Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 6

    శత్రుదేశంలో నున్న ఆ దేశ శత్రువుకి ఆయుధాలు అందజేసే బాధ్యత_ ఆ ఆయుధాలు కొనే బాధ్యతా కొన్ని మాఫియా గ్రూపులు నిర్వహిస్తున్నాయి. ఆ గ్రూపులకి డబ్బు అందజేసేది స్వదేశంలో వున్నా వ్యాపారసంస్థలు  ఆ విధంగా  దేశాధినేత నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా_ ఎవరు తనకేమ్టగా ఉపయోగపడ్తారో అంతగా ముడుపులు చెల్లించే స్వదేశీ  వ్యాపారస్థలతో మాదాల వెంకట్రామయ్య ఒకడు. పాలకుడు_పాలనా యంత్రాంగామనే రైలుమాఫియా  బిజినెస్ సర్కిల్ అనే పట్టాలపై  నడుస్తుంది. ఈ రెండు  పట్టాలలో ఒకటయిన మాదాల వెంకట్రామయ్యకి రెండవదయిన మాఫియా ప్రపంచంలో అవినాభావ సంభందాలున్నాయి. దేశంలోని  అతి ముఖ్యమయినవార్ని  ఒక పథకం ప్రకారం హతమార్చే మాఫియా లీడర్లతో మాదాల వెంకట్రామయ్యాకున్న సాన్నిహిత్యం వడయారుకి తెలియనిదికాదు. అందుకే విషయం విన్న వడయారు అంతగా కలత చెందాడు.

   
                                  *    *    *    *

    పొడుగ్గా నీడమీద పడటంతో తలెత్తి చూసింది కావ్య.

    కొన్ని కొన్ని సంఘటనలకి లింకులుండవు. ఎక్కడో దేనితోనో ప్రారంభమయిన మరెక్కడో ఇంక దేనితోనో అంతమవుతాయి. మాట్లాడే స్టేజి దాటిపోయినట్టు కళ్ళప్పగించి చూస్తోంది. అలా చూడడంవల్ల అసలే పెద్దవయి ఆమె కళ్ళు మరింత పెద్దవయ్యాయి. సీల్ హొట్ లాగా కొనదలచిన ముక్కు ఎంతో  అందంగా హుందాగా కనిపిస్తోంది. అతడు ఆమె కళ్ళనుగాని, కొనదలచిన ముక్కునుగాని చూడటంలేదు. ఆమెలోని పట్టుదలకు ప్రతీకారంగా క్రిందకి పెదవిని బిగించిన విధానాన్ని చూస్తున్నాడు.

    ఆమె తలకు స్కార్క్స్ వుంది. జీన్సు ధరించింది. కాళ్ళకు కాన్వాస్ బాటు. తనను సమీపిస్తున్న వ్యక్తీ మోటుగా వున్నాడు పెట్టికోటు మాదిరిగా షార్ట్ వుంది. ఆ షర్టుకి బటన్స్ లేవు. ఫ్రంటు పాకెట్స్ మాత్రం వున్నాయి. మేడలో అమెరికన్ దళార. ఒత్తుగా పెరిగిన గడ్డం. పాలిష్ లేని బూట్లు. నడుముకి బిగుతుగా బెల్టు. ఇవేమీ ఆమెకి కనిపించడంలేదు. జుట్టును కప్పుతున్న టోపీ_ క్రిందగా నుదుట నల్లని  గీతను చూస్తోందామె.

    అతనకి వెనుకగా, ఆమెకి ముందుగా_ఘోషిస్తున్నా  సముద్రం. కాని  ఆ ఇద్దరిమధ్య నిశ్శబ్దం. కడలితీరానా వెన్నెల్లో స్నానిస్తున్నట్టు ఆ ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా నిలబడుతున్నారు. అతడి ముఖంలో కారుణ్యం తెరలు తెరలుగా గడ్డకట్టసాగింది. ఒక ఉప్పెన వచ్చి డీకొన్నట్టయింది కావ్యని. ఆ వేళలో, అంత సమీపంలో, ఆ ప్రదేశంలో అందునా ఓ ఆడపిల్లని అంత దగ్గరగా చూస్తానానుకోలేదతను.

    ఊపిరితిత్తులనిండా బలంగా గాలి నింపుకుని స్వరం హెచ్చింది  కేకవేశాడు. "ఎవర్నువ్వు..." అని!

    "నాకు 'తంబి' కావాలి...."

    "తంబి... నేనే..."

    మంచులో స్నానమాడిన మల్లెమొగ్గ సూర్యకిరణాలు సోకిరెక్కలు విచ్చుకున్నట్టు  ఆమె పెదవులపై సన్నటి చిరునవ్వు మెదిలింది.
   
                                 *    *    *    *

    "తంబి..."

