుల్ని తానూ పూర్తీచేయాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయం విన్న బంధువులు రకరకాల వ్యాఖ్యానాలతో ఒక్కరొక్కరుగా నిష్కామించారు.

    వెంకట్రామయ్య చాలా నిజాయితీగా ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకొచ్చి చూపించేవాడు.అడపాదడపాఆమెను వర్క్సుస్పాట్ తెసుకేళ్ళేవాడు. ఏ వరకు ఎంతవరకు పూర్తయింది, ఏ బిల్ రాయవలసిందీ ఎంతమిగేలేది వివరంగా చూపించాడు. ఆర్నెల్లలో పూర్తవుతుందనుకున్న కాంట్రాక్ట్ రెండేళ్ళు పట్టింది. ఎప్పటికప్పుడు ఆమెను స్పాట్ కి తీసుకెళుతుండటంవల్ల, ఆమె కళ్ళముందు వర్కు  జాప్యం జరిగినా అతడ్ని ఆ పార్ధం  చేసుకావులేదామే. పైపెచ్చు అతడు రేయింబళ్ళు కష్టపడేది కేవలం జీతపు రాళ్ళాకోసమే కాదని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతోనేనని గ్రహించింది. దానితో అతడిపట్ల అమెకుగల అభిమానం చిగురించింది. ఏ మాటకు ఆమాటగానే చెప్పాలి.... రాఘవయ్యా మరణానంతరం వెంకట్రామయ్య  కాంట్రాక్ట్స్ నిమిత్తం పైసా గూడా ఆమెనుంచి  తీసుకోలేదు. పైపైచ్చు ప్రతి బిల్ వచ్చినప్పుడు లక్ష రూపాయలతో రెండు లక్షలో ఆమె కుటుంభానికి ఇచ్చేవాడు.

    ఇక్కడే తెలివిగల పనిచేశాడు వెంకట్రామయ్య. పైసాకు ఫిసాకు ఆదాయ వ్యయాలు ఆమెకు లెక్కచెప్పేవాడు ఆమెకోసం తన జీతం నుంచి చక్కని కానుకలు తెచ్చియిచ్చేవాడు ఆమె ధరించే చెప్పుల దగ్గర్నుంచి ఇలా పేస్  వరకు ఆ కానుకలలో చోటు చ్చేసుకునేవి... చీరల సంగతి సరేసరి!

    "మీరు గమనించారో లేదో... మీ కళ్ళక్రింద ఈ మధ్యనల్లని చారికలు ఏర్పడుతున్నాయి. ఇదిగో ఈ క్రీమ్ వాడండి... మార్కెట్ లోకి కొత్తగా వచ్చింది." అని ఓసారి....

    "బెంగుళూరు వెళ్ళినప్పుడు ఏమీ తోచక హొటల్ కారిడార్  లో తిరుగుతుంటే శారీ షోరూమ్ కనిపించింది. ఈ చీర మీకు బాగుంటుందనిపించింది. మీకోసం కొన్నాను" అంటూ మరోసారి... ఇలా రక రకాల బహుమతులు  ఆమెకు అందజేసేవాడు!

    ఒంటరి ఆడది...

    అందునా విధవరాలు....

    పైపెచ్చు వయస్సులో వున్నది.

    అంతకన్నా ఇంకేం కావాలి?

    ఆమె హృదయం వీనను ఎక్కడ మీటాలో అక్కడ మీటేవాడు.

    ఇంతకు మించిన విషయం మరొకటుంది.

    అతనేన్నడూ తన హద్దులు మీరేవాడుకాదు. ఆమె తన యజమానురాలన్న భావం తన చేతులతో చూపించేవాడు.

    కాంట్రాక్టుల పని మీద అడపాదడపా రాజధానికి వెళ్ళవలసిన వచ్చేది ఆమెను వెంటబెట్టుకుని, ఆమెకు రైలులో ఫస్ట్ క్లాసు టికెట్ కొని తానూ మాత్రం సెకండ్ క్లాసులో ప్రయాణం చేసేవాడు. ఆమె కోసం హొటల్ లో ఏ.సిరూమ్ తీసేవాడు. తనకు సింగల్ రూమ్స్ దొరకని పక్షంలో రాత్రివేళ బయట సోఫాలో పడుకునేవాడేగానీ పొరపాటున కూడా ఆమె రూమ్ లో ఎక్సట్రా బెడ్ వేయించేవాడుకాదు.

    ఆ స్థితిలో ఏ మగాడి చిట్టా శుద్ధినయినా ఏ ఆడది శకించగలదు?

    భర్త వున్నంతకాలం ఆకుచాటు పిందెలా కాలం గడిపిన ఆమె ఇప్పుడు తనకు తెలియని మరో ప్రపంచాన్ని చూస్తోంది. వెంకట్రామయ్య సాయంతో కంట్రాక్టల్నీ స్వయంగా పర్యవేక్షిస్తోంది. సంపాదిస్తోంది. రాఘవయ్య ప్రారంభించిన ఆ బారీ కాంట్రాక్ట్ దాదాపుగా పూర్తయింది.

