Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 6

ఆ పెనుగులాటలో రజని మంచంమీద నుంచి కిందకు దొర్లింది.
నిద్రమత్తు కాస్తా వదిలిపోయింది. ఎదురుగా ఎవరూ లేరు.గాబరాగా తన వంటిపై చూసుకుంది. పలుచటి నైటీ నిక్షేపంగా వుయ్మ్ది.
అంటే, తను ఇంతవరకూ కలకంతున్నాదా_ ఆ తియ్యని ఊహలే మరోకసారి మొదలుతుండగా చిలిపిగా నవ్వుకుంటూ తిరిగి మంచంపై వాలిపోయింది దిండును కరుచుకుంది రజని.
   
                                                       *    *    *    *
విద్యార్ది యూనియన్ ఎలక్షన్ల  జోరు.
పోటీ ప్రధానంగా ఇరువురి మధ్య సాగుతుంది.
ఆ యిద్దరూ విద్యార్దుల నాయుకులు అభినయ్.... రవితేజ.
డబ్బు, పలుకుబడితో పెరిగివాడు అభినయ్.
డబ్బుతో ఏది అయినా సాధించవచ్చు అంటాడు. అతనికి వ్యతిరేకంగా ఏది జరిగినా భరించలేడు_ సహించలేడు.
కొడుకు చేసే పనులు ఎలాంటివి అయినా సమర్దిస్తుంటాడు జయచంద్ర.
కారణం... రేపు తన రాజకీయ వారసుడు అతనే కాబట్టి!
రవితేజ తెలివితేటలు వున్న చురకయిన విద్యార్ది నాయుకుడు.
సాటి విద్య్హార్దులలో మంచితనాన్ని, గౌరవాన్ని పెంపొందించుకున్న యువకుడు.
అతనికోసం ప్రాణాలు యివ్వడానికి అయినా సిద్దపడే స్నేహితులున్నారు.
అతని తండ్రి ఆనందరావు. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. ప్రజలలో పలుకుబడి పెంచుకున్న పెద్దమనిషి.
ఇద్దరికీ తండ్రుల ఆశీర్వాదాలు పుష్కలంగా వున్నాయి.
అయితే,రాజకీయాలలో ఆరితేరిన జయచంద్రకు దుర్మార్గపు అలోచనలు చెప్పే కుడిభుజంగా లాయర్ సత్య మోహన్ వున్నాడు.
ఇప్పుడు అతనికళ్ళు అభినయ్ మీద పడ్డాయి.
బంధుత్వాన్ని పట్టిష్టపరుచుకొనడానికి మేనల్లుడిని ఇంటి అల్లునిగా చేసుకోవాలని అతని అలోచన!
సాటి విద్యార్దులను తనవేపుకు తిప్పుకోనడానికి అభినయ్ ధనబలాన్ని, దౌర్జన్యాన్ని ఆశ్రయించాడు. అయినా నిజాయితీకి పట్టంకట్టారు విద్యార్దులు.
ఆ సంవత్సరం యూనియన్ లీడర్ పదవి రవితేజను వరించింది.
ఓటమిని భరించలేక అభినయ్ తనకు వ్యతిరేకంగా పనిచేసిన విద్యార్దులమీద తన అనుచరులతో దాడి చేయించాడు.
రవితేజ, అభినయ్ ల మధ్య అవరోధం ఏర్పడి అది పెరిగి శత్రుత్వం అయింది.
ఆనందరావుకు జరిగిన దారుణం తెలిసింది. ఎటువంటి పరిస్థితిలోనూ అభినయ్ తో విరోధం పెట్టుకోవద్దని మందలించాడు కొడుకుని.
"రాజీకియాలలో శాశ్వితమిత్రులు, శత్రువులు వుండరు. అభినయ్ చిన్నవాడు ఆవేశమే కానీ ఆలోచనలేని యువకుడు. తండ్రి అడుగు జాడలలో నడుస్తూ పండంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. జయచంద్ర మేకవన్నె పులి...తడిగుడ్డతో గొంతులను నులిమే కసాయివాడు. అలాంటివాడితో పోటీపడడం, తగవులు పెంచుకోవడం శ్రేయస్కరం కాదు."
తండ్రి హితబోధ  రుచించలేదు రవితేజకు.
