"రాజా, ఏమయ్యా! బాణంలా వచ్చి బంతిలా పడిపోయావు! డెయిజీ హైజీ కహాఁజాయేగీ? కావాలంటే బ్యూటీపెరేడు చేయిస్తాడు సూర్యారావు డెయిజీయే కావాలంటావా, క్షణంలో రప్పిస్తా" అని ఫోను డయల్ చేశాడు.
"రాజా! ఇలా ఒక చెక్కు పారేయి, ఆరువేలకు వచ్చేస్తుంది డెయిజీ 5,000 ఆ సినిమావాళ్ళ ముఖానకొట్టి, వెయ్యి మైకేలుగాని ముఖాన కొడ్తా ఈ సూర్యారావుకు నయాపైసా అవసరం లేదు రాజా ఆనందించాలి అంతే కావలసింది సూరికి మైకేలున్నాడే, వాడు షైలక్ అవతారం పుట్టబోయే మైకేలును దృష్టిలో పెట్టుకొనే షేక్స్పియరు వికారాఫ ది నేక్ ఫీల్డు రాశాడు ఇలా పారెయ్యండి చెక్కుబుక్కు మీకెందుకు శ్రమ?" అని చెక్కుబుక్కు లాక్కొని రాశాడు యాంత్రికంగా సంతకం చేశాడు రాజారావు "ఈలోగా కాస్త మందు పుచ్చుకోండి ఆర్డరిచ్చి వెళ్తా" అంటూ పరుగెత్తినంత వేగ్మగా నడిచి వెళ్ళాడు సూర్యారావు.
* * *
డెయిజీ చిరునవ్వు కురిసింది వెన్నెల విరిసింది రాజారావుకు నందనం వెలిసింది దగ్గరికి లాక్కున్నాడు "నన్ను వదిలి వెళ్ళిపోయావు కదూ! నాకన్నా ఉద్యోగం ఎక్కువైందికదూ?" అన్నాడు.
"మైడియర్ రాజా! వచ్చేశాగా" అని టేబుల్ మీద ఉన్న గ్లాసు రాజాకు అందించింది.
"డెయిజీ డార్లింగ్! నువ్వు ముందుంటేనే మస్తుగా, మత్తుగా ఉంది ఇంకా గ్లాసెందుకూ?" అంటూనే ఒక్క గుక్క మింగేశాడు.
డెయిజీ కిలకిలా నవ్వింది "నాకేది గ్లాసు?"
రాజారావు ముఖం వెలవెల బోయింది ఏదో తప్పు చేసినవాడిలా ముఖం పెట్టాడు ఏమనాలో అర్ధం కావడంలేదు ఆ అమాయకత్వంలో మునిగితేలింది డెయిజీ.
"ఊరికే అన్నా వేరే గ్లాసెందుకూ?" అని ఆ గ్లాసుతోనే రెండు గుటకలు వేసి రాజారావు నోటికి అందించింది రాజారావు ముఖం విప్పారింది "థాంక్స్" అని మింగేశాడు.
ఈ తడవ డెయిజీకి జార్జి గుర్తుకు రాలేదు రాజాను తన రాజాగా గుర్తించింది ఎంత మంచివాడు! ఇట్టే తనవాడై పోయాడు! ఇంతలో సూర్యారావు మాటలు గుర్తుకువచ్చాయి నీకు చేతకాకుంటే గుర్రప్పందాలకు తీసుకురా, నేనే చూసుకుంటా అన్నాడు తన చేతకానితనం సూర్యారావుకు చూపదలచలేదు తానే సాధించాలనుకుంది కాని, తీరా రాజారావు కనిపించేవరకూ, అతని మాటలు వినేవరకూ తనలో ఏదో బలహీనం ప్రవేశించింది సినిమా తీయడానికి డబ్బడగాలి తండ్రి చెప్పాడు, తాను ఇల్లు కొనుక్కోవడానికి డబ్బిమ్మని అడగమని ఎలా అడుగుతుంది తాను? ఏదో మమత ఏర్పడింది తనలో తనను నమ్మినవాణ్ణి నిలువునా మోసం చేయడమా? ఎందరిని మోసగించలేదు తాను? ఎందరికి తనను అమ్ముకోలేదు? ఏమిటీ దౌర్భల్యం? అడిగేద్దామనుకుంది పిండుదామనుకుంది కాని, మనసొప్పలేదు ఈ పని సూర్యారావుకే వదిలివేయడం మంచిదనుకుంది భుజాల మీద చేతులువేసి ముఖంలోకి చూస్తూ "డార్లింగ్! ఎప్పుడు ఈ గదిలోనేనా? బయట ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో చూచావా? ఈ రోజు 'జాక్ పాట్' గుర్రప్పందాలు ఎలా ఉంటాయనుకున్నావు! సిటీ యావత్తూ అక్కడే ఉంటుందనుకో ఆడ, మగా జంటలుగా ఎంత ముద్దుగా ఉంటారనుకున్నావ్! మనమూ వెళ్దామా? ఇద్దరమూ జతగా వెళ్ళాలని ఉంది" అన్నది.
