Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 8


                                  తెలుగు నవల
    'ఛీరేస్తాన్' రచయిత నెత్తురు కసాయిరావ్.(ఆంధ్రుల అభిమాన, ఆరాధ్య రచయిత నెత్తురు కసాయిరావ్ నవల ఈ వారం నుండే ప్రారంభిస్తున్నాం. పాఠకులూ...ఈ కరుడుగట్టిన కసాయ్ సిరియల్, ఎక్సయిటింగ్ సీరియల్,సెక్సయిటింగ్ సీరియల్, హింసాత్మక పాషాణ సీరియల్ కోసం కళ్ళని పత్తికాయలు చేస్కుని ఇన్నాళ్లూ పిచ్చిగా ఎదురుచూశారుగా...ఇక చదవండి...చదివి నెత్తిబాదుకు ఏడ్వండి... మీ ఎడిటర్)
            1వ వారం
    మందాకిని పరుగుతీస్తుంది...
    ఆమె శరీరం చెమటతో తడిచిపోతూంది.ఎండిన పుల్లలు ఆమె పాదాలకింద పడి చిటుకు చిటుకుమని శబ్దం చేస్తున్నాయ్. మందాకిని పాదాలు చిట్లి రక్తం స్రవిస్తుంది.
    అలా పరుగుతీయడంతో ఆమె చీర జారిపోయి ఎక్కడో పడిపోయింది.
    ప్రస్తుతం ఆమె లంగా,జాకెట్ తో  పరుగుతీస్తుంది(అమె లంగా జాకెట్ తో పరుగుతీయడం మననులో ఊహించుకుని పాఠకులు లొట్టలు వేస్తారని నాకు తెల్సు-రచయిత).
    ఒకసారి వెనక్కి తిరిగిచూసింది. వాళ్లు నలుగురూ రానురాను దగ్గరికి వచ్చేస్తున్నారు.
    హఠాత్తుగా ఒక రాయికి తట్టుకుని మందాకిని కిందపడిపోయి కస్తాదూరం దొర్లింది. ఆమె శరీరం మొత్తం గీసుకుపోయి నెత్తురు స్రవించసాగింది.
    మూలుగుతూ లేవబోయిన మందాకిని చూసింది...
    ఆ నలుగురు దుర్మార్గులూ మందాకిని చుట్టూ మూగిపోయి ఉన్నారు.వాళ్లు కోర్కెలతో బుసలు కొడ్తూ ఆమె మీదికి వంగారు.
    అప్పుడు భయంతో ఆమె పెట్టిన కేకతో ఆ ప్రదేశం మారుమ్రోగింది.
            2వ వారం  
    'ధన్'మని పెద్ద శబ్దం అయ్యింది.
    భయంతో కళ్లుమూస్కుని ఉన్న మందాకిని ఆ శబ్దం విని కళ్లు తెరిచింది.
    నలుగురిలో ఒక రౌడి దూరంగా నేలమీద పడి ఉన్నాడు.అతని నోటినుండి రక్తం కారుతూ ఉంది.వాళ్లకి ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా ప్రభంజన్ ఉన్నాడు.
    "ఒక ఆడపిల్లని నిస్సహాయురాల్ని, ఒంటరిదాన్నీ చేసి ఆమె శీలాన్ని దోచుకోవాలని అనుకుంటార్రా...మిమ్మల్ని ఏంచేస్తానో చూడండి"రౌద్రంగా చూస్తూ అరిచాడు ప్రభంజన్.
    సరిగ్గా అదే సమయంలో వాళ్ల నలుగురిలో ఒకడు బుర్రగోక్కున్నాడు.
    వాడలా బుర్ర గోక్కుంటే చూసి ఉలిక్కిపడ్డాడు ప్రభంజన్.
    అతని కళ్లముందు గతం అంతా సినిమా రీలులా తిరిగింది.
    "అమ్మా" అంటూ ఆర్తనాదం చేశాడు ప్రభంజన్.
 
            3వ వారం
    "ఏంట్రా నాయనా గుండెలదిరిపోయేలా ఇట్టా అరిచాడు!" అనుకున్నారు వాళ్లు నలుగురు.
