మృదువని ఎక్కడికి వెళ్ళినట్టు?
***
"మిస్ శరణ్య... మీరు మైడ్రాన్ అపార్ట్ మెంట్స్ లో ఎప్పటి నుంచి ఉంటుంన్నారు?"
"సంవత్సరం నుంచి"
"మీ ఫాదర్ పేరేంటి?"
వాళ్లవంక చూసి చెప్పింది.
"హ..ర్ష...వ..ర్ద..న...రా...వు.."
డిఫెన్స్ చీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
"యస్ హర్షవర్దన్ ఈజ్ మై డాడ్... అమెరికాలో ఉన్న భారతీయ రాయబారి హర్షవర్దనరావు..." చెప్పింది శరణ్య
***
డిఫెన్స్ చీప్ కొద్ది క్షణాల వరకూ కోలుకోలేక పోయాడు.
ప్రధానమంత్రి అతి సన్నిహితుడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు వున్న వ్యక్తి. ఎన్నో దేశాల్లో రాయబారిగా పనిచేసిన వ్యక్తి హర్షవర్దనరావు కూతురు శరణ్య అని తెలియడంతో ఏం చేయాలో పాలుపోలేదు.
డిఫెన్స్ అధికారులతో తన చాంభార్ లో చర్చించి, శరణ్య దగ్గరికి వచ్చాడు చీఫ్.
"సారీ మిస్ శరణ్యా... మీకు ట్రబుల్ ఇవ్వక తప్పలేదు. మ ప్రాబ్లంమాది..ఎనీవే..మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మీ సాయం మాక్కావాలి... ఈ విషయాన్ని నాన్నగారి వరకూ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు" చాలా కన్విన్స్ గా చెప్పాడు చీఫ్.
నవ్వొచ్చింది శరణ్యకు తన పిన్సియార్టీ, నిజాయితీ కాకుండా, తండ్రి పడవే తనకీ గౌరవం తెచ్చి పెట్టింది. శరణ్య లేచి బయటకి వచ్చింది.
"మా కారులో డ్రాఫ్ చేస్తాం..." చెప్పి, క్షణాల్లో కారుని ఆరెంజ్ చేశాడు చీఫ్
***
కారులో తన ప్లేటుకు బయల్దేరుతుందో, నవ్వూ, భయమా, రెండూ ఏకకాలంలో కలిగాయి. తను అమెరికాలో ఉన్న భారత రాయభారి హర్షవర్దనరావు కూతురు అని చెప్పినప్పుడు చీప్ మొహంలో కనిపించిన తత్తరపాటు, కంగారు, భయం చూసి నవ్వొస్తే, తాను హర్షవర్దన్ రావు కూతురు కాదన్న విషయం చీఫ్ కు తెలిస్తే ఏమవుతుందోనన్న భయమా కాలిగాయి. తాత్కాలికంగా ఈ గండం నుంచి బయటపడ్డానికి, హర్షవర్దనరావు పేరును అనాలోచితంగా చెప్పేసింది.
సంవత్సరం క్రితం అమెరికాలో తను చేసిన స్టేజ్ షో చూసి, అప్రిషియేట్ చేసి,ఎప్పుడే అనవసరం వచ్చినా తనని కాంటాక్ట్ చేయమని చెప్పాడు.అతనికి పిల్లల్లేరు. తనలోనే అతను బిడ్డను చూసుకున్నాడు. ఆ విజిటింగ్ కార్డు వాళ్ళకి కనిపించింది. తను హర్షవర్దనరావు కూతురు అని చెప్పడంతో నమ్మారు. కానీ రెపీ నిజం వాళ్ళకు తెలిస్తే...?
ఈ లోగా తనే అమెరికా ఫోన్ చేసి హర్షవర్దనరావుగారికి మొత్తం విషయం చెప్పి, అతని సాయం తీసుకుంటే మంచిది... మానుకుంది శరణ్యా.
కారు అపార్ట్ మెంట్ ముందాగింది.శరణ్యా కారు దిగి,తన ప్లాటు వైపు నడిచింది.
సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది.
***
తలుపు తీసి, లోపలికి వెళ్ళి రిసీవర్ తీసుకుంది శరణ్య.
"హలో... నేను మృదువనిని...." అటువైపు నుంచి వినిపించింది.
