Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 6

    బిలబిలమంటూ అరడజను పైగా వున్న డిఫెన్స్ అధికారులు లోపలకి వచ్చారు.

    "వాట్ హేపండ్... మీరంతా ఎందుకు వచ్చారు?" కోపాన్ని అదిమి పెట్టుకుంటూ అడిగింది.శరణ్య.

    "వెరీజ్ యూవార్ ప్రెండ్..." ఓ అధికారి దర్బంగా అడిగాడు.

    "ఐ డోంట్ నో..."చెప్పింది సాద్యమైనంత పోలయిట్ గా.

    ఆ అధికారి గుర్రుగా చూశాడు.

    "డోంట్బ్లజ్ అజ్... మృదువని ఎక్కడుందో నీకు తెలుసు" ఆ అధికారి ఏకవచనంతో మాట్లాడేసరికి చిర్రెత్తుకొచ్చింది. శరణ్యకు.

    "మిష్టర్ ఆఫీసర్.. హోల్డ్ యువర్ తంగ... మిమ్మల్ని బ్లఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు" కోపంగా అంది.

    "అచ్చా.. ఠీక్ హై... మీరు మాతో రావాల్సి ఉంటుంది.యూ ఆర్ అ..రె..స్ట్.." ఓ అధికారి చెబుతూనే హ్యండ్ కప్స్ బయటకు తీశాడు.

    "వ్వా..ట్.." అదిరిపడి అడిగింది.

    "యస్... మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం..."

    "నాన్న... నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..?"

    "ఒక దేశద్రోహిని దాచినందుకు"

    "ఆఫీసర్..."

    "యస్... మిమ్మల్ని ఇంటారాగేట్ చేయాలి. మీరు మర్యాదగా కోపరేట్ చేస్తే మీకు మంచిది. అదర్  వైజ్..." ఆగి అన్నాడు అధికారి.
 
    "నేను మా లాయరు కు ఫోన్ చేసుకోవచ్చా?"

    "నిరభ్యంతరంగా... కానీ ఇప్పుడు కాదు... ముందు మీరు పదండి..."  చేసేది లేక, వాళ్ళతోపాటు నడిచింది శరణ్య.
              
                                           ***

    డిఫేన్స్ కార్యాలయం.

    స్పెషల్ సెల్...

    ఆ సెల్ లో డిఫేన్స్ ఆఫీసర్లు, డిఫేన్స్  చీఫ్ ఉన్నారు. ఓ కుర్చీలో శరణ్య కూచొని ఉంది.

    "మీ పేరు?" డిఫెన్స్ చీఫ్ అడిగాడు.

    "శరణ్య"

    "ఏం చేస్తూంటారు?"

    "స్టేజ్ ఆర్టిస్టును...."

    "మృదువని తెలుసా?"

    "తెలుసు..."

    "ఎప్పట్నించి?"

    "ఆరేళ్ళుగా"

    "మీరు క్లోజ్ ప్రేండ్సా?"

    "యస్.."

    "ఇప్పుడు మృదువని ఎక్కడుంది?"

    "తెలియదు..."

    "క్లోజ్ ప్రెండ్స్ అంటున్నారు. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది?" ఇంటరాగేట్ చేసే ఆఫీసర్ అడుగాడు.

    "మృదువని మీ ఆఫీసులోనేగా  పని చేస్తుంది. మీ దగ్గరే కదా తను పర్సనల్ సెక్రటరీ మరి మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి... మీ సభార్దినేట్ గురించి మీకు తెలియదా?" కోపాన్ని అదిమిపెట్టె ప్రయత్నం చేస్తూ అడిగింది శరణ్య.

    "ష..ట..ప్.." కోపంగా అరిచాడు డిఫెన్స్ చీఫ్.
 
    "ఇక్కడ మా ప్రశ్నలకు మాత్రమె సమాధానం చెప్పాలి.... ఎదురు ప్రశ్నలకు అవకాశం లేదు..." హిందిలో అన్నాడు కోపంగా చీఫ్.

    "నాకు తెలియని విషయం పదేపదే తెలియకపోయినా అడిగితె నేనెలా చెప్పగలను. యస్... మృదువని నా బెస్ట్ ప్రెండు, షి ఈజ్ మై బెస్ట్ ప్రెండ్... ఆఫ్ కోర్స్... అల అని ఆమె ఎక్కడెక్కడ తురుగుతుమ్దావు నాకెలా తెలుస్తుంది?"

    డీఫేన్స్ చీఫ్ ఒక్క క్షణం తల పకించాడు.

    "సరే... మీరు చివరిసారిగా మృదువని ఎప్పుడు కలిశాడు?"
 
    "రెండ్రోజుల క్రితం..."

    "ఈ రెండ్రోజుల్లో మీరు మృదువని కలవలేదా?"

    "లేదు"

    "ఎందుకని?"

    "షర్మిల ఆర్ట్ ధియేటర్ లో ఇవ్వాళ ఓ డ్రామా వెసం. డానికి సంభందించిన రిహాల్సల్స్ లో బీజీగా ఉన్నాం... కావాలంటే, కో అర్టుస్టులను, డైరెక్టర్ ని ఎంక్వయిరీ చేసుకోవచ్చు" ఉక్రోషంగా అంది శరణ్య.

    ఓ డిఫెన్స్ అధికారి ఎవరేవరో ఫాన్స్ చేశాడు. ఆ తర్వాత డిఫెన్స్ చీఫా దగ్గరకి వచ్చి చెప్పాడు.

    "శీ ఈజ్ కరెక్ట్ సార్... రెడ్రావుజులుగా డ్రామా రిహల్సిల్స్ ఉంది."

    "ఐసీ..." అన్నట్టు తల పకించాడు.

    శరణ్యకు ఇదంతా అయోమయంగా ఉంది. అసలు మృదువని ఏమైంది? ఆమెను ఎందుకిలా దోషిలా చూస్తున్నారు. ఎంతసేపూమృదువని గురించి అడుగుతారే కానీ, ఆమె చేసిన నేరం ఏమిటో ఎందుకు చెప్పరు?

    ఆ క్షణం శరణ్యకు, అమాయకమైన మృదువని మొహం గుర్తొచ్చింది.


    అంతక్రితమే, డిఫెన్స్ అధికారులు మృదువని  ఇంటిని అంగుళం అంగుళం గాలించారు. శరణ్యను  మృదువని ఇంటికి తీసుకుకెళ్ళారు.

    ఆ ఇంట్లో వాళ్ళకేఅధారమూ  దొరకలేదు.

    మృదవని చుట్టుపక్కల ప్లాట్ల వాళ్ళు భయ భయంగా చూస్తోండిపోయారీ దృశ్యాన్ని.
 
    ఎప్పుడూ కామ్ గా వుండే మృదువని, తన పని తాను చేసుకుపోయే మృదువని పారిపోవడం ఏమిటి?

    అదే శరణ్యకు అర్ధం కావడంలేదు. డిఫెన్స్  అధికారులు మరో గంటసేపు వరకూ శరణ్యను చాలా ప్రశ్నలు వేశారు. రకరకాల యాంగిల్స్ లో క్రాస్ ఎగ్జమిన్ చేశారు. అయినా  అన్నింటికి శరణ్య ఒక్కటే సమాధానం ఇచ్చింది.
క్షణక్షణానికి ఆమె సహనం నశించి పోతుంది.

    ఈ వ్యవహారం అంతా ఆమెకు ఇబ్బందిగా ఉంది. ఆమె టెన్స్ ఫీలవుతున్నది. ఈ విషయంలో కాదు, మృదువని విషయంలో.

 Previous Page Next Page