తాత కారు వరకూ ఆమెను సాగనంపాడు. కారు బయలుదేరుతూండగా మల్లిగాడి గురించి కొద్ది మాటలు చెప్పాడు.
"అమ్మా, పట్నవాసం దొరసానీ! మల్లిగాడు తన కండబలంతో ఈ గూడెం నాయకుడైనాడు. ముసలి మల్లయ్య (వృద్ధ మల్లిఖార్జునుడు) ఆలయానికి గాలిగోపురంలా కనిపించే ఆమలక శిఖరం మీద దోరోకినవాడు అతడు కావతంనించి గూడెంలో వారందరికీ అతడు భ్రమరాంబ, మల్లికార్జునుల ముద్దుబిడ్డ అని ఒక నమ్మకం. అందుకు తగినట్టుగానే వాడు అమిత శక్తి సంపన్నుడుగా ఐనాడు.
"కాని ఇటివల అతడి ప్రవర్తన విపరీతమైన మార్పులు వచ్చినాయి. దూరదేశాలనించి వచ్చిన కొండదొరలతో స్నేహం ప్రారంభిచాడు. శ్రీశైల పర్వతాలలో అతడికి తెలియని చోటు అంటూ లేదు. ఎవరైనా అడవి విశేషాలు తెలుసుకోవాలని వస్తే వారికి అతడే చెప్పాలి. అందునించి దూరదేశాలనించి వచ్చే కొండదోరాలు అతనితో స్నేహం చేశారు. అది మొదలుగా మల్లిగాడు ప్రవర్తన పూర్తిగా మారిపాయింది. వారితో తిరుగుతున్నాడు. ఏవో మూలికలకోసం తిరుగుతున్నారని మొదట్లో నేను అనుకున్నాను. కాని అంతకన్నా ముఖ్యమైన పని ఏదో ఉంది. ఆ రహస్యం మల్లిగాడు ఎవరికీ చెప్పలేదు. కాని శ్రీపర్వతాలమీద జ్యోతిర్ వృక్షాలని ఉన్నాయి. వాటికోసం అతడు దురాశతో పరాయి దేశాల వారితో చేయి కలిపాడు. వారు నాగభూమి నించి వచ్చిన వారని వారి మాటలవల్ల అర్ధం చేసుకున్నాను.
"అందునించి మల్లిగాడు ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోయాడని నేను భావించాను. అతడిని చూస్తేనే గూడెంవారంతా భయపడుతున్నారు. నీవు వచ్చిన పని చాలా చిన్నది. మోదుగుపూలు నేను తెల్లారేసరికల్లా తెచ్చి మీ విడిది దగ్గర అప్పగించుతాను" అన్నాడు వృద్ధుడైన కొండదొర.
నాగభూమి నించి ఎవరో వచ్చారని వినగానే వాణిలో గత స్మృతులు కదలాడినాయి షైజా, రేనో, ఖిమో ఆమె మనఃపటలం మీద కదలాదినారు. మోడి ఆటలో తాను విజేత కావటం, వారికి సప్తధాతు సంజీవని తెచ్చి ఇవ్వటం, కృష్ణస్వామి తన కోసం ప్రాణాలను పణంగా ఒడ్డటం అన్నీ జ్ఞాపకం వచ్చినాయి.
ఆమె ప్రొఫెసర్ కృష్ణస్వామి గురించి విషాదమూర్తి ఐపోయింది. వైజ్ఞానిక లోకంలో వెలుగు వాకిళ్ళు తెరచిన ఆ మహనీయుని ప్రస్తుత స్థితి జ్ఞాపకం వచ్చి మనసు పరివేదనతో నిండిపోయింది.
"అయితే నాగాలు ఇంకా మూలికలను అన్వేషిస్తూ ఆంధ్రదేశంలోనే తిరుగుతున్నారు అన్నమాట! తనకు చెప్పినట్లుగా వారు తమ దేశానికి వెళ్లిపోలేదు" అనుకోగానే ఆమె మనసుని భయం ఆవరించింది.
