శ్రద్దగా వింటోంది మౌనిక.
"నేను చనిపోయేలోపు ఓటమి నా దరిదాపుల్లోకి రాకూడదనుకున్నాను బట్..." ఆవేశంలో ఆయనకు మాటలు తడబడ్డాయి.
ఆయన బాధను ఆమె అర్ధం చేసుకోగలిగింది. కానామెకు చెప్పటం కన్నా చేసి చూపించటమే యిష్టం. అందుకే యింకా ఆమె మౌనంగానే వుండిపోయింది.
"డిగ్ ఫర్ విక్టరీ.... విక్టరీ.... ఓ మైగాడ్.... విక్టరీ ఓ ముఖ్య సూత్రంగా మారి నేను, ఆ అబ్సెషన్ తో ఎన్నో విజయాల్ని కావాలని, తాపత్రయపడి సొంతం చేసుకున్నాను..... కాని...." ఆయన హఠాత్తుగా ఆగిపోయి సిగార్ ని కసిగా యాష్ ట్రే పై ఆనించి నలిపి వేశాడు.
వయస్సు బరువుతో వాలుతున్న ఆయన ఉబ్బిన కనురెప్పల వెనక సన్నటి ఎరుపుజీర.
శరీరంలో చిన్న ప్రకంపన.....
ఆమె లేచి నించుంది.
ఓ క్షణం మౌనంగా ఆయనకేసి చూసి రెండడుగులు ఆయనవేపుకి వేసి చటుక్కున వంగి ఆయన కాళ్ళకు నమస్కరించి వెనుదిరిగింది.
"అతి త్వరలోనే ఆ అపజయాన్ని విజయవంతంగా మార్చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్ గ్రాండ్ ఫా.... బై..." అంటూ ఆమె వేగంగా బయటకు నడిచింది.
ఆవేశంగా వెళుతున్న మనుమరాలి వంక ప్రేమగా చూస్తూ 'చాలు- ఈ మాత్రం ఆవేశం... ఆత్మవిశ్వాసం నీలో వుంటే ఈ జెయింట్ ఇండస్ట్రియల్ మెగాలిత్ మేనేజ్ చేయగలవు. విష్ యూ బెస్టాఫ్ లక్ మై చైల్డ్' అనుకున్నాడు మనసులోనే జె.జె.
* * * * *
"పారిశ్రామిక చక్రవర్తి పదకోశంలో మొట్టమొదటిసారి అపజయం అనేమాటను ప్రవేశపెట్టిన ఘనత మనకే దక్కింది కదూ....?" అతను పెద్దగా నవ్వుతూ అన్నాడు.
ఆ హాల్లో వున్న ఐదుగురు వ్యక్తులు అతని నవ్వుకు ఓ క్షణం భయపడ్డారు.
"ఎస్...ఐ షుడ్ బీదా టేకోవర్ టైకూన్..... ఇంకా ఎన్నో కంపెనీలను కబళించాలి. నాలో... నాతో కలుపుకోవాలి. అప్పటివరకూ యీ వెన్నుపోటు వ్యాపారాలు తప్పవు. రక్తం కారకుండా పీకలు కోయాలి. నాగరీకంగా యింకా వీలయితే న్యాయపరంగా వెన్నుపోటు పొడవాలి. పొడుస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ విషయాలేవీ బయటకు పొక్కరాదు. ఒకవేళ బయటకు పొక్కాయనుకోండి, చెప్పానుగా.... రక్తం కారకుండా పీకలు కోయించటం నాకు వెన్నతో పెట్టిన విద్య..." మరలా నవ్వాడతను.
అది అతను పొందిన విజయగర్వమో- అవతలి వ్యక్తిని నాశనం చేయగలిగానన్న పైశాచిక ఆనందమో అక్కడున్న ఎవరికీ అర్ధం కాలేదు. అతను వాళ్ళకు అర్ధమయినా కాకపోయినా వాళ్ళకు అతనిచ్చే వాటా కావాలి. అందుకే మౌనంగా వుండిపోయారు. అతనికి కావాల్సింది కూడా అదే.
"ఇక మేం వెళతాం భరద్వాజగారు" ఆ ఐదుగురు లేచారు.
వెళతాం అన్న మాటలోని మర్మాన్ని భరద్వాజ గ్రహించి చిన్నగా నవ్వుతూ, అప్పటికే సిద్దంగా వుంచిన ఐదు కవర్స్ ని ఒక్కొక్కరికి అందించాడు దర్పంగా.