    గతాన్ని అంత ఓసారి తలుచుకున్నాక రెండో వ్యక్తి వంక చూశాడు.
    రెండో వ్యక్తి ముక్కులో వేలు పెట్టి గిరగిరా తిప్పాడు.ప్రభంజన్ మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. వీడుకూడా వాడే... తన చిన్నతనంలో...తనకి ఆరేళ్ల వయసప్పుడు...
    "అమ్మా!..."మరోసారి ఆర్తనాదం చేసి ముడోవ్యక్తి వంకా,నాలుగో వ్యక్తి వంకా చూశాడు.
    మూడోవ్యక్తి జేబులోంచి పుల్లతీసి పళ్లుకుట్టుకున్నాడు.నాలుగోవ్యక్తి చెవిలో చిటికెనవేలు పెట్టి తిప్పసాగాడు.
    ప్రభంజన్ ఉలిక్కిపడి"అమ్మా...అమ్మా..."అంటూ రెండుసార్లు ఆర్తనాదం చేశాడు.
    'వీళ్లు నలుగురూ వాళ్లే!...అనుకున్నాడు. అతని కళ్లు అగ్నిగోళాలయ్యాయ్.
    "ఒరేయ్...ఇరవైఏళ్ల క్రితం గుర్తుందిరా?... మీరు ఎంత అన్యాయం చేశారో!!..."గట్టిగా అరిచాడు.
    "ఇరవైఏళ్ల క్రితమా?...ఏం చేశాం?" అన్నాడు అందులో ఒకడు.
    "మా అమ్మని మీరు నలుగురూ కలిసి రేప్ చేశారు...అయితే మీరు నలుగురూ ఇంకా ఈ రేపులు చేసే బిజినెస్ మాన్లేదన్నమాట!!" పళ్లునూర్తూ అన్నాడు ప్రభంజన్.
    "మీ అమ్మనా?...ఎవరు మీ అమ్మ?"
    "జానకి!" జవాబు చెప్పాడు ప్రభంజన్.
    అంతే ...నలుగురూ ఒక్కసారిగా ప్రభంజన్ మీదపడి అతన్ని కిందపడేశారు.ఒకడు ప్రభంజన్ వీపుమీదా కూర్చున్నాడు. మరొకడు అతని చేతులు నొక్కిపడ్తే ఇంకొకడు కాళ్లునొక్కి పట్టాడు. నాలుగోవాడు ప్రభంజన్ పంట్లాన్ని పట్టి కాస్త కిందికిలాగి చూశాడు.
    అతని కళ్లు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయ్. అంతలోనే భయంకరంగా గావుకేకపెట్టాడు.
            4వ వారం
    "ఉందా?..." ఆతృతగా అడిగారు మిగతా ముగ్గురూ.
    "ఉంది... వీడి పిర్రమీదా కుంకుడుగింజంత పుట్టుమచ్చ ఉంది"చెప్పాడు నాలుగోవ్యక్తి.
    "ఎడమ పిర్రా కుడిపిర్రా?"
    "కుడి పిర్రే!" చెప్పాడు నాలుగోవాడు.
    అది విన్న మిగతా ముగ్గురు కూడా గావుకేకపెట్టారు.
    "అయితే వీడు నిస్సందేహంగా జానకికొడుకే!మనమీద ప్రతీకారం తీర్చుకుంటాడు..."
    ఇలా అనుకుని ప్రభంజన్ ని వదిలిపెట్టి ఆ నలుగురూ పరుగుతీశారు.
    ప్రభంజన్ మందాకిని చేయిపట్టుకుని"మీరు కూడా రండి"అని ఆమెతోబాటు వాళ్లవెంట పడ్డాడు.
    కొంతదూరం పరుగెత్తిన తరువాత వాళ్లు నలుగురూ ఒక జీప్ ఎక్కారు. జీపు రివ్వున ముందుకు కదిలింది.అక్కడే ఒక మోటార్ సైకిల్ ఉంటే దానిమీద ప్రభంజన్ మందాకినీ కూర్చుని వారిని వెంబడించారు.