గుర్రప్పందాల్లో లక్షలు కోల్పోయినవాళ్ళున్నారు దివాళా తీసి విషం పుచ్చుకుని చచ్చిన ఒకని విషయమూ తెలుసు రాజారావుకు నారాయణరావుగారు ఆ పిచ్చితోనే అడుగంటారనీ తెలుసు అయినా, అవేవీ అతనికి స్ఫురించలేదు "పద వెళ్దాం, నేనూ ఎన్నడూ చూళ్ళేదు" అన్నాడు.
ఇద్దరూ బయల్దేరారు కారు చాదర్ ఘాట్ బ్రిడ్జివద్ద ఆగిపోయింది రోడ్డంతా కార్లమయం అయిపోయింది బ్రిడ్జిమీద నాలుగు వరసలుగా కార్లు సాగుతున్నా ట్రాఫిక్ కదలడంలేదు అడుగు కదిలేవరకు అయిదు నిమిషాలు అవుతూంది ఒకనికంటే ముందు ఇంకొకడు పోవాలని ఆదుర్దా ముందుకుపోయి మళ్ళీ అదే నడక ట్రాఫిక్ పోలీసుల విజిల్స్ అసలు ఇన్ని కార్లు పట్నంలో ఉన్నాయనికూడా ఊహించలేదు రాజారావు.
"డెయిజీ! ఏమిటి ఇంత రష్?"
"ఆనందం కొనుక్కోవడానికి"
అర్ధం కాలేదు రాజారావుకు చిరునవ్వు నవ్వేశాడు వెనక కార్ల హారన్లు కారు నడిపించాడు రేస్ కోర్సుకు చేరి జంటగా లోనికి ప్రవేశించాడు.
"హల్లో రాజా! వచ్చేశావూ? ఇవ్వాళ నగరం యావత్తూ ఈ కోర్సులోనే వుందనుకో - సినీజనం, రాజకీయాలు, కంట్రాక్టర్లు, వ్యాపారులు, అధికారులు ఈ జాక్ పాట్ మనదే-లక్షా యాభైవేలు అయినా,మనం సినిమా తీయం మీ పేరే తెరకెక్కాలి. ఆంద్రదేశం యావత్తూలోనూ రాజారావుగారి పేరు మారుమ్రోగాలి పదండి గుర్రాలు చూద్దాం" అని డెయిజీవైపు ఒక రకంగా చూచాడు డెయిజీ బ్యాండువైపు చూస్తున్నట్లు నటించింది.
రాజారావు కదిలాడు తెలిసిన కంట్రాక్టర్లు చాలామంది కనిపించారు కాస్త సిగ్గనిపించింది కొందరు అమ్మాయిలను రాచుకుమ్తూం చేతులు కలుపుకొని తిరిగేవారూ కనిపించారు అతనికి ధైర్యం వచ్చింది డెయిజీతో చేతులు కలుపుకొని నవ్వుతూ మాట్లాడుతూ సాగిపోతున్నాడు ఇప్పుడతని కేదో గర్వంగా, గౌరవంగా అనిపించింది గుర్రాల్ను జనానికి చూపిస్తున్నారు "ఆ మూడో నెంబరు గుర్రం చూచావూ? కొట్టిందనే అర్ధం! చెవిమీద తెల్లనిమచ్చ, అదీ అసలు అదృష్టం వేయిపెట్టు, ఎనిమిదివేలు వస్తాయి ఏ సినిమా తీసి సంపాదించేము? ఏ కంట్రాక్టు చేసి సంపాదించేము? ఒక్క వేయి గంటలో ఎనిమిదివేలు ఎంత మంచి చౌకబేరమూ, ఊఁ రాజా! ఒక్క వేయి ఎక్కువ అవసరం లేదు" డెయిజీవైపు చూశాడు రాజారావు డెయిజీ మనసు కలవరపడింది వద్దని చెప్పేద్దామనుకుంది అసలు సూరి దుర్మార్గుడని పెద్దగా కేకవేద్దామనుకుంది సూరి చూచాడు ఏవో బల్లాలు గుచ్చుకున్నాయి బాధగానే నవ్వింది.