వాళ్ళవి తీసుకొని కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచారు.
* * * * *
(సబ్జెక్టు లోతుకు వెళ్ళబోయే ముందు నేనీ నవల ఏ బ్యాగ్రౌండ్ తో రాయబోతున్నానో, దాని లోతుపాతులు ఏమిటో చూచాయగా తెలియజెప్పటం సమంజసమని భావిస్తున్నాను. రచయిత)
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాన్ని సుఖమయం చేయటానికి, ఎన్నో కొత్త కొత్త వస్తువులు పుట్టుకొచ్చాయి. ఒకే వస్తువును ఎన్నో కంపెనీలు ఉత్పత్తి చేయటం ప్రారంభించాయి.
దాంతో కంపెనీల మధ్య పోటీ ప్రారంభమయింది. ఒక కంపెనీని మించి మరో కంపెనీ తమ ఉత్పత్తుల్నే మార్కెట్ లో ఎక్కువగా అమ్ముకోవాలనే ప్రయత్నంతో ప్రచార రంగంలోకి దిగాయి.
వినియోగదారుల మనస్సులో తమ కంపెనీ బ్రాండ్ నేమ్ తో వున్న వస్తువులే తిష్ట వేసుకోవాలని ప్రతి కంపెనీ ఎడ్వర్ టైజింగ్ మీడియాని ఒక ఆయుధంగా ఉపయోగించుకో నారంభించాయి.
కొన్ని దశాబ్దాలకు ఈ ఎడ్వర్టయిజింగ్ మీడియా తన ప్రాముఖ్యాన్ని విస్తరించుకొని ఒక ప్రత్యేక పరిశ్రమగా గుర్తింపు పొందింది.
The advertising business run by people who know us better than we know ourselves.
మన గురించి మనకు తెలిసినదానికన్నా ఈ ఎడ్వర్టయిజింగ్ పరిశ్రమలో వున్న వ్యక్తులకే మన గురించి బాగా తెలుసు. అలా తెలుసోగలిగినప్పుడే ఆయా ఎడ్వర్టయిజింగ్ కంపెనీలు తమ క్లయింట్ వస్తువుల్ని ఎక్కువగా అమ్ముడుపోయేలా చేయగలవు.
ఎడ్వర్టయిజింగ్ బిజినెస్ వుడ్ రూల్ అవర్ లైన్స్ సమ్ డే ఆర్ అదర్ అన్నది అక్షరాలా నిజమైందీ రోజు.
ఉత్పత్తి కన్నా అమ్ముకోవటమే కష్టమైన పని ఈ రోజుల్లో.
ఆ పని ఇప్పుడు హిడెన్ పరుష్యుయేడర్స్ చేతుల్లో వుంది.
ఈ ఎడ్వర్టయిజర్స్ ఇప్పుడు కేవలం హిడ్డెన్ ఫర్ ష్యు యేడర్స్ మాత్రమే కాదు- మోడరన్ సొసైటీ బలహీనతల్ని, భయాల్ని అలవాట్లను ఔపోసన పట్టిన సైకో సేల్స్ మెన్ లు కూడా.
ప్రచార ప్రపంచపు చీకటి రహస్యాల్ని, ప్రచార ప్రపంచపు తొలి గవాక్షం వెనుక దాగివుండే కుట్రల్ని, కుతంత్రాల్ని బయటపెట్టే ప్రయత్నంలో పాటు సక్సెస్ ఫుల్ ఎడ్వర్టయిజింగ్ సీక్రెట్స్ ని, ఇమేజ్ మేకర్స్ విజయం వెనుక దాగివుండే కిటుకుల్ని ఇందులో ప్రస్తావించాను.
ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ ఎడ్వర్టయిజింగ్ పరిశ్రమలో వున్న వ్యక్తులకే మన గురించి బాగా తెలుసు. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆయా ఎడ్వర్టయిజింగ్ కంపెనీలు తమ క్లయింట్ వస్తువుల్ని ఎక్కువగా అమ్ముడుపోయేలా చేయగలవు.
ఎడ్వర్టయిజింగ్ బిజినెస్ వుడ్ రూల్ అవర్ లైన్స్ సమ్ డే ఆర్ అదర్ అన్నది అక్షరాలా నిజమైందీ రోజు.
ఉత్పత్తి కన్నా అమ్ముకోవటమే కష్టమైన పని ఈ రోజుల్లో.
