Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 7

    తన దృష్టిని పరిశోధనల మెడ కేంద్రీకరించాలి. ఊహూ... వద్దు... దీని కన్నా ముందు విశాలీ ఓదార్చాలి... అతనో నిర్ణయానికి వచ్చి లేచి భార్య వున్న పూజ గదివైపు అడుగులు వేశాడు.
                                                                        ***
    భర్త అడుగుల శబ్దం విని, పూజగదిలో మోకాళ్ళ మధ్య తల పెట్టి ఏడుస్తున్నా విశాలి తలెత్తింది.
    నెల మీద కూర్చున్నాడు భరద్వాజ.
    "విశాలీ...! నన్ను క్షమించు" అన్నా పదాలతో నీ కడుపు కోతకు ఊరడింపు లభించదు. మన మొదటి రాత్రి నువ్వో మాటన్నావు గుర్తుందా? మనకు పిల్లలు పుట్టకపోతే... ఎలా? అని నేను సరదాగా అడిగిన ప్రశ్నకు నువ్విచ్చిన సమాధానం ఏమిటో తెలుసా... నా కింకా గుర్తుంది విశాలీ..."
    "నాకు ఆల్రెడి ఓ బిడ్డ వున్నాడుగా..." అన్నావు. ఆ బిడ్డని నేనే అన్నావు... అప్పుడు చెమర్చిన కన్నీటి చెమ్మా యింకా పదిలంగా నా గుండె గదిలోనే వుంది. చిన్నప్పుడు అమ్మకు దూరమయ్యాను. ఇప్పుడు బిడ్డకు దూరమయ్యాను. నిన్నూ, నీ బిడ్డకు దూరం చేశాను. అందుకు నివ్వేశిక్ష విధించినా స్వీకరించాడనికి సిద్దంగా ఉన్నాను..." అతను ఆమె ఓడిలో తల పెట్టి మాట్లాడాసాగాడు.
    అప్పుడు వర్షించింది ఆమె కంటి ఆకాశంలో నుండి కన్నీటి మేఘాలు కుమ్భావ్రుష్టియి...
    మెల్లిగా కళ్ళు తుడుచుకుని వంగి భర్త నుడురును చుంభించింది. ఆమె మనసు అర్దమైంది. తన బాధ చూడలేక తల్లడిల్లుతొన్న భర్త మనసు అవగతమైంది విశీలికి!
    "ఏవండి... దూరమైనా బిడ్డా మీద మమకారమే తప్పా, మీ మీద ద్వేషంలేదు, తల్లి ప్రేమతో, మీ భర్త మనసును అనుమానించాను. జరిగిపోయిన విషాదం వదిలేయండి. మీలోని సైంసిస్ట్ నిద్రలేపండి. మళ్ళా  పరిశోధన లకు ఉపక్రమించండి..." అంది విశీలి మనస్పూర్తిగా.
    అతని మనసులో చిత్రమైన, అద్బుతమైన స్పందన, భర్త మనసేరిగే భార్య దొరకడం కన్నా ఆ మేధావికి మరో గొప్పా విజయం ఏముంటుంది? 
                                              ***
    "విశాలీ...! నా లోని సైంసిస్ట్ భరద్వాజ ను కన్నకొడుకుతోపాటే పాతిపెట్టీశాను..."
    "శుక్రవారం పూట అవేంమాటలండీ..." అంది నొచ్చుకుంటూ విశాలి.
    "నిజం విశాలీ...! నేను సైంసిస్ట్ ని కాకపోయుంటే, నా కన్నా కొడుక్కివున్న 'కన్ను' ని చూసి ఏదోసృష్టివిచిత్రం అని సరిపేట్టుకునేవాడిని.
    నేను సైంసిస్ట్ ని కాకపోయుంటే, నా వెంట ఆ కరంజయా పడేవాడుకాదు. ప్రాణభయంతో మనం పారిపోయేవాళ్ళం కాదు. అనుక్షణం భయం గుప్పిట్లో బ్రతకటానికి కారణం నా వృత్తే.
    ఇన్నాళ్ళూ నా కిష్టమైన వృత్తి కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. నా ప్రయోగాలు... నా పరిశోధనలు... ఇవే నా ప్రపంచంగా బ్రతికాను. చివరకు కానేసం బిడ్డను చూసుకుని బ్రతికే అవకాశం కూడా నీకివ్వలేదు.
    దేశం కోసం ఎన్నో పరిశోధనలు చేయాలనుకున్నాను. ఈ విషయమే  గుర్తుచడం లేదు. యిది ఈ ప్రభుత్వాన్ని నిందించటం కోసం కాదు. నాకు నేను ఆత్మ విమర్శ చేసుకుని, ఓ నిర్ణయం తీసుకోవాడానికి అంటోన్నా మాటలు.
    నీకు బాధాకరమైన మరో సిరీజయన్ చేయాల్సి వచ్చినప్పుడు... డాక్టర్ చెప్పిన మరో షాక్ న్యూస్ ఏమిటో తెలుసా... నీకు... నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. భవిషత్తు లో మనం అమ్మా నాన్నలం కాలేము..."
    ఒక శరాఘాతం హృదయానికి తగిలినట్టు...
    ఒక విద్వంసం గుండెలో వేనవేల ప్రకంపనాలు సృష్టించినట్టు...
    భర్తవైపు విషణ్ణవదనంతో చూసింది విశాలి.
    "అందుకే విశాలీ... యిక నుంచి నేనే నీ బిడ్డను అనుకో... ఓ మామూలు భర్తగా నీతో గడుపుతాను. ప్రభుత్వం గుర్తించని ఈ సైంసిస్ట్ వృత్తి నా కొద్దు నివ్వూ, నేనూ...
    ఏ చిన్నా ఉద్యోగమో చూసుకుంటాను. ఇది నా నిర్ణయం... తిరుగులేని నిర్ణయం..."
    భర్తవైపు విస్మయంగా చూసింది.
    పరిసోధనే ప్రపంచంగా బ్రతికిన ఆ వ్యక్తి...
    ల్యాబ్ కు తాళం వేశాడు. అది ఎటువంటి పరిస్తితుల్లోనూ తెరవకూడదనుకున్నాడు.
    భర్తను ఓదార్చే ప్రయత్నంలో, కన్నా తీపి కోతను దిగమింగుకుంది. కానీ పాతికేళ్ళ తర్వాత, మళ్ళీ ఇదే సమస్య ఆ ఇంటిని వెనవేలల ప్రకంపనలను సృష్టిస్తుందని వూహించలేదు విశాలి.
                                              ***
    న్యూఢిల్లీ...
    కన్నాట్ ప్లేస్
     మెయిన్ సర్కిల్ లో ఓ ఖరీదైన బిల్డింగ్ లోకి కారు ఎంటరయింది.