రాజారావు డబ్బు యిచ్చాడు.
అంతా గ్యాలరీకి కదిలారు డెయిజీ రాజా ప్రక్కనే కూర్చుంది సూరి మూడు గ్లాసులు తెచ్చాడు ముగ్గురూ పుచ్చుకుంటున్నారు జనమంతా లేచి నుంచున్నారు కీచు ధ్వని వినిపించింది "పందెం మొదలైంది" అని రాజా లేచాడు అంతా బెంచీలమీద నుంచున్నారు గుర్రాలు పరుగెడుతుంటే గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి మూడో నెంబరు గుర్రం వెనకబడింది ఒకటో నెంబరుది వచ్చేస్తూంది మూడోది ఒకటోదానివెనక వచ్చేసింది ఈలలు కేకలు ఒకటోదాన్ని దాటిపోయింది మూడోది ఆనందంలో చేతులో గ్లాసుందని మరిచి చప్పట్లు చరిచింది డెయిజీ గ్లాసు ధన్ మని పగిలినది మూడో గుర్రం దూసుకుపోయింది.
రాజారావు గెలిచాడు.
డెయిజీ చేయి గట్టిగా నొక్కి కొగిలించుకున్నంతపని చేశాడు.
సూరి షేక్ హ్యాండిచ్చి కౌగలించుకున్నాడు.
మళ్ళీ బుక్కీస్ దగ్గరికి బయల్దేరారు.
ఆ రోజు జరిగిన నాలుగు పందాలలోనూ పోనూ రానూ రాజారావుకు పదివేలు పెచ్చువచ్చింది.
రాజారావు మహాదానందంలో ఉన్నారు.
సూర్యారావు సినీజనాన్ని డెయిజీ సహితంగా రాజారావుకు పరిచయం చేశాడు
రాజారావు తన అంతస్తు హోదా, గౌరవం పెరిగినట్లుగా భావించాడు.
సూరిమీద గౌరవభావం ఏర్పడింది.
"ఎక్కడికి వెళ్దాం?" అడిగాడు రాజా.
"మళ్ళీ మురికిపట్నంలో కెందుకు? చలో గండిపేటకు" అన్నాడు సూరి.
"బ్యూటిఫుల్ అయిడియా! మూన్ లైట్ ఎంజాయ్ చేయాలంటే గండిపేటకే వెళ్ళాలి" అనేసింది డెయిజీ.
"ఆల్ రైట్, పదండి" అని రాజారావు కారెక్కి స్టీరింగ్ అందుకున్నాడు మిగతా ఇద్దరూ కారెక్కారు కారు కదిలింది.
"మైడియర్ రాజా! గ్రహాల్ను గడియారం ముల్లులాగా తిప్పేశావోయ్ లక్ నీ చెక్ లో కొచ్చేసింది ఇక నీవు పట్టిందే బంగారం నా జాక్ పాట్ పోయినా నీకో లక్ పాట్ వచ్చేసింది ఈ సూర్యారావున్నాడు చూచావూ - తనకోసం బ్రతకడు నువ్వు మురిసిపోయావా? అంతేచాలు వీడికి అన్నట్లు మరచా నాకు నయాగరాలో అర్జంటు ఎంగేజ్మెంటుంది నాకో బల్బుల్ దొరుకుతే ఉస్మాన్ సాగర్ లో పడ్తా నన్ను నయాగరాలో డ్రాపుచేయి"
డెయిజీ కృత్రిమపు నవ్వు నవ్వింది కళ్ళలో భయం దడ దడలాడింది కొంత డబ్బు కాజేసి నయాగరావద్ద దిగిపోయాడు సూర్యారావు.
కారు శరవేగంగా సాగిపోతూంది.
* * *