ఉవ్వెత్తున పొంగే కెరటాల్లో సాయంకాలపు రంగులు కలిసిపోతూ కొత్తకాంతులు రువ్వుతున్న వేళ.
తడి ఇసకను గుడులుగా కడుతున్న మెత్తని నాలుగు చేతులు.... కట్టిన గుడుల్ని అంతలోనే కాళ్ళతో తన్నేసి, నీళ్ళలో తడవడానికి పరుగెడుతున్న బాల్యం.
దూరంగా, గుడివాకిట నిండుగా విరిసిన పున్నాగచెట్టు కొమ్మమీద నిల్చున్న నేమలిపిట్ట రెక్కల్లోంచి రాలిన, నెమలి ఫించం గాలికి ఎగిరి ఎగిరి నీటి అలమిద పడినపుడు_
ఆ ఫించాన్ని అందుకోవడానికి తీసిన పరుగులు.... తియ్యని కేరింతలు....విసురుగా రాళ్ళను డికొని, పగిలి , పగిలి, జుత్తుమీదపడి ఇంద్ర ధనసులా మెరిసే నీటి తుంపర__
ఏదో అస్పష్టాస్పష్ట జ్ఞాపకాల సంగమం....తెల్సిన చిరునవ్వు గులాబి అత్తరులా పరిమళించిన సమయం.... జ్ఞాపకాల అరల్లో ఎక్కడో చిన్న కదలిక ....ఏమిటా జ్ఞాపకం___?
ఆ నవ్వును ఎప్పుడో ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం.....
"ఎవిటలా చూస్తున్నారు....మీ పేరు ముక్తానందాదేవి కాదూ.... హొం మినిసర్ట్ గా పదవి బాధ్యతను స్వకరించిన, ది గ్రేట్ ఇండస్టియలిస్ట్ హరికృష్ణమనాయుడుగారి ఒన్లి డాటర్" ఇంజన్ ఆఫ్ చేస్తూ అన్నాడతను.
ముక్త మరింత ఆశ్చర్యపోయింది.
దానిక్కారణం....నార్త్ ఇండియన్ అనుకున్న వ్యక్తి, నార్త్ ఇండియన్ కాకపోవడం....డిల్లి రోడ్ల మీద స్వచ్చమ్తెన తెలుగు తో తననో వ్యక్తి పలకరించడం.
చిత్రంగా ఉంది ముక్తానందకు.
"ఎంటాలా చూస్తున్నారు.....ఇంత జన సమర్దంలో ....మీరే ముక్తా నంద అని గుర్తు పట్టి పలకరించననా....బ్తె దిబ్తె....మీరెక్కడకెళ్తూన్నారో చెప్తే....డ్రాప్ చేస్తాను. అది మీకిష్టమ్తేతేనే" ఆ అడగడంలో ఏదో చనువు.... ఏదో చిలిపితనం ....ఎప్పుడో విన్న స్వరం....ఆ గొంతుతో గంటలు, గంటలు కబుర్లడుకున్న గుర్తు.
జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది ముక్తానంద.
"ఏంటి....అంతసేపలా ఆలోచిస్తూన్నారు కమాన్ గేటిన్....నేనెం హొం మినిస్టర్ కూతుర్ని కిడ్నాఫ్ చేయడానికొచ్చిన కాశ్మీర్ మిలిటెంట్ కాదులెండి ట్రాఫిక్ పోలీసులు నా మీద కేసు పెట్టె లోపలే .....మీరో పని చేస్తే బావుంటుంది."
"ఏం పని చేస్తే బావుంటుంది" అసంకల్పితంగానే అడిగేసింది.
"జిపెక్కేస్తే బాగుంటుంది...." మళ్ళి మెల్లగా నవ్వుతూ అన్నాడు. ఒకక్షణం తటపటాయించింది ఆ వ్యక్తి విశాలమ్తెన కళ్ళల్లో తొంగి చూస్తున్న అమాయకత్వం వేపు చూస్తూ, ద్తేర్యంగా ముందుకడుగేసింది.