    ప్లేయి ఓవర్ బ్రిడ్జీ ప్రారంభోత్సవం దగ్గర పడుతుంటే వెంకట్రామయ్య రెట్టింపు ఉత్సాహంతో కనిపించసాగాడు. ప్రారంభోత్సవంనాడు దినపత్రికలన్నిట్లో స్వర్గీయ రాఘవయ్య ఫోటోవేసి పావనిపేరున, సిబ్బంది పేరున స్మృత్యంజలి ఘటిస్తూ ప్రకటనలిచ్చాడు. వర్కర్లందరికీ పావని చేతులమీదుగా నూతనవస్రాలు పంపిణీచేశాడు, సప్లయిర్స్ కి స్వీట్స్ పంపించాడు. అధికార ప్రముఖులకి వారివారి స్థాయి అనుగుణంగా బహుమతులు పంపాడు.

    బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖుల ప్రసంగాలలో రాఘవయ్య పేరుతోపాటు పావని పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సభలో పాల్గొన్న పావనికి పులకింత!

    అప్పుడు అర్దమయింది ఆమెకి__ తమ సంస్థకొచ్చిన గుర్తింపు గౌరవం. రాఘవయ్య మరణానంతరం అన్ని విధాల చితికి పోవాల్సిన తమ సంస్థ అన్ని విధాల ఉచ్చదశకు రావడానికి కారకుడు వెంకట్రామయ్య. అ కన్స్రక్షన్ లో పనిచేసిన ప్రతివారికీ ఏదో ఒక బహుమతి ముట్టింది వెంకట్రామయ్యకి తప్ప! కేవలం జీతపురాళ్ళు తీసుకుని రేయనక పగలనక కష్టపడి పనిచేశాడు. పై పెచ్చు జీతంనుంచే తన కోసం ఎంతో కొంత ఖర్చు చేసేవాడు__ రాఘవయ్య ఎన్నడూ భార్యా బిడ్డలకోసం తన చేతుల మీదుగా కానుకలు తెచ్చేవాడు కాదు, డబ్బిచ్చే వాడుకాదు.

    అటువంటి వెంకట్రామయ్యకి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అన్నది నిర్ణయించుకుంది. వెంకట్రామయ్యని డిన్నర్ కి ఆహ్వానించింది.

    డిన్నర్ కి ఉత్తచేతుల్తో రాలేదు వెంకట్రామయ్య వస్తూ వస్తూ చిన్న పొట్లాం, ఒక ప్యాకెట్ తెచ్చాడు. "కొండంత దేవతకి ఓ నూలిఫోగు...." అంటూ ముందుగా ప్యాకెట్ విప్పి షాల్ బయటకు తీశాడు. ఆ రైజున వేదికపై ముఖ్యమంత్రి గారు మీకు షాల్ కప్పారు. ఈ రోజున నా చేతులమీదుగా మీకు ఈ షాల్ కప్పుబోతున్నాను. అబ్యంతరంమా? ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అడిగాడు. కాదనలేదామే! అదే అంగీకారంగా తీసుకుని షాల్ కప్పాడు. పొట్లాం విప్పాడు. మల్లె పూదండ. "ఈ మల్లెల్ని మీసిగలో ముడుచుకోండి..." అంటూ చేతికి అందించాడు.

    ఆ దండను కూడా అతడు తన సిగలో ముదిస్తే బాగుణ్నునుకుంది. కాని అతడా పనిచేయలేదు.

    "కూర్చోండి...." అంటూ సోఫా చూపించి లోపలకి వెళ్ళి హాట్ ప్యాక్ లో వుంచిన సూప్ తీసుకొచ్చి ఇచ్చింది.

    సూప్ తాగుతూ అన్నాడతను____ "ఈ రోజున రాఘవయ్య గారుంటే ఈ సంస్థని ఇంకా ఎంతగా అభివృద్ధి చేసేవారో__ ఈ రోజున ఈ ఫారం కి చక్కని గుర్తింపు, గౌరవం లభించాయి. గుడ్ విల్స్ చాలా బాగా క్యాష్ చేసుకోవచ్చు ___"

    "అవును. కాని, పోయిన అయన తిరిగారారు కదా..."

    "సారీ, మిమ్మల్నీ బాధపెట్టాను___" కావాలనే అన్నాడు వెంకట్రామయ్య, వాస్తవానికి పావని రాఘవయ్యా తాలూకు ఆలోచనల్తోగాని, ఆవేదనతోగాని లేదని తెలిసినా!

    "అవును. నిజంగా నన్నెంతవరకూ మీరు బాధపెట్టారు" అన్నది పావని.

    ఊహించని ఈ సమాధానంతో నివ్వెరబోవడం ఈ పర్యాయం వెంకట్రామయ్య వంతయింది.

    "నిజం చెప్పండి__

    అయన పోయిన తర్వాత మొత్తం భారం మీ మీద వేసుకుని చేహారు. మొదట్లో నేనూ అనుకునేదాన్ని. చాలా లాభాల్లో కాంట్రాక్టుల నడుస్తున్నాయని! కాని, మీరు టేకప్ చేసేరోజుకి కంపెనీకి చాలా అప్పులున్నాయి. అటువంటి కంపెనికీ లాభాలు సంపాదించి పెట్టారు. భర్తగా రాఘవయ్యాగారులేని లోటు మినహా ఇతరత్రానాకే ఇబ్బంది రాకుండా చూశారు కాని బాబునిఎప్పుడయినా, కనీసం పొరపాట్నాయినా దగ్గరకు తీశారా? ఈ ఇంటికి మీరు పరాయివారు  కారే..."

 Previous Page Next Page