అక్కడ వున్న వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళూ ఆ బాధ్యత తామే తీసుకుంటామని ఉర్రూతలూగారు.
రాజు హత్యకు ప్రతీకారంగా దుర్గేష్ కి తిరిగి తలెత్తుకోలేనట్లు పరాభవం చెయ్యాలనీ, దుర్గేష్ కూతురు సుధని పాడుచెయ్యాలనీ తీర్మానించాడు తండ్రి. ఆ బాధ్యత తన మీద పెట్టాడు. ఆయనొక మాట అంటే, అది ఇంక అక్షరాలా అమలు జరిగి తీరాలని తనకి తెలుసు. అందరికీ తెలుసు!
ఏం చెయ్యాలా అన్న ఆలోచనలోనే నాలుగు రోజులు గడిచిపోయాయి రిజల్టు లేకుండా. రోజులు గడిచిపోతున్న కొద్దీ తండ్రికి అసహనం పెరిగిపోవడం తనకు అర్ధమవుతూనే వుంది.
అప్పుడు అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
దుర్గేష్ కి చాలా దగ్గరివాడయిన శంకర్ తనకి ఫోన్ చేశాడు_తనంతట తానుగా! కలలో కూడా ఊహించటం కష్టం ఆ పనిని!
తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు శంకర్.
ఆశ్చర్యం కలిగింది తనకి. అణుచుకుని అన్నాడు. "ఏమిటి?"
"నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి" అన్నాడు శంకర్.
"ఏ విషయం?"
"కోటలో ఉంటున్నాను. కోట రహస్యాలు తెలుసు నాకు. రాజెక్కడ వుంటాడో, రాణీ ఎక్కడ వుంటుందో, యువరాణీ ఎక్కడ వుంటుందో నాకు బాగా తెలుసు"
"ఇవన్నీ నాకెందుకు చెప్పడం?"
"మీరు దుర్గేష్ మీద పగ సాధించదలుచుకున్నారు, నేనూ అదే ప్రయత్నంలో వున్నాను"
"కానీ నువ్వు దుర్గేష్ కి చాలా దగ్గరి మనిషివి!"
"ఈ మధ్యే దూరమయ్యాను"
"ఎలా? ఎందుకు?"
కొద్ది క్షణాలు ఆగి అన్నాడు శంకర్.
"ఆడి దగ్గర ఊడిగం చేస్తోంది అమ్మనీ, ఆలినీ పోషించుకోవడానికి! ఆళ్ళనే అమ్మనా బూతులు తిట్టాడు ఆడు!"
"ఎందుకు?"
"గిట్టని వాళ్ళెవరో ఆడికి నామీద చాడీలు చెప్పారు. దుర్గేష్ ఇంటి సెక్యూరిటీ నేను చూస్తుంటా! సెక్యూరిటీ ఖర్చులో సగం నేను మిగుల్చుకుని తినేస్తున్నానని చెప్పి పురెక్కించారు ఆడికి! అందరి ముందూ నా అమ్మనీ, ఆలినీ తిట్టాడు ఆడు. నా గుండె మండిపోతోంది."
సంభ్రమంగా వింటున్నాడు తను.
శంకర్ దుర్గేష్ కోసం ప్రాణాలయినా పెడతాడని పేరుంది.
అలాంటి శంకర్, బాస్ బూతులు తిట్టడం వల్ల మారిపోయాడా?
బూతులు వాళ్ళకి కొత్త కావు. ప్రతి పదానికీ ముందో, వెనకో బూతు తగిలించి మాట్లాడే సంస్కారం తమ గ్యాంగులది. అలవాటయిన ఆ బూతులు ప్రత్యేకమైన అర్ధంలో ఉద్దేశించబడి వుండవు. కేవలం ఊత పదాల్లా వాడుగ్గా దొర్లిపోతుంటాయి అవి.
అవే మాటలతో అనేకసార్లు తిట్టి ఉండొచ్చు దుర్గేష్, శంకర్ ని.
సందర్భాన్ని బట్టో, అసందర్భం అనిపించోగానీ, ఈసారి ఆ నాటు మాటలే ఈటెల్లా శంకర్ గుండెకి గుచ్చుకుని వుంటాయి.
సంతోషం లేని నవ్వొచ్చింది తనకి.
ఒక్కొక్క మనిషిడి ఒక్కొక్క స్వభావం!
మనిషి, మనసే మిస్టరీ.
మళ్ళీ ఆ స్వభావం కూడా ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా మారిపోతూ వుంటుంది.