ఎక్కి అతని పక్కన కూర్చుంది.
"మీరు బాగా డేరింగు , డాషింగ్ అని విన్నాను....కానీ...." గేరుమార్చి , ఎక్సిలేటర్ నొక్కుతూ అన్నాడు. ఒక పరాయివ్యక్తి తనని తక్కువగా అంచనా వెయ్యడం నచ్చలేదు ముక్తకు.
"ఆపెయండి....దిగిపోతాను...."నోటివరకూ వచ్చినమాట ఆగిపోయింది.
"అయితే....ముక్తానందాదేవి గారికి, నేనింకా గుర్తుకురాలేదన్న మాట, ఎక్కడకెళ్ళాలో చెప్తే ఓ పదినిమిషాలు టైమిస్తాను. ఈ లోపల గుర్తుకు తెచ్చుకుందురుగాని...."
"హొటల్ అశోకా." వెంటనే చెప్పింది ముక్తానంద.
"ఆశికా చేరే లోపల నేనెవరో చెప్పేస్తారన్నమాట" జీపును మలుపు తిప్పుతూ అన్నాడావ్యక్తి.
సాధారణంగా తనని కలిసిన వ్యక్తులేవ్వర్ని, అంత సులభంగా మరిచిపోదు తను మరి బాగా తెలిసినట్టు ప్రవర్తిస్తున్న ఈ యువకుడేవారు ?
స్టిరింగుమీద చేతులు వేసి, నిలాసంగా డ్తెవ్ చేస్తున్న అతనివ్తెపు ఓరకంట చూసింది....
అతనికి ముప్పే ఏళ్ళుంటాయి. బలంగా దృడంగా ఉన్నాడు. విశాల మ్తెన నుదురు వెడల్పాంటి ముఖం అతని ముక్కే విచిత్రంగా ఉంది. ఎవరిదోతెచ్చి, ఇతగాడికి తగిలించినట్టుగా ఉంది. విశాలమ్తెన, చరుక్తేన కళ్ళు కాటుక దిద్దినట్టుగా దట్టమ్తెన కనుబొమలు నీరెండ కాంతిలో మెరుస్తున్న మీసకట్టు ....అన్నిటికిమీంచి బంగారు రంగుచాయ....
ముక్త తనని ఓరకంట చూడడం గమనించాడు ఆ యువకుడు తనలో తన నవ్వుకున్నాడు.
జీపు చాందిని చౌక్ దాటి కుడివేపు మలుపు తిరిగింది.
"టెన్ మినిట్స్ లో, సెవెన్ మినిట్స్ అయిపోయాయి. ఇంకా త్రి మినిట్స్ మిగిలాయి"
అతని మాటలు తన మెమొరి పవర్ కి పరీక్ష పెడుతున్నట్లుగా ఉన్నాయేతప్పు__ హేళన చేస్తున్నట్లుగాలేవు. అందుకే ముక్తానంద చురుగ్గా ఆలోచిస్తోంది- గుర్తుకు తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
"కాగితం పువ్వులు అంటారుగాని వాటిని కాగితాలలో చెయ్యరు. అసలు, కాగుతాలకు వాటికి అస్సలు సంబందంలేదు. తెలుసామీకు...."
ఏదో జ్ఞాపకం చేస్తున్నవాడిలా మ్ ప్రశ్నించాడు. అయినా ముక్త నంద మౌనంగానే ఉంది.
"కాగితం పువ్వులకి, కాగితం పువ్వులని పిల్చే చోగాస్ విల్లియాకి కాగితాలకు అసలు సంబంధంలేదు" తిరిగి అన్నాడు.
మీరు స్తెన్సు టిచర, పోలిస్ ఆఫీసర్ " చిరుకోపంతో అంది ముక్తానంద.
ఆఫ్ కోర్స్ ....క్లూ ఇస్తే పట్టుకుంటావె మోనని నవ్వుతూ అన్నాడతను.