Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 50

    బస్ అందరూ గోతులు తవ్వుతారు. ఆ గోతుల్లోవున్న ప్రభుత్వమేగాక తవ్వినవాళ్ళుకూడా పడతారు. అప్పుడు నీ రొట్టె విరిగి పంచదార పాకంలో పడుతుంది. నీవు ముఖ్యమంత్రివి అయిపోతావ్. అఫ్కోర్స్ నీ పదవి కాలం మూన్నాళ్ళ ముచ్చటే కావచ్చు. కాని ఈ లోపల ఏడేడు తరాలకి సరిపోను డబ్బు మూటగట్టుకోవచ్చు. సగం పైన భూమి ఆక్రమించుకోవచ్చు. మన అబ్బాయిలకు అమ్మాయిలకు యించక్క తలా యాభైకోట్లు యిచ్చేయవచ్చు. అంతే ననుకుంటున్నారా! జలుబుచేస్తే ముక్కుపరీక్ష చేయించుకోటానికి అమెరికా దగ్గు వస్తుంటే కొండ నాలుక ఎక్స్ రే తీయించుకోటానికి రష్యా అలా అలా తిరిగిరావచ్చు. మన చంటి వెధవికి ఏ ఇంగ్లండో తీసుకెళ్ళి ఫారెన్ డాక్టరు చేత వేలిమిద పైకి లేచిన గోరుని జాగ్రత్తగ తీయిస్తాము. అలా చాలా సౌకర్యాలు వుంటాయి. ఆలోచించండి బాగా ఆలోచించండి" అంటుంది జయచిత్ర.

    అంతే నీకు ముఖ్యమంత్రిని కావాలనే పిచ్చి పట్టుకుంటుంది. రాత్రింబవళ్ళు యిదే ఆలోచన. ఇలా ఒక చిన్న విషయంలోంచి అనగా - నీకు జయచిత్రకి పెళ్ళి అయిం తర్వాత... మి మధ్య జరిగే చిన్న విషయంలోంచి యింత పెద్ద విషయంలోకి ఆ - ఆలోచన అలా అలా సాగిపోతూ వుంటుంది. ఆలూలేదు చూలులేదు అల్లుడి పేరు సోమలింగంలాగా మి పెళ్ళి కాకముందే యిన్ని ఆలోచనలు వచ్చి పోతుంటాయి. అలాంటి జబ్బు నీకు పట్టుకుంది. అవునా!" అబ్బులు విషయం చెప్పి అడిగాడు.

    " అవునురా అబ్బూ! నా రోగం ఏమిటో సరీగచెప్పావు. అన్నట్లు ఈ వ్యాధి పేరేమిటన్నావ్?" నుదుట కారుతున్న చెమటని టవల్ తో అద్దుకుంటూ అడిగాడు వ్యాకర్ణ.

    " ఈ జబ్బు పేరు లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫీర్!" అబ్బులు గొప్పగా చెప్పాడు.

    " జపాన్ సుందరీమణి పేరులా వుందిరా!"

    " య్యా, వుంటే వుండవచ్చు. అందులో వింత ఏముంది!" మిసాలచాటుననవ్వుని దాచుకుంటూ అన్నాడు అబ్బులు.

    వ్యాకర్ణకి ఉన్నట్లుండి పెద్ద అనుమానం వచ్చింది.

    " ఇలాంటి వ్యాధి వుంటుందని నీకెలా తెలుసురా!" అడిగాడు.

    " ప్రస్తుతం నేనుకూడా యిదే వ్యదహి పీడుతుడిని కదా! మనిద్దరి ఆలోచనలు ఒకేవిధంగా సాగుతున్నాయి కదా! మనిద్దరం పరిస్థితి ఒకేరకంగా వుందికదా!" కదా అన్నమాటని వత్తిపలుకుతూ చెప్పాడు అబ్బులు.

    " మంది అంటువ్యాధా!"

    " ఎంతమాత్రం కాదు. యిరువురం ఒకే పరిస్థితిలో వున్నాము కాబట్టి గ్రహించాను."

    " సరే, ఈ వ్యాధి పేరు డిమ్కా లిమ్క్ అని యెలా తెలుస్తుకున్నావ్?"

    " దీనిపేరు డిమ్కా లిమ్క్ కాదు. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్" సరిదిద్దాడు అబ్బులు.

    " సరే అదేలే, ఈ పేరు నీకెలా తెలుసా అని..."

    " అదా?"

    " ఆ... అదే... చెప్పు."

    " చెప్పక తప్పదా?"

    " తప్పదు."

    " అయితే విను. మనం ప్రేమించాముగాని పెళ్ళికాలేదు. అందుకని ఏదో ఏదో ఆలోచిస్తున్నాము. ఆ ఆలోచనకి ఓ దరీ తెన్నూ లేదు. రూపంలేదు. జీవం లేదు. దాంతో నాకో ఆలోచన వచ్చింది. ఇదోరకం వ్యాధి అని... వ్యాధి అని తెలుసుకున్న వాడిని దానికో పేరుకూడా తగిలించాలికదా! లెఒఅపొథె ఎవరితోనన్నా చెప్పేటప్పుడు ఎలా తెలుస్తుంది. చంటి వెధవలాగా వ్యాధి వ్యాధి అని అఘెరిస్తే ఏమన్నా బాగుంటుందా? అందుకే ఈ వ్యాధికి నామకరణం కూడా నేనే చేసేశాను. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్ అని..." అబ్బులు కళ్ళద్దాలు తుడుచుకుంటూ చెప్పాడు.
 

 Previous Page Next Page