    ఒక రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర జీపుదాటి వెళ్లిపోయిన తరువాత రైల్వేగేటు పడిపోయింది.
    ప్రభంజన్ పిడికిలి బిగించి మోటార్ సైకిలు పెట్రోలు ట్యాంక్ మీద కసిగా గుద్దేడు.
            5వ వారం
    మందాకిని కళ్లనుండి ధారాపాతంగా అశ్రువులు కార్తున్నాయ్. ఆమె అప్పడే ప్రభంజన్ చెప్పిన హృదయవిదారకమైన అతని గాధని అతను చెప్తుండగా తెలుసుకుంటూ ఉంది.
    ప్రభంజన్ తన కళ్లనుండి రక్తాశ్రువులు స్రవిస్తూ ఉండగా చెప్పసాగాడు.
    "అలా మా అమ్మ జానకిని నలుగురూ కలిసి రేప్ చేసిన తరువాత ఆమెని చంపేసి ఆ హత్యానేరాన్ని మా నాన్నగారి మీదకు తోసేసారు ఆ దుర్మార్గులు... చట్టానికి చెవులేగానీ కళ్లుండవు మందా!...అందుచేత మానాన్నకి ఉరిశిక్షపడింది... నేను అనాథనయ్యాను"
    చెప్పడం ముగించాడు ప్రభంజన్.
    అతని కళ్లనుండి ధారాపాతంగా కన్నీళ్లు కార్తున్నాయ్.
    మందాకిని చీరచెంగుతో అతని కన్నీళ్లు తుడవాలని అనుకుందిగానీ తీరా చూస్కుంటే తన ఒంటిమీద చీరలేదు. ఆమె లంగా,జాకెట్టుతోనే ఉంది.
    అతని కన్నీళ్లు కూడా తుడిచేందుకు వీలులేని తన దుస్థితికి ఆమెకి దుఃఖం వచ్చింది.
    ప్రభంజన్ తలని రెండు చేతుల్తో లాక్కుని తన గుండెలకి అదుముకుంది.
    తన మొహాన్ని ఆమె గుండెలకేసి రాసి కన్నీళ్లు చెరిపేస్తున్నాడు ప్రభంజన్.కానీ అలా చెయ్యడం వల్ల అతనిలో ఉద్రేకం చెలరేగింది.
    ఆమెని అమాంతం ఎత్తి గడ్డిలో వెల్లకిలా పడేశాడు. అలా పడడంలో మందాకిని లంగా పైదాకా చెదిరిపోయింది. ఆమె వంక కాంక్షతో చూసిన ప్రభంజన్ ఆమె మీదపడి... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... (ఛీ... ఛీ... ఇక్కడ నేనిహ రాయలేను బాబూ-మల్లిక్)
            6వ వారం
    "ఊ... " పాప దీనంగా మూలిగింది.
    మందాకిని ఓ పట్టుపట్టిన హుషారులో విజిలేస్కుంటూ అప్పడే ఇంటికి వచ్చిన ప్రభంజన్ పాప మూలుగివిని ఠకీమని హాలు మధ్యలో ఆగిపోయాడు.
    ఓ పక్కగా వదిన అన్నపూర్ణ నిలబడి చెంగుతో కళ్లొత్తుకుంటూ  ఉంది.
    "పాపెందుకు మూలుగుతుంది వదినా? నువ్వెందుకు ఏడుస్తున్నావ్" వదినని అడిగాడు ప్రభంజన్.
    అప్పుడు అన్నపూర్ణ చెప్పింది విని ప్రక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు ప్రభంజన్.
            7వ వారం
    అర్ధరాత్రి పన్నెండు గంటలైంది.
    అది స్మశానం.ఆ స్మశానంలో ఒంటరిగా నడుస్తున్నాడు ప్రభంజన్ జంకూ గొంకూ లేకుండా. అతని కళ్లకిందపడి పుర్రెలు ఫటఫట చిట్లుతున్నాయ్. స్మశానంలో చితిమంటలు అక్కడక్కడా మెల్లమెల్లగా మండుతున్నాయ్. నక్కలు పాతిపెట్టిన శవాలని వెలికిలాగి పీక్కుతింటున్నాయ్.