ఆ పని ఇప్పుడు హిడెన్ పరుష్యుయేడర్స్ చేతుల్లో వుంది.
ఈ ఎడ్వర్టయిజర్స్ ఇప్పుడు కేవలం హిడ్డెన్ ఫర్ ష్యు యేడర్స్ మాత్రమే కాదు- మోడరన్ సొసైటీ బలహీనతల్ని, భయాల్ని అలవాట్లను ఔపోసన పట్టిన సైకో సేల్స్ మెన్ లు కూడా.
ప్రచార ప్రపంచపు చీకటి రహస్యాల్ని, ప్రచార ప్రపంచపు తొలి గవాక్షం వెనుక దాగివుండే కుట్రల్ని, కుతంత్రాల్ని బయటపెట్టే ప్రయత్నంతో పాటు సక్సెస్ ఫుల్ ఎడ్వర్టయిజింగ్ సీక్రెట్స్ ని, ఇమేజ్ మేకర్స్ విజయం వెనుక దాగివుండే కిటుకుల్ని ఇందులో ప్రస్తావించాను.
ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ ఎడ్వర్టయిజింగ్ ప్రక్రియ 1950లో అమెరికాలో ప్రారంభమైంది.
"మేడిసన్ ఎవెన్యూ ప్రచారం అంటే తెలియజెప్పిన సంస్థ, వినియోగ దారుల్ని, సమ్మోహితుల్ని ఎలా చేయాలో చెప్పిన సంస్థ.
హిడ్డెన్ ఫర్ ష్యూయేడర్స్ పుట్టుక స్థలం అది.
యాడ్ ఎలిస్ డార్కెస్ట్ సీక్రెట్స్ ని తన కడుపులో దాచుకున్న సంస్థ మేడిసన్ ఎవెన్యూ.
ఈ మేడిసన్ ఎవెన్యూలో బయలుదేరిన ప్రచార మాయా ప్రపంచం ప్రపంచ దేశాలన్నిటిని కొన్ని సంవత్సారాలలోనే తన గాఢ పరిష్వంగంలోకి చేర్చుకోగలిగింది.
మనకు తెలీకుండానే, మన ప్రమేయం ఎంత మాత్రం లేకుండానే ఈ ఎడ్వర్టయిజర్స్ వల్లనే ప్రచారపు మత్తులో మనం పడిపోతాం. మన మెదళ్ళని, వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ట్యూన్ చేసుకోగలరు.
The keeps us spending.....మనల్ని ఇన్ స్ఫైర్ చేయగలరు. రెచ్చగొట్టగలరు- మధ్యపెట్టగలరు- టెంప్ట్ చేయగలరు. అలాంటి అల్లా ఉద్దీన్ అద్భుత దీపాలు వాళ్ళ చేతుల్లో వుంటాయి.
అఫ్ కోర్స్- వస్తువుల్లో గుణం లేకున్నా, మన్నిక లేకున్నా ఆ వస్తువు కొనటం మానేస్తామనుకోండి.
ఫలానా డిటర్జెంట్ సోప్ అమిత తెల్లగా ఉతుకుతుందన్నంత మాత్రాన ఆ సోప్ అమ్ముడుపోతుందా?
ఫలానా వ్యక్తి ఫోటోల్ని మోడలింగ్ కి వాడుకున్నంత మాత్రాన ఆ వస్తువు అమ్ముడుపోగలదా అనే అనుమానాలు ఎడ్వర్టయిజింగ్ గిమ్మిక్ మాత్రమే.
ప్రతి మనిషి ఒక సేల్స్ మెన్ అయినప్పుడే ఈ పారిశ్రామిక ప్రపంచంలో బ్రతకగలడు.
నీ దగ్గిర వస్తువు వుంటే ఆ వస్తువును- తెలివితేటలుంటే వాటిని బలం వుంటే ఆ బలాన్ని- అమ్ముకోగలిగినప్పుడే బ్రతికి బట్టకట్టి పైకి రాగలరు.
నేటి ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఓ అమ్మకపుదారుడే.
ఎవ్విరి మేన్ షుడ్ బికమ్ ఎ సేల్స్ మేన్ అదర్ వైజ్ దేరీజ్ నో ఎగ్జిస్టెన్స్.
గూండా తన బలాన్నీ, ధైర్యాన్నీ అమ్ముకుంటాడు.
న్యాయవాది తను న్యాయశాస్త్రంలో నేర్చుకున్న మతలబుల్ని అమ్ముకుంటాడు.