Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 6

        వెంటనే బామ్మగారు " ఏంటి నాయనా అన్నావ్?" అంది.

    " అబ్బే,ఏంలేదు. విచారిస్తున్నాం" అన్నాడు అబ్బులు విచారంగా ముఖం పెట్టి.

    తప్పదన్నట్లు వ్యాకర్ణ కూడా బిలేదు  విచారంగా ముఖం పెట్టాడు.

    " చూశారా చూశారా! మొగపిల్ల కాయలు నా కధ మికే విచారం కలిగిస్తుం దంటే ఆ సమయంలో నా కెంత విచారం కలిగించి వుండాలి? చా... చా.. అవును కదా? ఏం చేస్తాను. తప్పుతుందా? నా నుదుట గీత అలా వుంది.

    ఓపక్క ఆయన్ చేసిన అన్యాయం- మరోపక్క ఏడాది పసిగుడ్డు- మరోపక్క నెత్తిన ఈ ముళ్ళకిరీటం- నా సంగతి నా దుఃఖం ఆ పరమాత్ముడి కెరుక.

    ఆయన బ్రతికుండగా సర్వసౌఖ్యాలు చూపించారు. పోతూపోతూ " ఇహ నీ ఏడుపు నీ వేడువు" అని ఈ ముళ్ళకిరీటం నెత్తిన పెట్టి దీవించి మరీపోయారు.

    ఏం చేస్తాను. నాకు ఆయుష్షు వుండబట్టి యింకా బతికి వున్నాను. మనిషన్న తర్వాత కష్టాలు తప్పవు.

    ఇంతకూ మి కష్టం చెప్పారు కాదు" అంటూ బామ్మాగారు ముక్కు చీదుకుని నెత్తిన చెంగు సవరించుకున్నారు.

    అబ్బులికి, వ్యాకర్ణకి బాగానే అర్దమయింది బామ్మగారి కధ. బామ్మగారి భర్త బామ్మగారితో ఏడేళ్లు మాత్రమే కాపురం చేసి చనిపోయ్యారు.

    బామ్మగారు ఉన్న ఒక్క కొడుకునీ పెంచి పెద్ద చేసింది. ఆవిడ మాటకు ముందు నెత్తిమిద గుడ్డ సవరించుకుంటూ లేక ముందుకు లాక్కుంటూ బహు ముచ్చటగా అనేమాట ముళ్ళకిరీటం ( నెత్తిన ముసుగు) అని... ముసుగు అంటే నచ్చక కిరీటం అంటే గుండుకి తగిలించుకోరు గాబట్టి ముళ్ళకిరీటం అంటూ వుంటుందని...  గ్రహించారు. బామ్మగారు అమాయకురాలు. అల్ప సంతోషి అని గ్రహించి బామ్మగారి కొచ్చిన కష్టానికి ఒక్కొక్కరూ విచారం వెలిబుచ్చి, జాయింటుగా వెలిబుచ్చి, చివరికి వీళ్ళ కష్టం అనగా అద్దెకి గది కావాలని అడిగారు.

    బామ్మగారు వీళ్ళిద్దరికి రెండు గదులున్న ఖాళీ వాటాను చూపించింది.

    అబ్బులకి వ్యాకర్ణకి గదులు నచ్చాయి. రెండు గదులు కాబట్టి రేటేక్కువ అనుకున్నారు.

    కాని బామ్మగారు అద్దె తక్కువే చెప్పింది.

    మిత్రులకి బోలెడు సంతోషం వేసింది. ఎందుకయినా మంచిదని బ్రహ్మచారులమని చెప్పాడు అబ్బులు.

    " మంచితనం చెడ్డతనం మనిషిలో వుంటుంది. బ్రహ్మచారయినా, పెళ్ళయిన వాడయినా, నలుగురు బిడ్డలా తండ్రయినా మంచివాడు ఎప్పుడూ మంచవాడే" అంది బామ్మగారు.

    బామ్మగారి మాటలు విన్న వ్యాకర్ణ, అబ్బులు బామ్మగారి రెండు కాళ్ళూ పట్టుకుని గాని లేక చెరో కాలు పట్టుకుని గాని నమస్కారం పెడదామనుకున్నారు.

    సినిమాలో అయితే బాగుంటుంది గాని నిజజివితలో ఎలా బాగుంటుందని మానివేశారు.

    ఎందుకయినా మంచిదని బామ్మగారిని పొగడటం మొదలుపెట్టారు.

    అప్పుడే " ఎవరు వీళ్ళు? ఎందుకోచ్చారు?" అంటూ ఓ టినేజ్ అందమైన అమ్మాయి వచ్చింది అక్కడికి.

    అబ్బులు భూతద్దాల కళ్ళజోడులోంచి నాలుగు కళ్ళతో ఆ అమ్మాయిని ఎగాదిగా చూశాడు.

    వ్యాకర్ణ రెండు కళ్ళతోనే చూశాడు. అయితే వ్యాకర్ణ తక్కువ తినలేదు. తనూ ఆ అమ్మాయిని ఎగాదిగా కిందనుంచి పైకి, పైనుంచి కిందకి చూశాడు.

    రెండు జడలు వేసుకొని ఆ అమ్మాయి అందంగా ముద్దుగా బొద్దుగా బాగుంది.

    ప్రస్తుతం ముఖం సీరియస్ గా బామ్మాగ్రి ముఖంలో చూస్తూ నడుంన చేతులు కట్టుకు నంచుంది.

    "ఈ అబ్బాయిలు చాలా మంచివాళ్ళే జయా! తూర్పుభాగం రెండు గరులలోకి అద్దెకొచ్చారు" అంది బామ్మగారు.

 Previous Page Next Page