Previous Page Next Page 
వేగు చుక్క పేజి 6


    "ష్యూర్! ఏం చెయ్యాలి నేను?"

    సంకోచంగా చూశాడు సాగర్. "ఈ అమ్మాయి బట్టలు తీసేసి, వళ్ళంతా మసాజ్ చేసి వేడి పుట్టించాలి. ఆ తరువాత నాలుగైదు బ్లాంకెట్లు వెచ్చగా కప్పెయ్యాలి."

    నవ్వింది స్వరూప. "ఇటీజ్ ఏ ప్లెజర్! ఓకే బాయ్స్! అవుట్! అవుట్!" అంది. ఒకళ్ళ భుజాల మీదుగా ఒకళ్ళు తొంగి చూస్తున్న సెయిలర్స్ ని ఉద్దేశించి.

    అందరూ బయటికి వెళ్ళగానే  లోపలనుంచే బోల్టు పెట్టేసిందామె.

    బయట డెక్ మీద కలకలం వినబడింది సాగర్ కి. త్వరత్వరగా అటు వెళ్ళాడు.

    అక్కడ నలుగురైదుగురు సెయిలర్సు కలసి హెడ్ కుక్ ఇబూకాని గట్టిగా పట్టుకుని ఉన్నారు. పొట్టిగా, పిట్టలా ఉన్నా, వాళ్ళవారికీ లొంగక గింజుకుంటున్నాడు ఇబూకా. అతని చేతిలో వంపు తిరిగిన  చిన్న కత్తిఉంది.

    "ఇబూకా! ఇబూకా. వాటీజ్ దట్? స్టాపిట్!" అన్నాడు సాగర్  గట్టిగా.

    "నన్ను వదలండి! నేను 'హరాకిరీ' చేసుకుని చచ్చిపోవాలి!" అంటున్నాడు ఇబూకా.

    "హరాకిరీనా? ఎందుకు?" అన్నాడు సాగర్ ఆశ్చర్యంగా. హరాకిరీ ఏమిటో అతనికి బాగా తెలుసు అది ఒక జపనీస్ యుద్ద సాంప్రదాయం శత్రువు చేతికి చిక్కడం కన్నా ఖడ్గంతో పొడుచుకు చచ్చిపోయి మానాభి మానాలు దక్కించుకోవడమే మంచిదనుకునే వారు జపనీస్ యోధులు. అందుకుగానూ పదునైన చిన్నకత్తితో కడుపుని ఎడమవైపు నుంచీ కుడి వైపుకు కోసుకుని, ఒక్కసారిగా కత్తిని పైవైపుకి మెలి తిప్పుతారు. పేగులు తెగిపోయి, మరణం సంభవిస్తుంది. అప్పటికీ చావు రాకపోతే, పక్కనే ఉన్న ఆప్తుడెవారయినా శిరచ్చేదం చేసి, చావుని ప్రసాదిస్తాడు!

    కాలక్రమాన, యుద్దవీరులేకాక, ఆత్మగౌరవానికి భంగం కలిగితే పౌరుషవంతులందరికీ ఇది ఆడారమైంది.

    "సర్! ఇన్ని సంవత్సరాల నుంచీ మీ దగ్గర పనిచేస్తున్నాను మచ్చలేని రికార్డు మీది! ఇన్నాళ్ళకు ఈ పనికిరాని పేవకునివల్ల ఒక అమ్మాయి షిప్పులో ఉండిపోవడం, మీకు మాటలురావడం....." దుఃఖంతో అతని గొంతు రుద్దమైపోయింది.

    విచలితుడయ్యాడు సాగర్.

    పనిపట్ల అంతటి విశ్వాసం, నిజాయితీ ఉండబట్టే జపనీయులు రెండో ప్రపంచ యుద్దంలో ఆర్థికంగా, పారిశ్రామికంగా నాశనమైపోయిన తమ దేశాన్ని మళ్ళీ అగ్ర రాజ్యంగా మార్చుకోగలిగారు.

    అభిమానంగా ఇబూకా భుజం మీద చెయ్యివేసి "పొరపాటు అన్నది మనుషులకి సహజం. ఒక తప్పు చేసినందుకు నువ్వు ఇంతగా బాధపడి పోనఖ్ఖర్లేదు. ఇదింక మర్చిపో!" అన్నాడు సాగర్.