"మృదువనీ... నువ్వా.. ఎక్కడ్నుంచి... ఏమిటిదంతా... నీ గురించి పోలీసులు వెతకదమేమిటి? అసలేమైంది? నువ్వెక్కడున్నావు..." శరణ్యా అందోళనగా అడిగింది.
"ష్... మెల్లిగా... నీ ఫోన్ ని వాళ్ళు టాప్ చేస్తారేమో..." అటువైపు నుంచి మృదువని అందోళనగా అంది.
"అల్ రైట్... నేను మరో నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్ కు ఫోన్ చెయ్. అదీ అరగంట తర్వాత..." అంటూ తనకు తెలిసిన ఓ టెలీఫోన్ నెంబర్ ఇచ్చింది శరణ్య.
ఆ తర్వాత ఫోన్ పెట్టేసి, బయటకు నడిచింది. దగ్గర్లో వున్న టెలిఫోన్ బూత్ దగ్గరకి వెళ్ళింది. ఓ నెంబర్ డయల్ చేసింది. అటువైపు నుంచి డయల్ టోన్ వినిపించగానే తన చేతిలో వున్న కాయిన్ బాక్స్ లో వేసింది.
"నేను శరణ్యా ను మాట్లాడుతున్నాను. మిస్టర్ జేమ్స్ ఉన్నారా?"
"జేమ్స్ ది నైట్ షిప్ట్ కదా... వాన్ సెకన్. ఇప్పుడే అందరూ బయటకి వెళ్ళారు..." అంటూ రిసీవర్ పక్కన పెట్టాడు అవతలి వ్యక్తి. సరిగ్గా వన్ మినిట్ తర్వాత....
"హాలో జేమ్స్... నేను శరణ్యను మాట్లాడుతున్నాను. నాకో అర్జంట్ ఫేపర్..."
"ఏమిటది... మీ స్టేజ్ ప్రోగ్రామ్ కు కుర్చీలు ఏమైనా కావాలా?" అటువైపు నుంచి జేమ్స్ సరదాగా అడిగాడు.
"జోక్స్ తర్వాత జేమ్స్. ఆయామ్ వెరీ సీరియస్... నా ఫోన్ ని ఎవరైనా టాప్ చేస్తున్నారేమో తెలుసుకోగలమా?"
"వాట్... నీ ఫోన్ ను టాప్ చేయటమా? నువ్వేమైనా పావులితీషియన్ వా? లేడీ దావూద్ ఇబ్రహీంవా? నీ ఫోన్ ఎవరు టాప్ చేస్తారు... పొద్దున్నే నిద్రమత్తా? హేంగోవరా?"
"జేమ్స్... చెప్పావా... బీ సీరియస్... వెంటనే కనుక్కోగలవా?"
"ఒక్కపది నిమిషాల్లో కనుక్కుంటారు.... ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను."
"వద్దొద్దు... నేనే నీకు ఫోన్ చేస్తాను... సరిగ్గా పది నిమిషాల తర్వాత..." అంటూ ఫోన్ పెట్టేసింది శరణ్య.
ఈ పది నిమిషాలు చాలా రెస్ట్ లెస్ గా ఉంది. సరిగ్గా పదకొండవ నిముషం జేమ్స్ కు ఫోన్ చేసింది.
"నేనే శరణ్యా... అలాంటి దేమీ లేదు."
"ఆర్యూ ష్యూర్..."
"ష్యూర్.... అయినా ఊర్కే ఎవరి ఫోన్ పడితే వల్ల ఫోన్ చేయడానికి గవర్నమెంటుకు ఎ పనీ లేదని అనికున్నావా? అయినా నీకిలాంటి డౌట్ ఎందుకు వచ్చింది?"
"ఎందుకంటే... రాత్రి నన్ను డిఫెన్స్ వాళ్ళు అరెస్ట్ తీసుకువెళ్ళారు." అటువైపు జేమ్స్ అదిరిపడ్డాడు.
"ఎనీ సీరియస్ మేటర్... ఏమైందసలు... నిన్ను డిఫెన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడమేమిటి?"
"అదంతా తర్వాత చెబుతాను గానీ, నా ఫోన్ టాప్ అవుతుందా? లేదా? అన్నా విషయం ఎప్పటికప్పుడు కాస్త గమనిస్తూవుండు.... అన్నట్టు నా ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయకు... నేనే బయట్నుంచి నీకు ఫోన్ చేస్తూ వుంటాను. మనం సాయత్రం కలుద్దాం... బై..." అంటూ ఫోన్ ఫోన్ పెట్టేసింది.