సీత సల్లకీ లతలా గజగజ వణకుతూ కన్నీరు కార్చింది డగ్గుత్తుకతో "లక్ష్మణా! ఈ దుఃఖానికి ఔషధంలాంటిదగు చితి పేర్చు మిధ్యాపవాదానికి గురియైన నేను జీవించలేను" అన్నది సీత ఇలా అనగా లక్ష్మణుడు దీనంగా రాముని వైపు చూశాడు రాముడు అందుకు అంగీకరించాడని గ్రహించి చితి పేర్చాడు.
ఇంక చదవలేకపోయింది, "సీతమ్మ తల్లీ! ఎన్ని చెరలు పడ్డావమ్మా?" అనుకోని "రామయ్యా, ఇంత కఠినమా తండ్రీ? సీత శీలం నీకు తెలియనిదా? ఆమెను చితిలో పెట్టి కాల్పిస్తావా?" అనుకుంది.
పుస్తకం మూసి అక్కడపెట్టి రాజారావు గదికి వెళ్ళింది ఇంకా నిద్రలోనే ఉన్నాడు గది తలుపులు తెరచి లోపలికి వెళ్ళింది తలుపు తెరచే ధ్వనికి లేస్తాడనుకుంది, లేవలేదు మంచం పక్కన నుంచుంది దుప్పటి ముఖంమీదినుంచి తొలగించింది మళ్ళీ కప్పుకున్నాడు "లేవండి, పదిన్నర అయింది" భుజం తట్టి లేపింది లేచాడు రాజారావు పార్వతి కనిపించింది తెలియని కోపం ప్రజ్వరిల్లిందతనిలో "ఛీ! నీ పాడుముఖం చూపించడానికి లేపావా? ఫో అవతలికి" అని కసిరాడు.
పార్వతి వణికిపోయింది పిడుగు పడినట్లు గడగడలాడింది గొంతు పూడుకుపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి మెదడు మొద్దుబారిపోయింది ఏమనాలో, ఏంచేయాలో తోచలేదు స్థాణువులా నిలుచుండిపోయింది.
రాజారావు లేచి మంచంలో కూర్చున్నాడు అలా నుంచున్న పార్వతిని చూచి జాలి కలిగే బదులు కోపం మండింది "ఎందుకలా రాయిలా నుంచున్నావు? ఫో ఇక్కన్నుంచి" అని చేతిలో నెట్టాడు.
పార్వతికి ఏమీ అర్ధం కావడంలేదు ఎందుకిలా అంటున్నాడో ఆలోచించే స్థితిలో గూడా లేదు తూలి రెండడుగులు వెనక్కువేసి నిలదొక్కుకుని నుంచుంది.
గుమ్మంలో నుంచున్న పార్వతి తండ్రి నారాయణరావు ఇదంతా చూస్తున్నాడు నారాయణరావు పొడవైనవాడు స్ఫురద్రూపి ఒకప్పుడు అతడు బలవంతుడేకాని ఇప్పుడు ఎముకల గూడుకు చర్మం తొడిగినట్లున్నాడు బాగా వదులైన పైజామా, లాల్చీ వేస్తాడు చెంపలు ఎండుకపోయిన చెరువుల్లా ఉంటాయి ముక్కు పొడవు కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి అతని బ్రతుకు బ్రాందీ వినోదం చదరంగం.
పూర్వం సంపన్నుడే నారాయణరావు గుణవంతుడు, శీలవంతుడు, పరోపకారపారీణుడుకూడా కాని, అతనికి గుర్రపు పందాలపిచ్చి పట్టుకుంది దానికి అనుబంధంగా అంటుకున్నదే త్రాగుడు త్రాగుడు ఆరోగ్యాన్నీ, పందాలు ఆస్తినీ హరించగా అల్లుని ఆశ్రయంలోకి వచ్చాడు అల్లుడు రోజా బ్రాందీకి డబ్బిస్తాడు బ్రాందీ మంచినీళ్ళప్రాయం అయిందతనికి నల్లమందుకూడా అలవాటు చేసుకున్నాడు బ్రాందీ, నల్లమందు సేవించడం, ఎవరూ దొరక్కుంటే తానే ఇరుపక్షాల చదరంగపు ఆట ఆడడం అతని జీవితం మరో ప్రపంచం తెలియదతనికి భారతదేశంలో ఆంగ్లప్రభుత్వం వున్నా, ప్రజాప్రభుత్వంవున్నా అతనికి అక్కరలేదు.