పుడుతున్న ఒక్కొక్కడి బ్రతుకూ ఒక కొత్త గ్రంథం.
ప్రతి జీవితం సృష్టిలో ఇదివరకు లేని ప్రత్యేకమైన కొత్త సబ్జెక్టు లాంటిది.
దేనికదే!
ఏ మనిషి ఎప్పుడు ఎక్కడ పుడతాడో, ఎలా పెరుగుతాడో, ఎక్కడ చస్తాడో ఎవరికీ తెలియని మిస్టరీ.
ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు మారతారో చెప్పడం ఎవడి తరమూ కాదు.
ప్రత్యక్ష సత్యం యిలా వుండగా, మనుషుల బతుకులన్నిటినీ ఏదో ఒక సిద్ధాంతం అనే బాట కట్టేసి, ఒకే గాట్లో వాళ్ళ జీవితాలు నడుస్తాయని వాదించే రాద్దాంత వాదులని తలుచుకుంటే మరీమరీ నవ్వొచ్చింది తనకి.
పైకి మాత్రం సీరియస్ గా అన్నాడు తను.
"అయితే ఇప్పుడేమిటంటావ్?"
"వాడిమీద పగ తీర్చుకునేటంత తాహతు నా ఒక్కడికీ లేదు. నన్ను మీతో కలుపుకోండి. వాడి కూతుర్ని గ్యాంగ్ రేప్ చేద్దాం!" అన్నాడు శంకర్.
నిదానంగా అన్నాడు తను. "ఆ పిల్లని చెడగొట్టే పని నేనొక్కణ్నే చెయ్యాలి."
"మీ ఇష్టం! మిమ్మల్ని ఆ పిల్ల గదిలో చేర్చే పూచీ నాది!"
"నువ్వు మాతోనే ఉన్నావనీ, మమ్మల్ని మోసం చెయ్యవనీ గ్యారంటీ ఏమిటి?"
"ఆపరేషన్ పూర్తి అయ్యేదాకా మా తమ్ముడు దుర్గేష్ మీ దగ్గరే వుంటాడు పూచీకత్తుగా!"
కొద్ది సెకండ్లపాటు మౌనంగా వుండిపోయాడు తను. తర్వాత అన్నాడు.
"సరే! సాయంత్రం నన్ను మా ఇంటి దగ్గర హోటల్లో కలు! నీ తమ్ముడితో కలిసి రా!"
సాయంత్రం శంకర్, అతని తమ్ముడు సంతోష్ కలిసి ఇరానీ కేఫ్ కి వచ్చారు. ఒక మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చుని వున్న తనని శంకర్ గుర్తుపట్టలేదు. నలిగిన బట్టలు వేసుకుని, బాగా వేజ్ లైన్ పట్టించి జుట్టు అణిచి వెనక్కి దువ్వి, చిన్న గెడ్డం అతికించుకుని వున్నాడు తను. అటూ ఇటూ చూస్తున్న శంకర్ ని తనే ముందు పలకరించాడు. తర్వాత చెప్పాడు_
"వెరీ సింపుల్ ప్లాన్! నువ్వు దుర్గేష్ ఇంటి సెక్యూరిటీకి ఇన్ ఛార్జ్ వి కదా! నేను ఎలక్ట్రీషియన్ ని అని చెప్పి లోపలికి తీసుకెళ్ళు. సుధ గది ఎక్కడుందో నాకు చూపించు. ఆ తర్వాత పని నే చూసుకుంటాను."
తల ఊపాడు శంకర్.
సంతోష్, తమ మనుషుల దగ్గర హోస్టెజ్ గా వుండిపోగా, తన శంకర్ తో కలిసి దుర్గేష్ ఇంటికెళ్ళాడు.
గేటు దగ్గర కాపలా వున్న వాళ్ళకి తనని చూపిస్తూ యధాలాపంగా అన్నాడు శంకర్. "రీవైరింగ్ చెయ్యడానికొచ్చాడు- ఎలక్ట్రీషియన్"
ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు.
ఇంటి వెనక నుంచి వున్న మెట్ల మీదుగా మొదటి అంతస్తుకి కెళ్ళాడు శంకర్. ఒక గదిలోకి వెళ్ళారు. చూడగానే తెలిసిపోతోంది. అది స్టోర్ రూం అని. పాతసామాన్లు అడ్డదిడ్డంగా పడేసి వున్నాయి.
తగ్గు స్వరంతో అన్నాడు శంకర్.