    తల వంచుకుని అక్కడ మంచి వెళ్ళిపోయాడు ఇబూకా.

    చారల పైజమా, నైట్ గౌను వేసుకుని ఉన్న సత్యనారాయణ సింగ్ గుప్పుగుప్పున పైప్ కాలుస్తూ అక్కడికి వచ్చాడు.

    "సాగర్ ! వాట్ ద హెల్ హజ్ హాపెన్డ్?"

    వివరించాడు సాగర్.

    "ఏంచేద్దాం ఇప్పుడు?" అన్నాడు సింగ్ విసుగ్గా.

    "ఆబ్వియస్ సర్! రెండే పద్దతులు ఉన్నాయి. మొదటి పద్ధతి షిప్పుని వెనక్కి మళ్ళించి ఆ అమ్మాయిని విశాఖపట్నంలో దింపెయ్యడం, రెండో పద్ధతి, ఆ అమ్మాయిని మనతోబాటు అండమాన్స్ దాకా తీసుకెళ్ళి అక్కడ పోర్టు బ్లయర్ లో ప్లేన్ ఎక్కించి వెనక్కి పంపెయ్యడం."

    ఆలోచించాడు సత్యనారాయణ సింగ్. షిప్పు ఒకరోజు అద్దె నలభై వేల రూపాయల దాకా ఉంటుంది. ఈ షిప్పు తన స్వంతమే అయినా, ఆ  లెఖ్ఖన వెనక్కి వెళ్ళి తిరిగి రావాలంటే ఇంధనంతో కలిపి, లక్షా, లక్షన్నర రూపాయల నష్టం వస్తుంది కంపెనీకి. అదీగాక వెనక్కి వెళ్ళే వ్యవధి లేదు. అత్యవసరంగా అండమాన్స్ చేరుకోవాలి.
   
    ప్రొఫెసర్ కూడా వచ్చాడు అక్కడికి. నిప్పు తొక్కిన కోతిలా గెంతులేస్తూ. "వెనక్కి వెళ్ళడమా! అట్టర్ నాన్సెన్స్ ! సీదా అండమాన్స్ కి వెళ్ళిపోవాలి మనం! ఒక్క క్షణం కూడా వెస్ట్ కావడానికి వీల్లేదు" అన్నాడు సర్కసుకి వెళ్ళడానికి తయారుగా ఉన్న పిల్లలు పెద్దల ఆ;ఆలస్యాన్ని భరించలేనట్లుగా.

    "ముందుకే వెళదాం" అన్నాడు సింగు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ.

    అప్పుడు వినబడింది అనూహ్య కేక! దయ్యాన్ని చూసి బెదిరిపోయిన దానిలా వుందా అరుపు.

    అదే క్షణంలో సింగుమొహం పొరపాటున అన్నం ముద్దతోబాబు బొద్దింకని మింగేసినవాడిలా అయిపోయింది. రెయిలింగ్సు వైపు పరిగెత్తాడతను.

   
                          *    *    *

    తలుపులువేసిమ్ అక్కడే నిలబడి అనూహ్యవేపు చూసింది స్వరూపరాణి.

    అమాయకంగా వుంది అనూహ్య మొహం. అలసట కనబడుతోంది.
   
    నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది స్వరూప మంచంమీద కూర్చుంది. మెల్లిగా చేతులుజాచి అనూహ్య  నడుముచుట్టూ వున్న బెల్టులాంటి వెండి గొలుసు తీసేసింది. స్కర్టుకి ఒక పక్కగా జిప్పు వుంది. జిప్పు లాగేసి, అనూహ్యని పక్కకి పొర్లించి, స్కర్టుని తొలగించింది. తర్వాత పాంటీస్.

    అన్యూహని కష్టంమీద కొద్దిగా లేపి, చిన్న పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు కూర్చోబెట్టుకుంది. పొడుగ్గావున్న అనూహ్య పోడుక్కి తగిన బరువుగా వుండడంతో కొద్దిగా కష్టంగా వుంది ఆమెకు. తల పక్కకి వాల్చేస్తోంది అనూహ్య.

    స్వెటర్ లావున్న అనూహ్య టాప్స్ అడుగున రెండు చేతులతో పట్టుకుని పై ఎత్తింది.

