ఆయనకావిషయం తెలిదు___మరో రెండు నిమిషాల తర్వాత_ ఆశోకా హొటల్నించి కార్లు ర్తేల్వే స్టేషన్ కేసి దూసుకుపోయాయి.
* * *
సరిగ్గా నలభ్తే నిమిషాల తర్వాత____
హొటల్ ఆశోకా ఇంటర్నేషనల్ పోర్టికోలో ఒక టాక్సి వచ్చి ఆగింది.
అందులోంచి_____
దిగ్రేట్ ఇండస్టి యలిస్ట్.....హొంమంత్రి హరికృష్ణమనాయుడు కూతురు ముక్తానంద దిగింది హుందాగా.
* * *
ముక్తానంద....వ్తేట్ బ్యూటి ....తెల్లగా ,అందంగా ఉంటుంది.
చూడగానే ఇటాలియన్ లా ఉంటుంది. పారిస్ నుంచి తెచ్చిన పాలరాతి విగ్రహానికి ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. కొంతమంది చూడగానే గోవాలోని సాయం సంధ్య మ్తేసూరు ప్యాలెస్ లో అండమ్తెనరవి వర్మ చిత్రాలు జ్ఞాపకానికొస్తాయి___
ఒక అందమ్తెన అమ్మాయిగా__ముచ్చటైన నల్లటి అమ్మాయిగా - ముక్తానందను చూడగానే భావుకులకు ఆ పోలికలన్ని గుర్తుకొస్తాయి.
ఒక్కొక్కప్పుడు విశాలమ్తెన ఆమె కళ్ళు ప్రేమదారాలు వర్షిస్తే మరోక్కప్పడు చండ్రనిప్పులు కురిపిస్తాయి అన్న విషయం కొంతమందికే తెలుసు ముఖ్యంగా హరికృష్ణమనాయుడుకి బాగా తెలుసు.
* * *
హొటల్ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకొచ్చిన ముక్తానంద దగ్గరకు పరుగులాంటి నడకతో ఒక వ్యక్తి వచ్చాడు.
"గుడ్....ఈవెనింగ్ మేడమ్....మ్తేనేమిజ్ ప్రవీణ్. మీకోసం వెయిట్ చేసి, డాడి జ్తేపూర్ వెళ్ళారు" చెప్పాడు ప్రవీణ్ కంగారు పడిపోతూ___
"జ్తే పూర్ ఎందుకెళ్ళారు...." వెంటనే అడిగింది ముక్తానంద.
"అభినందన సభకి మేడమ్"
"డాడెకే పోర్ట్ పోలియో ఇచ్చారు?"
"హొం...మేడమ్..."
ఆమాటకు ముక్తానంద పెదవుల మీద చిరునవ్వు వెల్లి విరిసింది.
"ఒకవేళ మీరు జ్తే పూర్ కి రాలేకపోతే డాడి మిమల్ని మద్రాసుకు రమ్మనిమని చెప్పమన్నారు" మళ్ళి చెప్పాడు ప్రవీణ్.
"మద్రాసుకా...." ఆలోచనలో పడింది ముక్తానంద.
"జ్తే పూరుకు ఎ ప్లయిట్ వెళ్ళారు డాడి."
"ప్లయిట్లో కాదమ్మా....ప్యాలేస్ ఆం విల్స్ పార్టి మెంబర్స్ తో వెళ్ళారు.ఈ పాటికి టైన్....స్టేషన్లోంచి, వెళ్ళిపోయుంటుందమ్మ."
ఇమ్మిడియాట్ గా తను మద్రాసు వెళ్ళలేదు. అహమ్మదాబాద్ లో ఇంకో అయిదు రోజుల పనుంది.
"ప్యాలెస్ ఆన్ విల్స్ వెళ్ళిపోయుంటుందా....ఆర్యూఘర్..... ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి."
ముక్తానంద నోట్లోంచి ఆ మాట రావడంతో, రిసెప్షన్ కౌంటర్ వేపు పరుగేత్తాడు ప్రవీణ్.
మూడ్నిమిషాల తర్వాత పరుగెత్తుకుని వెనక్కోచ్చాడు.
"సారి మేడమ్....ఎంగేజ్ వస్తోంది."
మరేమత్రం ఆలోచించలేదు ముక్తనంద.
పోర్టికోలోకొచ్చి అప్పడే వచ్చి ఆగిన టాక్సి ఎక్కింది.
"రేల్వే స్టేషన్ "డ్తె వర్ తో చెప్పింది ముక్తానంద.
ప్రవీణ్ వచ్చేలోపే టాక్సి ముందుకు దూసుకుపోయింది.
* * *
ముక్తానంద డిల్లి సెంట్రల్ ర్తేల్వే స్టేషన్ కి చేరడానికి పది నిమిషాల ముందే__
ప్యాలెస్ ఆన్ విల్స్ వెళ్ళిపోయింది.
తండ్రి ప్రమాణ స్వీకారాన్ని కళ్ళారాచూసి ముందుగా తనే తండ్రిని కంగ్యచ్యులేట్ చెయ్యాలనుకొంది.
కానీ అహమ్మదాబాద్ లోనే ప్లయిట్ రెండు గంటలు లేటుగా బయలు దేరింది.
అహమ్మదాబాద్ వెళ్ళిపోవడమా? మార్నింగ్ ప్లయిట్ కి మద్రాసు వెళ్ళడమా? ఏది నిర్ణయించుకోలేని సందిగ్ధ స్ధితి.
స్టేషన్ లోంచి బయటికొచ్చి, రోడ్డు ప్రక్కన నడుస్తోంది ముక్తా నంద అన్యమనస్కంగా.
టైమ్ సెన్స్ ఎక్కువ ముక్తానందకు.
ఇండియన్ ఎయిర్ ల్తేన్స్ మీద బాగా కోపం వచ్చింది.
"హొటల్ ప్రోగ్రామంతా ఆప సెట్ అయిపోయింది." అని విసుక్కుంది లోలోనే. తలెత్తి టాక్సికోసం దిక్కులు చూస్తున్న ముక్తానంద తనని దాటిపోయి, ముందుకెళ్ళి మళ్ళి వెనక్కొచ్చిన పిలిసు జీపును చూసి ఆశ్చర్యపోయింది.
తను హొం మినిస్టర్ కూతురునని, లిప్ట్ ఇవ్వడానికి పిలిస్ జీపు ఆగిందా? అప్పడే ఎలా తెలుస్తుంది?
ఓరకంట జీపు స్టిరింగు ముందు కూర్చున్న వ్యక్తి వేపు చూసింది.
ఎవర్తే ఉంటాడు....? ఎవరో సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్ధాయి ఆపిసర్. ఈ పిలిసు జాతికి అదనపు తెలివి తేటలు, వరల్లాగా వచ్చేస్తాయి కాబోలు తను మినిస్టర్ కు చెందిన రిలేటివ్స్ సులభంగా గుర్తుపట్టేస్తారు స్టిరింగు ముందు కూర్చున్న ఆఫీసర్ తెల్లగా నార్త్ ఇండియన్ లా మెరిసిపోతున్నాడు.
ముక్త మొఖం వేపు చూస్తూ ప్రశాంతంగా నవ్వాడు. ఆ నవ్వు ఆడపిల్ల నవ్వులా చాలా బాగుంది.
ఆ నవ్వును, ఎక్కడో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం ....అనుమానంగా అతని వేపు చూసింది ముక్త.
దిగంతాలు స్వప్నాలు కంటున్న వేళ.....