"రీమోడలింగ్ చేసిన ఇల్లు ఇది! పక్కనే వుంది సుధ బాత్ రూం. ఈ స్టోర్ రూంలో నుంచి బాత్ రూంలోకి తలుపు వుంది. నేను సుధ గదిలోకి వెళ్ళి గడియ తీస్తా! వీలు చూసుకుని నీ పని కానిచ్చెయ్."
తల పంకించాడు తను.
బాత్ రూంకి, స్టోర్ రూంకీ మధ్య వున్న గడియ తీశాక, ఏమీ ఎరగనట్లు వెళ్ళి తన పనిలో తను జొరబడిపోయాడు శంకర్.
ఆ చీకటి స్టోర్ రూంలోనే చాలాసేపు కాచుకు కూర్చున్నాడు తను.
తర్వాత టైం చూసుకున్నాడు.
తొమ్మిదిన్నర అవుతోంది.
అదే క్షణంలో....
నెమ్మదిగా బాత్ రూం తలుపు తెరుచుకున్న సవ్వడి.
కొద్దిగా తెరిచి వున్న స్టోర్ రూం తలుపులో నుంచి చూశాడు.
బాత్ రూంలోకి వచ్చింది డాక్టర్ సుధ. అన్యమనస్కంగా వుంది తను. వస్తూనే గీజర్ ఆన్ చేసింది. అప్రయత్నంగానే అద్దంలోకి చూసింది. అలా చూస్తూనే, నాభి దగ్గర కుచ్చెళ్లు లాగేసి చీర విప్పడం మొదలెట్టింది. మెకానికల్ గా బట్టలు విప్పేస్తున్నాయి ఆమె చేతులు.
నిర్నిమేషంగా చూశాడు తను.
ఒక్క అడుగు వెనక్కి వేసి, బాత్ రూంకి నాలుగు వేపులా ఉన్న అద్దాలలో నాలుగు యాంగిల్స్ లో కనబడుతున్న తన ప్రతిబింబాన్ని చూసుకుంది డాక్టర్ సుధ.
తర్వాత అప్రయత్నంగా పైకే అంది_ "ఛీ! ఈ ఆడ శరీరమే నాకో శాపం! నేను ఆడదాన్నయి పుట్టడం వల్లేగా వాడు నన్ను రేప్ చేస్తానని శపథం చేసింది!"
అని, అసహనంగా సోప్ తీసి, అద్దం మీదకి విసిరింది. సబ్బు అద్దానికి తగిలి, జర్రున జారుతూ వచ్చి డాక్టర్ సుధ కాళ్ళ దగ్గర పడింది.
షవర్ ఆన్ చేసింది సుధ. గోరు వెచ్చగా ఉన్నాయి నీళ్ళు.
కళ్ళు మూసుకుని, షవర్ కింద నిలబడింది.
కొండల్లో నుంచి, కోనల్లో నుంచి కిందకు ఉరుకుతున్న జలపాతంలా జారుతున్నాయి నీళ్ళు ఆమె వంటి మీద నుంచి.
నీళ్ళు ఇంకా వేడెక్కాయి.
వేడి నీళ్ళు పడి ఆమె వళ్ళు కందిపోయినట్లు ఎర్రబడుతోంది. ఐనా చలించకుండా, తనని తను పనిష్ చేసుకుంటున్నట్లు చాలాసేపు షవర్ కిందే నిలబడింది సుధ.
తర్వాత షవరూ, గీజరూ ఆఫ్ చేసి, ఒళ్ళు తుడుచుకుని, ఇస్త్రీ చీరె కట్టుకుంది. తన గదిలోకి వెళ్ళింది.
"భోజనం ఇక్కడికే తేనా? డైనింగ్ హాల్ కి వస్తారా అమ్మా?" అన్నాడు వంటమనిషి భయభక్తులతో.
"నేనివాళ భోజనం చెయ్యను" అంది సుధ ముక్తసరిగా.
"అమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారు"
"నేను చెబుతాలే! నువ్వెళ్ళు" అంది కసురుతూ.
వంటవాడు వెళ్ళిపోయాడు.
వినబడుతున్న ప్రతి శబ్దాన్నీ చెవులు రిక్కించుకుని వింటున్నాడు తను.
ఆమె పరుపు మీదికి ఒరిగిన సవ్వడి. చీరె గరగర.
ఆ తర్వాత....
పుస్తకం తిరగేస్తున్నట్లు కాగితాల రెపరెప.