Previous Page Next Page 
సక్స్ స్ పేజి 4



    అంత ఆనంద సందోహం మధ్య తీవ్ర ఆలోచనలో మునిగిపోయాడాయన.

    పోలిటిక్స్ విశాలమ్తెన ఎరీనా లాంటిది - శత్రువుల్ని గుర్తుపట్టడం కష్టం__ "ప్రమాణ స్వకారానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. గుర్తుంచుకో దీనికి భిన్నంగా ఏం జరిగినా ప్తెన ల్  రిజల్ట్  కొన్ని గంటల్లో నీకు తెలుస్తుంది...." సడన్ హా ఫోన్  హెచ్చరిక గుర్తుకొచ్చింది.

    ముసురుకున్న ఆలోచన్ల తో, తనకు  కేటాయించిన సీట్లో కూర్చున్నారాయన.

    మనిషిగా అభినందనలు అందుకుంటూనే ఉన్నా, మనసు.... అనేక రకాలుగా ఆలోచిస్తోంది.

    తను శత్రువుల్ని ఎదుర్కోగలడు.

    తన తెలివి తేటల ఉక్కుపాదంతో, శత్రువుల్ని అణగద్రోక్కేయగలడు..... అ కాన్పిడెస్ తనకుంది. ఇండస్టియలిస్ట్ గా ఆ ఎక్స్ పిరియన్స్ తనకుంది.

    శత్రువు ఒంటి కన్నుతో చూస్తే, థనుఇ వెయ్యికళ్ళతో  చూడగలడు.... శత్రువును  పసిగట్టడంలో, తన అంచనా ఎప్పడూ తప్పుకాదు. మొత్తం యాభ్తే ఆరు  మంది మంత్రులు ప్రమాణ స్వకారం చేశారు. కేబి  నేత ర్యాంక్ మంత్రులు పద్దెనిమిది మంది.... మిగతా మంత్రులు స్టేట్  మంత్రులు ....డిప్యూటి మంత్రులు.......

    మొత్తం కర్యక్రమం పూర్తయేసరికి నలబ్తే అయిదు  నిమిషాలు పట్టింది. ప్రమాణ స్వీకారం అయిపోయాక___

    మంత్రి వర్గ  సహచరులతో ప్రధాని ఫోటో  దిగారు. ఆ తర్వాత రాష్టపతి భవన లో  రాష్టపతి  నూతన మంత్రివర్గానికి తేనీటి విందు నిచ్చారు.

    అక్కడే__

    కొత్త హొంమంత్రి మొట్టమొదటి, ఆధికారిక పర్యటన కార్యక్రమం ఖారార్తేంది. పార్టి ఏం.పిలు ఏర్పాటు చేసిన అభినందన  సభ జ్తే పూర్ జరపాలని నిశ్చయింపబడింది.

    తనకు  సన్నిహితుల్తేన ఇండస్ట్రీయలిస్టు లు కూడా ఉండడంతో ఆ ప్రోగ్రాం ని  కాదన లేకపోయారు హరికృష్ణమనాయుడు.



               *                   *                  *     

    హరికృష్ణమనాయుడు....

    హొంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రెండు గంట ల్తెంది డిల్లి నుంచి జ్తేపూర్ ....

    జ్తేపూర్ నుంఛి మద్రాసు ప్రయాణం.

    సూట్లో అరగంట రెస్టు తిసుకోన్నాడయన.

    అప్పటికి నాలుగ్తెదు సార్లు  కూతురు గురించి సూర్యసాగర్ ని అడిగా డయాన సూర్యసాగర్.  అహమ్మదాబాదుకు ఫోన్  చేసి బయలుదేరినట్లు తెల్సుకున్నాడు.