    ఇది అతనికి తల్లిదండ్రులో, తాతయ్యా నాయనమ్మా పెట్టిన పెరుకాదు. ఊరు వాళ్ళు పెట్టినపేరు. కన్నతల్లి కాదని ఆ సముద్రపు ఒడ్డున విడిచివెళితే, ఆ సముద్రమే అతడ్ని పెంచి పెద్దచేసింది. అదెలా జరిగిందంటే...

    తంబి పుట్టిన రెండేళ్ళకు జరిగిందిది. తంబి తండ్రి రాఘవయ్యా సివిల్ కాంట్రాక్టర్. నెలలో ఎక్కువ రోజులు తండ్రి వర్కుస్పాబ్ దగ్గర, బిల్స్ పాస్ చేయించడానికి రాజధాని లోను గడపవలసి వచ్చేది పర్యవసానంగా తంబి 'అమ్మాకూచి'అయ్యాడు. తంబికి యిష్టమైనవి రెండేరెండు వున్నాయి. ఒకటి తల్లి ఒడిలో తల పేట్టుకుని పడుకోవడం, తల్లి తంబి వెంట్రుకల్ని చేతి వ్రేళ్ళతో దువ్వుతుంటే నిద్రపోవడం రెండు__ సాయం సమయలలో తల్లి తమ్బిని భీచ్ కి తీసికెళ్ళేది. మిగతా పిల్లలా తంబి బెలూన్స్ తో అడికునేవాడుకాదు. సముద్రపు అలలు తీరానికి కొట్టుకుని తిరిగి వెళుతుంటే చూస్తూ కూర్చునేవాడు.

    రాఘవయ్య కాంట్రాక్ట్స్ లో పనిచేస్తున్నామాదాల వెంకట్రామయ్య తరుచుగా తన యజమాని యింటికి వచ్చేవాడు, యింట్లోకి కావలసినవన్ని  తెచ్చి యిచ్చివెళ్ళేవాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మాదల వెంకట్రామయ్య అటు కాంట్రాక్ట్స్ వర్క్సులో రాఘవయ్య ఆదరణని, ఇటు యింటిపనులు చేసిపెట్టి పావని అభిమానాన్ని పాడాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఒక దుర్ఘటన జరిగింది. ప్లెయ్ ఓవర్ కనస్త్రక్షన్ దాదాపుగా పూర్తయింది. ఇహా రోడ్డు మిగిలివుంది. అది కూడా పూర్తిచేస్తే రాష్ట్రముఖ్యమంత్రి చేత ప్రారంభోత్సవం చేయిస్తారు. ఆ రోడ్డు వేయడానికి ప్లే ఓవర్ దిగువ భాగంలోనున్న పెద్ద పెద్ద బండలు పెద్ద ప్రతిబంధకంగా వున్నాయి. ఆ బండల్ని డైనమైట్ తో పేల్చడానికి అవసరమయిన ఏర్పాట్లన్నీ చేశారు. ఈ విషయం తెలియని రాఘవయ్యా ఆ రాత్రికి తన జీపులో వర్క్స్ స్పాట్ వస్తుండగా డైనమైట్ తో పేల్చడం, రాఘవయ్య మరణించటం జరిగింది. రాఘవయ్యా భార్య పావనికి అప్పుడు యిరవై రెండేళ్ళు, పిల్లవాడికి మూడేళ్ళు. అంతకుమించి ఇంట్లో డబ్బుకాని, వెలుపలినుంచి తీసుకొచ్చిందిగాని కాంట్రాక్ట్స్లలలోకొన్ని లక్షలరూపాయలపెట్టుబడి పెట్టాడు రాఘవయ్య.

    అప్పటివరకు ఇంట్లోని సొంత మనిషిలా, నమ్మకంగా పనిచేస్తున్నవ్యక్తీ_ఆ కాంట్రాక్టుల తాలూకు  లావాదేవీలు రాఘవయ్యతో సరిసమంగా తెలిసిన వ్యక్తీ మాదల వెంకట్రామయ్య.

    గ్రాడ్యుయేషన్ చేసిన రాఘవయ్య భార్య తన జీవితానికేకాక, తన భర్త చేసిన అప్పులు... చేస్తున్నా కాంట్రాక్టుల విషయమై ఒక నిర్ణయం తీసుకోవలసి సమయం ఆసన్నమయింది. ఆమెకంత దృడచిత్తం... దూరదృష్టిలేవు. చుట్టపు చూపుగా వచ్చినవారు తమకు తోచిన సలహా యిస్తున్నారు వాస్తవానికి అక్కడున్న వారిలో తరుచుగా తమ యింటికి వచ్చి తమ బాగోగులు చూస్తున్నా వ్యక్తీ... రాఘవయ్యా మరణంతో భిన్నుడయిన వ్యక్తి మాదల వెంకట్రామయ్య! ఆ క్షణాన అతడు తమకెంతో ఆప్తుడిగా కనిపించాడు. అతడి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోగోరింది పావని.
   

 Previous Page Next Page