జయచంద్ర భవంతిలోకూడా ఇదే చర్చ జరుగుతుంది. తండ్రీ కొడుకులు యిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్ళకు తోడు క్రిమినల్ లాయర్ సత్యమోహన్... వాళ్ళు ఫారిన్ డ్రింక్ సిప్ చేస్తున్నారు.
"నా మేనల్లుడిని ఓడిస్తాడా? వాడి అంతు చూస్తాను."
సత్యమోహన్ డోసు ఎక్కువై రంకెలు వేస్తున్నాడు. రెండు పెగ్గులకే అతను రెచ్చిపోవడం మొదలయింది.
"అవును రవితేజను వదలిపెట్టకూడదు. దెబ్బకు దెబ్బ తీయాలి. ఎలక్షన్లలో గెలిచాను అని విర్రవీగుతున్నాడు" అన్నాడు అభినయ్ కసిగా.
జయచంద్ర కొడుకువంక సూటిగా చూశాడు.
అభినయ్ తలదించుకున్నాడు.
"తొందరపడకు. మళ్ళీ  అసెంబ్లీ ఎన్నికలువస్తున్నాయి. ఈ సారి ఎన్నికలలో నేను గెలవడం ఖాయం. మంత్రిపదవిని రావడమూ ఖాయం. అప్పుడు నువ్వేం చేసినా అడుగేవాళ్ళు ఉండరు. రవితేజ విషయం అప్పుడు చూడవచ్చు" అన్నాడు జయచంద్ర.
"అదేంటిబావా... నువ్వు మినిష్టర్ అయ్యేవరకూ అబ్బాయిని మడికట్టుకుని కూర్చోమంటావా?" రెచ్చ గొట్టే ధోరణిలో అన్నాడు సత్యమోహన్.
"అంకుల్..."
అభినయ్ సందేహిస్తూ క్షణం ఆగాడు.
"చెప్పు అల్లుడూ... ఆగిపోయావే"
"యూనియన్ ఎలక్షన్లలో రజని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది నలుగురిలోనూ నన్ను అవమానించింది."
అభినయ్  కళ్ళలో నీలినీడలు తొంగి చూసాయి.
నా కూతురు అలా ప్రవర్తించిందా... సారీ అల్లుడూ, అది చిన్నపిల్ల. తల్లిలేదు కదా అని గారాబంగా పెంచాను. దానిని నేను మందలిస్తానులే. అదేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు" సత్యమోహన్ సర్ది చెప్పాడు.
ముగ్గురూ చాలా సేపటివరకూ అలా మాట్టాడుకుంటూనే వున్నారు.
బాగా పొద్దుపోయిన తరువాత సత్యమోహన్, జయచంద్రలు వెళ్ళిపోగా అభినయ్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ క్షణంలో తల్లి మాటలు గుర్తుకు వచ్చాయతనికి.
"కన్నతల్లిగా నిన్ను శాసించడంలేదు. ఒకవేళ నామాట వింటావనీ నాకు నమ్మకంలేదు. కానీ ఏ తల్లీ తన కంటి ఎదురుగానే, కొడుకు పనికిరాకుండా పోవడం చూసి సహించలేదు. నేను చెప్పేది నీ మంచికోసమే. ఈ రాజకీయాలూ, హత్యలు, దోపిడీలు నీకొద్దురా తండ్రీ! బుద్దిగా చదువుకుని ప్రయోజకుడివి కావాలి నువ్వు. మీ నాన్నతో కలిసి తిరుగుతూ అనుక్షణమూ గొడవలలో తలదూర్చవద్దు."
అవును, తల్లి చెప్పినమాట కూడా నిజమే!
యువరక్తం వేగంతో ఉరకలు వేస్తుందే తప్ప మంచి చెడులను ఆలోచింపనీయదు. తనకు ఏదయినా జరిగితే తన తల్లి తట్టుకోలేదు.
కానే, సమాజంలో ఎదుగుదల వుంటేనే ప్రత్యేకమయిన మనిషిగా గుర్తింపు లభిస్తుంది. యువజన నాయుకునిగా తనకున్న గౌరవాన్ని భ్రష్టు పట్టించాడు ఆ రవితేజ.
ఇటు తల్లి అభ్యర్దన....
అటు తన వ్యక్తత్వం... ఆ పై తండ్రి రాజకీయం...
పరస్పర సంఘర్షణల మధ్య అతని మనస్సు నలిగిపోతుంది.

 Previous Page Next Page