    "ఒకసారి ఎయిర్ పోర్టుక్కూడా ఫోన్ చేసి  కనుక్కోండి." తిరిగి అన్నాడాయన. హరిరామకృష్ణమనాయుడి కెందుకో ఉన్నఫళాన కూతుర్ని చూడాలని ఉంది.అందుకే  అంత ఆరాటపడి పోతున్నాడు. వెంటనే  ఎయిర్  పోర్టుక్కూడా ఫోన్ చేసాడు సూర్య సాగర్ డిల్లీకి వచ్చే  అహమ్మదాబాద్ ఎయిర్ బస్ ....రెండు గంటలులేటు....మరో పది నిమిషాల్లో జ్తే పూర్ కి బయలు దేరాలి. ఆయన  మనసు, కూతురు కోసం....కూతురుని చూడాలనే  కోరికతో విలవిల్లాడి పోతుంది. అయినా తప్పని మర్యాదని  పాటించాలి. హరికృష్ణమనాయుడు గౌరవార్ధం, లగ్జరీ ర్తెలు ప్యాలెస్ ఆం విల్స్ ను  బుక్ చేశారు.

    సూట్లోంచి బయటికోస్తూ, సూర్యసాగర్ తో చెప్పారు హరికృష్ణ మనాయుడు ____ "అమ్మాయి.....ఇక్కడకొస్తే .....జ్తే పూర్ కి వచ్చే యామని మెసేజ్ ఇవ్వండి. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయండి" శాసనాది కారం మొదల్తెంది.

    ఆశోకా హొటల్ మొత్తం, పిలిసు బందోబస్తుతో నిండిపోయింది.

    పోర్టికోలో కొచ్చిన హొంమంత్రి ని పొలిసు ఉన్నతాధికారులు తమని తాము పరిచయం చేసుకున్నారు____ కంటికి  రెప్పలా చుట్టూ పొలిసు పహరా మొదల్తెపోయింది.

    అభిమానులు, మిత్రులు, అనుచరగణం జయ, జయధ్వనాలతో , ఆశికా హొటల్ దద్దరిల్లి పోయింది.

    దగ్గరకొచ్చి , దండలు వేయడానికి  కుమ్ములాడుకొంటున్న అభిమాన సందోహాన్ని పోలీసులు లాఠిలతో అడ్డుకుంటున్నారు.

    "THIS IS CALLED POWER...." నవ్వుతూ తనలో  తాను  అనుకోన్నారాయన.

    డి.ఐ.జి. స్ధాయి అధికారికరు కారు డోర్ తెరిచి పట్టుకొన్నారు. కారెక్కబోతూ దూరంగా ఓ  వ్యక్తిని చూసి నవ్వి, దగ్గరకు  రమ్మన్న ట్టుగా  సంజ్ఞ చేశారు  హరికృష్ణమనాయుడు ఆ వ్యక్తి డిల్లి సౌత్  జొన్ డి.సి.పి. అగర్వాల్.

    "కారెక్కండి, మిస్టర్ అగర్వాల్ ...."

    మొట్టమొదటి సారి తనని కంగ్రాచ్యులేట్ చేసిన పోలిసదికారి అగర్వాల్.... అందుకే హొంమంత్రి  అగర్వాల్ ని చూడగానే పోల్చుకున్నారు.

    "ధాంక్యూ సర్...." అగర్వాల్ , హొంమంత్రి హరికృష్ణమనాయుడు  కారు వెనకనున్న సెక్యూరిటి కార్లోకెక్కాడు గర్వంగా హొం మంత్రి స్వయంగా పిల్చి, ఒక పోలిసదికారిని కారేక్కమనడం, కొంత మంది ఉన్నత స్ధాయి పిలిసదికరులకు నచ్చలేదు!

    పిల్చింది....కారేక్కమంది సాక్షాత్తు హొంమంత్రికి సెల్యూట్ చేస్తూ, కోపాన్ని దిగమింగుతూ ఉండిపోయారు వాళ్ళు-

    గొప్ప  జినియస్సులు కూడా, ఆకస్మాత్తుగా తప్పలు  చేస్తుంటారు.

    అలాంటి భయంకరమ్తెన ఒక తప్పు హొం మినిస్టర్ , హరికృష్ణమనాయుడు చేసారు.    

 Previous Page Next Page