ఇల్లు అలకగానే పండగకాదు విస్తరి వేయంగానే విందు భోజనము కాదన్నట్లు బామ్మగారి ఆశీస్సుతో వెంటనే వాళ్ళ పెళ్ళిళ్లు సీజను కూడా వేరే ఉంటుంది.
వ్యాకర్ణ జయచిత్రల సంగతి అబ్బులు బిందురేఖల సంగతి ఎడాపెడ అటూ ఇటూ అందరికీ తెలిసిపోయింది. అందరికి అందరు నచ్చటంతో వీళ్ళ వివాహం ఎవరకి అభ్యంతరం లేకపోయింది. వక్క శాస్ర్తిగారికి తప్ప నెలా ఇరవై రోజులుకి తప్ప మంచి ముహూర్తాలు లేవు అంటూ చల్లగా చెప్పాడు.
అది తెలిసి.
" నాకు వీళ్ళమిద నమ్మకంలేదు" అన్నాడు అబ్బులు కళ్ళజోడు తుడుచుకుంటూ.
అది చూసి వ్యాకర్ణ " ఏంటిరా అబ్బూ! ఏడిచావ?" అన్నాడు. అక్కడితో వూరుకోకుండా " బ్బొబ్బొబొ" అని సానుభూతి కూడా చూపించాడు.
" ఏను నీ కళ్ళకి కిక్కపిల్ల లాగాను పిల్లిపిల్లి లాగాను కనబడుతున్నానా?" అబ్బులు కళ్ళకి కళ్ళజోడు తగిలించుకుని మిర్రి మిర్రి చూస్తూ అడిగాడు.
" అబ్బే, అలాంటిదేమో లేదే" అబ్బులిని పై నుంచి కిందదాకా ఎగాదిగా చూస్తూ చెప్పాడు వ్యాకర్ణ.
" మరి కుక్కపిల్లను పిలిచినట్లు బొబ్బొబ్బొ ఏమిటోయ్ గార్ధభేశ్వరా!"
" అడా!"
" ఆ... అదే."
" దేనికంటే సానుభూతిని బొబ్బొబ్బొ అన్నాను."
" నాపై సానుభూతా! నాకేం కాని రోగం రాలేదు!"
" రోగమని కాదు."
" మరి దేనికట?...? వెధవ నాన్చుడు నీవూను. చెప్పి అఘెరించు."
" నువ్వు ఏడ్చావు కదా!"
" నేను ఏడ్చానా!" తెల్లబోయాడు అబ్బులు.
" మరి కళ్ళజోడు తుడుచుకున్నావు కదా!"
" నీ బొంద. పెళ్ళి అనంగానే పిచ్చిపట్టింది. ఏడిస్తే ఎవరైనా ఏం తుడుచుకుంటారు?"
" కళ్ళు" టకీమని చెప్పాడు వ్యాకర్ణ.
" మరి నే తుడిచింది కళ్ళజోడు కదా?" లా చదవక పోయినా లా పాయింటు తీస్తూ అడిగాడు అబ్బులు.
" అదీ నిజమేననుకో నాకు వీళ్ళమిద నమ్మకం లేదంటూ కళ్ళు... సారీ కళ్ళజోడు తుడుచుకుంటుంటే ఎవరో చావు బతుకుల్లో వున్నారు. డాక్టరు ఏ విషయము సరీగ చెప్పటంలేదు ఆ పరిస్థితులలో నీవు డాక్టర్లని పట్టుకుని నాకు వీళ్ళమిద నమ్మకం లేదు వుండవచ్చునని ముందుగా వూహించి సానుభూతిగ బొబ్బొబ్బొ అన్నాడు రా అబ్బులూ!"
" అంతేనా?" అబ్బులు నాలుగు కళ్ళలోంచి వ్యాకర్ణని నఖశిఖ పర్యంతమూ పరీక్షగా చూస్తూ అన్నాడు.
" అంతే" తల వాల్చుకుని చెప్పాడు వ్యాకర్ణ.
" ఇది ఒక భయంకర వ్యాధి. దీని పేరు లాట్కోడిమ్కా గ్రాఫై ఎనీషి యూఫీర్."
" అమ్మబాబోయ్! ఇది యింత భయంకరమైన వ్యాధా!" దీని లక్షణాలు ఏమిటిరా అబ్బూ!"
" లేనిది వుందనుకోటం వున్నది లేడనుకొటం ముఖ్య లక్షణం. సపోజ్ నికింకా పెళ్ళి కాలేదు అవునా!"