" అవునో కాదో నీకు తెలుసు టైమ్ వేస్ట్ చేస్తూ అవునా! కాదా? అని వెధవ ప్రశ్నలు వేయక డైరెక్ట్ గ చెప్పేసేయి."
" సరే. కాస్త ఆలశ్యాన్ని కూడా భరించలేకపోవటం కూడా ఆ వ్యాధి లక్షణమే. ఇహ విషయాని కొస్తాను. నీకు జయచిత్రకు యింకా పెళ్ళి కాలేదు. కాని నీవు రాత్రింబవళ్ళు కాస్త తీరుబడి దొరికితే చాలు ఆలోచించిన వాడిని ఆలోచించినట్లే వుంటున్నావు. ఆ... ఆలోచనలు ఎట్లా వుంటాయి అంటే నీకు జయచిత్రతో పెళ్ళి అయినట్లు... టింకూలాంటి మగబిడ్డ... పింకూలాంటి ఆడపిల్లకు తండ్రి వాయినట్లు, నన్న మాట... టింకూ పింకులు చాలంటావు నీవు. ఇంకో నాలుగురన్నా లేకపోతే ఏం బాగుంటుంది అని జయచిత్ర ముద్దు ముద్దుగ వాదులాడు కుంటుంటారు అవునా!"
ఆత్రతగ వింటున్న వ్యాకర్ణ " నీ అవునా తగలడు. విషయం చెప్పుకు పోమ్మన్నానా!" అంటూ కోప్పడ్డాడు.
" నేనేమన్నా రాంగ్ రూట్ లో పడి చెప్పుకుపోతున్నా నేమోనని అవునా అని అడిగాను. అవునా అంటే తప్పా! అవునా అని అడగటం బూతుమాట అన్నట్టా?" అబ్బులు చొక్కా చేతులు మడుస్తూ పోట్లాటకు దిగుతూ అడిగాడు.
" వరేయ్, వరేయ్, అలా కోపం తెచ్చుకోకురా! ఏదో తెలివితక్కువగ తొందరపడి నోరు జారాను. సారీర. నీవు చెప్పింది సెంట్ పర్సెంట్ కరెక్ట్. అవును... అవును... అవును... యింక చెప్పరా!"
వ్యాకరణ బాధాపూరిత స్వరంతో అనేసరికి అబ్బులు చల్లపడ్డాడు. " సరేలే. నే చెప్పింది కరెక్ట్ అంటూ ఒప్పుకున్నావు కాబట్టి క్షమించి చెపుతున్నాను. సావధానుండ వైవిను..."
అలాగే అన్నట్టు తల తాటించాడు వ్యాకర్ణ.
" పిల్లలు కావలి వద్దు అనే విషయంలో వీవు జయచిత్ర తీవ్రంగా వాదులాడుకుంటుంటారు. కనేది నేను మికేం కష్టం అంటుంది జయచిత్ర.
" పోషించేది నేను. నీకేం తుమ్మినంత తేలిగ్గా కంటావు. ఆ తర్వాత అన్ని కష్టాలు నాకే" అంటావు నీవు. ఎంతకీ మి మధ్య వాదన తెగదు. పదిమంది పిల్లల వల్ల కష్టం ఏమిటిట! పంచదార క్యూలో వకణ్ణి కిరసనాయిలు క్యూలో యింకొకడిని. వెచ్చాలు తేవటానికి...అలా అలా అందరిని పనులకి వుపయోగించావవు. మి మగాళ్ళకేమి తెలియక ఏదేదో అంటుంటారు. మికేం ఉదయమనగ ఆఫీసు కెళ్ళి సాయంత్రం మనగ వస్తారు. న జీవితమంత కిరసనాయిలు క్యూలోనే సరిపోతుంది. పంచదార క్యూలోనే తల పండిపోతుంది. అంటూ ధాం ధూం లాడుతుంది.
నువ్వు కాసేపు నీ తలకాయే పట్టుకుని ఆలోచిస్తావు. మంచి ఆలోచన తడుతుంది. మన ప్రధానికి చూడు యించక్క ఇద్దరే పిల్లలు ప్రియంక, రాహుల్. సోనియాగాంధీ భర్తతో సహకరించి ఇద్దరితోనే పులిస్టాపు పెట్టింది కనుకనే రాజీవ్ ప్రధాని కాగలిగారు డిల్లి సింహాసనం ఎక్కారు. ఇండియాలో రారాజు అయ్యారు. అదీ... యిదీ... అంటూ ఏదేదో ఉదాహరణలతో సహా చెపుతావు.
నా భర్త యింత తెలివి తక్కువ వాడేమిటమ్మా అని ఓ పక్క వాపోతూ మరోపక్క నీ తెలివి తక్కువకి నీ ముఖానే నవ్వి " అది వారసత్వ సింహాసనం. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకండి. మన ముఖ్యమంత్రిని చూడండి. ఇంచక్క డజనుదాకా కన్నాడు" అంటుంది.
" ఆయనే!" అంటావు నీవు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టి.
" బోడివిట్టూ మిరూను" అని ముద్దు ముద్దుగా కోప్పడి " మగవాళ్ళు పిల్లలను కంటారని ఏ రచయిత్రి తన నవలలో యింత వరకూ రాయలేదు లేండి" అని అకారణంగా రచయిత్రులను తిట్టి, ఆపై " వాళ్ళావిడ డజనుమందిదాకా కనబట్టే ఆయన ముఖ్యమంత్రి అవలీలగ కాగలిగా రని... బోడిగుండుకి మోకాలుకీ ముడిపెట్టి వాదిస్తుంది. జయచిత్రతో వాదించలేక " అయితే నేను ముఖ్యమంత్రిని కావచ్చంటావ్!" ఆశపడుతూ అడుగుతావు. " అదేమంత కాష్టంకాదు. ముఖ్యమంత్రుల పదవులు మూన్నాళ్ళ ముచ్చటే. నేను కంటూ వుంటాను. మిరు ఎవరెవరికి గోతులు తీయాలా అని ఆలోచిస్తూ కూర్చోండి. ఆ తార్వాత గోతులు తవ్వటానికి ప్రతిపక్షాల సరుకులు తట్టా బుట్టా సర్దుకుని పలుగు పార పుచ్కుకుని " నీ కాల్ మొక్కుత దొర!" అంటూ వచ్చి పడతాయి, అందరికి నీవు అభయ హస్తం ఎడంచేత్తో యిస్తాను.