    స్మశానం మధ్యలో ముగ్గువేస్కుని దానిమీద కూర్చుని మాంత్రికుడు మహమ్మద్ పీరా మంత్రాలు చదువుతున్నాడు. అతన్ని చూస్తూనే ప్రభంజన్ కళ్లు అగ్నిగోళాలయ్యాయ్.
    పరుగున వెళ్లి పీరా గొంతుపట్టి పైకిలేపి గెడ్డం కింద ఒక్కటిచ్చాడు.
    అప్పుడు మాంత్రికుడు పీరా పెట్టిన కేకకి ఆ స్మశానంలోని శవాలు సైతం గడగడలాడాయ్.
            8వ వారం
    "రాత్రి నేను ఆ మాంత్రికుడ్ని చితక్కొట్టాను. వదినా...కానీ వాడు మన పాపకి చేతబడి చేయలేదు"చెప్పాడు ప్రభంజన్.
    "మరి మన పాప ఎందుకు చిక్కిపోతూ ఉంది?" అంది అన్నపూర్ణ.
    ప్రభంజన్ పాపని డాక్టర్ కి చూపించాడు. డాక్టర్ చెప్పింది విని అదిరిపడ్డాడు ప్రభంజన్.
    "మీ పాపని ఎవరో నలుగురు రేప్ చేసినట్టున్నారు. అందుకే పాపకి మానసికంగా దెబ్బతగిలి అలా చిక్కిపోతూంది."
    ప్రభంజన్ పిడికిళ్లు బిగుసుకున్నాయ్.
    "ఆ నాడు మా అమ్మని రేప్ చేశారు... ఈనాడు వసిది అనైనా ఆలోచించకుండా పాపని రేప్ చేశారు. ఇది తప్పకుండా వాళ్లపనే!...వాళ్ల అంతు చూడందే నిద్రపోను..." అనుకున్నాడు.
            9వ వారం
    మందాకిని సహాయంతో వాళ్లు నలుగురూ ఎవరో తెలుసుకున్న ప్రభంజన్ ఆశ్చర్యపోయాడు.
    వాళ్ల నలుగురిలో ఒకడు పోలిస్ కమీషనర్,ఒకడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఒకడు స్మగర్ల,ఒకడేమో ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టు.
    తన తల్లిని రేప్ చేసినప్పుడు ఆ పోలీసు కమీషనర్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. ఆ ఇండస్త్రియలిస్టుకి ఒక కిళ్లీకొట్టు ఉండేది.స్మగర్ల కాఫీ హోటల్లో క్లీనరుగా ఉండేవాడు. ఆ ఆర్టిస్టు రోడ్డుమీద చాక్ పిసుల్తో ఆంజనేస్వామి బొమ్మలు గీసేవాడు.
    ఆ నలుగురి గురించీ ఇన్ ఫర్మేషన్ తెలుసుకున్నాక హోటల్ గదిలో మందాకిని మంచం మీద ఎత్తిపడేసిన ప్రభంజన్... ...,(సారీ... ఇక్కడ కూడా నెత్తురు కసాయ్ రావు నవల్లో ఏంరాశాడో నేను చెప్పలేను)
                      10వ వారం
    అప్పటికి అలా గంటనుండి ఆ కారుని ఛేజ్ చేస్తున్నాడు ప్రభంజన్. చివరికి మోటార్ సైకిల్ తో కారుని ఓవర్ టేక్ చేసి కారుకి అడ్డంగా నిలబెట్టేడు. అందులోని స్మగ్లర్ నీ పట్టి కిందికి లాగి అతని మర్మావయవాన్ని కత్తితో కోసేశాడు.
    (కథ ఇలానే 30 వారాలు సాగుతుంది. విలన్లందరూ చచ్చాక మందాకిని, ప్రభంజన్ ల వివాహంతో సుఖాంతం అవుతుంది. -రచయిత)
                             *  *  *

 Previous Page Next Page