    మెయిన్ గేటు దగ్గర సెంట్రీ కారు ఆపాడు.

    "పాస్ వర్డ్ ప్లీజ్.." అడిగాడా సెంట్రీ.
    "ఫిన్ ఫోర్ టు త్రీ..." చెప్పాడు డ్రైవర్.
    గేటు తెరిచాడు సెంట్రీ.
    కారు లోపలకి వెళ్ళగానే గేటు మూసుకుంది.
    ఆ ప్రహరీలో కొంతమంది అయూధాలతో కాపాలా కాస్తున్నారని బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.
    బ్లాక్ డ్రెస్ లో వున్నరంతా.
    కారు ఆగగానే డ్రైవర్ వచ్చి బ్యాక్ డోర్ తీశాడు. కారులో నుంచి దిగాడు కరంజయా. అతనితోపాటే లల్లూరామ్.
    ఇద్దర్నీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకి తీసుకువెళ్ళిమెటల్ డిక్టేటర్ దగ్గర నిలబెట్టారు సేక్యూరీటి వాళ్ళని చెక్ చేసి, వాళ్ళిద్దరి దగ్గరా ఆయుధాలు లేవని కన్ ఫార్మ్ చేసుకుని లోపలకి పంపించారు.
                                               ***
    "వేల్ కమ్ ప్రెండ్ వేల్ కమ్" రివాల్వింగ్ చెయిర్ లో గిర్రున తిరుగుతోన్న ఖాన్ ఆగి అన్నాడు.
    "ఖాన్ సాబ్... ప్రైమినిష్టర్ దగ్గర కూడా ఇంత టైట్ సేక్యూరీటి లేదు. అయినా మేము నీ దోస్త్ లం... మాక్కూడా ఈ ఫార్మాలటీ స్ అవసరమా?" వస్తూనే అడిగాడు కరంజయా.

 Previous Page Next Page