"కరంజయా నువ్వు మంచిపని చేశావ్.... నీ మేలు మా ప్రభుత్వం మరచిపోదు. మనం మొదలు పెట్టిన విద్వంసం ఇప్పుడే మొదలైంది. సుప్రీం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ బిడ్డను పెంచాల్సిన బాధ్యత మీదే..." అందుకే ఈ అగర్వాల్ మీకు సాయం చేస్తాడు." అని ఆగి అగర్వాల్ వంక చూశాడు పాకిస్తాన్ ఏజెంట్ ఖాన్.
"అర్దమైంది ఖాన్ సాబ్... పూర్వం రోజుల్లో రోజూ విషాన్ని ఆహారంగా ఇచ్చి విష కుమ్దిడిగా తయారు చేస్తాను.
అతని మెదడులోని ఆలోచనా కణాలను నియంత్రిస్తాను. అతనికి ఆలోచించే శక్తి లేకుండా చేస్తాను. ప్రతేకమైన చిఇప్స్ ద్వారా అతని మెదడులో 'సేల్స్'ని ఇన్ స్టాల్ చేసి, మన ఆదేశాలతో అతను నడుచుకునేలా చేస్తాను...
అతనికి ఆలోచించే శక్తి వుండదు. మనం ఏది చెబితే అది చేస్తాడు. అతని ఒంట్లో విద్యుత్ నిరంతరం ప్రవహిస్తుంటుంది. మాములుగా మానవుడి మెదడు పదివాట్ల బల్బుకు అవసరమయ్యే శక్తిని ఉపయోగిస్తుంది.కానీ ఈ భస్మ కన్ను కొన్ని వందల వాట్ల విద్యుత్ శక్తి తయారయ్యేలా తీర్చి దిద్దుతాను. క్రీ.శ. 1712 లో జర్మనీ ల్యూబెక్ ప్రాంతంలో ఓ బాబు పుట్టిన ఎనిమిది వారాల తర్వాత మాట్లాడడం ఆరంభించాడట. సంవత్సరం వయసు రాగానే బైబిల్ మొత్తం చదివేశాడట. మెక్సికో సిటీలో ఓ వ్యక్తికీ కళ్ళు తల వెనకవైపు వున్నాయట. వెనక నుంచి వచ్చే వాళ్ళను అతను స్పష్టంగా చూడగాలిగేవాడట. ఈ మధ్య ఓ పత్రికలో చదివాను. కరెంట్ మనిషి గురించి. అతన్ని ముట్టుకుంటే శాక కొడుతుందట. ఒక గదిలో కావాల్సిన వెలుతురు సరిపడే విద్యుత్ తయారయ్యే శక్తి అతని బడికి ఉందిట.
ఇలాంటి విచిత్రాలు బోల్ట్ వున్నాయి. మనవ దేహంలో వున్న భాస్వరంతో రెండు వందల ఇరవై అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... మీరు కోరిన విధంగా 'భస్మ' ను తెర్చిదిద్దె బాధ్యత నాదేనని వీటి గురించి నాకు సరైన అవగాహాన వుందని చెప్పడానికే" అంటూ ఆ టేబుల్ మీద వున్న బ్రీఫ్ కేస్ వైపు తోసి ఓ.కే... ఇది అడ్వాన్స్ అనుకోండి. ఇఅతడ్ని మీ ల్యాబ్ లోనే వుంచండి. పాతికేళ్ళు తిరిగే సరికి ఇతనో మిరాకిల్ పెర్సన్ అవ్వాలి. శాస్రవేత్తల ప్రపంచం నివ్వెరపోవాలి. సైన్స్ కు సైతం అంతుచిక్కని ఉద్వేగానికి లోనుకావాలి. దీంతో మీ పేరు ప్రతిష్టలు ఇక్కడ ఇండియాలోనే కాదు అక్కడ పాకిస్తాన్ లో మార్మోగిపోతాయి. నీకు పాకిస్తాను ప్రభుత్వం ప్రత్యెక గుర్తింపు ఇస్తుంది" కరంజయా చెప్పాడు.
బ్రీఫ్ కేస్ తీసుకుని ఖాన్ కు షేక్ హ్యండిచ్చి , కరంజయాకు 'బై' చెప్పేసి, బాబును తీసుకుని బయటకు నడిచాడు అగర్వాల్.