రాజారావు మామగారిని ఇంట్లో ఉంచుకొని ఇంతఖర్చు ఎందుకు భరిస్తున్నాడూ అంటే అందులో ఒక రహస్యం ఉంది రాజారావు కొంత కాలం అబ్కారీ కంట్రాక్టులుచేసి లక్షలు ఆర్జించాడు కాని, ప్రభుత్వానికి ఎగనామం పెట్టాడు తెలివిగల అధికారుల సలహతో ఆస్తినంతా మామగారిపేర పెట్టాడు.
పార్వతి దుఃఖం పొంగింది జలజలా కన్నీరు రాల్చింది ఏదో అగ్గిలో పెట్టి ఊదుతున్నట్లూ, కాళ్ళకింది భూమి జారిపోతున్నట్లూ అనిపించింది తండ్రివైపు చూచింది అతనిలో చలనం కనిపించలేదు భర్తను చూచింది అతడింకా మండిపోతూనే ఉన్నాడు పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
"ఫో ఇక్కన్నుంచి" - గర్జించాడు రాజరావు.
ఎవరో కొరడాతో కొట్టినట్లూ, మెడపట్టి గెంటుతున్నట్లూ అనిపించింది ముఖాన కొంగు కప్పుకొని అక్కన్నుంచి వెళ్ళిపోయింది పార్వతి.
గుమ్మంలో నుంచున్న నారాయణరావు పక్కకు తొలగి దోవ ఇచ్చాడు.
నారాయణరావును చూచాడు రాజారావు కోపం విసుగ్గా పరిణమించింది "జేబులో ఉంది తీసికెళ్ళండి, ఇదొకపీడ" అన్నాడు.
నారాయణరావుకు వినిపించింది జేబులో ఉందనే విషయమే తరవాతదేమీ అతనికి వినిపించలేదు చరచరా గదిలోకి వెళ్ళి జేబులోంచి డబ్బు తీసుకొని తన గదిలోకి వెళ్ళి చదరంగం ముందు కూర్చుని ఉన్న చంద్రయ్యకు అందించాడు చంద్రయ్య డబ్బందుకొని సైకిలు మీద వెళ్ళిపోయాడు.
రాజారావుకు ఇంకా రాత్రి మత్తు వదలలేదు డెయిజీ ఇంకా అతని కళ్ళల్లోనే ఆడుతూంది ఏదో కొత్త యుగం, కొత్త జీవితం ప్ర్రారంభం అయినట్లుందతనికి డెయిజీ దగ్గరికి వెళ్ళాలనే తహతహ ఎక్కువైంది ముఖం కడుక్కున్నాడు స్నానమైనా చేయకుండా బట్టలు మార్చుకున్నాడు బయలుదేరుతుంటే కాఫీ, టిఫిను తెస్తున్న పార్వతి ఎదురైంది ఆమెవైపు చురచుర చూచి వెళ్ళిపోయాడు.
పార్వతి చేతులు వణికాయి.
పోర్టికోలో కారెక్కుతుంటే కనిపించాడు సూరి అప్పుడే టాక్సీ దిగాడు.
"హల్లో హీరో రాజా! రాత్రంతా రాజ్యమేలావు అప్పుడే బయలుదేరావే! ఘటికుడివే" కారు నడుస్తుంటేనే మజా నుంచుంటే ఏముంది? ఊఁ సాగనియ్" కారెక్కాడు సూరి కారు సాగింది.
"ప్రొడ్యూసర్ రాజా! పహ్దిమంది కవులు పదేళ్ళు పరితపించినా తోచని పేరు ఎన్నిక చేశా మన సినిమాకు పేరు ఆహా ఆ పేరు వింటేనే చాలు, జనం విరగబడాల్సిందే శతదినోత్సవం తరువాతకూడా బ్లాకులో అమ్మాల్సిందే టిక్కెట్లు పేరు చెప్పకముందే డిస్ట్రిబ్యూటర్లు విరగపడుతున్నారు! మన పలుకుబడి అలాంటిది పిక్చరు పేరుతోనే హక్కులు అమ్మేయగలం.
"డిస్ట్రిబ్యూటర్లు మన ఇంటిముందు పడిగాపులు కాయాల్సిందే" అని రాజారావును చూచి "వినడం లేనట్లుందే" అని నసిగాడు.
"వినకేం, వింటూనే ఉన్నా ఇంతకూ ఆ పేరేమిటో చెప్పావు కాదు?"