    టాప్స్ పైకి వచ్చేశాయి కానీ తలదగ్గర ఆగిపోయాయి. చేతులతో నెక్ ని కొంచెం సాగదీస్తే గానీ తలని దాటి బయటకు రాదు అది.

    అనూహ్య తల టాప్స్ లోనే వుండిపోయింది.

    అది అలాగే వుండనిచ్చి బ్రాసరీ హుక్సు తీసింది స్వరూప. బ్రా వున్నంతమేరా ఒళ్ళు మరింత తెల్లగా కనబడుతోంది.

    ఆమె ఒక్కసారిగా కదిలింది, మగతలో నుంచీ బయటపడినట్టు. తన అందాలని సూర్యుడికి కూడా కనబడకుండా దాచుకోవాలనే తరతరాల సాంప్రదాయం ఆమె మస్తిష్కంలో అలారంలా మోగి ఎలర్ట్ చేసింది.

    కళ్ళు తెరిచింది బలవంతంగా అంతా చీకటిగా ఉంది. ముక్కుకి స్ట్రెచ్ నైలాన్ టాప్స్ బిగువుగా తగులుతూ ఊపిరి ఆడడం కష్టమని పిస్తోంది. తన తల మీద ఎవరో మాస్కు తోదిగినట్లు అనిపిస్తోంది ఆమెకి.

    ఏం జరిగింది? ఎక్కడుంది తను?

    కొద్ది క్షణాలపాటు ఏమీ అర్థంకాలేదు. ఆ తర్వాత జరిగినదంతా ఒక్కసారిగా గుర్తు వచ్చింది.

    క్రమంగా స్పర్శ తెలిసింది. వెచ్చటి, మృదువైన చేతులు రెండు తన గుండెలమీద-

    అప్పుడు కేకపెట్టింది అనూహ్య. టాప్సుని బలవంతంగా క్రిందికి లాగేసుకుంది.

    ఎదురుగా ఉన్నది ఒక స్త్రీ. ముప్పయి ఏళ్ళుంటాయి. అందంగానే ఉంది కానీ నరమాంసం భక్షించే చిరుతపులులకు ఉండే అందం అది.

    "యువర్ బాడీ ఈజ్ బ్యూటీపుల్!" అంది రాణి తమకంగా. "హనీ ! యూ లుక్ డివైన్! నువ్వు నేను అతి సున్నితమయిన ఫ్రెండ్స్ కాబోతున్నాం, ఫర్ ఎవర్! దిసీజ్ ఏ ప్రామిస్!"

    స్వరూపరాణి మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది అనూహ్య. ఆమె చూపులు ఎక్కడ కేంద్రీకరించి ఉన్నాయో గమనించగానే మరింత ముడుచుకుపోతూ, కాళ్ళు యింకా దగ్గరికి జరుపుకుంది.

    నవ్వుతూ చెయ్యి ముందుకి, అనూహ్యకాళ్ళవేపు జాచింది స్వరూప అచ్చం మగవాడిలా.

    ఆమెకు అందకుండా జరిగి, చటుక్కున మంచంమీద నుంచీ కిందికి దూకింది అనూహ్య. తెల్లటి బెడ్ షీట్ లాగేసి నడుం చుట్టూ చుట్టేసుకుంది. కొంతమంది ఆడవాళ్ళలో ఇలాంటి మానసిక రుగ్మత ఉంటుందని పుస్తకాల్లో చదివిందామె. లెస్బియనిజమ్! సాటి ఆడవాళ్ళమీద మనసు పడడం!!

    కానీ అలాంటి వాళ్ళని చూడడం ఇదే మొదలు! బయటికి వెళ్ళిపోబోన్న అనూహ్యని వారించాలని చూస్తూ "హనీ కామ్ డవున్! ప్లీజ్ కామ్ డవున్!" అంటోంది స్వరూప.

    వినిపించుకోకుండా బోల్టుతీసి బయటకి పరిగెత్తింది అనూహ్య అంతసేపూ ఆపకుండా అరుస్తూనే ఉంది.


                                                                    *    *    *

    ఎక్కుపెట్టి వదిలిన బాణంలా నేరుగా తనవైపే దూసుకుని వస్తున్న అనూహ్యని ఆశ్చర్యంగా చూశాడు సాగర్.