భారతదేశ భవిషత్తు ను చీకటిగా మార్చాలనే ప్రయత్నంలో చీకట్లో కలసిపోయాడు అగర్వాల్.
***
"ఆ సైంసిస్ట్ నుఓ కంట కనిపెట్టి వుండండి. తోక జడిస్తే అస్ బద్మాష్ కు మార డాలో..." కరువైన కంఠంలో హెచ్చరించాడు ఖాన్.
కరంజియా తనకు ఆ విషయం తెలుసునన్నట్టు తలూపాడు. మరు క్షణం ఆ టెంట్ లో వున్న క్యాండిల్ ను ఉఫ్' మణి ఊదాడు లల్లూరామ్.
ఆ టెంట్ చీకటితో అంధకారమైంది. తమ మీద అనిమానం రాకూడదని ఆ జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు.
***
ఈజీ చెయిర్ లో వెనక్కి వాలి కళ్ళు ముఉసుకున్నాడు భరద్వాజ.
మూసుకున్న అతని కళ్ళల్లో నుంచి బలవంతంగా బయటకొచ్చాయి రెండు కన్నీటి చుక్కలు.
ఆ కన్నీటి చుక్కలు అతని చెక్కిళ్ళ మీద నుంచి కిందకి జారిపోయాయి. అతని మనసు రోదిస్తోంది. పాలు తాగే వయసులో తల్లి చనిపోయినప్పుడు, పాలకోసం ఎడ్చాడే కానీ, తల్లి చనిపోయిందని తెలిసి ఏడుపురాలేదు. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియక, తల్లి స్తానాన్ని వదలడం లేదు.
ఊహా తెలిశాక, తన ల్యాబే తన ప్రపంచం, తన పరిశోధనలే తన ఆత్మీయత నేస్తాలు. పెళ్లయ్యాక విశాలి తన జీవితంలో మరో భాగమైంది.
పరిశోధనలు, భార్య ... ఈ రెండూ రెండు కళ్ళని అనికున్నా. పరిశోధనలే ప్రాణంగా బ్రతికాడు.
ఇప్పుడు కన్నబిడ్డ దూరం అవ్వడం అతనికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
ఈ వారం రోజులుగా జరిగిన ఒక్కో సంఘటనా తాని కాళ్ళ ముందు మెదిలింది.
కరంజయా తనని కలవడం తన దగ్గరున్న కెమికల్ ఫార్ములా అడగడం, తను నిరాకరిచటం, తనకు డబ్బు ఆశ చూపడం...
దానికీ తను లొంగకపోవడం... ఓ అమ్మాయి ద్వారా తనని ట్రాప్ చేయాలని ప్రయత్నించటం, అప్పుడూ తను లోంగకపోయేసరికి... తనని చంపాలనే ప్రయత్నం... తను పారిపోవడం... సిటీ హాస్పిటల్ లో బిడ్డ పుట్టడం... కన్నబిడ్డని తన చేతులతో గొయ్యి తవ్వి పూడ్చి పాతిపెట్టడం... గోతిలో పతి పెట్టిన ఆ బిడ్డ మాయమవ్వడం అన్నీ... అన్నీ గుర్తుకురాసాగాయి.
బిడ్డ దూరమయ్యడన్న బాధకన్నా, ఆ బిడ్డను ఎవరు మాయచశారో? అన్నా అందోళన అతన్ని కలవరపెడుతోంది.
లోపల పూజగదిలో విశాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కడుపు తీపి ఆమె గుండెను కదలించి వేస్తోంది.
బిడ్డకోసం పూజలు చేసి, పత్రాలు చేసి, నోములు నోచినా ఆ దేవుడు ఆమెకు కడుపుకోత శాపంగా అనుగ్రహించాడు.
'దేవుడా... నిన్ను నమ్మని నాకు శిక్ష విధించినా అర్ధం వుంది. నువ్వే దేవుడివని రోజూ పూజ చేసే నా భార్యనెందుకయ్యా శిక్షిస్తావు?! మనసులోనే అనుకున్నాడు భరద్వాజ.
అతనకి నవ్వొచ్చింది.
మనిషికి బాధలోనే నమ్మకాలు పెరుగుతాయి.
తల విదిలించాడు భరద్వాజ.
చెంపలమీద జాలువారిన కన్నీటి చుక్కలు ఆ గదిలో చెల్లాచేదురయ్యాయి. భాదని దిగమింగుకోవాలి...