"చెపితే ఇంకేముంది? ఆ పేరుకే ఇస్తారు పదివేలు ఎవరైనా అసలు కథలో ఏముంది? ఉన్నదంతా పేరులోనే అయినా, పిక్చరు మనం తీస్తున్నాం కాబట్టి, పేరుకు డబ్బులేదు కాని, పదిమంది సినీ రచయితలు ఉస్మాన్ సాగర్ కూ, హిమాయత్ సాగర్ కూ, కిద్వాయ్ గార్డెన్ కూ తిరిగి తిరిగి చర్చలు జరిపి అంగీకరించారు వారి ఖర్చులకు అయిదువేలు! ముష్టి అయిదువేలు" మనం కాబట్టి అడ్వాన్సు లేకుండా అంగీకరించారు అయిదువేలు అలా పారేశారా అంటే డిస్ట్రిబ్యూటర్లు మన ఇంటిముందు పడిగాపులు కాయల్సిందే ఆఁ - మరచాను రాత్రి బాపతు వేయి ఇచ్చారు కారు మైకేలు ప్రాణాలు తోడేస్తున్నాడు ఏదీ, ఒక్క ఆరువేలకు చెక్కు రాసి ఇలా పారెయ్యండి అది అరవై వేలయి కూర్చుంటుంది"
నయాగరా రావడంతో ఇద్దరూ దిగారు లిఫ్టులో 103 వ నెంబరు గదికి వెళ్ళారు తలుపు తీసి చూస్తే గది రిక్తంగా ఉంది డెయిజీ లేదు.
ఆనంద భాండపు అడుగు ఊడినట్లయింది రాజారావుకు.
డెయిజీ ఆంగ్లో ఇండియన్ యువతి మెడల వరకూ జారి కత్తిరించిన జుట్టూ, పొడవైన ముక్కూ, పల్చని చెంపలూ, సొగసైన కళ్ళూ, పసిడిచాయ అందంగా ఉంటుంది కళ్ళలో ఏదో సొగసూ, ఆకర్షణా ఉన్నాయి వాటిని డబ్బుగా మార్చుకోవడంలో నైపుణ్యం సంపాదించాడు మైకేలు మైకేలు డెయిజీకి తండ్రి కాడు పెంచి పెద్దచేసినవాడు అతడే హెచ్చెస్సీ దాకా చదివించి, ఒక కంపెనీలో రిసెప్షనిస్టుగా చేర్చాడు ఆవిడ అందమైన చిరునవ్వుకు డబ్బు చేసుకోవడానికి జీతం బాగానే ఇస్తున్నారు కంపెనీవాళ్ళు కాని, మైకేలుకు అంతటితో తృప్తిలేదు అంటే, మైకులు చెడ్డవాడని కాదు అతను బైబిలు చదవంది నిద్రపోడు ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్తాడు వారంరోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ప్రారంభిస్తాడు యవ్వనం డెయిజీలోని అందాన్ని వికసింపచేసింది ఆ పరిమళం కొంతదూరం వ్యాపించింది పూవు పరిమళం బేరగానికేం తెలుస్తుంది? అతనికి కావలసింది వ్యాపారం మన మైకులు పూలమ్ముకునే వాడనుకోండి అందాన్ని డబ్బు చేసుకోవడానికి డెయిజీని 'కాల్ గార్ల్'ను చేశాడు.
పట్టణాల్లోని నవ నాగరకులు పాశ్చాత్య పద్దతుల్లో జీవించాలని ఉబలాటపడ్తారు ఆంగ్లో ఇండియన్ యువతులు స్వేచ్చగా తిరుగుతారు కిల కిలా నవ్వుతారు గంతులేస్తారు వారిని చూస్తే మురిసిపోతారు నవ నాగారకులు పరిస్థితులకు లొంగిన ఆంగ్లో ఇండియన్ యువతులు వారి డబ్బుకు లొంగిపోతారు వారితో చెట్టపట్టాలు పట్టుకొని తిరగడం, బార్లల్లో త్రాగడం, కార్లల్లో తిరగడం, డ్యాన్సులు చేయడం వీరి వృత్తి నాగరికతకు డెయిజీని అప్పగించి డబ్బు చేసుకున్నట్లున్నాడు మైకేలు.
మైకేలుతో బేరమాడి డెయిజీని తెచ్చాడు సూరి రాజారావు గది వదిలి వెళ్ళేవరకు ఇంకా నిద్రలోనే ఉంది డెయిజీ ఇంకా ఆమె లేవకముందే వచ్చాడు మైకులు లేపాడు ఆఫీసుకు టైమైందని తీసికెళ్ళాడు డబ్బు విషయం అడుగుతే తనకేమీ తెలియదని చెప్పింది కస్సు బస్సు మని తీసికెళ్ళి ఆఫీసులో దింపాడు.
ఆ స్థితిలో గదిలో ప్రవేశించారు రాజా, సూర్యారావు రాజా దిగజారిపోయాడని తెలుసుకొని సంతోషించాడు సూర్యారావు డెయిజీ వలలో వేసుకుందనుకున్నాడు ఇక ఉచ్చు లాగడమే తరువాయి అనుకున్నాడు.