    "హెల్ప్ మీ! ప్లీజ్ హెల్ప్ మీ!" అంది రొప్పుతూ, ఆమె గుండెలు ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాయి.

    "టేకిట్ ఈజీ! టేకిట్ ఈజీ! ఏమయింది చెప్పండి."

    తనమీదికి ఉరకబోతున్న పులిని తప్పించుకుని పరిగెత్తిన లేడి పిల్ల ప్రమాదం గడిచిందో లేదోనని ఒక్కసారి వెనక్కి చూసినట్లు భయంగా చూసింది అనూహ్య.

    కొంచెం దూరంలో ఆగిపోయి ఉంది స్వరూపరాణి అదోరకంగా నవ్వుతూ.

    "చెప్పండి మిస్! ఏమయింది?" అన్నాడు సాగర్.

    చెప్పడానికి నోరు తెరచి ఆగిపోయింది అనూహ్య అదంతా తను ఇతనితో ఎలా చెప్పగలదు.

    నాలుక దాకా వచ్చి జారిపోయిన చాక్ లెట్ కేక్ ని చూసినట్లు చూసింది స్వరూపారాణి అనూహ్యని.

    "నేను ఇంటి కెళ్ళిపోతాను నన్ను వెంటనే పంపెయ్యండి. ప్లీజ్!" అంది అనూహ్య వణుకుతున్న గొంతుతో.

    జాలిగా చూశాడు సాగర్. "సారీ మీస్! నడి సముద్రంలో ఉన్నాం మనం. పోర్ట్ బ్లయర్ చేరగానే నెక్స్ ట్ ఫ్లయిట్ లో మిమ్మల్ని మెడ్రాస్ పంపేస్తాం! అప్పటిదాకా ఓపిక పట్టండి!"

    "పోర్ట్ బ్లయరా?" అంది అనూహ్య భయంగా. "పోర్ట్ బ్లయర్ కి వెళ్ళేదాకా ఈ షిప్పులోనే ఉండాలా నేను?"

    "మీకేం ఫర్వాలేదు. మీకు తోడుగా మరో లేడీ పాసెంజరు ఉన్నారు. మిసెస్ సింగ్ డోన్డ్ వర్రీ!"

    విషాదకరమైన జోక్ లాగా వినబడ్డాయా మాటలు అనూహ్యకి. ఇంతమంది మగాళ్ళ మధ్య తను గాక మరొక్కతే ఆడది!

    ఆ ఆడదాని వల్లే తనకు తక్షణ ప్రమాదం!

    బెదిరిపోతూ మళ్ళీ భుజం మీదగా వెనక్కి చూసిందామె. రాణి పెదవులు నవ్వుతో  వంకర తిరిగి ఉన్నాయి.

    "నన్ను తప్పించుకుని ఈ షిప్పులో ఎంత దూరం పోగలుగుతావు!" అన్నట్లు.

    చటుక్కున సాగర్ వైపు తిరిగింది అనూహ్య.

    "పోర్టు బ్లయర్ దాకా నేను ఈ షిప్పులోనే రావడం తప్పనట్లయితే నేనూ మీతోబాటే ఉంటాను ప్లీజ్!"

    నిన్న తన స్కర్టు ఎగిరిపోతే, అతను ఎంత డిగ్నిఫైడ్ గా ప్రవర్తించాడో గుర్తు ఉంది అనూహ్యకి.

    చిత్రంగా ఉంది ఇది! సాటి ఆడదాని చేష్టలకు భయపడిపోయి, పరాయి మొగాడిని శరణు కోరుతుంది తను!

    వింతగా ఆమెని చూశాడు సాగర్. "మీ ఇష్టం!" అన్నాడు ముక్తసరిగా. తర్వాత ప్రోఫెసర్ వైపు తిరిగి, "ప్రోఫేసర్ గారూ! ఇవాళ్టి నుంచీ నేను మా ఫస్ట్ ఆఫీసరు కేబిన్ షేర్ చేసుకోండి! మన కేబిన్ ఈ అమాయ్మికి ఇచ్చేద్దాం! ఓకే?" అన్నాడు.

 Previous Page Next Page