"చరిత్ర పునరావృత్తమవుతుందా?" అనుకోగానే గుండె జలదరించింది. చిన్నికృష్ణుడు మనఃపతలం మీద ప్రత్యక్షమైనాడు. తనకు మాతృత్వమనే మహనీయమైన అనుభూతిని అందించిన చిలిపిక్రిష్ణుడు. తనకు మార్గదర్శి అయి, తనకోసం శ్వేతనాగు ముందు ప్రాణాలను పణంగా ఒడ్డిన గురుదేవుని పేరు పెట్టుకున్న కృష్ణుడు. ఒక్కక్షణం వాడిని చూడకపోతే మనసు వ్యదాపూర్ణమవుతుంది. ఆ బంధం ఆమె మనసుని పట్టి లాగింది.
"ఇంక ఈ విషయాలలో తలదూర్చకూడదు" అనుకుందామె. శ్వేతనాగు గురించి, నాగాల గురించి, వాసుకి గురించి ఆలోచించటం మానుకోవాలి. ఆ సాహస జీవితంనించి కర్తవ్యబద్దురాలాయి దూరంగా ఉండిపోవాలి. తల్లిగా, ఇల్లాలుగా తన బాధ్యతలకు అంకితమైపోవాలి."
ఇలా ఆలోచిస్తూ కారు నడుపుతోంది వాణి. గూడెం దాటి ఒక కిలోమీటరు దూరం వచ్చింది కారు. అదంతా అడవి ప్రాంతం. కొండలు, లోయలు! వృక్షాలు ఎత్తుగా పెరిగి ఉన్నాయి. దారి ఇరుకుగా ఉంది. ఇంక నాలుగు కిలోమీటర్ల దూరం పోతేకాని తన నివాసం చేరుకోలేదు.
కారు నెమ్మదిగా పోతోంది. ఆలోచనలు అనే జలపాతాలు మనసు అనే గిరి శిఖరాల మీదనించి ఆమ్తర్యపు లోయల్లోకి పరవళ్ళుగా దూకుతున్నాయి. అలవాటైన విద్యకావటం నించి కారు నడపటం నించి కారు నడపటం అసంకల్పిత చర్యలా జరిగిపోతోంది.
అల్లంత దూరంలో వృక్షాల కింద ఏవో నీడలు కదలాడుతున్నట్లు కనిపించింది. క్రమంగా ఆ నీడలు పురోగమించినాయి. కారు వెళ్ళే మార్గాన్ని నిరోధించినాయి. కారు బ్రేకులు పడినాయి. ఆ నీడలు కారుని ముట్టడించినాయి విభ్రాంత అయింది వాణి.
విస్ఫరితమయిన నేత్రాలతో అలా చూస్తూ ఉండిపోయింది. ఆ రూపాలను కనుపాపల మీద విస్పష్టంగా ముద్రించుకున్నదామే. తను ఎంతగా కర్తవ్య బద్ధురాలు కావాలని అనుకున్న ఏవో బంధాలు ఇంకా రెండు సంవత్సరాల వెనుకకు లాగుతున్నాయి.
"తల్లిగా, ఇల్లాలిగా జీవితం కొనసాగించాలనుకున్న తనని విధి పరిహాసం చేస్తోంది.విధి అనే వేటగాడు ఎక్కుపెట్టిన విల్లు ఎన్నటికి వృధా పోదు.
ఒకవేళ అదే యధార్ధమైతే తానెందుకు వెనుకంజ వేయాలి? అనుక్షణం అనేక బంధాలు, ప్రమాదాలు, మృత్యువు వేన్నాడే జీవితం గురించే తానెందుకు భయపడాలి? పరిస్టితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎప్పుడైనా తప్పని మృత్యువుని ఎదుర్కోవలసివస్తే, ఒకవేళ తల వంచవలసి వస్తే ఆ పని ఏడుస్తూ ఎందుకు చెయ్యాలి? పరిస్థితుల్ని ధైర్యంగానే ఎదుర్కోవాలి." ఎదురుగా కనిపించిన వ్యక్తుల్ని గుర్తుపట్టాక ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి.
ఇంతదూరం వచ్చాక ఇంక వెనుకంజ వేయటమెందుకని వారు అడగకుండానే డోరు తెరుచుకుని కారు దిగిపోయింది వాణి. ఆ నీడలు అతి భయంకరంగా ఆమెను చుట్టుముట్టినాయి.
చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది వాణి. కారుని అక్కడే వదిలేసి వారితోపాటుగా నడుస్తూ చీకటిలో కలిసిపోయింది.
0 0 0